చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం | Small farmers, women farmers Subhash Palekar training camp | Sakshi
Sakshi News home page

చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం

Published Wed, Feb 4 2015 11:17 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

చిన్న రైతులు, మహిళా రైతులకు  సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం - Sakshi

చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరం

పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణ శిబిరం కర్నూలు నగరం (ఎస్‌ఎస్‌ఎన్ గార్డెన్స్, మాస మజీదు, సుంకేసుల రోడ్డు)లో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 1 వరకు జరగనుంది. 3 ఎకరాలకన్నా తక్కువ  పొలం ఉన్న 20-45 ఏళ్ల మధ్య వయస్కులైన చిన్న రైతులు, మహిళా రైతులకు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇస్తారు.

తొలిసారి పాలేకర్ శిక్షణకు వచ్చే రైతులకు, ఐదు రోజులూ కచ్చితంగా శిక్షణ పొందగోరే వారికిప్రాధాన్యం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రవేశ రుసుము: రూ. 500. పేర్లు నమోదు చేసుకోవడానికి సంప్రదించాల్సిన నంబరు: బి. వెంకటేశ్వర్లు - 94408 16090. ఇతర వివరాలకు 040- 27654337, 27635867 (ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు) నంబర్లలో సంప్రదించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement