బిగ్ బాస్ హౌస్‌లో మెగా చీఫ్ కోసం రాయల్ క్లాన్, ఓజీ క్లాన్‌లు భారీగానే పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఓవర్ స్మార్ట్ గేమ్‌లో కొట్లాడుకుని మరీ ఛార్జింగ్ కోసం ఆపసోపాలు పడ్డారు. అయితే, ఈరోజు జరగనున్న డే-43 ప్రోమో తాజాగా విడుదలైంది. హౌస్‌లో వచ్చే వారం కోసం మెగా చీఫ్ ఎవరుకానున్నారనేది తేలిపోయింది.
ఛార్జింగ్ టాస్క్‌లో రాయల్ క్లాన్ గెలిచింది. దీంతో ఆ క్లాన్ నుంచి కొందరు మెగా చీఫ్ పోటీదారులు అయ్యారు. ఫైనల్‌గా ఎవరైతే రేసులో ఉన్నారో వారందరితో 'పట్టుకో లేదంటే వదులుకో' అనే టాస్క్‌ను బిగ్‌బాస్ పెట్టాడు. ఈ గేమ్ కూడా స్కూలు పిల్లలు ఆడుతున్న కుర్చీల ఆట మాదిరి ఉంది. సర్కిల్‌లో ఒక వస్తువును ఉంచి దానిని ఎవరైతే ముందుగా తీసుకుంటారో వారికి ఒక పవర్ దక్కుతుంది.
అప్పుడు రేసులో ఉన్న కెంటెస్టెంట్స్‌లలో ఎవరినైనా ఇద్దరినీ తొలగించే ఛాన్స్ ఉంటుంది. ఈ గేమ్‌లో ఎక్కువ సార్లు గౌతమ్ నెగ్గుతాడు. దీంతో చాలామందిని గేమ్ నుంచి తప్పిస్తాడు. ఫైనల్‌గా గౌతమ్, గంగవ్వ మాత్రమే ఉంటారు. వారిలో గౌతమ్ మెగా చీఫ్ అయినట్లు తెలుస్తోంది. అతనికి తోడుగా గంగవ్వ-హరితేజ ఇద్దరూ మినీ చీఫ్‌లుగా ఉండనున్నారు. గౌతమ్- గంగవ్వ మధ్య జరిగిన టాస్క్ ఎంటి అనేది బిగ్ బాస్ రివీల్ చేయలేదు. తాజాగా విడుదలైన ప్రోమోలో మాత్రం గంగవ్వ కాళ్లకు గౌతమ్ నమస్కరించడాన్ని చూపించాడు.
Comments
Please login to add a commentAdd a comment