
సాక్షి, మేడ్చల్: బీటెక్ విద్యార్థి జీవన్‌రెడ్డి మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. 15 రోజులుగా కనిపించకుండా పోయిన అతను గోవాలో ఉన్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. నల్గొండ జిల్లా సిద్దార్థ కాలనీకి చెందిన జీవన్‌రెడ్డి మేడ్చల్‌లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతను కళాశాల సమీపంలోని హరిహర హాస్టల్లో ఉంటున్నాడు. ఈ నెల 11న కాలేజీకి వెళ్లిన అతడు తిరిగి రాలేదు.(అయిదు రోజులైనా లభించని బీటెక్ విద్యార్థి ఆచూకీ)
ఇక హాస్టల్ రూమ్ బాత్‌రూంలో రక్తపు మరకలు కనపడటంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యారు. విద్యార్థి తండ్రి ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు 15 రోజులుగా అతని కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు జీవన్ రెడ్డి గోవాలో ఉన్నట్లు గుర్తించారు. జల్సాల కోసమే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. గతంలోనూ అతను క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవాడని తెలిసింది. (విద్యార్థి అదృశ్యం: 70 సీసీ కెమెరాల పుటేజీ పరిశీలన)
Comments
Please login to add a commentAdd a comment