malla reddy college
-
మల్లారెడ్డి యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన
-
టార్గెట్ మల్లారెడ్డి: రూ.8.8 కోట్ల నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/మేడ్చల్/కుత్బుల్లాపూర్: తెలంగాణలో గత రెండు నెలలుగా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐతో పాటు ఆదాయ పన్ను (ఐటీ) శాఖ వరుసగా నిర్వహిస్తున్న దాడులు సంచలనం కలిగిస్తున్నాయి. మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున ఐదు గంటల నుంచే, మంత్రి ఇంట్లో ఉండగానే.. కేంద్ర పోలీసు బలగాల పహారాలో ఆయన నివాసంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు ప్రారంభమయ్యాయి. మొత్తం 50 బృందాలు దాడుల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సోదాల్లో పెద్ద ఎత్తున ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించిన అధికారులు, రూ.8.8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మెడికల్ సీట్ల కేటాయింపుల్లో అవకతవకలు, రియల్ ఎస్టేట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు గుర్తించినట్లు సమాచారం. దాడులు రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం కూడా సోదాలు కొనసాగవచ్చని తెలుస్తుండగా.. ఐటీ అధికారుల నుంచి మంగళవారం ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. పన్ను చెల్లింపు, ఎగవేతపై పక్కా సమాచారం! బోయిన్‌పల్లిలో నివాసం ఉంటున్న మల్లారెడ్డి ఇంటి నుంచే దాడులు మొదలయ్యాయి. మంత్రి, ఆయన బంధువులు నిర్వహిస్తున్న పలు విద్యా సంస్థలకు..ముఖ్యంగా మెడికల్ కళాశాలలకు సంబంధించిన ఆదాయం, వాటిపై చెల్లిస్తున్న పన్ను, ఎగవేతకు సంబంధించి అందిన పక్కా సమాచారం మేరకు ఐటీ అధికారులు దాడులకు దిగినట్లు తెలుస్తోంది. మంత్రి నిర్వహిస్తున్న విద్యా సంస్థలు, వారి బంధువుల ఇళ్లను, మంత్రి భాగస్వామిగా ఉన్న విద్యా సంస్థలను జల్లెడ పడుతున్నారు. సోదాల సమయంలో మంత్రి తన మొబైల్‌ఫోన్‌ను తన నివాసం పక్కనే ఉన్న క్వార్టర్స్‌లో జూట్ బ్యాగ్‌లో దాచి పెట్టారు. ఈ విషయాన్ని పసిగట్టిన ఐటీ అధికారులు ఆ మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా అందరి మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న కుమారులు మహేందర్‌రెడ్డి, భద్రారెడ్డి, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, ఇళ్లతో పాటు వియ్యంకుడు లక్ష్మారెడ్డి, బంధువు త్రిశూల్‌రెడ్డి, విద్యా సంస్థల ఖాతాలు ఉన్న బాలానగర్‌లోని క్రాంతి కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ రాజేశ్వరరావు ఇళ్లల్లోనూ, ప్రధాన విద్యా సంస్థల్లోనూ దాడులు నిర్వహించారు. మెడికల్ సీట్ల కేటాయింపునకు సంబంధించిన అవకతవకలు కూడా గుర్తించినట్లు తెలిసింది. మొత్తం 30 కళాశాలల్లో దాడులు చేసినట్లు సమాచారం. అల్లుని ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లు మంత్రి ఇంటికి సమీపంలోనే సౌజన్య కాలనీలో నివాసం ఉండే అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాల సమయంలో ఆయన ఇంట్లో లేరని, టర్కీ దేశ పర్యటనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఇంట్లో రెండు ఎలక్ట్రానిక్ లాకర్లను అధికారులు గుర్తించారు. వాటిని తెరవడానికి ప్రయత్నిస్తున్నారు. సీఎంఆర్ కాలేజీలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న మంత్రి సోదరుడు గోపాల్‌రెడ్డి ఇంట్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొంపల్లిలోని ఫామ్ మిడోస్ విల్లాలోని మహేందర్‌రెడ్డి నివాసంలో, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కాగా మంత్రి మల్లారెడ్డి ఆర్థిక వ్యవహారాలు చూసే సంతోష్‌రెడ్డి ఇంట్లోనే ఉండి తలుపులు తీయకుండా మొండికేయడంతో, ఐటీ అధికారులు బలవంతంగా ఇంటి ద్వారాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. మల్లారెడ్డికి సంబంధించిన ఆర్థిక సమాచారం మొత్తం ఆయన వద్దనే లభిస్తుందన్న ఉద్దేశంతోనే అధికారులు బలవంతంగా లోపలికి వెళ్లినట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలు, కొన్ని హర్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విద్యాసంస్థల విస్తృత సామ్రాజ్యం! మంత్రి విద్యా సంస్థల సామ్రాజ్యం విస్తుగొల్పేస్థాయిలో ఉండడం గమనార్హం. ఆయనకు మొత్తం 36 ఇంజనీరింగ్ కాలేజీలు, మూడు మెడికల్ కళాశాలలు, డీమ్డ్ యూనివర్సిటీ, రెండు అంతర్జాతీయ పాఠశాలలతో పాటు, మరిన్ని విద్యా సంస్థలు, వందల ఎకరాల భూములున్నట్లు ఐటీ అధికారులు గుర్తించారు. మంత్రి కుమారులు రియల్ ఎస్టేట్ సంస్థల్లోనూ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లు అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు చెబుతున్నారు. మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలల సీట్ల విక్రయంలో పెద్ద ఎత్తున ఆదాయం సమకూరినా.. ఆ మొత్తానికి సంబంధించిన పన్ను చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది. కాలేజీల్లో సీట్ల కేటాయింపునకు సంబంధించిన రికార్డుల్లోనూ భారీ వ్యత్యాసాలు బయటపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీల బ్యాంకు లావాదేవీలను కూడా ఐటీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వస్తున్న ఆదాయమెంత.? ఐటీ రిటర్న్ దాఖలు చేసింది ఎంత..? పన్ను ఎగ్గొట్టింది ఎంత.? బినామీ వ్యక్తులపైనున్న ఆస్తులెన్ని.? క్రాంతి కో ఆపరేటివ్ బ్యాంకులో ఉన్న ఖాతాల్లో బినామీ ఖాతాలెన్ని.? అన్న అంశాలను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. సీఎంఆర్ స్కూల్స్‌లో మంత్రి మల్లారెడ్డి, నర్సింహయాదవ్ భాగస్వాములుగా ఉన్నట్లు తెలిసింది. దీనితో ఆయన ఇంటిపై కూడా దాడులు కొనసాగాయి. మహేందర్‌రెడ్డికి సన్నిహితుడైన జైకిషన్ ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. జైకిషన్ కేసినోలో పెట్టుబడులు పెట్టినట్లు ఐటీ అధికారులకు సమాచారం ఉంది. దాడుల నేపథ్యంలో మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి స్నేహితుడు సుచిత్రా ప్రాంతంలో ఉండే త్రిశూల్‌రెడ్డి కార్యాలయం, ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు అక్కడ రెండు కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అలాగే రఘునాథ్‌రెడ్డి వద్ద మరో రూ.2.8 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సంతోష్‌రెడ్డి నివాసంలో ఎంత పట్టుబడిందీ తెలియరాలేదు. ప్రవీణ్‌రెడ్డిని తీసుకెళ్లిన ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి మరదలు కుమారుడు ప్రవీణ్‌రెడ్డికి చెందిన దూలపల్లిలోని ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు అక్కడ పలు డాక్యుమెంట్లు, నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. కాగా డాక్యుమెంట్లతో పాటు ప్రవీణ్‌రెడ్డిని, మరొక వ్యక్తిని అధికారులు తమ వెంట తీసుకెళ్లారు. అయితే వారిని ఎక్కడికి తీసుకెళ్లిందీ కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదని తెలిసింది. హార్డ్‌డిస్కులు దాచిపెట్టిన కళాశాలల సిబ్బంది సీఎంఆర్ గ్రూప్ కళాశాలల్లోని సిబ్బంది ఐటీ అధికారులకు దొరకకుండా పలు కంప్యూటర్లు, వాటి హార్డ్ డిస్క్‌లు రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టినట్లు తెలిసింది. కాలేజీలకు అధికారులు రాకముందు వరకు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజ్‌లను కూడా డిలిట్ చేసినట్లు సమాచారం. సోదాల సందర్భంగా అధికారులు కళాశాలల గేట్లు మూసివేశారు. మీడియాను సైతం అనుమతించలేదు. ఉలిక్కి పడ్డ టీఆర్ఎస్ శ్రేణులు టీఆర్ఎస్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మేడ్చల్ ఎమ్మెల్యే, మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలతో ఆయన వెంట తిరిగే టీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ప్రసార మాధ్యమాల్లో వార్తలు రావడంతో అధికసంఖ్యలో కార్యకర్తలు ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే అధికారులు ఎవరినీ లోనికి అనుమతించలేదు. ఒక కళాశాలతో ప్రారంభించి.. పాలవ్యాపారి నుండి మంత్రి స్థాయికి ఎదిగిన మల్లారెడ్డి ప్రస్ధానం మేడ్చల్ మండలం నుండే మొదలైంది. తన అమ్మమ్మ ఊరుగా చెప్పుకునే మైసమ్మగూడలోనే ఆయన మొదటి ఇంజనీరింగ్ కళాశాల స్ధాపించారు. మైసమ్మగూడలో వందల ఎకరాల భూమి ఉండగా అందులోనే పదుల సంఖ్యలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలు, మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది. కండ్లకోయలో ఆయన సోదరులు నర్సింహారెడ్డి, గోపాల్‌రెడ్డి నేతృత్వంలో సీఎంఆర్ గ్రూపు పేరుతో ఇంజనీరింగ్ కళాశాలలు, సీఎంఆర్ ఆసుపత్రి ఉన్నాయి. మేడ్చల్ పట్టణంలో పదుల సంఖ్యలో కమర్షియల్ ప్లాట్లు, ఎల్లంపేట్, పూడూర్ తదితర గ్రామాలలో గోదాంలు ఉన్నాయి. ఇదీ చదవండి: మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ రైడ్స్.. ఒకేసారి 50 బృందాలతో.. -
30 వేల మంది విద్యార్థుల జాతీయ గీతాలాపన
మేడ్చల్‌రూరల్: స్వతంత్ర భారత వజ్రోత్సవా లను పురస్కరించుకుని సామూహిక జాతీయ గీతాలాపనలో మల్లారెడ్డి వర్సిటీ రికార్డు సృష్టించింది. వర్సిటీకి ’ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్’అవార్డు దక్కింది. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మైసమ్మగూడలో ఉన్న మల్లారెడ్డి వర్సిటీ క్రీడామైదానంలో మంగళవారం ఉదయం 11.30 గం.కు మంత్రి హరీశ్‌రావు జాతీయజెండా ఆవిష్కరించి సెల్యూట్ చేయగా ఏకకాలంలో 30 వేలమంది విద్యార్థులు జాతీయ గీతాన్ని ఆలపించారు. దీంతో ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వర్సిటీని ‘ఇండియన్ బుక్’ అవార్డుకు ఎంపిక చేశారు. అనంతరం మంత్రి మల్లారెడ్డికి అవార్డును అందజేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. రికార్డు సృష్టించాలన్నా, దాన్ని తిరగరాయాలన్నా మంత్రి మల్లన్నకే సాధ్యమవుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తన జన్మధన్యమైందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్‌రావు, జిల్లా కలెక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బ్లాక్’లో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లా రెడ్డికి చెందిన ‘మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజ నీరింగ్–ఎంఆర్‌సీఈ(క్యాంపస్–1)’ను నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్) ఐదేళ్ల పాటు బ్లాక్ లిస్టులో పెట్టింది. దూలపల్లిలోని ఈ కళాశాలకు మెరుగైన గ్రేడ్ కోసం ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసు కున్నట్లు న్యాక్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎం.అరుణ్.. మల్లారెడ్డి కాలేజీ ప్రిన్సిపాల్ కు లేఖ రాశారు. గతంలో ఎంఆర్సీ ఈకి న్యాక్ ‘బీ++’ గ్రేడ్ ఉండేది. మరింత మెరు గైన గ్రేడ్ కోసం రీఅసెస్మెంట్కు సెల్ఫ్ స్టడీ రిపోర్టును (ఎస్ఎస్ఆర్) మల్లారెడ్డి కాలేజీ గతేడాది న్యాక్‌కు పంపించింది. అయితే, అందులో జత చేసిన బీహెచ్ ఈ ఎల్, యాష్ టెక్నాలజీస్, ఎయిర్టెల్ కం పెనీల సంతకాలు, స్టాంపులు, లెటర్ హె డ్లను డిజిటల్ ఫోర్జరీ చేసినట్లు న్యాక్ పే ర్కొంది. డాక్యుమెంట్లు ఫోర్జరీ అని, ఎస్ఎస్ఆర్ సరైంది కాదని తేల్చింది. ఈ వ్యవహారంపై షోకాజ్ నోటీసు జారీ చేసిం ది. అయినప్పటికీ కాలేజీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదని, దీంతో ఎస్‌ఎస్‌ఆర్‌ను రద్దు చేసి, ఆ కశాశాలను ఐదేళ్లు బ్లాక్ లిస్ట్‌లో పెడుతున్నట్లు పేర్కొంటూ న్యాక్ ఈ నెల 24న నోటీసు జారీచేసింది. కాగా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన కాలేజీ.. ఫోర్జరీ సంతకాలు, నకిలీ ధ్రువ పత్రాలు తయారు చేసే కేంద్రంగా మారిం దని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అధ్యా పక సంఘాలు ఆరోపించాయి. న్యాక్ గుర్తింపు ఎందుకంటే.. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యం లోని న్యాక్ కమిటీ గుర్తింపు ఇస్తుంది. వి ద్యా ప్రమాణాలు, బోధన, లెర్నింగ్ ప్రాసె స్లో మెరుగైన విధానాలు, మౌలిక సదు పాయాలు, ఉత్తమ ఫ్యాకల్టీ, పరిశోధన, ఉద్యోగ అవకాశాలు లభించే కాలేజీలకు తగిన గ్రేడ్ (గుర్తింపు)ను న్యాక్ ఇస్తుంది. దీంతో పరిశోధన ప్రాజెక్టులు, వాటికి ఆర్థిక సహకారం లభిస్తుంది. కంపెనీలు కూడా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో న్యాక్ గుర్తింపున్న కాలేజీలకు ప్రాధాన్యమిస్తాయి. ఇటు వి ద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాగా, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీని న్యాక్ బ్లాక్‌లిస్టులో పెట్టిన నేప థ్యంలో.. ఇందుకు నైతిక బాధ్యత వహి స్తూ మంత్రి మల్లారెడ్డి తన పదవికి రా జీనామా చేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూ దన్‌రెడ్డి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. -
వీడిన బీటెక్ విద్యార్థి కేసు మిస్టరీ
సాక్షి, మేడ్చల్: బీటెక్ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. 15 రోజులుగా కనిపించకుండా పోయిన అతను గోవాలో ఉన్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. నల్గొండ జిల్లా సిద్దార్థ కాలనీకి చెందిన జీవన్‌రెడ్డి మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను కళాశాల సమీపంలోని హరిహర హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 11న కాలేజీకి వెళ్లిన అతడు తిరిగి రాలేదు.(అయిదు రోజులైనా లభించని బీటెక్ విద్యార్థి ఆచూకీ) ఇక హాస్టల్ రూమ్ బాత్రూంలో రక్తపు మరకలు కనపడటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 15 రోజులుగా అతని కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు జీవన్ రెడ్డి గోవాలో ఉన్నట్లు గుర్తించారు. జల్సాల కోసమే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. గతంలోనూ అతను క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవాడని తెలిసింది. (విద్యార్థి అదృశ్యం: 70 సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన) -
పేట్‌బషీర్‌బాగ్‌లో యువకుడు మిస్సింగ్ మిస్టరీ
-
ఆమె బ్యాక్ గ్రౌండ్ చూడలేదు - రామ్ చరణ్
హైదరాబాద్ : 'ఆమెతో ప్రేమలో పడేటప్పుడు ఆమె ఫ్యామిలీని కానీ, బ్యాక్ గ్రౌండ్‌ని కానీ చూడలేదు.. లెక్కలు చూసుకుని పుట్టేది అసలు ప్రేమే కాదు, నాది అన్ కండిషనల్ లవ్' అని చెప్పాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ఫెస్ట్ కి ముఖ్య అతిధిగా హాజరైన అతడు విద్యార్థులతో మాట్లాడుతూ తన ప్రేమకథను చెప్పుకొచ్చాడు. జీవితంలో అతి ముఖ్యమైన ఐదు విషయాలను గురించి వివరిస్తూ విద్యార్థులను ఉత్తేజపరిచారు. కుటుంబం, చదువు, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ.. చాలా విలువైనవన్నారు. రామ్ చరణ్ నోటి వెంట 'ప్రేమ' అనే మాట రాగానే విద్యార్థులంతా ఉత్సాహంగా ఈలలు వేశారు. దాంతో రామ్ చరణ్ చిన్న సైజ్ లవ్ గురు అయిపోయారు. ప్రేమలో పడటం అనేది అందరికీ జరిగేదే.. అయితే జీవితం ఎప్పుడూ మన ఆధీనంలోనే ఉండాలి, ఏదైనా మన లక్ష్యాలకు విఘాతం కలిగించేలా ఉండకూడదు అంటూ వివరించారు. ఉదాహరణకు నా ప్రేమ కథే తీసుకుంటే.. మల్లారెడ్డి గారు చెప్పినట్లు నేను ఉపాసనను లెక్కలు చూసుకుని ప్రేమించలేదు, అంతస్తు చూసి పెళ్లి చేసుకోలేదు.. మాది నిజమైన ప్రేమ అన్నారు. అంతకు ముందే ఎంపీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్ స్టిట్యూషన్స్ చైర్మన్ మల్లారెడ్డి మాట్లాడుతూ.. రామ్ చరణ్ ఉపాసనను పెళ్లి చేసుకుని జాక్ పాట్ కొట్టారన్నారు. మల్లారెడ్డి కామెంట్ ను సున్నితంగా ఎత్తి చూపుతూనే తన ప్రేమ కథ చెప్పి విద్యార్థులను మెప్పించారు రామ్ చరణ్. ఏ బంధమైనా లెక్కల మీద నిలబడదని, నిజమైన ప్రేమే బంధాలను నిలబెడుతుందంటూ చరణ్ చెప్పిన మాటలకు విద్యార్థులు రెట్టించిన ఉత్సాహంతో చప్పట్లు చరిచారు. అభిమాన తార రాకతో కాలేజీ ఆవరణంతా హంగామా చేశారు విద్యార్థులు. -
మల్లారెడ్డి కాలేజీలో ర్యాగింగ్ కలకలం
-
చెస్ చాంప్ భరత్‌కుమార్
జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలి యంట్ ఓపెన్ చెస్ టోర్నీ ఓపెన్ ఈవెంట్లో మల్లారెడ్డి కాలేజి విద్యార్థి భరత్ కుమార్ టైటిల్ గెలుచుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జరిగిన ఓపెన్ ఈవెంట్ ఫైనల్స్‌లో భరత్ కుమార్ (6) చక్రవర్తి రెడ్డి (5.5)పై విజయం సాధించాడు. దీప్తాంశ్ రెడ్డి (5.5) సందీప్ నాయుడు (5.5)తో డ్రా చేసుకున్నాడు. రాఘవ్ శ్రీవాస్తవ్ (5) నాగ శశాంక్ (4)పై, చేతన్ శర్మ (5) మల్లేష్ (4)పై, హిందూజ రెడ్డి(5) భుసన్ (4.5)పై నెగ్గారు. జూనియర్ కేటగిరీలో సాయి నాగ సంహిత (6) బిపిన్ రాజ్ (5)పై, సుదర్శన్ రెడ్డి (6) వర్షిత (4.5)పై, అభినవ్ చంద్ర (5) శ్రీకర్ (4)పై గెలుపొందారు. ముదాబిర్ (4.5) నాగ విజయ్ కీర్తి (4.5)తో, ప్రణీత్ (4.5) జైతిరేష్ (4.5)తో గేమ్ డ్రా చేసుకున్నారు. టోర్నీ ఉత్తమ మహిళగా వి.సాహితి, ఉత్తమ వెటరన్‌గా ఎన్.రామ్ మోహన్ రావు నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఉపాధ్యక్షుడు మేజర్ శివప్రసాద్, కార్యదర్శి కన్నారెడ్డి బహుమతులు అందజేశారు.