
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇంట పెళ్లి సందడి షురూ అయింది. ఆయన రెండో తనయుడు సిద్దార్థ్.. డాక్టర్ ఐశ్వర్యతో ఆయన ఏడడుగులు వేయనున్నారు. ఇటీవలే వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే! తాజాగా వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. త్వరలో హైదరాబాద్‌లో జరగనున్న పెళ్లి కోసం అతిథులకు ఆహ్వానాలు పంపుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారిని బ్రహ్మానందం కుటుంబ సమేతంగా కలిసి పెళ్లి పత్రిక అందజేశారు.
తన కుమారుడి పెళ్లికి తప్పకుండా రావాల్సిందిగా కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బ్రహ్మానందం దంపతులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపోతే బ్రహ్మానందానికి ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు రాజా గౌతమ్ 'పల్లకిలో పెళ్లికూతురు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తర్వాత పలు చిత్రాల్లో నటించారు. గౌతమ్‌కు ఇదివరకే పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు.
బ్రహ్మానందం తన మనవళ్లతో కలిసి ఆడుకున్న ఫోటోలను అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటారు గౌతమ్. బ్రహ్మానందం చిన్న కొడుకు సిద్దార్థ్ విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతడికి సినిమాల మీద ఆసక్తి లేకపోవడంతోనే ఇండస్ట్రీకి దూరంగా ఉంచినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment