
ఆమని, వికాస్ వశిష్ఠ, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదినీ, తదితరులు కీలక పాత్రల్లో నటించిన సినిమా "నారి". మహిళల్ని గౌరవించాలి, ఆడిపిల్లలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు సహకరించాలి అనే కాన్సెప్ట్ తో దర్శకుడు సూర్య వంటిపల్లి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్ శ్రీమతి శశి వంటిపల్లి నిర్మించారు. "నారి" సినిమా మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ - మహిళల గురించి ఒక మంచి కథతో "నారి" సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ తో తెలుస్తోంది. ట్రైలర్ చాలా బాగుంది. కొత్త ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఇలాంటి మంచి ప్రయత్నం చేయడం సంతోషకరం. ఆమని గారు మావిచిగురు, శుభలగ్నం లాంటి మూవీస్ తో తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయారు. అలాగే మా సంస్థలో ఎంసీఏ, శ్రీనివాస కల్యాణం మూవీస్ లో నటించారు. "నారి" సినిమాను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని ఈ టీమ్ కు సజెస్ట్ చేస్తున్నా. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటూ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. అన్నారు.
నటి ఆమని మాట్లాడుతూ - ఈ రోజు మా "నారి" సినిమా ట్రైలర్ దిల్ రాజు గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. వాళ్ల బ్యానర్ లో నేను శ్రీనివాస కల్యాణం, ఎంసీఎ మూవీస్ చేశాను. అప్పటి నుంచి బిజీగానే ఉంటున్నాను. వారి బ్యానర్ లో మరిన్ని మూవీస్ చేయాలని అనుకుంటున్నా. "నారి" సినిమా మహిళల గొప్పదనం చెప్పేలా మా దర్శకుడు సూర్య వంటిపల్లి రూపొందించారు. ఈ మూవీలో ఇంతమంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన సూర్య గారికి థ్యాంక్స్. ప్రతి మహిళ చూడాల్సిన చిత్రమిది. మహిళ జీవితంలో పుట్టినప్పటినుంచి అన్నీ కష్టాలే. అది అర్థం చేసుకున్న వాళ్లు కొద్దిమందే ఉంటారు. ఈరోజు సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ప్రశ్నిస్తుందీ మూవీ. నేను ఈ క్యారెక్టర్ లో ఎంతో ఇన్వాల్వ్ అయి నటించాను. మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 7న రిలీజ్ అవుతున్న మా "నారి" సినిమాను మీరంతా థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment