‘బ్లాక్‌’లో మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీ | Malla Reddy College In Blacklist BY NAAC | Sakshi
Sakshi News home page

తప్పుడు పత్రాలు.. బ్లాక్‌లిస్ట్‌లో మల్లారెడ్డి కాలేజీ

Published Fri, Dec 25 2020 7:15 PM | Last Updated on Sat, Dec 26 2020 6:06 AM

Malla Reddy College In Blacklist BY NAAC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్‌ ఆఫ్‌ ఇంజ నీరింగ్‌–ఎంఆర్‌సీఈ(క్యాంపస్‌–1)’ను నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రెడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) ఐదేళ్ల పాటు బ్లాక్‌ లిస్టులో పెట్టింది. దూలపల్లిలోని ఈ కళాశాలకు మెరుగైన గ్రేడ్‌ కోసం ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్నట్లు న్యాక్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఎం.అరుణ్‌.. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్‌ కు లేఖ రాశారు. గతంలో ఎంఆర్‌సీ ఈకి న్యాక్‌ ‘బీ++’ గ్రేడ్‌ ఉండేది. మరింత మెరు గైన గ్రేడ్‌ కోసం రీఅసెస్‌మెంట్‌కు సెల్ఫ్‌ స్టడీ రిపోర్టును (ఎస్‌ఎస్‌ఆర్‌) మల్లారెడ్డి కాలేజీ గతేడాది న్యాక్‌కు పంపించింది.

అయితే, అందులో జత చేసిన బీహెచ్‌ ఈ ఎల్, యాష్‌ టెక్నాలజీస్, ఎయిర్‌టెల్‌ కం పెనీల సంతకాలు, స్టాంపులు, లెటర్‌ హె డ్‌లను డిజిటల్‌ ఫోర్జరీ చేసినట్లు న్యాక్‌ పే ర్కొంది. డాక్యుమెంట్లు ఫోర్జరీ అని, ఎస్‌ఎస్‌ఆర్‌ సరైంది కాదని తేల్చింది. ఈ వ్యవహారంపై షోకాజ్‌ నోటీసు జారీ చేసిం ది. అయినప్పటికీ కాలేజీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని, దీంతో ఎస్‌ఎస్‌ఆర్‌ను రద్దు చేసి, ఆ కశాశాలను ఐదేళ్లు బ్లాక్‌ లిస్ట్‌లో పెడుతున్నట్లు పేర్కొంటూ న్యాక్‌ ఈ నెల 24న నోటీసు జారీచేసింది. కాగా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కాలేజీ.. ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువ పత్రాలు తయారు చేసే కేంద్రంగా మారిం దని ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల అధ్యా పక సంఘాలు ఆరోపించాయి. 

న్యాక్‌ గుర్తింపు ఎందుకంటే..
నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఆధ్వర్యం లోని న్యాక్‌ కమిటీ గుర్తింపు ఇస్తుంది. వి ద్యా ప్రమాణాలు, బోధన, లెర్నింగ్‌ ప్రాసె స్‌లో మెరుగైన విధానాలు, మౌలిక సదు పాయాలు, ఉత్తమ ఫ్యాకల్టీ, పరిశోధన, ఉద్యోగ అవకాశాలు లభించే కాలేజీలకు తగిన గ్రేడ్‌ (గుర్తింపు)ను న్యాక్‌ ఇస్తుంది. దీంతో పరిశోధన ప్రాజెక్టులు, వాటికి ఆర్థిక సహకారం లభిస్తుంది.  కంపెనీలు కూడా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో న్యాక్‌ గుర్తింపున్న కాలేజీలకు ప్రాధాన్యమిస్తాయి. ఇటు వి ద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాగా, మల్లారెడ్డి ఇంజనీరింగ్‌ కాలేజీని న్యాక్‌ బ్లాక్‌లిస్టులో పెట్టిన నేప థ్యంలో.. ఇందుకు నైతిక బాధ్యత వహి స్తూ మంత్రి మల్లారెడ్డి తన పదవికి రా జీనామా చేయాలని ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూ దన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement