బ్రహ్మీకి ప్రమోషన్‌ వచ్చిందోచ్‌ | Comedian Brahmanandam Become Grandfather | Sakshi
Sakshi News home page

బ్రహ్మీకి ప్రమోషన్‌ వచ్చిందోచ్‌

Published Thu, Apr 13 2017 4:54 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

బ్రహ్మీకి ప్రమోషన్‌ వచ్చిందోచ్‌

బ్రహ్మీకి ప్రమోషన్‌ వచ్చిందోచ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ప్రముఖ హాస్యనటుడు,  హాస్యబ్రహ్మ  బ్రహ్మానందానికి  ప్రమోషన్‌ లభించింది.  అనేక సినిమాల్లో తనదైన హావభావాలు, నటనతో హాస్యం పడించి, అటు ప్రేక్షకులను అభిమానాన్ని, ఇటు అనేక రివార్డులు, అవార్డులను సొంతం చేసుకున్న ‍ బ్రహ్మీ వ్యక్తిగత జీవితంలో మరో కీలకమైన మెట్టు ఎక్కారు. అదే.. తాతయ్య అయ్యారు. దీంతో బ్రహ్మానందం కుటుంబంలో  ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి.

బ్రహ్మానందం కుమారుడు గౌతమ్- జ్యోత్స్న దంపతులకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. హనుమాన్ జయంతి కావడంతో పండగ రోజు ఇంట్లో సంతోషం వెల్లివిరిసిందని.. మనవడి రాకతో ఇల్లు కళకళలాడుతోందని బ్రహ్మానందం తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, బంధువులతో పంచుకున్నారు. పండుగ రోజున, ఆనందం  తమ సంతోషం రెండింతలు అయిందనీ,  ప్రతి ఒక్కరితో ఈ సంతోష వార్తను  పంచుకునేందుకు  ఆనందంగా ఉందన్నారు.  జ్యోత్స్న , బాబు ఇద్దరూ  ఆరోగ్యంగా ఉన్నారని  బ్రహ్మానందం తెలిపారు. అలాగే  గౌతమ్‌ తండ్రిగా మారడం  ఆనందంగా ఉందన్నారు. అన్నట్టు  మనవడికి అన్నీ తాత పోలికలేనట.

కాగా పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా  టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసిన గౌతమ్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ప్రస్తుతం మను అనే ఫిల్మ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement