పావని (ఫైల్)
బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఇందిరానగర్‌లో నివసించే టంగుటూరి పావని (21) అనుమానాస్పద స్థితిలో అదృశ్యమైంది. వరంగల్‌కు చెందిన పావని గండిపేటలోని సీబీఐటీలో బీటెక్ నాల్గో సంవత్సరం చదువుతోంది. సమీపంలోని ఓసియన్ పార్కు వద్ద జయా రెసిడెన్సీ హాస్టల్‌లో ఉంటుంది. సెలవులు రావడంతో ఓటు వేసేందుకు ఈనెల 6న స్వగ్రామం వరంగల్ జిల్లా మట్టెవాడ గోపాలస్వామి టెంపుల్ లైన్‌లో ఉన్న ఇంటికి వెళ్లింది. గురువారం ఉదయం ఓటు వేసిన అనంతరం 9.30 గంటలకు వరంగల్ రైల్వేస్టేషన్‌కు వచ్చి హైదరాబాద్ వెళ్లేందుకు రైలెక్కింది. మధ్యాహ్నం 12.40 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో దిగినట్లుగా సోదరి గౌతమికి ఫోన్ చేసి చెప్పింది.
మెహిదీపట్నంలో బస్సు ఎక్కానని నేరుగా హాస్టల్‌కు వెళుతున్నానని మధ్యాహ్నం 2.28 గంటలకు వాట్సప్ మెసేజ్ చేసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆమె హాస్టల్‌కు చేరుకోలేదు. వాస్తవానికి శుక్రవారం ఆమెకు పరీక్ష కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హుమాయున్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టారు. పోలీసులు రంగంలోకి దిగి సెల్‌సిగ్నల్స్‌పై ఆరా తీయగా శంకర్‌పల్లిలో చివరి సిగ్నల్ వచ్చిందనీ అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో తర్వాత సిగ్నల్స్ అందలేదని తేలింది. ఆమె కాల్‌డేటా కోసం పోలీసులు వేచిచూస్తున్నారు. బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీ ఫుటేజ్‌లు పరిశీలిసు ్తన్నారు. ఆమె కాల్‌డేటా తీస్తే గానీ అసలు విషయం బయటపడదని పోలీసులు భావిస్తున్నారు. ఇంకోవైపు శంకర్‌పల్లిలోని పలు ప్రాంతాల్లో ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment