కామారెడ్డి: పట్టణంలోని రైట్ శిక్షణ కేంద్రం ద్వారా ఔత్సాహికులకు సెల్‌ఫోన్ రిపేరింగ్, ఫ్రంట్ ఆఫీస్, బ్యుటీషియన్, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ రాజేంద్రకుమార్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్రప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన సర్టిఫికెట్‌లు అందజేస్తామన్నారు. శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుందని, ఆసక్తి గల వారు ఇతర వివరాలకు 85004 42499, 85199 11370 నెంబర్‌లను సంప్రదించాలన్నారు.
న్యాక్ కేంద్రంలో టైలరింగ్..
డిప్యూటీ డీఈవో కార్యాలయ ఆవరణలోగల న్యాక్ కేంద్రంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ కేంద్రం డైరెక్టర్‌లు రమేశ్, జీవన్, భక్తమాల తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రులు లేబర్‌కార్డులో పేర్లు నమోదు చేసుకుని ఉండాలని, 18నుంచి 35ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టైలరింగ్‌తో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ఫ్లంబింగ్, శానిటేషన్ రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివారలకు 99891 52024, 95813 21409 నెంబర్‌లను సంప్రదించాలన్నారు.
రైట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
Published Sat, Oct 15 2016 11:06 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
Advertisement