చెస్ విజేత గౌతమ్ | chess championship gowtham | Sakshi
Sakshi News home page

చెస్ విజేత గౌతమ్

Published Mon, Mar 31 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 5:22 AM

chess championship gowtham

జింఖానా, న్యూస్‌లై న్: డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో బాలుర అండర్-16 విభాగంలో గౌతమ్ టైటిల్ సాధించాడు. మదర్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీల్లో గౌతమ్ ప్రథమ స్థానంలో నిలువగా, భార్గవ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అండర్-12 విభాగంలో సాయి సూరజ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో శ్రీరామ్ నిలిచాడు. బాలికల విభాగంలో నాగప్రసన్న విజేతగా నిలువగా, వినీత రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది.
 
 బాలుర అండర్-10 విభాగంలో కార్తికేయ మొదటి స్థానంలో, అరవింద్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో అమూల్య టైటిల్ దక్కించుకుంది. శ్రీశుభ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర అండర్-8 విభాగంలో శ్రీఅనిల్ అగ్రస్థానంలో నిలువగా... రెండో స్థానాన్ని అవినాష్ సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో రిషిత టైటిల్ గెలుచుకోగా, వర్షిత రెండో స్థానంలో నిలిచింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement