
యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటించిన తాజా చిత్రం 'రవికుల రఘురామ'. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు.
ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment