జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలి యంట్ ఓపెన్ చెస్ టోర్నీ ఓపెన్ ఈవెంట్‌లో మల్లారెడ్డి కాలేజి విద్యార్థి భరత్ కుమార్ టైటిల్ గెలుచుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో ఆదివారం జరిగిన ఓపెన్ ఈవెంట్ ఫైనల్స్‌లో భరత్ కుమార్ (6) చక్రవర్తి రెడ్డి (5.5)పై విజయం సాధించాడు. దీప్తాంశ్ రెడ్డి (5.5) సందీప్ నాయుడు (5.5)తో డ్రా చేసుకున్నాడు. రాఘవ్ శ్రీవాస్తవ్ (5) నాగ శశాంక్ (4)పై, చేతన్ శర్మ (5) మల్లేష్ (4)పై, హిందూజ రెడ్డి(5) భుసన్ (4.5)పై నెగ్గారు. జూనియర్ కేటగిరీలో సాయి నాగ సంహిత (6) బిపిన్ రాజ్ (5)పై, సుదర్శన్ రెడ్డి (6) వర్షిత (4.5)పై, అభినవ్ చంద్ర (5) శ్రీకర్ (4)పై గెలుపొందారు.
ముదాబిర్ (4.5) నాగ విజయ్ కీర్తి (4.5)తో, ప్రణీత్ (4.5) జైతిరేష్ (4.5)తో గేమ్ డ్రా చేసుకున్నారు. టోర్నీ ఉత్తమ మహిళగా వి.సాహితి, ఉత్తమ వెటరన్‌గా ఎన్.రామ్ మోహన్ రావు నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఉపాధ్యక్షుడు మేజర్ శివప్రసాద్, కార్యదర్శి కన్నారెడ్డి బహుమతులు అందజేశారు.
చెస్ చాంప్ భరత్‌కుమార్
Published Mon, Dec 16 2013 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 AM
Advertisement
Advertisement