ఎక్కడో మూరుమూల గ్రామంలో పుట్టి పెరిగిన కుర్రాడు, చెప్పులు కూడా కొనుకోలేని దుస్థితిలో ఉన్న పిల్లవాడు లెక్చరర్‌గా పాఠాలు చెప్పే స్థాయికి ఎదిగాడు. సైకిలే గొప్ప అనుకునే ఆయన కార్లలో తిరిగాడు. విద్యార్థులకు పాఠాలు బోధించే అతడు ప్రేక్షకులకు వినోదం పంచడం కోసం నటుడిగా ముఖానికి రంగు వేసుకున్నాడు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆయన రాష్ట్రపతి చేతులమీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు. ఆయనే స్టార్ కమెడియన్ బ్రహ్మానందం. ఈ మధ్య సినిమాలు తగ్గించేసిన ఆయన నేను మీ బ్రహ్మానందం పేరిట తన ఆత్మకథ రాసుకున్నాడు. గత నెలాఖరున ఈ పుస్తకం విడుదలైంది. పెద్దగా వివాదాల జోలికి పోలేదని, కానీ తనలోని సంఘర్షణలకు పుస్తకరూపం ఇచ్చానన్నాడు బ్రహ్మానందం.
దగ్గర డబ్బులు లేవు
ఈ పుస్తకంలో తన గురించి ఎవరికీ తెలియని విషయాలను పొందుపరిచాడు. తన చదువంతా ఎవరో ఒకరి సాయంతోనే కొనసాగిందని తెలిపాడు. తనకు సాయం చేసినవాళ్ల ఇంట్లో చిన్నపాటి పనులు చేసిపెడుతూ ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు తెలిపాడు. అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి తన దగ్గర డబ్బులు లేవు. సరిగ్గా అప్పుడే వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అధికారులు గుంటూరులో పీజీ సెంటర్ ఓపెన్ చేశారు. బ్రహ్మానందం కళను, కామెడీని చూసి MA తెలుగులో ఫ్రీ సీట్ ఇచ్చారు. గుంటూరు సమీపంలో నల్లపాడులో చిన్న అద్దెగదుల్లో చేరిన ఆయన అనసూయమ్మ చేసిన ఆర్థిక సాయంతో చదువుకున్నారు. పూర్తిగా ఆమె మీద ఆధారపడితే బాగోదని, కనీసం తినడానికి అయినా సంపాదించాలని ఏదో ఒక పని చేద్దామనుకున్నాడు.
లారీలకు రంగు వేసే పనిలో..
నల్లపాడు రూమ్ నుంచి కాలేజీకి వెళ్లే దారిలో లారీలు రిపేర్లు చేస్తూ పెయింట్ వేసేవాళ్లు. సాయంత్రం కాలేజీ అయిపోగానే పాత బట్టలు వేసుకుని అక్కడికి వెళ్లి లారీలకు పెయింట్ వేశాడు. అప్పుడు నెల జీతంలా కాకుండా పనిని బట్టి నాలుగైదు రూపాయలు ఇచ్చేవారని పుస్తకంలో రాసుకొచ్చాడు బ్రహ్మానందం. అలా చిన్నపాటి పనులు చేసుకుంటూ, దాతల సాయంతో చదువుతూ తన చదువు పూర్తి చేసి లెక్చరర్‌గా మారాడు. మరోవైపు తనలోని కామెడీ యాంగిల్‌తో ప్రముఖ హాస్యనటుడిగా ఎదిగాడు.
చదవండి: వర్మ ఆడిషన్‌కు వెళ్లా.. నన్ను వెళ్లిపోమని చెప్పాడు.. తర్వాత పిలవనేలేదు
Comments
Please login to add a commentAdd a comment