open chess tournment
-
ఓపెన్ చెస్ చాంప్ కృష్ణ
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన జాతీయ చెస్ ఆటగాడు సీఆర్జీ కృష్ణ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. రామ్‌నగర్‌లోని సూపర్ కిడ్స్ చెస్ అకాడమీలో మంగళవారం జరిగిన ఈ ఈవెంట్లో కృష్ణ అన్ని రౌండ్లలోనూ విజయం సాధించాడు. దీంతో అతను ఐదు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. చివరి ఐదో రౌండ్ గేమ్‌లో కృష్ణ... ప్రత్యూష్ శ్రీవాస్తవపై గెలుపొందాడు. రెండో స్థానంలో వీఎస్ఎన్ మూర్తి నిలువగా... ప్రత్యూష్, ప్రవీణ్ భండారిలు వరుసగా మూడు, నాలుగు స్థానాలు పొందారు. విజేతలకు హైదరాబాద్ జిల్లా సంఘం కార్యదర్శి కన్నారెడ్డి మెడల్స్ అందజేశారు. 3న అండర్-7 టోర్నీ సూపర్ కిడ్స్ చెస్ అకాడమీ వచ్చే నెల 3న హైదరాబాద్ జిల్లా సెలక్షన్ చాంపియన్‌షిప్‌ను నిర్వహించనుంది. అండర్-7, మహిళల చాలెంజర్, ఓపెన్ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఎంట్రీలు పంపేందుకు మరిన్ని వివరాలకు కె.దయానంద్‌ను 9652617524 ఫోన్నంబర్లో సంప్రదించవచ్చు. -
అభిజిత్‌కు టైటిల్
తాష్కెంట్: గ్రాండ్ మాస్టర్, ప్రపంచ జూనియర్ మాజీ చాంపియన్ అభిజిత్ గుప్తా అగ్జమొవ్ మెమోరియల్ అంతర్జాతీయ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో సత్తా చాటాడు. నిర్ణయాత్మకమైన చివరి రౌండ్లో నల్లపావులతో ఆడిన అభిజిత్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి రష్యా గ్రాండ్ మాస్టర్ ఒలెగ్ కొర్నీవ్పై విజయం సాధించాడు. తొమ్మిది రౌండ్ల ఈ టోర్నీలో 7.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. 2600 ఎలో రేటింగ్ పైబడిన ఆటగాళ్లు బరిలోకి దిగిన ఈ టోర్నీలో ఏడో సీడ్ అభిజిత్ ఏడో రౌండ్లో టాప్ సీడ్ సెర్గి ఝిగాల్కో(బెలారస్)కు షాకివ్వడం కలిసొచ్చింది. -
చెస్ విజేత గౌతమ్
జింఖానా, న్యూస్‌లై న్: డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో బాలుర అండర్-16 విభాగంలో గౌతమ్ టైటిల్ సాధించాడు. మదర్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీల్లో గౌతమ్ ప్రథమ స్థానంలో నిలువగా, భార్గవ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అండర్-12 విభాగంలో సాయి సూరజ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో శ్రీరామ్ నిలిచాడు. బాలికల విభాగంలో నాగప్రసన్న విజేతగా నిలువగా, వినీత రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. బాలుర అండర్-10 విభాగంలో కార్తికేయ మొదటి స్థానంలో, అరవింద్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో అమూల్య టైటిల్ దక్కించుకుంది. శ్రీశుభ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర అండర్-8 విభాగంలో శ్రీఅనిల్ అగ్రస్థానంలో నిలువగా... రెండో స్థానాన్ని అవినాష్ సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో రిషిత టైటిల్ గెలుచుకోగా, వర్షిత రెండో స్థానంలో నిలిచింది. -
చెస్ చాంప్ భరత్‌కుమార్
జింఖానా, న్యూస్‌లైన్: బ్రిలి యంట్ ఓపెన్ చెస్ టోర్నీ ఓపెన్ ఈవెంట్లో మల్లారెడ్డి కాలేజి విద్యార్థి భరత్ కుమార్ టైటిల్ గెలుచుకున్నాడు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్లో ఆదివారం జరిగిన ఓపెన్ ఈవెంట్ ఫైనల్స్‌లో భరత్ కుమార్ (6) చక్రవర్తి రెడ్డి (5.5)పై విజయం సాధించాడు. దీప్తాంశ్ రెడ్డి (5.5) సందీప్ నాయుడు (5.5)తో డ్రా చేసుకున్నాడు. రాఘవ్ శ్రీవాస్తవ్ (5) నాగ శశాంక్ (4)పై, చేతన్ శర్మ (5) మల్లేష్ (4)పై, హిందూజ రెడ్డి(5) భుసన్ (4.5)పై నెగ్గారు. జూనియర్ కేటగిరీలో సాయి నాగ సంహిత (6) బిపిన్ రాజ్ (5)పై, సుదర్శన్ రెడ్డి (6) వర్షిత (4.5)పై, అభినవ్ చంద్ర (5) శ్రీకర్ (4)పై గెలుపొందారు. ముదాబిర్ (4.5) నాగ విజయ్ కీర్తి (4.5)తో, ప్రణీత్ (4.5) జైతిరేష్ (4.5)తో గేమ్ డ్రా చేసుకున్నారు. టోర్నీ ఉత్తమ మహిళగా వి.సాహితి, ఉత్తమ వెటరన్‌గా ఎన్.రామ్ మోహన్ రావు నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ చెస్ సంఘం ఉపాధ్యక్షుడు మేజర్ శివప్రసాద్, కార్యదర్శి కన్నారెడ్డి బహుమతులు అందజేశారు.