gowtham
-
గంగవ్వ కాళ్లు మొక్కిన బిగ్ బాస్ కొత్త చీఫ్
బిగ్ బాస్ హౌస్‌లో మెగా చీఫ్ కోసం రాయల్ క్లాన్, ఓజీ క్లాన్లు భారీగానే పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఓవర్ స్మార్ట్ గేమ్‌లో కొట్లాడుకుని మరీ ఛార్జింగ్ కోసం ఆపసోపాలు పడ్డారు. అయితే, ఈరోజు జరగనున్న డే-43 ప్రోమో తాజాగా విడుదలైంది. హౌస్‌లో వచ్చే వారం కోసం మెగా చీఫ్ ఎవరుకానున్నారనేది తేలిపోయింది.ఛార్జింగ్ టాస్క్‌లో రాయల్ క్లాన్ గెలిచింది. దీంతో ఆ క్లాన్ నుంచి కొందరు మెగా చీఫ్ పోటీదారులు అయ్యారు. ఫైనల్‌గా ఎవరైతే రేసులో ఉన్నారో వారందరితో 'పట్టుకో లేదంటే వదులుకో' అనే టాస్క్‌ను బిగ్‌బాస్ పెట్టాడు. ఈ గేమ్ కూడా స్కూలు పిల్లలు ఆడుతున్న కుర్చీల ఆట మాదిరి ఉంది. సర్కిల్లో ఒక వస్తువును ఉంచి దానిని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వారికి ఒక పవర్ దక్కుతుంది. అప్పుడు రేసులో ఉన్న కెంటెస్టెంట్స్లలో ఎవరినైనా ఇద్దరినీ తొలగించే ఛాన్స్ ఉంటుంది. ఈ గేమ్‌లో ఎక్కువ సార్లు గౌతమ్ నెగ్గుతాడు. దీంతో చాలామందిని గేమ్ నుంచి తప్పిస్తాడు. ఫైనల్‌గా గౌతమ్, గంగవ్వ మాత్రమే ఉంటారు. వారిలో గౌతమ్ మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది. అతనికి తోడుగా గంగవ్వ-హరితేజ ఇద్దరూ మినీ చీఫ్లుగా ఉండనున్నారు. గౌతమ్- గంగవ్వ మధ్య జరిగిన టాస్క్ ఎంటి అనేది బిగ్ బాస్ రివీల్ చేయలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం గంగవ్వ కాళ్లకు గౌతమ్ నమస్కరించడాన్ని చూపించాడు. -
‘రవికుల రఘురామ’ ట్రైలర్ ప్రామిసింగ్‌గా ఉంది: విజయ్ సేతుపతి
యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటించిన తాజా చిత్రం 'రవికుల రఘురామ'. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ.. ‘ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది, సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి అలాగే ఈ సినిమాకు వర్క్ చేసిన అందరూ ఆర్టిస్ట్, టెక్నిషియన్స్ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. -
Ravikula Raghurama: ఆకట్టుకుంటున్న ‘ప్రాణాలే’ సాంగ్
యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిక జంటగా నటించిన తాజా చిత్రం 'రవికుల రఘురామ'. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీధర్ వర్మ సాగి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి 'చందమామే' అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ "ప్రాణాలే"రిలీజ్ అయింది. ఈ లిరికల్ వీడియో సాంగ్ ను డైరెక్టర్ రాధాకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ...ప్రాణాలే సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది. లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి. ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది. ఈ సాంగ్ ఆకట్టుకోవడంతో రవికుల రఘురామ చిత్ర రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారని చెప్పడంలో సందేహం లేదని, మార్చి 15న విడుదల కాబోతున్న ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. -
'సమ్యక్ దర్శనం' వల్లే సత్యాన్ని తెలుసుకోగలం!
మగధ రాజ్య రాజధాని రాజగృహ సమీపంలోని పక్షి పర్వతం. ఆ పర్వతం చివర విశాలమైన చదును భాగం. ఒకపక్క పెద్ద పెద్ద కొండరాళ్ళు. ఆ రాళ్ళ సందులో చిన్న గుహ. అది చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చదును భాగం చుట్టూ పనస చెట్లు దట్టంగా ఉన్నాయి. ఒకరోజు బుద్ధుడు సాయంత్రం వేళ ఆ గుహ ముందున్న రాతిమీద కూర్చొని ఉన్నాడు. ఆ సమయానికి వచ్చాడు దీర్ఘనఖుడు అనే సన్యాసి. అతను అగ్ని ఆరాధకుడు. దీర్ఘనఖుడు వచ్చి, వంగి బుద్ధునికి నమస్కరించాడు. ఒక పక్కన నిలబడ్డాడు. ఆ రోజుల్లో కొందరు తాపసులు ‘‘మీరు చెప్పేది ఏదీ నాకు సమ్మతం కాదు. దేన్నీ నేను ఒప్పుకోను’’ అనేవారు. ఏ విషయాన్ని చెప్పినా, దాన్ని ఏదో ఒక విధంగా విమర్శించేవారు. తప్పులు వెదికేవారు. అంగీకరించేవారు కాదు. ఇంకొందరున్నారు. వారు ప్రతిదాన్నీ అంగీకరించేవారు. ఆయా విషయాలపై వాదవివాదాలు చేసేవారు కాదు. ‘అలాగే... ‘అవునవును’ అంటూ తలలూపేవారు. ఇక మూడోరకం ఉన్నారు. వారు ‘‘మాకు కొంత సమ్మతం కాదు’’ అనేవారు. దీర్ఘనఖుడు ఇందులో మొదటి రకం వాడు. ‘‘ఏదీ నాకు సమ్మతం కాదు’’ అనేవాడు. ఆరోజు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ.... ‘‘దీర్ఘనఖా! ఏదీ నాకు సమ్మతం కాదు’ అనేదైనా నీకు సమ్మతమేనా?’’ అని అడిగాడు. ‘‘గౌతమా! అది మాత్రం నాకు సమ్మతమే’’ అన్నాడు. బుద్ధుడు అతని వైపు తదేకంగా చూశాడు. బుద్ధుని ప్రశాంత దృక్కులు తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లు గమనించాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘ఏదీ సమ్మతం కాదు... అనేవారి దృష్టి రాగరహితంగా ఉంటుంది. దేనితో కలవకుండా ఉంటుంది. ΄÷గడ్తలకు, ప్రతి దాన్నీ పొందాలనే భావనకూ దూరంగా ఉంటుంది. దేనినీ పట్టుకుని వేళ్ళాడదు!’’ అన్నాడు. ‘‘గౌతమా! మంచిది. మీరు నా దృష్టి కోణాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట’’ అన్నాడు. ‘‘దీర్ఘనఖా! ఇంకా విను. ‘అంతా సమ్మతమే అనేవారు దీనికి భిన్నంగా ఉంటారు. వారి దృష్టి రాగంతో ఉంటుంది. ప్రతి దానితో కలసి΄ోతుంది. ΄÷గడ్తలను కోరుకుంటుంది. ప్రతి దాన్నీ పొందాలి అనుకుంటుంది. ఇక మూడోరకంవారి దృష్టి ఈ రెండు రకాలనూ కలగలుపుకుని ఉంటుంది. విశేషం ఏమిటంటే.. ఈ మూడు రకాల వారిలో ప్రతి ఒక్కరూ తమ దృష్ఠే సరైనదనుకుంటారు. ఇతరుల్ని విమర్శిస్తారు. వ్యతిరేకిస్తారు. తమ అనుభవంలో... తాము అనుకునేదానికి భిన్నమైన ఫలితం చూసినా, గ్రహించినా గానీ,,, వీరు మారరు. మూర్ఖంగా తాను అనుకున్నదే సత్యం అనుకుంటారు. సర్వం అదే అని నిర్ణయించుకుంటారు. మిగిలినదంతా మిధ్యే అని భావిస్తారు. దీని వల్ల ప్రజ్ఞని (ఎరుకను) కోల్పోతారు. సత్యాన్ని ఆవిష్కరించలేరు’’ అని చెప్పాడు. బుద్ధుడు అలా మూడురకాల దృష్టి గలవారి గురించి చెప్పాక, తన తప్పు ఏమిటో దీర్ఘనఖునికి అర్థమైంది. ద్వేషం, క్రోధాలు ఎలా సత్యాన్ని తెలుసుకోడానికి అవరోధాలలో... రాగం మోహం కోరికలు కూడా అలాంటి అవరోధాలే అని గ్రహించాడు. ఇవి తొలగించుకుని సమ్యక్ దర్శనం వల్లనే సత్యాన్ని సత్యంగా.. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలం అని అర్థం చేసుకున్నాడు. మనస్సుని మాలిన్య రహితం చేసుకోవడం వల్ల సమ్యక్ దృష్టి కలుగుతుందని గ్రహించి... వినమ్రంగా బుద్ధుని పాదాలంటి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: గంగే మాం పాహి! -
'నువ్వు చేసింది ఉప్మా కాదు.. మర్డర్'.. ఆసక్తిగా ట్రైలర్!
యడ్లపల్లి మహేష్, స్పందన, సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'కరెన్సీ నగర్'. ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్నారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్ 29న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చేతుల మీదుగా కరెన్సీ నగర్ ట్రైలర్ విడుదల చేశారు. శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ.... 'తెలుగులో మొదటిసారిగా వస్తోన్న ఆంథాలజీ చిత్రమింది. ట్రైలర్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఈ సినిమాతో దర్శకుడు వెన్నెల కుమార్ విజయం సాధించి మంచి గుర్తింపు తెచ్చుకుంటాడాని కోరుకుంటున్నా. చిత్ర యూనిట్ అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నా' అని అన్నారు. ట్రైలర్ చూస్తే ఈ సినిమాలో మనిషికి, మనీకి, నైతికతకు ఉండే బంధాన్ని.. నాలుగు కథల రూపంలో చక్కగా తెరకెక్కించారు. ఈ చిత్రంలోని పాటలు, సంగీతం అందర్నీ ఆకట్టుకుంటాయని మేకర్స్ వెల్లడించారు. ఈ మూవీ అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్కు మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ సదాశివుని, పవన్ సంగీతమందించారు. -
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది: నమ్రత
నమ్రతా శిరోద్కర్ టాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. మహేశ్ బాబును ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది. మహేశ్, నమ్రతకు సితార, గౌతమ్ జన్మించారు. సామాజిక సేవలోనూ ముందుండే నమ్రత తాజాగా తన కుమారుని గురించి పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. నమ్రత ఇన్‌స్టాలో రాస్తూ.. 'నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. రెయిన్బో ఆస్పత్రిలోని పిల్లలను కలవడం సంతోషంగా ఉంది. చికిత్స తీసుకుంటున్న పిల్లలతో కలిసి.. క్యాన్సర్ బారిన పడిన పిల్లల్లో గుండె ధైర్యాన్ని నింపడం చూస్తుంటే గర్వంగా ఉంది. వాళ్ల కోసం బహుమతులు తీసుకెళ్లడం.. చిరునవ్వులను చిందించే చిన్నారులతో సరదాగా ఉండడం. ఇలా చేయడం వల్ల చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకుంటుంటారు. వాళ్లకు అండగా నిలుస్తున్నందుకు గౌతమ్‌కు ధన్యవాదాలు.' అంటూ రాసుకొచ్చారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వావ్ గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. మహేశ్ బాబు ఫౌండేషన్‌తో రెయిన్బో ఆస్పత్రి కలిసి పని చేస్తోంది. ఎంబీ ఫౌండేషన్ సహకారంతో చిన్న పిల్లలకు గుండెకు సంబంధించిన ఆపరేషన్స్ ఉచితంగా అందిస్తున్నారు. ఇప్పుడు ఆదే బాటలో ఆయన కుమారుడు గౌతమ్ కూడా చేరిపోయారు. గుండె ఆపరేషన్ చేయించుకున్న చిన్నారులను ఆసుపత్రికి వెళ్లి పలకరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
Sakshi Premier League 2023: ఫైనల్లో ఎస్ఆర్ఆర్, గౌతమ్ కాలేజీ జట్లు
ఘట్కేసర్: తెలంగాణ రాష్ట్ర స్థాయి సాక్షి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ జూనియర్ విభాగంలో ఎస్ఆర్ఆర్ కాలేజి (మంచిర్యాల), గౌతమ్ జూనియర్ కాలేజి (ఈసీఐఎల్) జట్లు టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. సీనియర్ విభాగంలో వాగ్దేవి డిగ్రీ కాలేజి (మంచిర్యాల), భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి (సైనిక్‌పురి) జట్లు ఫైనల్లోకి దూసుకెళ్లాయి. ఫైనల్స్ నేడు జరుగుతాయి. మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ మండలం ప్రతాప సింగారంలోని బాబురావు సాగర్ మైదానంలో ఈ టోర్నీ జరుగుతోంది. సోమవారం జరిగిన జూనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో ఎస్ఆర్ఆర్ కాలేజి తొమ్మిది వికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)పై గెలిచింది. ముందుగా పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. అనంతరం ఎస్ఆర్ఆర్ కాలేజి 7.2 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసి గెలుపొందింది. ఎస్ఆర్ఆర్ ప్లేయర్ కృష్ణతేజ 25 బంతుల్లో 52 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ గౌతమ్ జూనియర్ కాలేజి 67 పరుగుల తేడాతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజి (వరంగల్)ను ఓడించింది. ముందుగా గౌతమ్ కాలేజి 10 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. అన్విత్ రెడ్డి 16 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అనంతరం పాలిటెక్నిక్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 52 పరుగులకే పరిమితమై ఓడిపోయింది. సీనియర్ విభాగం తొలి మ్యాచ్‌లో వాగ్దేవి డిగ్రీ కాలేజి ఎనిమిది వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ డిగ్రీ కాలేజి (ఖమ్మం)పై నెగ్గింది. ముందుగా ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజి 10 ఓవర్లలో 9 వికెట్లకు 74 పరుగులు చేయగా... వాగ్దేవి కాలేజి 6 ఓవర్లలో 2 వికెట్లకు 75 పరుగులు చేసి గెలిచింది. సాయి 16 బంతుల్లో 38 పరుగులు చేశాడు. సీనియర్ విభాగం రెండో మ్యాచ్‌లో భవాన్స్ వివేకానంద డిగ్రీ కాలేజి ఐదు వికెట్లతో ఎస్ఆర్బీజీఎన్ఆర్ కాలేజిని ఓడించింది. మొదట ఎస్ఆర్బీజీఎన్ఆర్ జట్టు 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. అనంతరం భవాన్స్ వివేకానంద కాలేజి 6.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసి గెలుపొందింది. భవాన్స్ ప్లేయర్ కృతిక్ 17 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. -
సమంత హ్యాండ్ ఇవ్వడంతో.. సరికొత్త సినిమాతో విజయ్ దేవరకొండ
-
ఆ విషయంలో నాకు- మహేశ్‌కు మధ్య గొడవలు అవుతుంటాయి : నమ్రత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో మహేశ్‌బాబు-నమ్రత ఒకరు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పిన నమ్రత భార్యగా, తల్లిగా బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు మహేశ్‌కు సంబంధించిన వ్యాపారాలను చేసుకుంటూ బిజినెస్ విమెన్గానూ రాణిస్తుంది. అంతేకాకుండా భర్త మహేశ్‌కు సంబంధించిన కాస్ట్యూమ్స్ సహా పలు విషయాలను దగ్గరుండి చూసుకుంటుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే నమ్రత తాజాగా ఓ ఇంటర్వ్యూలో నమ్రత తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ''మహేశ్-నేను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవడం నా జీవితంలోనే బెస్ట్ మూమెంట్. పెళ్లి తర్వాత నా ప్రపంచమే మారిపోయింది. మాతృత్వాన్ని పొందడం గొప్ప అనుభూతి. ఇక భార్యభర్తలుగా మహేశ్‌కు, మీకు ఏ విషయంలో గొడవలు అవుతుంటాయి అన్న ప్రశ్నకు బదులిస్తూ.. మా ఇద్దరి మధ్య పిల్లల విషయంలోనే గొడవలు అవుతుంటాయి. వాళ్లు నన్ను అడిగితే నో చెప్తాను.. అందుకే పిల్లలు వాళ్లకు ఏం కావాలన్నా మహేశ్నే అడుగుతారు. ఆయన నో చెప్పరు. ఈ విషయంలో చిన్నచిన్న గొడవలు జరుగుతుంటాయి'' అంటూ చెప్పుకొచ్చింది నమ్రత. -
టెక్నాలజీ అంటే ఇష్టం.. రూ.13వేల ఖర్చు, పాత ఇనుప సామగ్రితో బైక్!
సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఆ యువకుడికి మహా ఇష్టం. ఆసక్తికి ఆలోచనలు తోడయ్యాయి. ఆవిష్కరణలు ఆరంభమయ్యాయి. డ్రైవర్‌లేని కార్లు, డబుల్ మైలేజీ ఇచ్చే బైక్‌లు, ఇ–బైక్‌లను తక్కువ ఖర్చుతో తయారుచేస్తూ అందరినీ ఔరా అనిపిస్తున్నాడు. యువతకు మార్గదర్శకంగా నిలుస్తున్నాడు. విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో డేటా సైన్స్ విద్యను పూర్తిచేసిన గెంబలి గౌతమ్‌కు చిన్నప్పటి నుంచి సాంకేతిక అంశాలు నేర్చుకోవడం అంటే ఇష్టం. కొత్తకొత్త ఆవిష్కరణలు చేయడం మహా సరదా. ఆదే అలవాటుగా మారింది. మైక్రో ఆర్ట్ నుంచి వినూత్న వాహనాల తయారీ వరకు వినూత్నంగా సాగిపోతున్నాడు. రోజురోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ.. పెట్రోల్ లేకుండా బ్యాటరీతో నడిచే వాహనాలను సొంతంగా తయారు చేసి అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. ఆయన ఆలోచన నుంచి రూపుదిద్దుకున్న ఏ ఆవిష్కరణ అయినా ఔరా అనాల్సిందే. అతి తక్కువ ఖర్చుతో నడిచే స్కూటర్‌ను చూస్తే వావ్ అంటాం. తనకు నచ్చిన రంగులతో విభిన్నమైన ఆలోచనలతో దూసుకెళ్తూ.. యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. డబుల్ మైలేజ్.. డబుల్ ధమాకా.. ► పెట్రోల్ భారం తగ్గేలా గౌతమ్ సరికొత్త డివైజ్‌ను రూపొందించాడు. చైనాకు చెందిన హజ్ మోటారు వినియోగించి, బైక్‌లో కొన్ని మార్పులు చేశాడు. ఇప్పుడు లీటరు పెట్రోల్‌తో గతంలో నడిచిన దానికంటే డబుల్ మైలేజ్ వస్తోంది. ► ఇంట్లో ఉండే పాత ఇనుప సామగ్రిని వినియోగించి కేవలం రూ.13వేల ఖర్చుతో రెయిన్ బో స్కూటర్‌ను రూపొందించాడు. లిథియం బ్యాటరీ, మూలకు చేరిన కొన్ని వాహనాల పరికరాలను వినియోగించి దీనిని తయారు చేశాడు. తన మామయ్య కోరిక మేరకు దీనిని తీర్చిదిద్దానని, ఎంతోమందికి నచ్చడంతో ఈ తరహా బైక్స్ తయారు చేయాలంటూ ఆర్డర్లు వస్తున్నాయని గౌతమ్ చెబుతున్నాడు. ► దివ్యాంగుల కోసం దేశంలోనే మొట్టమొదటి స్టీరింగ్ లెస్ కారును తయారుచేసి దాన్ని రోడ్లపై నడుపుతూ గౌతమ్ అబ్బుర పరిచాడు. ఆయన రూపొందించిన కారుకు స్టీరింగ్ ఉండదు. కేవలం రూ.32 వేల ఖర్చుతో డిజైన్ చేసిన కారులో 350 వోల్టుల సామర్థ్యం కలిగిన 2 మోటార్లు, లిథియం బ్యాటరీ, కొంత ఐరన్ వినియోగించాడు. సోలార్‌తో పాటు బ్యాటరీతో నడిచేలా కారును తయారు చేశాడు. కాళ్ల వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఆపరేట్ అవుతుంటుంది. చేతులు లేని విభిన్న ప్రతిభావంతులను దృష్టిలో పెట్టుకొని ఈ డిజైన్ రూపొందించినట్టు గౌతమ్ చెబుతున్నాడు. జీపీఆర్ఎస్ సిస్టమ్, బ్లూ టూత్ వంటి సదుపాయాలు ఈ కారు సొంతం. దీనికి లైసెన్స్‌తో పనిలేదు. గతంలో అంతర్జాతీయ సైన్స్దినోత్సవం సందర్భంగా ఈ కారుని చూసిన జపాన్ బృందం యువకుడి ప్రతిభను మెచ్చుకుంది. ప్రశంసల వర్షం కురిపించింది. విశాఖపట్నంలోని ఇద్దరు దివ్యాంగులకు రెండు కార్లు ప్రత్యేకంగా తయారు చేసి అందజేశాడు. పంటలకు పురుగుమందులు పిచికారీ చేసే స్ప్రేలను వినూత్నంగా తయారుచేసి రైతులకు అందజేస్తున్నాడు. 15 గంటల్లోనే ఈ బైక్ తయారీ తన స్నేహితుడైన వెల్డర్ జానకి సహాయంతో కేవలం 15 గంటల్లో ఈ–బైక్ రూపొందించాడు. దానిని రెండు గంటల పాటు చార్జింగ్ చేస్తే 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని రుజువు చేశాడు. వాహనం తయారీకి పాత ఇనుప సామగ్రి, ఎలక్ట్రికల్ వస్తువులు, స్కూటీ టైర్లు, బీఎల్డీసీ మోటార్, లిథియం బ్యాటరీని వినియోగించాడు. యాక్సిలేటర్, ఆటో గేర్ సిస్టం, హ్యాండ్‌బ్రేక్ ఉపయోగించాడు. రాత్రి కూడా సునాయసంగా ప్రయాణించేందుకు వీలుగా బైక్‌కు ఫ్లడ్ లైట్ అమర్చాడు. పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారి జల్దు వినయ్ ఎలక్ట్రికల్ పరికరాలు ఉచితంగా ఇవ్వడంతో తన ప్రయోగం వేగంగా పూర్తిచేసినట్టు యువకుడు తెలిపాడు. ఏ ఆలోచన వచ్చినా .. ఏ ఆలోచన వచ్చినా వెంటనే అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటాను. ఇప్పటి వరకూ స్టీరింగ్ లెస్ కారుతోపాటు రెయిన్ బో స్కూటర్, రెండింతలు మైలేజీ వచ్చేలా బైక్ డిజైన్‌లో మార్పులు చేశాను. సరికొత్త బైక్ తయారీకి ప్రయత్నిస్తున్నాను. రెయిన్ బో స్కూటర్ చాలా మందికి నచ్చడంతో ఇప్పటికే కొంత మంది డిజైన్ చేసి ఇచ్చారు. చిన్నప్పటి నుంచి సరికొత్తగా ఆలోచించడం, ఏదో ఒకటి చేయాలన్న తపనతో అనేక విషయాలను నేర్చుకోవడం మొదలు పెట్టాను. చిన్నప్పుడు పిల్లలకు కరెంట్ వైర్లతో వెరైటీ ఐటెమ్స్ చేసి ఇవ్వడం, సైన్స్ ఫెయిర్ ప్రాజెక్టులకు సహకారాన్ని అందించడం వంటివి చేశాను. అప్పుడే కొత్త ఆవిష్కరణల దిశగా నా అడుగులు పడ్డాయి. – జి.గౌతమ్, పార్వతీపురం చదవండి: ఉదయాన్నే జాగింగ్, రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా.. ఈ గ్యాడ్జెట్ మీకోసమే! -
అంతర్జాతీయ క్రీడా పోటీల్లో గిరిజన యువకుల సత్తా
అనంతగిరి/ జి.మాడుగుల/ చింతూరు: (అల్లూరి సీతారామరాజు జిల్లా): జిల్లాలోని అనంతగిరి, జి.మాడుగుల, చింతూరు మండలాలకు చెందిన గిరిజన యువకులు నేపాల్‌లోని ఖాట్మండులో జరిగిన యూత్‌గేమ్స్ ఇండో, నేపాల్ ఇంటర్నేషనల్ సిరీస్–2022 పోటీల్లో సత్తా చాటారు. ఈనెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఈ పోటీలు జరిగాయి. జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పంచాయతీ వెన్నెల గ్రామానికి చెందిన ప్రభూషణరావు అండర్–19 విభాగంలో సింగిల్స్, డబుల్స్‌లో బంగారు పతకాలు సాధించాడు. అలాగే చింతూరుకు చెందిన కారం చక్రియవర్ధన్ రెండు గోల్డ్‌మెడల్స్ సాధించాడు. బ్యాడ్మింటన్ అండర్–17 విభాగం సింగిల్స్‌లో చక్రియవర్ధన్ గోల్డ్‌మెడల్ సాధించగా, రంపచోడవరానికి చెందిన లతిక్‌తో కలసి డబుల్స్ విభాగంలోనూ గోల్డ్‌మెడల్ సాధించాడు. అలాగే అనంతగిరి మండలం ఎగువశోభ పంచాయతీకి చెందిన పాంగి గౌతమ్ షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో బంగారు పతకం సాధించాడు. అనంతగిరి పంచాయతీ పెద్దూరు గ్రామానికి చెందిన కమిడి సూర్య, గౌతమ్ కలిసి డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించారు. (క్లిక్: అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన్యం యువకుల సత్తా) -
గౌతమ్ గర్జన
అటువైపు ఇటువైపు బ్యాటింగ్‌లో రెండేసి మంచి ఇన్నింగ్స్‌లు. బౌలింగ్‌లో రెండు చక్కటి స్పెల్‌లు. ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ మధ్య విజయం ఇలా దోబూచులాడుతున్న దశలో ఒక్క మెరుపు ఇన్నింగ్స్ ఫలితాన్ని మార్చేసింది. ఎక్కడో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కృష్ణప్ప గౌతమ్... ఎవరూ ఊహించిన విధంగా చెలరేగి రాయల్స్‌ను గెలిపించాడు. GOUTHAM జైపూర్: పరాజయాల బాటలో ఉన్న రాజస్తాన్ రాయల్స్‌కు గెలుపు ఉపశమనం. అప్పటిదాక అడపాదడపా మెరుపులతో సాదాసీదాగా సాగి... చివర్లో ఉత్కంఠభరితంగా మారిన మ్యాచ్‌లో ఆ జట్టు ముంబై ఇండియన్స్‌పై మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఊపిరి పీల్చుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (47 బంతుల్లో 72; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు); ఇషాన్ కిషన్ (42 బంతుల్లో 58; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాయల్స్ అరంగేట్ర బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జోఫ్రా అర్చర్ (3/22) కీలక సమయంలో వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. ఛేదనలో సంజు శామ్సన్ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు), బెన్ స్టోక్స్ (27 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్)ల భాగస్వామ్యంతో పాటు గౌతమ్ (11 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అనూహ్య ఆటతో రాయల్స్ 19.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఎంతో చేస్తుందనుకుంటే... ఎదుర్కొన్న తొలి బంతికే ఓపెనర్ లూయీస్ (0) ఔట్ కాగా... ముంబై ఇన్నింగ్స్ ఆసాంతం సూర్యకుమార్, ఇషాన్ చుట్టూనే తిరిగింది. నాలుగు ఓవర్ల పాటు ఆచితూచి ఆడిన వీరు అయిదో ఓవర్లో 18 పరుగులు పిండుకుని జోరు పెంచారు. తర్వాత ఇదే నిలకడ చూపారు. పదో ఓవర్లోనూ 18 పరుగులు బాదారు. సూర్యకుమార్ 29 బంతుల్లో, ఇషాన్ 35 బంతుల్లో అర్ధ శతకాలు అందుకున్నారు. ఈ క్రమంలో 82 బంతుల్లోనే 129 పరుగులు జోడించారు. ఈ సీజన్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. అయితే... 8 బంతుల వ్యవధిలో ఇషాన్, సూర్యకుమార్‌తో పాటు కెప్టెన్ రోహిత్ (0) వెనుదిరగడంతో పరిస్థితి తలకిందులైంది. 19వ ఓవర్ వేసిన అర్చర్ మొదట కృనాల్ పాండ్యా (7), తర్వాత అద్భుత బంతులతో హార్దిక్ (4), మెక్లీనగన్ (0)లను బౌల్డ్ చేశాడు. పొలార్డ్ (20 బంతుల్లో 21 నాటౌట్) ధాటిగా ఆడలేకపోయాడు. చివరి 35 బంతుల్లో 37 పరుగులు మాత్రమే చేసిన ముంబై... ఆరు వికెట్లు కోల్పోవడంతో ఊహించినదాని కంటే చాలా తక్కువ స్కోరుకే పరిమితమైంది. గెలిచేస్తుందనుకుంటే... ఛేదనలో రాజస్తాన్ ఇన్నింగ్స్ కూడా సాధారణంగానే ప్రారంభమైంది. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్ త్రిపాఠి (9), కెప్టెన్ రహానే (14) త్వరగానే వెనుదిరిగారు. అయితే... సంజు, స్టోక్స్ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించి పరి స్థితిని చక్కదిద్దారు. వీరిద్దరూ ఉండగా 6 ఓవర్లలో 58 పరుగులు చేయాల్సిన దశలో రాయల్స్ సులువుగా గెలిచేస్తుందనిపించింది. కానీ బుమ్రా (2/28) ధాటికి బట్లర్ (6), క్లాసెన్ (0) వరుస బంతుల్లో అవుటయ్యారు. అర్చర్ (8) కూడా విఫలమవడంతో ఆశలు అడుగంటాయి. రాజస్తాన్ విజయానికి 18 బంతుల్లో 43 పరుగులు చేయాల్సిన స్థితిలో గౌతమ్ ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగాడు. హార్దిక్ పాండ్యా వేసిన చివరి ఓవర్లో తానే స్ట్రైకింగ్ తీసుకుని ఫోర్, సిక్స్‌తో ఘనంగా ముగించాడు. -
బెంగళూరు వీక్నెస్పై దెబ్బకొడతాం!
సాక్షి, బెంగళూరు : రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బలహీనతపై దెబ్బకొడతామని స్పిన్నర్, రాజస్తాన్ రాయల్స్ ఆటగాడు క్రిష్ణప్ప గౌతమ్ అన్నాడు. బెంగళూరు టాప్ బ్యాట్స్‌మెన్ స్పిన్నర్లను అంత ధీటుగా ఎదుర్కోలేరని ఆ ఆఫ్‌బ్రేక్ బౌలర్ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం సొంతగడ్డ బెంగళూరులో జరిగిన మ్యాచ్‌లో వారు ఆడిన విధానాన్ని బట్టి ఓ అంచనాకు వచ్చినట్లు తెలిపాడు. చిన్నస్వామి స్టేడియంలో 200 పరుగులు ఈజీగా చేయవచ్చునని, ఐతే స్పిన్నర్లు తలుచుకుంటే అడ్డుకోవడం సాధ్యమన్నాడు. స్పిన్నర్లకు ఇక్కడ అనుకూల వాతావరణ ఉంది. బెంగళూరుకు ఆదిలోనే స్పిన్ బౌలింగ్‌తో దెబ్బతీస్తాం. తొలి పది ఓవర్లలోనే స్పిన్ బౌలింగ్ వేస్తే వారు 80, 90 పరుగులు చేసేలోపే 4 వికెట్లు కోల్పోయవడం ఖాయంగా కనిపిస్తోంది. నేటి మ్యాచ్‌లో పరుగుల వరద పారే అవకాశాలు లేకపోలేదు. రాజస్తాన్ ఆటగాడిగా ఐపీఎల్ ప్రారంభించిన స్పిన్ దిగ్గజం షేన్‌వార్న్ ఆపై కోచ్‌గా, మెంటార్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆయన కోచింగ్‌తో రాజస్తాన్ ఎప్పుడూ బౌలింగే ఆయుధంగా బరిలోకి దిగుతామని' స్పిన్నర్ క్రిష్ణప్ప గౌతమ్ వివరించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో నేటి సాయంత్రం 4 గంటలకు రాజస్తాన్, బెంగళూరుల మ్యాచ్ ప్రారంభం కానుంది. -
ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ జాక్‌పాట్
బెంగళూరు : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11 సీజన్లో భాగంగా రెండో రోజు వేలంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలి రోజు వేలంలో పలువురు అనామక క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోగా, రెండో రోజు వేలంలో సైతం అదే పరంపర కొనసాగుతోంది. ఆదివారం బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్ వేలంలో కర్ణాటక ఆఫ్ స్పిన్నర్ గౌతమ్ జాక్‌పాట్ కొట్టాడు. గౌతమ్‌ను రూ. 6.2 కోట్లు భారీ ధర పెట్టి రాజస్థాన్ రాయల్స్ సొంతం చేసుకుంది. గౌతమ్ కనీస ధర రూ. 20 లక్షలు కాగా, అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్ రాయల్స్ గౌతమ్‌ను అత్యధిక మొత్తానికి కొనుగోలు చేసింది. గతంలో ముంబై ఇండియన్స్‌కు గౌతమ్ ప్రాతినిథ్య వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, రెండో రోజు వేలంలో వెస్టిండీస్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఇవెన్ లూయిస్ రూ. 3.8 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. మరొకవైపు స్సిన్నర్ రాహుల్ చాహర్ రూ. 1.9 కోట్లకు ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోగా, షహబాజ్ నదీమ్‌ను రూ. 3.2 కోట్లు పెట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్ కొనుగోలు చేసింది. మరొక స్సిన్నర్ మురుగన్ అశ్విన్‌కు రూ. 2.2 కోట్లు చెల్లించి ఆర్సీబీ దక్కించుకుంది. -
అపారెల్‌ను లాభాల్లోకి తెస్తాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వివిధ రంగాల్లో ఉన్న పోకర్ణ గ్రూప్... కొత్త ఏడాది సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతోంది. నష్టాల్లో ఉన్న అపారెల్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. స్టాంజా బ్రాండ్ ఇమేజ్ను మరిన్ని నగరాలకు విస్తరించాలని నిర్ణయించింది. అలాగే గుండ్లపోచంపల్లిలో ఉన్న దుస్తుల తయారీ ప్లాంటుకు పూర్వ వైభవం తీసుకొస్తామని పోకర్ణ గ్రూప్ సీఎండీ గౌతమ్ చంద్ జైన్ తెలిపారు. క్వార్జ్, అపారెల్ విభాగాల్లో కంపెనీ ప్రణాళికలను ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికిచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. లాభాల్లోకి తీసుకొస్తాం.. గ్రూప్ ఆదాయంలో 30 శాతం సమకూర్చిన అపారెల్ విభాగం కొన్నేళ్లుగా నష్టాలను చవిచూస్తోంది. గుండ్లపోచంపల్లిలో ఉన్న దుస్తుల తయారీ ప్లాంటుకు రూ.40 కోట్లకు పైగా వెచ్చించాం. నెదర్లాండ్స్, ఇటలీ, యూఎస్, జర్మనీ కంపెనీలకు థర్డ్ పార్టీగా దుస్తులను తయారు చేసి సరఫరా చేశాం. ఉత్పాదన హై క్వాలిటీ కావడం, ఆ కంపెనీలిచ్చే ధర తయారీ ఖర్చు కంటే తక్కువగా ఉండడంతో సరఫరా మానేశాం. దీంతో నిర్వహణ భారం పెరిగింది. ఉత్పత్తి సామర్థ్యంలో 10 శాతం వినియోగానికే పరిమితమయ్యాం. ప్లాంటులో ఉత్పత్తి పెరిగితేనే నష్టాల నుంచి గట్టెక్కుతాం. యూనిట్లో వాటా విక్రయానికి, లేదా లీజుకివ్వటానికి భాగస్వామిని చూస్తున్నాం. రిటైల్‌ను విస్తరిస్తాం కనక తయారీ కూడా పెరుగుతుంది. స్టాంజా స్టోర్లు పెంచుతాం.. ఒకానొక స్థాయిలో స్టాంజా స్టోర్లు 15 దాకా ఏర్పాటయ్యాయి. కానీ నష్టాలొస్తున్న 7 స్టోర్లను మూసేశాం. ఇపుడున్న ఔట్లెట్లలో స్థలాన్ని కుదించాం. రెండేళ్లలో మరో 18 ఔట్లెట్లు ప్రారంభిస్తాం. నాణ్యతలో రాజీ లేకుండా సరైన ధరలో ఉత్పత్తులను తెస్తాం. రూ.10 కోట్లుగా ఉన్న అపారెల్ విభాగ నష్టాలిపుడు రూ.1–2 కోట్ల స్థాయికి వచ్చాయి. రిటైల్ లాభాలు సమకూరుస్తోంది కనక అపారెల్ నష్టాలు తగ్గుతూ వచ్చాయి. ఈ విభాగాన్ని త్వరలోనే లాభాల్లోకి మళ్లిస్తాం. క్వాంట్రాకు ఆదరణ.. నేచురల్ క్వార్జ్ సర్ఫేసెస్ ఉత్పాదన అయిన పోకర్ణ బ్రాండ్ ‘క్వాంట్రా’కు విదేశాల్లో మంచి ఆదరణ ఉంది. ఈ రంగంలో విజయవంతంగా యూఎస్‌లో అమ్ముడవుతున్న మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్టు మాదే. ఇటలీకి చెందిన బ్రెటన్‌స్టోన్ పేటెంటెడ్ టెక్నాలజీ వాడుతున్నాం. 200 డిజైన్లు చేస్తున్నాం. పలు దిగ్గజ కంపెనీలకు థర్డ్ పార్టీగా కూడా క్వార్జ్ సర్ఫేసెస్ సరఫరా చేస్తున్నాం. కిచెన్ కౌంటర్ టాప్స్‌కు అనువైన ఈ ఉత్పాదనను భారత్‌లో ఐకియా కూడా పోకర్ణ నుంచే కొనుగోలు చేయబోతోంది. గ్రూప్ టర్నోవరులో క్వార్జ్ విభాగం వాటా 50 శాతం దాటింది. ఇందులో క్వాంట్రా 30 శాతం సమకూరుస్తోంది. హైదరాబాద్ వద్దే ప్లాంటు.. గ్రూప్ అనుబంధ కంపెనీ అయిన పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్‌కు విశాఖపట్నం సమీపంలో నేచురల్ క్వార్జ్ సర్ఫేసెస్ తయారీ ప్లాంటు ఉంది. ఇది పూర్తి స్థాయిలో నడుస్తోంది. మరో ప్లాంటు వస్తేనే కంపెనీ వృద్ధికి ఆస్కారముంది. అందుకే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో 50 ఎకరాల్లో కొత్త ప్లాంటు ఏర్పాటుకు కార్యాచరణ మొదలుపెట్టాం. ఈ యూనిట్‌కు రూ.325 కోట్లు ఖర్చు చేస్తాం. బ్యాంకు రూ.250 కోట్ల రుణం మంజూరు చేసింది. ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. న్యాయపర ఒప్పందాలు పూర్తి అయ్యాక 18 నెలల్లో ప్లాంటు రెడీ అవుతుంది. 2019–20లోనే ప్లాంటు కార్యరూపం దాలుస్తుంది. -
జిల్లాలో సినీ, టీవీ స్టూడియో నిర్మిస్తా
–హాస్య నటుడు గౌతంరాజు రాయవరం(మండపేట): ‘గోదావరి జిల్లాలో పుట్టినందుకు ఎంతో సంతోషిస్తున్నా. జిల్లావాసిగా కళామతల్లి రుణం తీర్చుకునేందుకు తగిన కృషి చేస్తున్నా’నన్నారు ప్రముఖ హాస్యనటుడు గౌతంరాజు. ఆత్మీయత, అనుబంధానికి జిల్లా పెట్టింది పేరని, మరో జన్మంటూ ఉంటే ఈ జిల్లాలోనే పుట్టాలని ఉందని చెప్పారు. రాయవరం సాయితేజా 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. పాఠశాల దశ నుంచే నాటకాలు రాజోలులో పుట్టిన నేను కాకినాడ కాకినాడ పీఆర్ కళాశాలలో బీఎస్సీ చదివాను. విద్యాభ్యాసం అనంతరం హైదరాబాద్‌లోని ఇంటర్మీడియేట్ బోర్డులో ఉద్యోగం చేశాను. సినిమారంగంపై ఉన్న ఆసక్తితో దీర్ఘకాలిక సెలవులో వెళ్లి, 1991లో ఉద్యోగానికి రాజీనామా చేశాను. పాఠశాల దశ నుంచి నాటకాలు వేశాను. కాకినాడలో చదువుతుండగా 42 ప్రదర్శనలు ఇచ్చాను. ‘పశ్చాత్తాపం, లాభం, ఏక్ దిన్ కా సుల్తాన్, ఆగండి ఆలోచించండి’ తదితర నాటకాల్లో నటించాను. అలా వచ్చింది అవకాశం.. సింగీతం శ్రీనివాసరావుగారి దర్శకత్వంలో వచ్చిన ‘వసంతగీతం’ సినిమాలో తొలిసారిగా నటించాను. ఇప్పటి వరకు 200కు పైగా సినిమాల్లో నటించాను. ‘ఘరానామొగుడు, కూలీ నెం1, ప్రేమకు వేళాయెరా, ఉగాది’ తదితర సినిమాలు గుర్తింపునిచ్చాయి. ‘జై శ్రీరామ్’ సినిమాలో తొలిసారి విలన్ వేషం వేశాను. ‘వెయ్యి అబద్ధాలు’ సినిమాలో తేజ మరోసారి విలన్ వేషం ఇచ్చారు.ఎందరో మహానటులు నాటక రంగం నుంచి వచ్చిన వారే. జిల్లాలో త్వరలో బీజీఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియో నిర్మాణం చేపడుతున్నాను. ఎక్కడ నిర్మించేది త్వరలోనే వెల్లడిస్తాను. తమిళ డైరెక్టర్ సాగా దర్శకత్వంలో త్వరలో సినిమా రూపొందిస్తున్నాం. ఆ సినిమాలో జిల్లాలో ఉన్న నటీనటులకు ప్రాధాన్యం ఇస్తాను. మే నెలాఖరుకు షూటింగ్ ప్రారంభిస్తాను. నా కొడుకు కృష్ణకు గుర్తింపు వచ్చింది... నా కుమారుడు కృష్ణంరాజును కృష్ణ పేరుతో సినిమా పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాను. ‘లక్ష్మీదేవి సమర్పించు..నేడే చూడండి’ ఈ నెల ఏడున విడుదలై మంచి కలెక్షన్స్‌ను రాబట్టింది. ఈ సినిమాతో కృష్ణకు నటుడిగా మంచి మార్కులు వచ్చాయి. కృష్ణ మంచి డ్యాన్సర్ కావడంతో హీరో అవకాశం వచ్చింది. -
బ్రహ్మీకి ప్రమోషన్ వచ్చిందోచ్
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందానికి ప్రమోషన్ లభించింది. అనేక సినిమాల్లో తనదైన హావభావాలు, నటనతో హాస్యం పడించి, అటు ప్రేక్షకులను అభిమానాన్ని, ఇటు అనేక రివార్డులు, అవార్డులను సొంతం చేసుకున్న బ్రహ్మీ వ్యక్తిగత జీవితంలో మరో కీలకమైన మెట్టు ఎక్కారు. అదే.. తాతయ్య అయ్యారు. దీంతో బ్రహ్మానందం కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్- జ్యోత్స్న దంపతులకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. హనుమాన్ జయంతి కావడంతో పండగ రోజు ఇంట్లో సంతోషం వెల్లివిరిసిందని.. మనవడి రాకతో ఇల్లు కళకళలాడుతోందని బ్రహ్మానందం తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, బంధువులతో పంచుకున్నారు. పండుగ రోజున, ఆనందం తమ సంతోషం రెండింతలు అయిందనీ, ప్రతి ఒక్కరితో ఈ సంతోష వార్తను పంచుకునేందుకు ఆనందంగా ఉందన్నారు. జ్యోత్స్న , బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని బ్రహ్మానందం తెలిపారు. అలాగే గౌతమ్ తండ్రిగా మారడం ఆనందంగా ఉందన్నారు. అన్నట్టు మనవడికి అన్నీ తాత పోలికలేనట. కాగా పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా టాలీవుడ్లో తెరంగేట్రం చేసిన గౌతమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ప్రస్తుతం మను అనే ఫిల్మ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
గౌతమ్, సితారల రాఖీ పండుగ చూశారా?
సూపర్ స్టార్ మహేష్ బాబు వారసులు గౌతమ్, సితారలు రాఖీ పండుగను ముద్దు ముద్దుగా సెలబ్రేట్ చేసుకున్నారు. చిన్నారుల రాఖీ వేడుకకు సంబంధించిన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నమ్రత దగ్గరుండి సితార చేత అన్నయ్య గౌతమ్‌కి రాఖీ కట్టించి, హారతి ఇప్పించి, స్వీట్ తినిపించారు. ఆ తర్వాత గౌతమ్.. చిట్టి చెల్లి సితారను ఆశీర్వదించేశాడు. పిల్లలకు చిన్నప్పటి నుంచే సంప్రదాయాలను నేర్పించడం, బంధాల విలువను తెలియజేయడం అభినందించదగిన విషయమని నమ్రతకు బోలెడన్ని ప్రశంసలందుతున్నాయి. గౌతమ్, సితారల ఫొటోలు చూసిన పలువురు 'బెస్ట్ రాఖీ మొమెంట్' అంటూ ముచ్చటపడుతున్నారు. ఈ ఫొటోతో అన్నాచెల్లెళ్లు సూపర్ స్టార్‌కు మించిన సెలబ్రిటీలు అయిపోయేలా ఉన్నారు. -
సపక్ తక్రా న్యాయనిర్ణేతగా గౌతమ్
అమలాపురం : హైదరాబాద్‌లోని ఈ నెల 27 నుంచి 31 వరకు జరిగే విక్టరీ ప్లేగ్రౌండ్ ఇండోర్ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల సపక్ తక్రా చాంపియన్‌షిప్ పోటీలకు న్యాయ నిర్ణేతగా జిల్లా సపక్‌తక్రా అసోసియేషన్ కోచ్ యాండ్ర గౌతమ్ ఎంపికైనట్టు సంఘ జిల్లా కార్యదర్శి మునగాల మన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సపక్‌తక్రా సంఘం నుంచి అహ్వానం అందిందని చెప్పారు. -
చెస్ విజేత గౌతమ్
జింఖానా, న్యూస్‌లై న్: డిస్ట్రిక్ట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్లో బాలుర అండర్-16 విభాగంలో గౌతమ్ టైటిల్ సాధించాడు. మదర్ చెస్ అకాడమీ నిర్వహించిన ఈ పోటీల్లో గౌతమ్ ప్రథమ స్థానంలో నిలువగా, భార్గవ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. అండర్-12 విభాగంలో సాయి సూరజ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. రెండో స్థానంలో శ్రీరామ్ నిలిచాడు. బాలికల విభాగంలో నాగప్రసన్న విజేతగా నిలువగా, వినీత రెండో స్థానాన్ని సొంతం చేసుకుంది. బాలుర అండర్-10 విభాగంలో కార్తికేయ మొదటి స్థానంలో, అరవింద్ రెండో స్థానంలో నిలిచారు. బాలికల విభాగంలో అమూల్య టైటిల్ దక్కించుకుంది. శ్రీశుభ ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలుర అండర్-8 విభాగంలో శ్రీఅనిల్ అగ్రస్థానంలో నిలువగా... రెండో స్థానాన్ని అవినాష్ సొంతం చేసుకున్నాడు. బాలికల విభాగంలో రిషిత టైటిల్ గెలుచుకోగా, వర్షిత రెండో స్థానంలో నిలిచింది.