యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటించిన తాజా చిత్రం 'రవికుల రఘురామ'. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'చందమామే' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ "ప్రాణాలే"రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ ను డైరెక్టర్ రాధాకృష్ణ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ...ప్రాణాలే సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సాంగ్ ఆకట్టుకోవడంతో రవికుల రఘురామ చిత్ర రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారని చెప్పడంలో సందేహం లేదని, మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment