NAAC
-
ప్రైవేటు డిగ్రీ కాలేజీలపై ‘న్యాక్’ పిడుగు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు ఇప్పటివరకు లేకున్నా ప్రైవేటు డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇచ్చేవి. న్యాక్‌ను కేవలం నాణ్యత ప్రమాణాలకు సూచిక గానే పరిగణించేవి. రాష్ట్రంలో 1100 కాలేజీల్లో, కేవలం ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు కలిపి 200 కాలేజీలకే న్యాక్ గుర్తింపు ఉంది. కానీ ఇక మీదట ప్రతీ కాలేజీ న్యాక్ పరిధిలోకి రావాల్సిందే. ఇది ఉంటేనే అనుబంధ గుర్తింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలనే ప్రతిపాదన న్యాక్ తీసు కొస్తోంది. రాష్ట్రంలోని న్యాక్ గుర్తింపు ఉన్న (న్యాక్ కాలేజీలు), న్యాక్ గుర్తింపు లేని కాలేజీలు (నాన్–న్యాక్ కాలేజీలు)గా విభజి స్తారు. నాన్ న్యాక్ కాలేజీలకు క్రమంగా అను మతి ఇవ్వకూడదనే నిబంధన తేవాలనే యోచ నలో ఉన్నారు. ఈ మేరకు ఇటీవల బెంగళూరు కేంద్రంగా న్యాక్ విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించింది. దక్షిణ భారత రాష్ట్రాల ఉన్నత విద్య మండళ్ళ చైర్మన్లను, పలువురు విద్యారంగ నిపుణులను ఈ సమావేశాలకు ఆహ్వానించింది. న్యాక్ నిబంధనలను మరింత సరళతరం చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరించింది. కొత్త నిబంధనలపై రాష్ట్రాల స్థాయిలో అవగా హన కల్పించాలని కోరింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త రూల్స్ తీసుకొచ్చేందుకు సిద్ధమవ్వాలని సూచించింది.90 శాతం కాలేజీలకు ఇబ్బందే!మౌలిక సదుపాయాల పెంపు, ఫ్యాకల్టీ, ఫలితాలు, ఉపాధి అవకాశాలు, సొంత బిల్డింగ్ ఉందా? వంటి అంశాలకు న్యాక్ బృందం మార్కులు ఇస్తుంది. దీని ఆధారంగానే గ్రేడ్‌ను కేటాయిస్తుంది. ఎక్కువగా కార్పొరేట్ కళాశాలలు మాత్రమే ఈ ర్యాంకులు పొందుతున్నాయి. కాగా, ఇప్పటి వరకూ న్యాక్ బృందాలు కళాశాలలను స్వయంగా పరిశీలించిన తర్వాతే గుర్తింపు ఇచ్చేవి. అలా కాకుండా ఆన్‌లైన్‌లోనూ పరిశీలించి అనుమతులు ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే న్యాక్ నిబంధనలు అమలు చేయాలంటే 90 శాతం కళాశాలలు ఇబ్బందిపడే అవకాశం ఉంది. కార్పొరేట్ కళాశాలలు మాత్రమే దీనివల్ల విస్తరిస్తాయనే విమర్శలొస్తున్నాయి. దాంతో న్యాక్ నిబంధనల్లో కొంత సడలింపు ఇవ్వాలని మండళ్ళ చైర్మన్లు ప్రతిపాదిస్తున్నారు. నాణ్యత లక్ష్యంగా సడలింపులు న్యాక్ నిబంధనల్లో సమూల మార్పులు చేసేందుకు న్యాక్ కౌన్సిల్ ప్రతిపాదించింది. దీనిపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. గుర్తింపు ప్రక్రియను మరింత సరళీకృతం చేయడమే దీని ఉద్దేశం. అన్ని కాలేజీలను న్యాక్ గుర్తింపు పరిధిలోకి తేవడం, నాణ్యత పెంచడమే లక్ష్యం. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి (ఉన్నత విద్య మండలి చైర్మన్)అలాగైతే ఇబ్బందేన్యాక్ నిబంధనల పేరుతో చిన్నకాలేజీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది. తెలంగాణలో నిరుద్యోగులు పెట్టుకున్న కాలేజీలు ఇప్పటికే అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. ఎన్నో కాలేజీలు మూతపడ్డాయి. న్యాక్ గుర్తింపును ఐచ్ఛికంగానే పరిగణించాలి. – గౌరీ సతీశ్, అధ్యక్షుడు, రాష్ట్ర ప్రైవేటు పీజీ, డిగ్రీ కాలేజీ యాజమాన్య సంఘంమూడు కేటగిరీల ఏర్పాటుఇక మీదట విద్యా సంస్థలను 3 కేటగిరీలుగా విభజించాలని న్యాక్ భావిస్తోంది. విశ్వవిద్యాలయాలు, అటాన మస్ కాలేజీలు, అనుబంధ కాలేజీలు అనే 3 విభాగాలను గుర్తిస్తారు. కాగా, విశ్వవిద్యాలయాలు ఇప్పటికే అన్ని వసతులతో ఉంటాయి. అటానమస్ కాలేజీలూ నిధులు సమకూర్చుకోవడంలో వెనుకాడవు. కానీ అనుబంధ గుర్తింపు ఉన్న కాలేజీల్లో ఫ్యాకల్టీ, మౌలిక వసతుల ఇబ్బంది ఉందన్న వాదనలున్నాయి. -
ఆంధ్రా వర్సిటీకి తొలిసారిగా A డబుల్ ప్లస్ గ్రేడ్
-
విద్యా తేజం.. ఆంధ్రా విశ్వవిద్యాలయం
(సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : ఉన్నతమైన, ప్రకాశవంతమైన చదువులకు ప్రతీకగా... ‘తేజస్వినావధీతమస్తు’ అనే సమున్నత ఆశయంతో ఏటా వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న ఆంధ్రా విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యున్నత వర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. సాగర తీరంలో, విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంత వాతావరణంలో అత్యున్నత వసతులు, ప్రమాణాలతో విద్యనందిస్తూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్)ను మెప్పించి, ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ పొందింది. నాక్ ఏయూలోని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్‌ను మంజూరు చేసింది. దేశంలో అత్యున్నత కోర్సులు, బోధన, సౌకర్యాలు, కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలకు దక్కే ఈ గ్రేడ్‌ను ఏయూ కూడా సాధించడం విశేషం. దేశంలో 3.74 స్కోర్ బెంగళూరు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలతో పాటు ఆంధ్రా యూనివర్సిటీకి మాత్రమే దక్కింది. టాప్ స్కోర్ దక్కిన నేపథ్యంలో 2030 వరకూ వర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉండనుంది. ఈ ర్యాంకులను అధికారికంగా ఈ నెల 14న ప్రకటించనున్నట్టు తెలిసింది. ఏయూ చరిత్రలో తొలిసారిగా.. నాలుగు పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కులతో కూడిన పట్టాని చేతిలో పెట్టి పంపించే రోజులకు స్వస్తి చెబుతూ.. యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా.. పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ.. ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతూ జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో తొలిసారిగా 86.05 స్కోర్‌తో నాక్ ఏ గ్రేడ్ పొందింది. తరువాత 2008లో 3.64తో ఏ గ్రేడ్‌ను, 2016లో 3.6 స్కోర్‌తో మరోసారి ఏ గ్రేడ్‌ను సాధించింది. తాజాగా జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ని పొందింది. ఏయూలో అత్యుత్తమ విద్యా విధానాలకు, సమర్ధతకు ఈ ర్యాంకు నిదర్శనం. రానున్న ఆరేళ్ల కాలానికి ఈ ర్యాంకు యూనివర్సిటీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. మూడు రోజులు క్షుణ్ణంగా పరిశీలన ఈ నెల 4, 5, 6 తేదీలలో ఏయూలో నాక్ బృందం పర్యటించింది. వర్సిటీలో మౌలిక వసతులు, బోధన ప్రగతి తదితర అంశాలను కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టి, నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, యోగా, సైకాలజీ, స్పోర్ట్స్ విభాగాలతో పాటు విభిన్న విభాగాలలో సాధిస్తున్న ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. 4.0 స్కేల్ పై 3.74 స్కోర్‌ను అందిస్తూ.. ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ మంజూరు చేశారు. ఈ విజయం వెనుక సీఎం వైఎస్ జగన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత ఉంది. విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా పలు మార్పులు చేస్తున్న వైస్ చాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి కృషి ఉంది. వీరిద్దరూ కలిసి గత నాలుగేళ్లుగా వర్సిటీలో పలు సంస్కరణలు తెచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, చైర్ ప్రొఫెసర్లని ఏర్పాటు చేయడం తదితర మార్పులు చేశారు. సమాజ ఉపయుక్తంగా, పరిశ్రమల అవసరాలు తీర్చే వైవిధ్య పరిశోధన కేంద్రంగా మార్చారు. ఇంజనీరింగ్‌తో సమానంగా సైన్స్, ఆర్ట్స్ కోర్సులను ఉపాధి కల్పించేవిగా రూపుదిద్దారు. ప్రపంచంలోని ఏ పరిశ్రమకైనా అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేలా యూనివర్సిటీ రూపాంతరం చెందింది. విశ్వవిద్యాలయంలో చేరే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఈ సంస్కరణలు ఊతమిస్తున్నాయి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థీ ఉన్నత సంస్థల్లో ఉపాధి పొందేలా విద్యా ప్రణాళికలను రూపొందించారు. దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రా యూనివర్సిటీ 100 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసింది. ఇక్కడి స్టార్టప్ సెంటర్లో 150 స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. విశ్వవిద్యాలయం ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ సాధించి, దేశంలో ఉన్నత స్థానాన్ని పొందడంపై వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, రెక్టార్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఏయూలో కోర్సుల వివరాలు.. యూజీ ప్రోగ్రామ్స్ – 36 పీజీ ప్రోగ్రామ్స్ – 118 పీహెచ్డీ – 57 పీజీ డిప్లొమా – 03 డిప్లొమా – 08 సర్టిఫికెట్/అవేర్నెస్ – 03 టీచింగ్ స్టాఫ్ – 538 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ – 2,270 మంది విద్యార్థులు – 10,338 మంది -
మార్పు మొదలైంది.. నాలుగేళ్లలో గణనీయమైన ప్రగతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలకు నేషనల్ అసెస్మెంటు అండ్ అక్రిడిటేషన్ (న్యాక్), నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్బీఏ) గుర్తింపు ఉండాల్సిందేనని సీఎం వైఎస్ జగన్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మూడేళ్లలో న్యాక్, ఎన్బీఏల్లో రెండింటిలో ఏ గ్రేడ్‌లో నిలిచేలా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను తీర్చిదిద్దాలని ఆదేశించారు. గడువులోపల న్యాక్, ఎన్బీఏ గుర్తింపు సాధించలేని కాలేజీలకు అడ్మిషన్లు నిలిపివేయాలని, గుర్తింపు రద్దు వంటి చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యా మండలిని ఆదేశించారు. ఈ గుర్తింపు సాధన కోసం ఉన్నత విద్యా మండలిలో క్వాలిటీ అస్యూరెన్స్ సెల్ ఏర్పాటు చేయించి కాలేజీలకు సహకారం అందించారు. ఈ చర్యల ఫలితంగా గత నాలుగేళ్లలో కాలేజీలలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాక ముందు న్యాక్ అక్రిడిటేషన్ సాధించే కాలేజీల సంఖ్య నామమాత్రంగానే ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సీఎం వైఎస్ జగన్ చేపట్టిన చర్యలతో ఏటేటా వాటి సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీలు 1323 వరకు ఉన్నాయి. 2019లో అక్రిడిటేషన్ సాధించిన కాలేజీలు 43 మాత్రమే. ఆ తరువాత రెండేళ్ల పాటు కరోనా కారణంగా కాలేజీలలో ప్రత్యక్ష బోధన అరకొరగా సాగింది. కరోనా అనంతరం న్యాక్ గుర్తింపు సాధించకుంటే అడ్మిషన్లు నిలిచిపోతాయని హెచ్చరించడంతో అన్ని కాలేజీలు ప్రమాణాల మెరుగుదలపై దృష్టి సారించాయి. ముఖ్యంగా పలు కాలేజీలకు వనరులు, ప్రమాణాలూ ఉన్నా న్యాక్ గుర్తింపు ప్రక్రియలో వెనుకబడ్డాయి. ఇటువంటి కాలేజీలకు క్వాలిటీ అస్యూరెన్సు సెల్ ద్వారా మార్గదర్శనం చేసి, న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేయించారు. చిన్న లోపాలతో గతంలో న్యాక్ గుర్తింపు రాకుండా పోయిన అనేక కాలేజీలు గత రెండేళ్లలో గుర్తింపును పొందేలా ప్రభుత్వం తోడ్పాటునందించింది. 2023 నాటికి మొత్తం 209 కాలేజీలకు న్యాక్ అక్రిడిటేషన్ లభించింది. ఈ ఒక్క ఏడాదిలోనే 81 కాలేజీలకు న్యాక్ అక్రిడిటేషన్ రాగా అందులో 7 ఏ ప్లస్ ప్లస్‌లో నిలిచాయి. -
జేఎన్టీయూ ‘కే’క!.. ఏపీలో న్యాక్–ఏ ప్లస్ గుర్తింపు పొందిన ఏకైక యూనివర్సిటీ
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సాంకేతిక విద్యలో కాకినాడ జేఎన్టీయూ రాష్ట్రానికే మణిహారంగా నిలిచింది. జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న పలు వర్సిటీల సరసన జేఎన్టీయూకేకు సముచిత స్థానం దక్కింది. యూనివర్సిటీ ఏర్పాటైన 12 ఏళ్లలోనే ఈ స్థాయికి చేరుకోవడం విశేషం. బెంగళూరుకు చెందిన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) బృందం ఈ నెల 9 నుంచి మూడు రోజులపాటు జేఎన్టీయూకేలో పర్యటించింది. ఇక్కడ జరుగుతున్న పరిశోధనలు, అధ్యయనం, క్రమశిక్షణతో కూడిన నిర్వహణ, సాంకేతిక అంశాల్లో ప్రగతిని సమీక్షించిన అనంతరం న్యాక్ ఏ ప్లస్ హోదా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఇవీ ప్రయోజనాలు ►న్యాక్ ఏ ప్లస్ హోదాతో యూనివర్సిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ►కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయి. వర్సిటీలో ల్యాబ్‌ల ఆధునికీకరణ, మౌలిక వసతులు, పరిశోధనల కోసం రూ.100 కోట్లు వస్తాయని అంచనా. ►ఈ వర్సిటీలో విద్యనభ్యసించేందుకు విదేశీ వర్సిటీల నుంచి విద్యార్థులు క్యూ కట్టనున్నారు. స్విట్జర్లాండ్, స్వీడన్ దేశాల యూనివర్సిటీలు ఇప్పటికే జేఎన్టీయుకేతో ఒప్పందం చేసుకున్నాయి. ఇటీవల ఒక అమెరికన్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం కూడా వచ్చి పరిశీలించి వెళ్లింది. ►ఇక్కడ చదువుకునే విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్యాకేజీతో ఉద్యోగాలు లభిస్తాయి. ►వర్సిటీలో పరిశోధనల కోసం కేంద్ర సంస్థలైన ఏఐసీటీఈ, యూజీసీ, డీఎస్టీ సైన్స్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు దరఖాస్తు చేసిన వెంటనే అనుమతులు లభిస్తాయి. వైఎస్సార్ చొరవతో యూనివర్సిటీగా.. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉండగా 1946లో కాకినాడ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1972లో కాకినాడ, అనంతపురం, హైదరాబాద్ ఇంజినీరింగ్ కళాశాలలు హైదరాబాద్ జేఎన్టీయూ పరిధిలోకి వచ్చాయి. ఆ తర్వాత మూడున్నర దశాబ్దాలకు 2008, ఆగస్టు 20న నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికతతో కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని జేఎన్‌టీయూకేగా మార్పు చేశారు. కాకినాడ ఇంజినీరింగ్ కాలేజీని కూడా ఈ వర్సిటీతో అనుసంధానించారు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ పరిధిలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 162 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు, నరసరావుపేట ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఉన్నాయి. చదవండి: తండ్రి హంతకులకు అండదండలా?.. వివాదాస్పదంగా సునీత వైఖరి యూనివర్సిటీకి ఒక మైలురాయి న్యాక్ 3.4 స్కోర్‌తో ఏ ప్లస్ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో విదేశీ వర్సిటీలతో విద్య, పరిశోధనలు, ఉపాధి నిమిత్తం ఒప్పందాలు పెద్ద ఎత్తున చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ గుర్తింపు యూనివర్సిటీకి ఒక మైలు రాయి. ఇప్పటికే సాంకేతిక వర్సిటీగా రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఉన్న జేఎన్టీయూకే స్థాయిని ఈ హోదా మరింత పెంచింది. – డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, వైస్ చాన్సలర్, జేఎన్టీయూకే -
2024 నాటికి అన్ని కాలేజీలకు నాక్ గుర్తింపు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం... అన్ని కళాశాలల్లో ప్రమాణాల పెంపునకు సైతం అనేక చర్యలు చేపట్టింది. 2024 నాటికి డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలతో పాటు అన్ని ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) గుర్తింపును తప్పనిసరి చేసింది. నాక్‌తో పాటు ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్‌లోనూ రాష్ట్ర విద్యాసంస్థలు స్థానం సంపాదించేలా చర్యలు చేపట్టింది. కాలేజీలకు నాక్ గుర్తింపు రావడంలో సహకారం అందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలిలో ప్రత్యేకంగా క్వాలిటీ అస్యూరెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయించింది. దీని ద్వారా అన్ని కాలేజీలు నాక్ ‘ఎ’ గ్రేడ్‌తో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులు సాధించేలా కార్యాచరణ చేపట్టింది. క్వాలిటీ అస్యూరెన్స్ సెల్లో వర్సిటీలు, స్వయంప్రతిపత్తి పొందిన కాలేజీలు, పరిశ్రమల ప్రముఖులతోపాటు ఉన్నత విద్యాశాఖ నుంచి సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సెల్ ద్వారా ఇప్పటికే కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా మార్గనిర్దేశం చేస్తోంది. విద్యా ప్రమాణాల పెంపు, నాక్ గుర్తింపునకు అవసరమైన వనరుల కల్పన, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌కు అవసరమయ్యే అంశాల్లో కాలేజీలను ముందుకు తీసుకువెళ్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో క్వాలిటీ లీడర్లుగా 164 ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ కాలేజీలు, వర్సిటీలను అధికారులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా సహకారం అందిస్తున్నారు. ప్రమాణాల పెంపునకు అత్యధిక ప్రాధాన్యం.. తొలి అడుగుగా నాక్ ‘బీ’ కేటగిరీలో ఉన్న కాలేజీలను గుర్తించి.. వాటి ద్వారా అసలు నాక్ గుర్తింపు లేని కాలేజీలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే 72 నాక్ గుర్తింపు ఉన్న కాలేజీలను, 13 వర్సిటీలను గుర్తించి వాటిని క్యూ (క్వాలిటీ) మెంటార్లుగా ఏర్పాటు చేశారు. వీటితోపాటు మరో 117 కాలేజీలను కూడా క్వాలిటీ మెంటార్లుగా గుర్తించి 346 కాలేజీలు నాక్ గుర్తింపు సాధించేలా వాటిని అనుసంధానించారు. ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాములు, శిక్షణ, ఈ–కంటెంట్ ప్రిపరేషన్ తదితర అంశాల్లో ఆయా కాలేజీలకు సహాయమందిస్తున్నారు. ఉద్యోగాలు కొల్లగొట్టేలా ఉచిత శిక్షణ.. ప్రభుత్వం అన్ని కోర్సుల్లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. దీంతోపాటు విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఇంటర్న్‌షిప్ కోసం కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానించారు. మైక్రోసాఫ్ట్, సిస్కో, సేల్స్‌ఫోర్స్, ఏడబ్ల్యూఎస్ వంటి సంస్థల ద్వారా లక్ష మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్‌నకు చర్యలు చేపట్టారు. ఐసీఐసీఐ, విప్రో, ఐబీఎం, ఎడెల్వైస్, హీరో, హోండా, మారుతి సుజికీ వంటి సంస్థల్లో ఫుల్‌స్టేక్, హెచ్ఆర్, మార్కెటింగ్, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ వంటి అంశాల్లో 50 వేల మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నారు. -
ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం.. విగ్రహం మార్పుపై వైవీయూ వీసీ క్లారిటీ
సాక్షి, వైఎస్సార్ కడప: యోగి వేమన యూనివర్శిటీలో వేమన విగ్రహ ఏర్పాటుని రాజకీయం చేయొద్దని యూనివర్శిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మునగాల సూర్యకళావతి కోరారు. న్యాక్ గ్రేడింగ్‌లో యూనివర్శిటీ అభివృద్ధి చూసే ఏ గ్రేడ్ ఇచ్చారని తెలిపారు. అభివృద్ధి పనులలో భాగంగానే వేమన విగ్రహాన్ని యూనివర్శిటీ ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన పేరుతో ఉన్న యూనివర్శిటీ కాబట్టి ప్రధానం ద్వారం వద్ద ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అందరితో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. 'ఎవరికీ ఇబ్బంది లేకుండా వేమన విగ్రహాన్ని మూడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశాము. యూనివర్సిటీ స్థాపకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కనుక ఖాళీ అయిన వేమన విగ్రహ స్థలంలో వైఎస్సార్ విగ్రహాన్ని పెట్టాము. కొత్త విగ్రహాలు ఏవీ తీసుకుని రాలేదు.. ఉన్న విగ్రహాలనే వేరేచోట మార్చడం జరిగింది. నూతన వైఎస్సార్ పరిపాలన భవనం అని పేరు పెట్టినందున వలన అక్కడే ఉన్న స్థలంలో విగ్రహం ఏర్పాటు చేశాం' అని వైస్ ఛాన్సలర్ మునగాల సూర్యకళావతి తెలిపారు. చదవండి: (యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి) -
యోగివేమన విశ్వవిద్యాలయంకు ‘విశ్వ’ఖ్యాతి
కరువు సీమలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం.. విశ్వఖ్యాతి పొందాలని.. వేలాది మంది విద్యార్థులు విద్యనభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తొలి పలుకులు నిజం చేస్తూ విశ్వవిద్యాలయ పాలకులు శ్రమించి ‘ఏ’ గ్రేడ్ సాధించారు. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్(న్యాక్) కమిటీ బుధవారం విశ్వవిద్యాలయానికి 3.13 సీజీపీఎస్‌తో ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది. న్యాక్ నూతన విధానంలో న్యాక్‌కు వెళ్లిన తొలి విశ్వవిద్యాలయం.. ఏ గ్రేడ్ సాధించిన విశ్వవిద్యాలయం యోగివేమన కావడం విశేషం. వైవీయూ : కడపలో 2006లో ఏర్పాటైన యోగివేమన విశ్వవిద్యాలయం ఇంతింతై వటుడింతై అన్న చందంగా ‘విశ్వ’ఖ్యాతిని పొందుతోంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (న్యాక్) వారు బుధవారం విశ్వవిద్యాలయానికి 3.13 సీజీపీఎస్‌తో ‘ఏ’ గ్రేడ్ కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు న్యాక్ పీర్ టీం చైర్మన్ ఆచార్య ధర్మజిత్ సింఘ్ పర్మార్ నేతృత్వంలో ఆచార్య ఆర్. సోమశేఖర్, ఆచార్య ఖలీద్ ఫాజిల్, ఆచార్య జయతీరాజ్, ఆచార్య సి. మధుమతిల బృందం విశ్వవిద్యాలయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సిద్ధం చేసి న్యాక్‌కు పంపారు. విశ్వవిద్యాలయం అధికారులు పంపిన సెల్ఫ్ స్టడీ రిపోర్ట్, న్యాక్ టీం ప్రత్యక్ష పరిశీలన అనంతరం ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా న్యాక్ వారు విశ్వవిద్యాలయానికి ఏ గ్రేడ్‌ను కేటాయించారు. నూతన విశ్వవిద్యాలయాల్లో తొలి ‘ఏ’ గ్రేడ్ విశ్వవిద్యాలయంగా వైవీయూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఏర్పాటైన 10 విశ్వవిద్యాలయాల్లో ‘ఏ’ గ్రేడ్ సాధించిన తొలి విశ్వవిద్యాలయంగా వైవీయూ నిలిచింది. న్యాక్ గ్రేడింగ్‌లో నూతన విధానాన్ని తీసుకువచ్చిన తర్వాత న్యాక్‌కు వెళ్లి ఏ గ్రేడ్ సాధించిన తొలి విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లో వైవీయూ నిలవడం విశేషం. 2020 జనవరి 10వ తేదీన వైస్ చాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన సమయంలో విశ్వవిద్యాలయానికి ‘ఏ’ గ్రేడ్ తీసుకురావడమే తన ముందున్న లక్ష్యం అని ప్రకటించిన ఆచార్య మునగల సూర్యకళావతి శ్రమించి సాధించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి న్యాక్ సాధన కోసం ఐక్యూసెల్ను (అంతర్గత నాణ్యతా ప్రమాణాల విభాగం) సమాయత్తం చేశారు. ఐక్యూసెల్ ఆధ్వర్యంలో దాదాపు రెండు సంవత్సరాల పాటు శ్రమించి విశ్వవిద్యాలయానికి ఉత్తమ గ్రేడింగ్ తీసుకురావడంలో కృషిచేశారు. 2016 జనవరి వైవీయూకు న్యాక్ 2.54 సీజీపీఎస్‌తో బి ప్లస్ గ్రేడ్ కేటాయించింది. అప్పటి న్యాక్ కమిటీ సూచించిన లోపాలను సవరించుకుంటూ, అధునాతన సౌకర్యాలను కల్పిస్తూ, గూగుల్ క్యాంపస్‌గా తీర్చిదిద్దడంతో పాటు సాంకేతికత, హరిత విద్యాలయంగా తీర్చిదిద్దడంలో సఫలమయ్యారు. హర్షం వ్యక్తం చేసిన అధికారులు విశ్వవిద్యాలయానికి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించడం పట్ల విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ఆచార్య మునగల సూర్యకళావతితో పాటు వైవీయూ పూర్వపు వైస్ చాన్సలర్లు ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి, ఆచార్య బేతనభట్ల శ్యాంసుందర్, ఆచార్య అత్తిపల్లి రామచంద్రారెడ్డి తదితరులు కూడా హర్షం వ్యక్తం చేశారు. న్యాక్ రావడంలో కీలకపాత్ర.. 652 ఎకరాల్లో ఏర్పాటైన విశ్వవిద్యాలయం దాదాపు పచ్చదనంతో ఉండటం. మల్టీ డిసిప్లినరీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ కేంద్ర పరిశోధన సంస్థలైన డీఎస్టీ–ఫిస్ట్, యూజీసీ, సీఎస్ఐఆర్, డీబీటీ తదితర సంస్థల నుంచి 10.26 కోట్ల మేర పరిశోధక ప్రాజెక్టులు. 99 శాతం మంది అధ్యాపకులు డాక్టరేట్ కలిగి ఉండటంతో పాటు బోధన, పరిశోధనలో అనుభవం కలిగిన అధ్యాపకులు ఉండటం. విశ్వవిద్యాలయంలో బాలికల నిష్పత్తి (54.92) బాలుర కంటే ఎక్కువగా ఉండటం. సిలబస్ రూపకల్పనలో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడం, – పరిశ్రమలకు అనుబంధంగా సిలబస్ రూపకల్పన. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో 101 నుంచి 150 లోపు ఉండటం. అధ్యాపకులు అందరూ ఆధునిక బోధనా పద్ధతుల్లో బోధించడం. ఐసీటీ, ఈ–లెర్నింగ్, ఎల్ఎంఎస్, గూగుల్క్లాస్ రూం, సిస్కో, వెబెక్స్, మైక్రోసాఫ్ట్ టిమ్స్ ఉపయోగించడం. పరిశోధనల్లో ‘హెచ్’ ఇండెక్స్ 40 ఉండటం. అధ్యాపకులు, పరిశోధకుల జర్నల్స్, పరిశోధనలు 20 శాతం మేరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితం కావడం. విశ్వవిద్యాలయం 6 జాతీయ, అంతర్జాతీయ పేటెంట్స్ కలిగి ఉండటం. 950 కె.డబ్లు్య సోలార్‌ప్లాంట్ కలిగి ఉండటం. ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్ ఉండటంతో పాటు, ప్రపంచంలోనే అతిపెద్ద పత్రాలు కలిగిన జెయింట్ వాటర్ లిల్లీ (విక్టోరియా అమేజోనికా) ఉండటం, మియావాకి విధానంలో మినీ ఫారెస్టు ఏర్పాటు చేయడం తదితర అంశాలను విశ్వవిద్యాలయ బలాలుగా న్యాక్ కమిటీ అభిప్రాయపడింది. వీటితో పాటు అధ్యాపకులు, సిబ్బంది కొరత తదితర కొన్ని అంశాలను సరిచేసుకునేలా సూచనలు చేశారు. -
‘న్యాక్’కు దూరంగా కాలేజీలు!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా ప్రమాణాలకు కొలమానమైన ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’గుర్తింపును అన్ని కాలేజీలకు తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేస్తోంది. న్యాక్ గుర్తింపు లేని కాలేజీలకు యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు ఇవ్వకుండా కట్టడి చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా న్యాక్ గుర్తింపు ఉన్న కాలేజీలు, యూనివర్సిటీల జాబితా పెంచాలని ఉన్నత విద్యామండలి ప్రయ త్నం చేస్తున్నా పెద్దగా స్పందన కన్పించడం లేదు. సదస్సుకు కూడా రాకుండా.. న్యాక్ బెంగళూరు కేంద్రం ఉన్నతాధికారులతో రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలకు అవగాహన కల్పించాలని ఉన్నత విద్య మండలి భావించింది. దీనిపై ఈ నెల 20న సదస్సు నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ రాష్ట్రంలోని ప్రైవేటు కాలేజీలు న్యాక్ గుర్తింపు ఏమోగానీ, కనీసం సదస్సులో పాల్గొనేందుకు కూడా విముఖత చూపినట్టు తెలిసింది. అనుకున్న మేర కాలేజీలు పాల్గొనేందుకు సుముఖత చూపకపోవడంతో న్యాక్ ప్రధాన కార్యాలయం ఆధికారులు సదస్సును వాయిదా వేశారు. నజరానా ఇస్తామన్నా.. న్యాక్ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునే కాలేజీలకు రూ.లక్షల్లో నజరానా ఇస్తామని కూడా ఉన్నత విద్యా మండలి గతంలో ప్రకటించింది. అయినా ఒక్క కాలేజీ కూడా ముందుకు రాలేదు. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. అవి గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలంటే ప్రమాణాలు పెంచుకోక తప్పదు. అంతగా ఆదాయం లేని తాము ప్రమాణాల కోసం ఎందుకు ఖర్చు చేయాలనే ఆలోచనతో అవి వెనుకడుగు వేస్తున్నాయి. ‘న్యాక్’ గ్రేడ్ ఉంటే విలువ దేశంలోని విద్యాసంస్థల్లో అంతర్జాతీయ స్థాయి గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)ను అమల్లోకి తెచ్చారు. వివిధ రంగాల్లోని ప్రముఖులతో ఏర్పడే న్యాక్ కమిటీల ఆధ్వర్యంలో విద్యా ప్రమాణాలను అంచనా వేస్తారు. న్యాక్ ప్రధానంగా ఏడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. పాఠ్య ప్రణాళిక రూపకల్పన, అమలు; విద్యాబోధన స్థాయి; పరిశోధన దిశగా పురోగతి; మౌలిక సదుపాయాలు; విద్యార్థి పురోగతి; ఆ సంస్థకు ఉన్న విశ్వసనీయత; అత్యుత్తమమైన ప్రమాణాల అమలు తదితర అంశాలను పరిశీలించి.. సదరు కాలేజీలు, యూనివర్సిటీలకు మార్కులు, గ్రేడ్లు ఇస్తుంది. ఈ గ్రేడ్ల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు అందే అవకాశం కూడా ఉంటుంది. గుర్తింపు తప్పనిసరి అవ్వొచ్చు ఉన్నత విద్యా రంగంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు న్యాక్ గుర్తింపు ఉంటేనే ప్రైవేటు కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించాయి. కాకపోతే ఇది అమలు చేయడానికి కొంత సమయం ఇచ్చాయి. రాష్ట్రంలోనూ న్యాక్ గుర్తింపు కోసం ఉన్నత విద్యా మండలి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కాలేజీలను ప్రోత్సహించి, చేయూతనివ్వాలని చూస్తోంది. ఈ ప్రక్రియను భవిష్యత్‌లో మరింత ముందుకు తీసుకెళ్తాం. న్యాక్ గుర్తింపు పొందడం తప్పనిసరి కావొచ్చు కూడా.. – వి.వెంకటరమణ, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ -
అర్హతలున్నాయి... అవగాహనే లేదు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపును తెలంగాణలో విస్తరించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేసింది. త్వరలో దీన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల డేటాను తెప్పించినట్టు, కొన్నింటిని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్టు అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో చాలా కాలేజీలకు న్యాక్ గుర్తింపు పొందగల అర్హతలున్నాయని, అయితే సరైన అవగాహన లేకపోవడంతో ఇందుకోసం దరఖాస్తు చేయలేదని అంటున్నారు. ఫలితంగా న్యాక్ గుర్తింపు కలిగిన కళాశాలల విషయంలో తెలంగాణ వెనుకబడి ఉంది. దేశంలో న్యాక్ గుర్తింపు పొందిన ఉన్నత విద్యా సంస్థలు 21 శాతం ఉంటే, తెలంగాణలో ఇది 11 శాతానికే పరిమితమైంది. కాలేజీల్లో ఉన్నత విద్య ప్రమాణాల స్థాయిని న్యాక్ గుర్తింపు తెలియజేస్తుంది. చాలా కాలేజీలు న్యాక్ గుర్తింపును అదనపు అర్హతగా భావించడంతో ఈ మేరకు ప్రచారం సైతం చేసుకుంటాయి. ఈ కళాశాలల శాతం ఎంత పెరిగితే ఆ రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాలు అంత ఎక్కువగా ఉన్నట్టన్న మాట. ప్రమాణాలున్నా.. ప్రయత్నమే లేదు రాష్ట్రంలో ప్రస్తుతం 1,976 ఉన్నత విద్యా సంస్థలున్నాయి. వీటిల్లో కేవలం 141 మాత్రమే న్యాక్ గుర్తింపు కలిగి ఉండటం గమనార్హం. ఇందులో 35 ప్రభుత్వ సంస్థలు, 19 ఎయిడెడ్, 87 ప్రైవేటు సంస్థలున్నాయి. రాష్ట్రంలోని 24 యూనివర్శిటీలకు గాను న్యాక్ గుర్తింపు ఉన్నవి పదే. శాతవాహన, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ సహా కొన్ని ఇప్పటికీ న్యాక్ గుర్తింపు పొందలేదు. ఈ పరిస్థితులపై ఉన్నత విద్య మండలి ఇటీవల క్షేత్రస్థాయి అధ్యయనం చేసింది. దాదాపు వందకుపైగా డిగ్రీ కాలేజీలు న్యాక్ గుర్తింపునకు అర్హత కలిగి ఉన్నట్టు గుర్తించాయి. సొంత భవనాలు, నాణ్యతతో కూడిన బోధన అందించగల ఫ్యాకల్టీ, లేబొరేటరీలు, పటిష్టమైన బోధన విధానాలు, లైబ్రరీ సదుపాయాలు, కచ్చితమైన నిర్వహణ వ్యవస్థ వీటికి ఉన్నాయి. కొన్నేళ్ళుగా అక్కడ మంచి ఫలితాలు కూడా వస్తున్నాయి. ఉపాధి అవకాశాలు పొందడంలోనూ ఈ కాలేజీ విద్యార్థుల శాతం మెరుగ్గా కన్పిస్తోంది. ఇలా న్యాక్ గుర్తింపునకు అవసరమైన అన్ని అర్హతలు, ప్రమాణాలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయా సంస్థలు గుర్తింపు కోసం దరఖాస్తు చేయలేదు. వాస్తవానికి విద్యార్థులు ఏదైనా కాలేజీలో చేరాలనుకున్నప్పుడు న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తారు. అలాగే దేశ, విదేశీ విద్యా సంస్థలు విద్యార్థుల చేరికల సమయంలో సదరు కాలేజీకి న్యాక్ గుర్తింపు ఉందా లేదా అని చూస్తాయి. అలాగే క్రమబద్ధమైన పర్యవేక్షణ, ప్రమాణాలు కొనసాగించేలా ఈ గుర్తింపు దోహదపడుతుంది. ఇలాంటి ప్రయోజనాలన్నిటిపై అవగాహన లేక, ‘నడుస్తోంది కదా..చూద్దాంలే’అన్న నిర్లిప్త ధోరణిలో చాలా కాలేజీలు ఉంటున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దరఖాస్తు చేసేలా కార్యాచరణ ఈ నేపథ్యంలోనే న్యాక్ గుర్తింపు కలిగిన కాలేజీలు, వర్సిటీల పెంపు కోసం ఉన్నత విద్యామండలి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేపట్టనున్నారు. ఇందులో భాగంగా తొలుత.. ఇప్పటికే గుర్తింపు పొందిన 141 కాలేజీల్లో 81 కాలేజీలు న్యాక్ గుర్తింపును రెన్యువల్ చేయించుకునే దిశగా ప్రోత్సహిస్తారు. ఇందులో పట్టణ ప్రాంతాల్లో 72, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 6, గ్రామీణ ప్రాంతాల్లో 63 వరకూ ఉన్నాయి. ఆ తర్వాత మౌలిక వసతులు, ఫ్యాకల్టీ పాటు, అన్ని అర్హతలున్న వందకుపైగా కాలేజీల చేత దరఖాస్తు చేయించాలని నిర్ణయించారు. దీని తర్వాత ప్రమాణాలు పెంచుకుని, న్యాక్ గుర్తింపునకు అర్హత సాధించే దిశగా కాలేజీలను ప్రోత్సహిస్తారు. ఇక ఏమాత్రం ప్రమాణాలు లేని, విద్యార్థుల చేరికలు లేని కోర్సులు, కాలేజీల మూసివేత దిశగా చర్యలు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. న్యాక్ గుర్తింపు పొందేలా ఆయా సంస్థలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరపాలని భావిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. -
బాసర ట్రిపుల్ఐటీకి న్యాక్ ‘సి’ గ్రేడ్
బాసర (ముధోల్): నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ఐటీ (ఆర్జీయూకేటీ)కి న్యాక్ ‘సి’ గ్రేడ్ గుర్తింపునిచ్చింది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కమిటీ బృందం గతేడాది బాసరను సందర్శించిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాసంస్థల్లో స్థితిగతులు, మౌలిక వసతులు, బోధన, బోధనేతర అంశాలు, పరిశోధనలు ఇలా ప్రతీ అంశాన్ని పరిశీలించి తదనుగుణంగా న్యాక్ గ్రేడ్లను నిర్ణయిస్తుంది. ఇందులో భాగంగా బాసర ట్రిపుల్ ఐటీకి ‘సి’ గ్రేడ్ ప్రదానం చేస్తూ కమిటీ సర్టిఫికెట్‌ను తన వెబ్సైట్లో పొందుపర్చింది. అధికారుల తీరే కారణమా..? తెలంగాణకే తలమానికమైన బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశాల కోసం ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు పోటీ పడతారు. ఎన్నో ఆశలతో వర్సిటీలో అడుగుపెట్టిన వారిని ఈసారి న్యాక్ గ్రేడ్ నిరాశపర్చింది. స్థానిక అధికారుల తీరుతో పాటు న్యాక్ బృందం వర్సిటీలో పర్యటించినప్పుడు వీసీ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతోనే సరైన గుర్తింపు దక్కలేదనే విమర్శలున్నాయి. అలాగే కమిటీకి వర్సిటీ అధికారులు వివరించిన తీరు కూడా సరిగా లేదనే వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు వర్సిటీ ప్రారంభం నుంచి రెగ్యులర్ వీసీ లేకపోవడం, పరిశోధనలకు పెద్దపీట వేయకపోవడం వంటి విషయాలు బృందాన్ని నిరాశపర్చినట్లు సమాచారం. న్యాక్గ్రేడ్ ఆధారంగానే యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్) నిధుల మంజూరు ఉంటుంది. ఈ గ్రేడ్ ఆధారంగానే క్యాంపస్ ప్లేస్మెంట్లలో మల్టీ నేషనల్ కంపెనీలు పాల్గొనడంతో పాటు వర్సిటీకి జాతీయ స్థాయి గుర్తింపు దక్కుతుంది. వర్సిటీ నుంచి విద్యార్థికి లభించిన సర్టిఫికెట్‌నూ హైప్రొఫైల్‌గా భావిస్తారు. ఈక్రమంలో వర్సిటీకి తక్కువ గ్రేడ్ గుర్తింపు రావడంపై వారంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. (సూర్యాపేటలో ర్యాగింగ్ రక్కసి; గదిలో బంధించి.. పిడిగుద్దులు గుద్ది) -
ప్రయత్నిస్తే ప్రమాణాల పెరుగుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు మెరుగుపడేందుకు తక్షణమే చర్యలు చేపట్టాలని నేషనల్ అనాలసిస్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) సూచించింది. ఈ దిశగా ఉన్నత విద్యా మండలి ఓ కమిటీ వేయాలని పేర్కొంది. నాణ్యత ప్రమాణాల కోసం విశ్వవిద్యాలయాల స్థాయిలో పనిచేస్తున్న కమిటీలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. విద్యా శాఖ నిధుల కేటాయింపు పెరగాలని పేర్కొంది. విద్యా రంగానికి రాష్ట్ర జీడీపీలో 30 శాతం రాష్ట్రం, 10 శాతం కేంద్రం ఖర్చు చేయాలని 1960లో కొఠారీ కమిటీ చేసిన సిఫార్సును న్యాక్ ప్రస్తావించింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2018–19లో 9.8 శాతం, 2019–20లో 7.5, 2020–21లో 7.4 శాతం నిధులే ఇవ్వడాన్ని ఉదహరించింది. రాష్ట్రంలో 85 శాతం కాలేజీలు యూజీ, పీజీ కోర్సులు కలిగి ఉంటే, అందులో 15 శాతం సంస్థలకే న్యాక్ గుర్తింపు ఉందని తెలిపింది. క్యుమ్యులేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ (సీజీపీఏ)లో 80 శాతం గుర్తింపు గల కాలేజీలకు తక్కువ గ్రేడ్ వచ్చిందని, దీన్ని పెంచితేనే విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని సూచించింది. న్యాక్ చేసిన పలు సూచనలు.. ►విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ పాత పద్ధతులనే అనుసరిస్తున్నాయి. వీటిని పూర్తిగా మార్చాలి. నైపుణ్యం ఉండే కోర్సులను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించాలి. ఈ క్రమంలో పారిశ్రామికవేత్తలు, నిపుణులతో సమన్వయం అవసరం. అకడమిక్ ఆడిట్లో యూనివర్సిటీలు వెనుకబడ్డాయి. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ముందుకెళ్లే చర్యలు ఉండాలి. ►టీచింగ్ విధానంలో గణనీయ మార్పులు అవసరం. విద్యార్థి కేంద్రంగా బోధన జరగాలి. ప్రాజెక్టు వర్క్ ఎక్కువగా ఉండేలా చూడాలి. పరిశోధన దిశగా విద్యార్థులను తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇది జరగాలంటే అధ్యాపకుడిలోనూ పరిశోధన విధానాన్ని మేళవించే మెళకువలు అభివృద్ధి చెందాలి. ►విశ్వవిద్యాలయాలు ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ మార్పులను మేళవింపు చేసుకోవాలి. అంతర్జాతీయ సంస్థలతో కలసి పరిశోధన చేపట్టాలి. అప్పుడే విద్యార్థి ఆలోచన ధోరణి విస్తృతమవుతుంది. విజ్ఞాన మార్పిడి చాలా అవసరం. దీనిపై విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి కృషి జరగట్లేదు. పారిశ్రామిక నిపుణులతో కలసి కొత్తదనం నింపేలా ఎంటర్‌ప్రెన్యూర్‌ను అభివృద్ధి చేయాలి. ఎన్సీపీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు చురుకుగా ఉంటే విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ►మౌలిక వసతుల కల్పన కొన్ని యూనివర్సిటీలకే పరిమితమైంది. దీన్ని కాలేజీ స్థాయికి తీసుకెళ్లాలి. లైబ్రరీల ఏర్పాటు, కొత్త సాఫ్ట్వేర్ అందుబాటులోకి తేవడం, రిఫరెన్స్ జర్నల్స్ ఉండేలా చూడటం, ఎలక్ట్రానిక్ సెర్చ్ ఫ్యాకల్టీ అభివృద్ధి, ఈ–క్లాస్ రూమ్స్ పెంచడం అత్యంత ముఖ్యమైన అంశాలు. ►క్రీడలు, సాంస్కృత కార్యక్రమాలు పూర్తిగా తగ్గిపోయాయి. వ్యాయామ ఉపాధ్యాయుల నియామకానికి ఎక్కడా ప్రాధాన్యం కన్పించట్లేదు. సబ్జెక్టు అధ్యాపకుల కొరత కాలేజీలు, యూనివర్సిటీలను వేధిస్తోంది. దేశంలో కొన్ని యూనివర్సిటీలు అంతర్జాతీయ క్రీడాకారులను ఆహ్వానిస్తున్నాయి. ఇక్కడ ప్రమాణాలు బాగుంటున్నాయి. ఈ తరహా ప్రయోగాలు చేయాలి. ►ఉన్నత విద్య ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వమే నాయకత్వం వహించాలి. సంబంధిత అధికారులతో చర్చలు జరపాలి. మెరుగైన రీతిలో బోధనకు గల అవకాశాలను పరిశీలించాలి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక పాత్ర పోషించాలి. వాస్తవ నివేదికలను, క్షేత్రస్థాయి నుంచి సేకరించి, విలువైన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. -
‘బ్లాక్’లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్–ఎంఆర్‌సీఈ(క్యాంపస్–1)’ను నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. దూలపల్లిలోని ఈ కళాశాలకు మెరుగైన గ్రేడ్ కోసం ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్నట్లు న్యాక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.అరుణ్.. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ కు లేఖ రాశారు. గతంలో ఎంఆర్సీ ఈకి న్యాక్ ‘బీ++’ గ్రేడ్ ఉండేది. మరింత మెరు గైన గ్రేడ్ కోసం రీఅసెస్మెంట్కు సెల్ఫ్ స్టడీ రిపోర్టును (ఎస్ఎస్ఆర్) మల్లారెడ్డి కాలేజీ గతేడాది న్యాక్‌కు పంపించింది. అయితే, అందులో జత చేసిన బీహెచ్ ఈ ఎల్, యాష్ టెక్నాలజీస్, ఎయిర్టెల్ కం పెనీల సంతకాలు, స్టాంపులు, లెటర్ హె డ్లను డిజిటల్ ఫోర్జరీ చేసినట్లు న్యాక్ పే ర్కొంది. డాక్యుమెంట్లు ఫోర్జరీ అని, ఎస్ఎస్ఆర్ సరైంది కాదని తేల్చింది. ఈ వ్యవహారంపై షోకాజ్ నోటీసు జారీ చేసిం ది. అయినప్పటికీ కాలేజీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని, దీంతో ఎస్‌ఎస్‌ఆర్‌ను రద్దు చేసి, ఆ కశాశాలను ఐదేళ్లు బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు పేర్కొంటూ న్యాక్ ఈ నెల 24న నోటీసు జారీచేసింది. కాగా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కాలేజీ.. ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువ పత్రాలు తయారు చేసే కేంద్రంగా మారిం దని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అధ్యా పక సంఘాలు ఆరోపించాయి. న్యాక్ గుర్తింపు ఎందుకంటే.. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యం లోని న్యాక్ కమిటీ గుర్తింపు ఇస్తుంది. వి ద్యా ప్రమాణాలు, బోధన, లెర్నింగ్ ప్రాసె స్లో మెరుగైన విధానాలు, మౌలిక సదు పాయాలు, ఉత్తమ ఫ్యాకల్టీ, పరిశోధన, ఉద్యోగ అవకాశాలు లభించే కాలేజీలకు తగిన గ్రేడ్ (గుర్తింపు)ను న్యాక్ ఇస్తుంది. దీంతో పరిశోధన ప్రాజెక్టులు, వాటికి ఆర్థిక సహకారం లభిస్తుంది. కంపెనీలు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో న్యాక్ గుర్తింపున్న కాలేజీలకు ప్రాధాన్యమిస్తాయి. ఇటు వి ద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాగా, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని న్యాక్ బ్లాక్‌లిస్టులో పెట్టిన నేప థ్యంలో.. ఇందుకు నైతిక బాధ్యత వహి స్తూ మంత్రి మల్లారెడ్డి తన పదవికి రా జీనామా చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూ దన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
ప్రమాణాల పెంపునకు ‘పరామర్శ్’
సాక్షి, అమరావతి: ఉన్నత విద్యాసంస్థల్లో నాణ్యతా ప్రమాణాలు పెంచడంతోపాటు వాటికి త్వరగా న్యాక్ గుర్తింపు వచ్చేలా సహాయం అందించడం కోసం యూజీసీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పరామర్శ్ పథకాన్ని ప్రవేశపెడుతోంది. 2022 నాటికి దేశంలోని ప్రతి ఒక్క విద్యాసంస్థ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ (న్యాక్) గుర్తింపు (కనీసం 2.5 స్కోరుతో) పొందేలా చూడడం ఈ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం కింద ఎంపికైన న్యాక్ గుర్తింపు ఉన్న ఉన్నత విద్యాసంస్థలు మెంటార్లుగా వ్యవహరిస్తూ తమ పరిధిలోని కళాశాలలు కూడా న్యాక్ గుర్తింపు పొందేలా మార్గనిర్దేశం చేస్తాయి. మెంటార్ల మార్గదర్శకత్వంలో ఆయా కళాశాలలు ప్రమాణాల పెంపునకు కార్యక్రమాలు చేపడతాయి. దీనికి అవసరమైన సహాయసహకారాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అందిస్తుంది. లక్ష్యం.. వేయి విద్యా సంస్థలు పరామర్శ్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం, యూజీసీ దేశవ్యాప్తంగా వేయి ఉన్నత విద్యాసంస్థల్లో ప్రమాణాలు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి. 3.6 కోట్ల మంది విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలన్నది దీని ముఖ్య ఉద్దేశం. పరిశోధన కార్యక్రమాల పెంపు, వినూత్న మార్పులతో బోధనాభ్యసన ప్రక్రియల్లో మెరుగుదల, తద్వారా ఆయా సంస్థలకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలు అమలు చేస్తారు. ఆయా సంస్థల్లోని అధ్యాపకుల్లో అవసరమైన పరిజ్ఞానాన్ని పెంపొందిస్తారు. రాష్ట్రం నుంచి 12 సంస్థలు ఎంపిక పరామర్శ్ పథకం కింద మెంటార్లుగా వ్యవహరించేందుకు యూజీసీ 2ఎస్, 12బీ స్టేటస్ ఉండి 3.26 న్యాక్ స్కోర్ ఉన్న కళాశాలల నుంచి యూజీసీ దరఖాస్తులను ఆహ్వానించింది. వీటిని పరిశీలించి మెంటార్ సంస్థలుగా ఎంపికైన 167 కళాశాలల జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 12, తెలంగాణ నుంచి 8 ఎంపికయ్యాయి. రాష్ట్రం నుంచి ఎంపికైన 12 విద్యాసంస్థలు ప్రైవేటువే. మెంటార్‌గా ఎంపికైన ఒక్కో విద్యా సంస్థ తన పరిధిలో ఐదు విద్యాసంస్థలను ఎంపిక చేసుకొని వాటికి న్యాక్ గుర్తింపు వచ్చేలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం కాలపరిధి ఏడాది ఉంటుంది. అవసరాన్ని బట్టి మరో ఏడాది వరకు పొడిగిస్తారు. మెంటార్‌కు రూ.30 లక్షల వరకు అందిస్తారు. 50 శాతం గ్రాంటును ముందుగా విడుదల చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలేవీ పరామర్శ్ పథకానికి దరఖాస్తు చేయలేదు. యూజీసీ నుంచి తగినన్ని నిధులు వచ్చే అవకాశాన్ని ప్రభుత్వ విద్యాసంస్థలు వినియోగించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. మెంటార్లుగా ఎంపికైన సంస్థలు ఇవే.. –శ్రీ ఎర్రమిల్లి నారాయణమూర్తి కాలేజ్ – నర్సాపూర్ –జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కాలేజీ – గుంటూరు –పీబీ సిద్ధార్థ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ – విజయవాడ –గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ – రాజమండ్రి –దువ్వూరు రమణమ్మ ఉమెన్స్ కాలేజీ– గూడూరు, నెల్లూరు –ఆదిత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ – టెక్కలి, శ్రీకాకుళం –ఆంధ్రా లయోలా కాలేజీ – విజయవాడ –సీఎస్డీ సెయింట్ థెరిసాస్ కాలేజ్ ఫర్ ఉమెన్ – ఏలూరు –విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – దువ్వాడ, విశాఖపట్నం –పీవీపీ సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – కానూరు, విజయవాడ, –గీతం – రుషికొండ, విశాఖపట్నం –కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ – వడ్డేశ్వరం, గుంటూరు -
‘న్యాక్’ ఉండాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో: ఉన్నత విద్యకు అత్యుత్తమ ప్రమాణాలు అందించే బృహత్తర కార్యక్రమం త్వరలో సాకారం కానుంది. వృత్తివిద్యా కళాశాలల్లో ఉన్నత విద్యాప్రమాణాలు పెంచేందుకు కసరత్తు మొదలైంది. జాతీయస్థాయి సగటు 20 శాతంతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో సుమారు పదిశాతం కళాశాలలకే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు ఉండడంతో ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించేందుకు ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు రాబోయే ఐదేళ్లలో అన్ని రకాల ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్ ఇతర ఉన్నత విద్యాసంస్థలు న్యాక్ లేదా నేషనల్బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ సాధించే దిశగా ఆయ కళాశాలలు, విద్యాసంస్థలకు అవగాహన కల్పించేందుకు ఉన్నత విద్యామండలి చర్యలు తీసుకుంటుండడం విశేషం. కాగా గ్రేటర్‌పరిధిలో సుమారు 500కుపైగా వృత్తి విద్యాకళాశాలలుండగా..ఇందులోనూ 20 శాతం కళాశాలలకే న్యాక్ గుర్తింపు ఉన్నట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో అన్ని కళాశాలల్లో త్వరలో ప్రమాణాలు మెరుగుపడతాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. వృత్తి విద్యాకళాశాలలు కేరాఫ్ గ్రేటర్‌సిటీ... గ్రేటర్‌పరిధిలో ఇంజినీరింగ్, ఫార్మా, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ తదితర వృత్తివిద్యా కళాశాలలతోపాటు పలు కోర్సులను అందించే వృత్తివిద్యా కళాశాలలకు సుమారు 500 వరకు ఉన్నాయి. వీటిలో న్యాక్ లేదా ఎన్బీఏ గుర్తింపున్నవి కేవలం 100కు మించిలేవంటే అతిశయోక్తి కాదు. విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యాప్రమాణాలు, విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు,ప్రయోగపరీక్షలు, పరిశోధన వంటి అంశాలకు పెద్దపీఠ వేయకపోవడం,న్యాక్,ఎన్బీఏ అక్రిడిటేషన్ సాధించేఅంశంపై దృష్టిసారించకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. తాజాగా కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2024 నాటికి అన్ని వృత్తి విద్యాకళాశాలలు, విద్యాసంస్థలు న్యాక్ గుర్తింపు సాధించే అవకాశాలు మెరుగుపడనున్నాయి. జాతీయస్థాయిలోనూ ఇదే పరిస్థితి... న్యాక్, ఎన్బీఏ గుర్తింపు సాధించే విషయంలో జాతీయస్థాయిలోనూ ఇదే పరిస్థితి ఉంది. ఈ గుర్తింపు విషయంలో జాతీయస్థాయి సగటు 20 శాతం మేర ఉంది. ఉదాహరణకు మొత్తం 42000 వేల విద్యాసంస్థలకు గాను న్యాక్ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు 8700, ఎన్బీఏ గుర్తింపు పొందిన 15 వేల కోర్సుల్లో కేవలం 3050 కోర్సులకు మాత్రమే ఎన్బీఏ గుర్తింపు లభించినట్లు ఉన్నతవిద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. కాగా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో జాతీయస్థాయి సగటు కంటే న్యాక్, ఎన్బీఏ గుర్తింపు పొందిన విద్యాసంస్థలు మొత్తం విద్యాసంస్థల్లో సుమారు 30 శాతం మేర ఉన్నట్లు పేర్కొన్నాయి. అంటే జాతీయ స్థాయి కంటే ఆయా రాష్ట్రాల్లో గుర్తింపున్న కళాశాలలు అధికంగా ఉన్నట్లు తెలిపాయి. న్యాక్, ఎన్బీఏ గుర్తింపుతో కలిగే ప్రయోజనాలివీ... ♦ ఉన్నతవిద్యా ప్రమాణాలు, ప్రయోగాలు, పరిశోధనల ఆధారంగా విద్యాసంస్థల వర్గీకరణ ♦ విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అవసరమైన సాంకేతిక అంశాలను కళాశాలలోనే నేర్చుకునే అవకాశం. ♦ విద్యార్థులకు కల్పించే సౌకర్యాలు, లైబ్రరీ వంటి వసతులు పెరుగుతాయి. ♦ కళాశాలల్లో ఉన్నత విద్యార్హతలు కలిగిన బోధకులు బోధించే అవకాశం ఉంటుంది. ♦ ఆయా కళాశాలలకు సైతం ప్రోత్సాహకాలు లభిస్తాయి. వాటి బోధన,పరిశోధన సామర్థ్యం పెరుగుతుంది. ♦ న్యాక్, ఎన్బీఏ గుర్తింపు పొందిన కళాశాలల్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లు పెరుగుతాయి. ♦ విద్యార్థులు జాతీయ స్థాయి పోటీపరీక్షల్లో సత్తా చాటే అవకాశం ఉంది. ♦ అంతర్జాతీయ స్థాయిలో అవకాశాల గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. అవగాహన కల్పిస్తున్నాం జాతీయస్థాయి సగటుతో పోలిస్తే తెలంగాణారాష్ట్ర వ్యాప్తంగా న్యాక్,ఎన్బీఏ గుర్తింపు కలిగిన కళాశాలలు పదిశాతం మేరనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో నగరంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయా విద్యాసంస్థలకు న్యాక్,ఎన్బీఏ గుర్తింపు ఎలా సాధించాలో నిపుణుల పర్యవేక్షణలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నాము. ఈ శిబిరాల్లో న్యాక్ సంస్థ ప్రతినిధులు సైతం హాజరై ఆయా కళాశాలల యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నారు.– పాపిరెడ్డి, ఉన్నతవిద్యామండలి చైర్మన్ -
పేదల పెన్నిధి.. ఉద్యోగాల సారథి
సాక్షి, పులివెందుల : పేదల పెన్నిధి.. ఉద్యోగాల సారధిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచారు. ఒకరు ఉద్యోగం చేసినా.. ఆ కుటుంబం బాగుపడుతుందనే ఆశయంతో ఆయన పని చేశారు. ఇందులో భాగంగా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పులివెందులలో 2008న డిసెంబర్ 25న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. దాదాపు 32 ఎకరాల్లో రూ.11 కోట్లతో భవనాలు ఏర్పాటు చేయించారు. పులివెందుల ప్రాంతంలో నిరుద్యోగ సమస్యలు ఉండకూడదనే లక్ష్యంతో నాక్ అకాడమీని నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాక్ అకాడమీలో 3,600 మందికి శిక్షణతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. 2008 నుంచి 2019 వరకు ఫ్లంబర్, పెయింటింగ్, సర్వేయర్, ఎలక్ట్రికల్ కోర్సులలో వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చారు. 2013–14లో నాక్ అకాడమీలో 1984 మందికి 2014–14లో 1284 మందికి, 2015–16లో 1327 మందికి, 2016–17లో 550 మందికి, 2017–18లో 398 మందికి, 2018–19లో 75 మందికి శిక్షణ ఇచ్చారు. కుట్టు మిషన్ల పంపిణీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నాక్ అకాడమీ ద్వారా నియోజకవర్గంలోని మహిళలకు శిక్షణ ఇచ్చి, శిక్షణ పూర్తయిన తర్వాత వారికి ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ప్రస్తుతం నాక్ అకాడమీలో శిక్షణ కార్యక్రమాన్ని తీసివేశారు. నిరుద్యోగ సమస్య ఉండకూడదనే.. జిల్లాలో నిరుద్యోగ సమస్య ఉండకూడదనే లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పులివెందులలో నాక్ అకాడమీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా చాలా మంది నిరుపేదలకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. నాక్‌లో మూడు నెలల పాటు శిక్షణతోపాటు ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. – జీవయ్య (నాక్ శిక్షకుడు), పులివెందుల వైఎస్ మా పాలిట దేవుడు దివంగత సీఎం వైఎస్ ఆర్ పేదల పాలిట దేవుడు. ఆయన చొరవతోనే పులివెందుల ప్రాంతంలో నాక్ భవనం ఏర్పాటు చేశారు. ఈ అకాడమీ ఏర్పాటు చేయకపోతే ఎందరో నిరుద్యోగులు రోడ్లపై ఉండేవారు. అకాడమీ ఏర్పాటు వల్ల ఇప్పుడు చాలా మంది వివిధ ప్రాంతాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. – జాకీర్(నాక్‌లో శిక్షకుడు), వేంపల్లె -
అన్ని విద్యా సంస్థలకు 2022 నాటికి న్యాక్
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణల పెంచేందుకు అనేక చర్యలు చేపడుతున్న కేంద్రం మరో భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దేశంలోని అన్ని ఉన్నత విద్యా సంస్థలు 2022 నాటికి నేషనల్ అసేస్‌మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) గుర్తింపు పొందేలా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కార్యాచరణను సిద్ధం చేసింది. ప్రతి ఉన్నత విద్యా సంస్థ నాణ్యతా ప్రమాణాలు కలిగి ఉండేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ‘పరాంశ్’పేరుతో ప్రత్యేక పథకానికి రూపకల్పన చేసింది. దేశంలోని జాతీయ స్థాయి విద్యా సంస్థలు, ఇండియన్ యూనివర్సిటీల భాగస్వామ్యంతో దీనిని అమలు చేయనుంది. వాటిని మెంటార్ సంస్థలుగా ఎంపిక చేసి, ప్రతి విద్యా సంస్థ న్యాక్ గుర్తింపు పొందేలా చేయాలని నిర్ణయించింది. న్యాక్ గుర్తింపునకు ఎలాంటి చర్యలు చేపట్టాలి, అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలి? ఉత్తమ ప్రమాణాలుగా ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న అంశాలపై ఆయా విద్యా సంస్థలు న్యాక్ గుర్తింపు కోరుకునే కాలేజీలకు మార్గదర్శనం చేయనున్నాయి. మొత్తానికి 2022కి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం న్యాక్ 2.5 మినిమమ్ స్కోర్‌నైనా సాధించేందుకు జాతీయ స్థాయి విద్యా సంస్థలు కృషి చేసేలా పరాంశ్ అమలుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే న్యాక్ గుర్తింపు ఉన్న విద్యా సంస్థలకే కేంద్ర ఆర్థిక సహాయం, గ్రాంట్లు, ఇతర పరిశోధన నిధులు ఇచ్చేలా చర్యలు చేపట్టిన కేంద్రం, తాజా నిర్ణయంతో ఉన్నత విద్యా సంస్థల్లో నాణ్యత ప్రమాణాలకు పెద్దపీట వేయవచ్చని భావిస్తోంది. -
న్యాక్‌తో పవర్ గ్రిడ్ ఎంవోయూ
పవర్ గ్రిడ్‌కు చెందిన సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్–1 (ఎస్‌ఆర్‌టీఎస్–1) తాజాగా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్)తో ఒక ఎంవోయూ కుదుర్చుకుంది. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలంగాణలోని 390 మంది యువతకు ఉపాధి కల్పనే ఈ ఎంవోయూ లక్ష్యం. ఇందులో భాగంగా పవర్ గ్రిడ్ తన కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.1.1 కోట్లను అందిస్తే.. న్యాక్ తనకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 31 కేంద్రాలలో ల్యాండ్ సర్వేయర్, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, వెల్డింగ్, పెయింటింగ్, ప్లంబింగ్, టైలరింగ్ వంటి పలు విభాగాల్లో శిక్షణనిస్తుంది. ఎస్‌ఆర్‌టీఎస్–1 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.శేఖర్, న్యాక్ డైరెక్టర్ జనరల్ కె.బిక్షపతి ఎంవోయూను మార్చుకున్నారు. న్యాక్ డైరెక్టర్లు, పవర్ గ్రిడ్ సీనియర్ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
‘గుర్తింపు’నిచ్చేది విద్యార్థులే..!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యాసంస్థలకు నేషనల్ అసెస్మెంట్ అక్రెడిటేషన్ కౌన్సి ల్ (న్యాక్) ఇచ్చే గుర్తింపులో విద్యార్థుల అభిప్రాయాలు కీలకం కానున్నాయని, వారి ప్రకారం అన్నీ బాగుంటేనే గుర్తింపు ఇచ్చే అవకాశం ఉంటుందని ఉన్నత విద్యా మం డలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. దీని ప్రకారమే భవిష్యత్తులో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిధులు విడుదల చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్రం అవసరమైన మార్పులు చేస్తోందని చెప్పారు. అందుకనుగుణంగా రాష్ట్రం లోని విద్యా సంస్థలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే కేంద్రం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్) ప్రవేశపెట్టిందని వివరించారు. రాష్ట్రంలోని వర్సిటీలు, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు వరల్డ్ ర్యాంకింగ్ పొందేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నత విద్యామండలి కార్యాలయంలో గురువారం టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ వరల్డ్ ర్యాంకింగ్ ప్రతినిధులు, రాష్ట్ర వర్సిటీల వీసీలు, డీన్స్, సీనియర్ ప్రొఫెసర్లతో వర్క్‌షాప్ జరిగింది. కార్యక్రమంలో గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిప్రీత్‌సింగ్, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ విద్య కమిషనర్ అశోక్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, ప్రొ.వెంకటరమణ, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ లీడ్ నిక్కీ హార్సెమన్, సౌత్ ఏసియా రీజనల్ డైరెక్టర్ రితిన్ మల్హోత్ర, అమెరికా కాన్సులేట్ కాన్సులర్ సెక్షన్ చీఫ్ డొనాల్డ్ ములిగాన్ పాల్గొన్నారు. టీచింగ్, పరిశోధనలు, పరిశ్రమలు, నిధులు, ఆవిష్కరణలు, వరల్డ్ ఔట్లుక్ వంటి 5 కేటగిరీలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకింగ్ ఇస్తున్నట్లు టైమ్స్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉస్మానియా వంటి వర్సిటీలు 800కుపైగా ర్యాంకింగ్‌లో ఉండటానికి కారణం అధ్యాపకుల కొరతతో పరిశోధనలు లేకపోవడమేనని అన్నారు. ఈ లోపాలను సవరించుకుంటే మంచి ర్యాంకు వస్తుందని సూచించారు. -
ఐఐటీలు, ఐఐఎంలకు అక్రిడిటేషన్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ : ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు, అక్రిడిటేషన్లను వేగవంతం చేయడంతో పాటు పారదర్శకత పెంచేందుకు ఈ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంలను భాగస్వాములుగా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఈ బాధ్యతలను యూజీసీ పర్యవేక్షణలో నడిచే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఒక్కటే చేపడుతున్నది. అయితే ప్రముఖ ప్రయివేట్ సంస్థలనూ ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయాలని నీతి అయోగ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రభుత్వ వనరులను సమర్ధంగా ఉపయోగించుకుంటూ ఉన్నత విద్యాసంస్థల గుర్తింపు ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు చర్యలు చేపడుతున్నామని మానవవనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. అక్రిడిటేష్న్ ప్రక్రియలో ఐఐటీలు, ఐఐఎంల పాత్రను పెంచేందుకు త్వరలో ఎనిమిది ఐఐటీలు, ఐఐఎంలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రతిపాదనను పలువురు స్వాగతించగా, మరికొన్ని ఐఐటీలు, ఐఐఎంలు ఫ్యాకల్టీ కొరతను చూపి అదనపు బాధ్యతలపై నిరాసక్తత వ్యక్తం చేశాయి. -
ఎస్వీయూ అరుదైన ఘనత
► నాక్‌లో ఏప్లస్ గ్రేడ్ ► తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన వర్సిటీ యూనివర్సిటీ క్యాంపస్: ఎస్వీయూ 2009లో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ (నాక్)లో ఏ గ్రేడ్ సాధించింది. అప్పట్లో అదో రికార్డు. ఆ రికార్డును ప్రస్తుతం తిరగరాసింది. ఏప్లస్ గ్రేడ్ సాధించింది. బెంగళూరులోని నాక్ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన నాక్ గ్రేడింగ్ ఫలితాల్లో ఎస్వీయూ 3.52 గ్రేడ్ పాయింట్లతో ఏ ప్లస్ గ్రేడ్‌ను సొంతం చేసుకుంది. నాలుగు గ్రేడ్ పాయింట్లకుగాను 3.52 గ్రేడ్ పాయింట్లు సాధించడం విశేషం. దేశంలో ఇప్పటి వరకు 7 యూనివర్సిటీలకే నాక్‌లో ఏప్లస్ గ్రేడ్ ఉంది. తాజాగా ఎస్వీయూ ఏప్లస్ సాధించి 8వ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. దేశంలోని ఏప్లస్ గ్రేడ్ ఉన్న యూనివర్సిటీల్లో నాలుగు డీమ్డ్, ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వ యూనివర్సిటీకి కూడా ఏప్లస్ లేదు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో గీతం యూనివర్సిటీ (విశాఖపట్నం)కి మాత్రమే ఈ గుర్తింపు ఉంది. ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా (హైదరాబాద్), ఆంధ్రా (విశాఖపట్నం)లకు సాధ్యం కాని ఏప్లస్ గ్రేడ్‌ను ఎస్వీయూ సొంతం చేసుకోవడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో అలగప్పా యూనివర్సిటీ తర్వాత ఏప్లస్ సాధించిన రెండో యూనివర్సిటీ ఎస్వీ యూ కావడం విశేషం. గత ఏడాది టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీలకు ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 601–800 ర్యాంక్ పొందింది. ఈ ఏడాది ప్రకటించిన ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో ఎస్వీయూ 401–600 ర్యాంక్ పొందింది. బ్రిక్స్ ర్యాంకింగ్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ పొందింది. నాక్‌లో మంచి గ్రేడ్ రావడం పట్ల క్యాంపస్‌లో శుక్రవారం రాత్రి సంబరాలు చేసుకున్నారు. -
నాక్ బృందం ఏఎన్‌యూ సందర్శన
* ఏఎన్‌యూ అభివృద్ధిపై వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ * అనంతరం విభాగాలను సందర్శించిన బృందం * కీలక అంశాలను లేవనెత్తిన సభ్యులు * కొన్ని చోట్ల తడబడిన విభాగాధిపతులు ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నాక్( నేషనల్ ఎసెస్మెంట్ అండ్ ఎక్రిడిటేషన్ కౌన్సిల్ ) నిపుణుల బృందం పర్యటన సోమవారం ప్రారంభమయ్యింది. కమిటీలో తొమ్మిది మంది ఉండగా ప్రొఫెసర్ సి బసవరాజు తొలిరోజు పర్యటనకు రాలేదు. నాక్ బృందానికి యూనివర్సిటీ పరిపాలనా భవన్ వద్ద ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గార్డ్ ఆఫ్ హానర్‌ను నాక్ బృందం స్వీకరించింది. నాక్ నిపుణుల బృందానికి వీసీ ఆచార్య ఎ రాజేంద్రప్రసాద్ గత ఐదేళ్లలో యూనివర్సిటీ సాధించిన సమగ్రాభివృద్ధితో కూడిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను సమర్పించారు. వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సుదీర్ఘంగా రెండున్నర గంటలకు పైగా కొనసాగింది. వీసీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను వీక్షిస్తున్న సమయంలో నాక్ బృందం యూనివర్సిటీలో భవిష్యత్‌లో చేపట్టబోయే చర్యలు ఏంటి, పరిశ్రమలతో కలిసి యూనివర్సిటీ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది.. అనే అంశాలను వీసీని అడిగారు. వీసీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ఏఎన్‌యూ ఐక్యూఏసీ( ఇంటర్నల్ క్వాలిటీ ఎస్సూరెన్స్ సెల్ ) ప్రజెంటేషన్‌ను కోఆర్డినేటర్ ఆచార్య కె రత్నషీలామణి సమర్పించారు. అనంతరం నిపుణుల బృందం చైర్పర్సన్ ఆచార్య హెచ్‌పీ ఖించా, ఆచార్య టి శ్రీనివాస్, ఆచార్య రాజేంద్రసింగ్‌లు ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలను సందర్శించి విద్య, పరిశోధన, బోధన, పరిశోధనా ప్రాజెక్టులు, ఇస్రో అనుబంధంతో కొనసాగుతున్న ప్రాజెక్టులను పరిశీలించారు. ఆచార్య టీఎన్ మాథూర్, ఆచార్య అరుణ్‌కుమార్, ఆచార్య వసంత్ జుగాలేలు ఆర్ట్స్, కామర్స్ కళాశాలలోని పలు విభాగాలను సందర్శించారు. ఆచార్య ఎన్పీ శుక్లా, ఆచార్య విజయ్ జుయాల్‌లు యూనివర్సిటీ సైన్స్ కళాశాలలోని పలు విభాగాలతో పాటు ఆర్ట్స్, లా కళాశాలల్లోని జర్నలిజం, లా విభాగాలను సందర్శించారు. కీలక అంశాలను లేవనెత్తిన సభ్యులు.. విభాగాల సందర్శన, విభాగాధిపతుల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా నాక్ నిపుణులు పలు కీలక అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల నిష్పత్తి ఎంత, అధ్యాపకుల కొరత ఎందుకు ఉంది, వృత్తివిద్యా కళాశాలల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఎందుకు లేరు.. విద్యార్థులకు నైపుణ్య లక్షణాలు, ఉపాధి కల్పన పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలేంటి..? విభాగాల ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న చర్యలేంటి..?, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రణాళిక ఏంటి, అంతర్జాతీయ స్థాయి సంస్థలతో కొలాబ్రేషన్స్ ఎలా ఉన్నాయి.. తదితర అంశాలను నిపుణుల బృందం అడిగి విభాగాధిపతులు ఇచ్చిన సమాచారాన్ని నమోదు చేసుకున్నారు. కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించే సమయంలో కొన్ని విభాగాధిపతులు తడబడ్డారు. నిపుణులు అడిగిన ప్రశ్నలకు కూడా కొందరు సూటిగా స్పందించలేకపోయారు. నేటి పర్యటన వివరాలు.. నాక్ నిపుణుల బృందంలో మంగళవారం ఆచార్య రాజేందర్‌సింగ్, ఆచార్య వసంత్ జుగాలే, ఆచార్య ఆరుణ్కుమార్లు ఒంగోలు పీజీ సెంటర్‌ను సందర్శిస్తారు. ప్రొఫెసర్ హెచ్‌పీ ఖించా, ఆచార్య టీఎన్ మాథూర్, ప్రొఫెసర్ ఎన్పీ శుక్లా, ప్రొఫెసర్ టి శ్రీనివాస్, పొఫెసర్ అరుణ్‌కుమార్‌లు ఏఎన్‌యూలోని లైబ్రరీ, బాలుర వసతి గృహాల్లో భోజనశాల, ఆన్లైన్ కౌన్సెలింగ్ సెంటర్, టెప్ సెంటర్, డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, పరిపాలనా భవన్‌లోని వివిధ కార్యాలయాలు, కంప్యూటర్ సెంటర్, పరీక్షా భవన్, ఆక్వాకల్చర్ సెంటర్, లేడీస్ హాస్టల్, స్పోర్ట్స్ హస్టల్, క్రీడామైదాన, సింథటిక్ ట్రాక్‌లను సందర్శిస్తుంది. -
డిసెంబర్లో ఏఎన్‌యూకు ‘నాక్’
సిద్ధంగా ఉండాలని వీసీ రాజేంద్రప్రసాద్ ఆదేశం ఏఎన్‌యూ: వర్సిటీకి నాక్(నేషనల్ ఎసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్) ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ లక్ష్యంగా అందరూ పని చేయాలని వీసీ ఆచార్య ఏ రాజేంద్రప్రసాద్ కోరారు. నాక్ ఏర్పాట్లపై సోమవారం వీసీ విభాగాధిపతులు, ప్రిన్సిపాల్స్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. వీసీ మాట్లాడుతూ తొమ్మిది మందితో కూడిన నాక్ బృందం డిసెంబర్ 5, 6, 7 తేదీల్లో ఏఎన్‌యూ సందర్శించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో జరిగిన, చేపట్టాల్సిన పనులను వీసీ అడిగి తెలుసుకున్నారు. నాక్కు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. వీసీలు, ఉన్నతాధికారులు మారుతుంటారని కానీ యూనివర్సిటీ ఖ్యాతి మాత్రం శాశ్వతంగా ఉంటుందన్నారు. అంతర్గత లోపాలను సరిదిద్దుకునేందుకు యూనివర్సిటీ ఎంచుకున్న నిపుణులతో నిర్వహించే నాక్ పీర్టీం సందర్శనలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని చెప్పారు. నాక్ Sపీర్టీం అన్ని విభాగాల్లోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి నివేదిక ఇస్తుందని చెప్పారు. నాక్ ఏర్పాట్ల కమిటీ సభ్యుడు డాక్టర్ ఆర్‌వీఎస్‌ఎస్‌ఎన్ రవికుమార్ వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య కే జాన్‌పాల్, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
రైట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ
కామారెడ్డి: పట్టణంలోని రైట్ శిక్షణ కేంద్రం ద్వారా ఔత్సాహికులకు సెల్‌ఫోన్ రిపేరింగ్, ఫ్రంట్ ఆఫీస్, బ్యుటీషియన్, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు డైరెక్టర్ రాజేంద్రకుమార్ తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రాష్ట్రప్రభుత్వం ద్వారా ఆమోదం పొందిన సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. శిక్షణ మూడు నెలల పాటు కొనసాగుతుందని, ఆసక్తి గల వారు ఇతర వివరాలకు 85004 42499, 85199 11370 నెంబర్లను సంప్రదించాలన్నారు. న్యాక్ కేంద్రంలో టైలరింగ్.. డిప్యూటీ డీఈవో కార్యాలయ ఆవరణలోగల న్యాక్ కేంద్రంలో ఉచితంగా టైలరింగ్ శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ కేంద్రం డైరెక్టర్లు రమేశ్, జీవన్, భక్తమాల తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రులు లేబర్కార్డులో పేర్లు నమోదు చేసుకుని ఉండాలని, 18నుంచి 35ఏళ్ల లోపు వారు అర్హులన్నారు. టైలరింగ్‌తో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్, ఫ్లంబింగ్, శానిటేషన్ రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వడంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివారలకు 99891 52024, 95813 21409 నెంబర్లను సంప్రదించాలన్నారు. -
ఎస్కేయూలో న్యాక్ కమిటీ పర్యవేక్షణ
► విభాగాల వారీగా విస్తృత పరిశీలన ► ఐదు విభాగాలకు ప్రశంస ► అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎస్పీ సింగ్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కూడిన న్యాక్ పీర్ కమిటీ వర్శిటీలోని విభాగాల వారీగా గురువారం పరిశీలించింది. సైన్స్ విభాగాల్లోని పరిశోధనలు, అకడమిక్ పురోగతి పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. కొన్ని విభాగాల్లో జాతీయ స్థాయిల్లోని ప్రమాణాలకు తీసిపోని విధంగా ఉన్న పరిశోధనల పట్ల పీర్ కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. న్యాక్ పీర్ కమిటీ గురువారం ఉదయం 9 గంటలకు వర్సిటీ పాలకభవనం వద్దకు చేరుకోగానే ఎంపీఈడీ విద్యార్థులు గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్కేయూ వీసీ ఆచార్య కే.రాజగోపాల్‌తో భేటీ అయ్యారు. ఐక్యూఏసీ డైరెక్టర్‌తో ఆరా: ఇంటర్నల్ క్వాలిటీ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ సెల్ (అంతర్గత నాణ్యత ప్రమాణాల మదింపు విభాగం) డైరెక్టర్ ఆచార్య జి.శ్రీధర్‌తో విభాగాల పురోగతిపై ఆరా తీశారు. విభాగాల వారీగా పరిశీలన : కెమిస్ట్రీ విభాగంలో న్యాక్ పీర్ కమిటీ సభ్యులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆచార్య ఎన్ ఎస్ షెకావత్, ఆచార్య మహేంద్ర డి .శ్రీసత్ (న్యాక్ పీర్ కమిటీ సభ్యులు)లను కెమిస్ట్రీ విభాగాధిపతి ఆచార్య జే.శ్రీరాములు విద్యార్థులను పరిచయం చేశారు. ఆచార్య జే. శ్రీరాములు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► రూరల్ డెవలప్మెంట్ అండ్ సోషల్ వర్క్, సోషియాలజీ, మేనేజ్మెంట్ విభాగాధిపతులు ఈ క్లాస్‌రూంలో ప్రజెంటేషన్ ఇచ్చారు. రూరల్‌డెవలప్‌మెంట్, సోషియాలజీ రెండు విభాగాలు ఒకే సారి కలిపి ఇవ్వడంతో న్యాక్ పీర్ కమిటీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. టీచింగ్ పర్సనల్లకు ఇచ్చే జీతం ఎందుకు తక్కువగా ఉందని ప్రశ్నించారు. ఇందులో న్యాక్ పీర్ కమిటీ సభ్యులు ఆచార్య బీకే పునియా, ఆచార్య కన్హియ అహుజా పాల్గొన్నారు. ► న్యాక్ పీర్ కమిటీ చైర్మన్ ఆచార్య ఎస్వీ సింగ్, ఆచార్య సౌందర్యపాండన్, ఆచార్య ఎన్ . గోవిందరాజులు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, హిస్టరీ విభాగాల ఆచార్యులతో సమాచారాన్ని ఆరా తీశారు. పీర్ కమిటî చైర్మన్ అడిగిన ప్రశ్నలకు తెలుగు విభాగం ఆచార్యులు ఇచ్చిన సమాధానాల్లో స్పష్టత కరువైందన్నారు. తమిళంలో పీహెచ్డీ చేసే ప్రొఫెసెర్లు తెలుగులో ఎలా పీహెచ్డీ ఇస్తున్నారని ప్రశ్నించారు. ఇంగ్లిష్ విభాగానికి సంబంధించి డాక్టర్ వి. మాధవితో మాట్లాడారు. ►కెమిస్ట్రీ, బయెటెక్నాలజీ, బోటనీ, ఇంగ్లిష్, జువాలజీ విభాగాధిపతులు, ఇన్చార్జ్ విభాగాధిపతులు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల పట్ల కమిటీ సంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం ట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లను పరిశీలించి, సాయంత్రం 5 గంటలకు ఈ క్లాస్ రూంలో పూర్వ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో న్యాక్ కమిటీ ఒక టీం సభ్యులు మాట్లాడారు. మరో టీం అనుబంధ డిగ్రీ, పీజీ కళాశాలల ప్రిన్సిపల్స్‌తో సమావేశమై కర్రికులం, పరీక్షల నిర్వహణ విధానాలు, వర్సిటీ అవలంబిస్తున్న పద్ధతులపై పాలిమర్ సైన్సెస్ సెమినార్ హాల్లో ఆరా తీశారు. విద్యార్థులతో మూడో టీం పూలే భవనంలో సమావేశమయ్యారు. రాత్రి 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి.