Grandfather
-
అమెరికా నుంచి వచ్చి.. తాతను చంపిన మనవడు
హైదరాబాద్: చిన్నప్పటి నుంచి తనను అందరిలా పెంచలేదని.. అందరిని చూసినట్లు తనను చూడలేదని తాతను కత్తితో పొడిచి చంపేశాడు ఓ మనవడు. అడ్డుకోబోయిన కన్నతల్లిని గాయపరిచాడు. ఈ దారుణ ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎస్ మక్తాలో నివాసం ఉండే వి.చంద్రశేఖర జనార్దన్ రావు (86) వ్యాపారవేత్త. ఇతను వెల్జాన్ గ్రూప్ ఆఫ్ ఇండస్త్రీ చైర్మన్. ఆయనకు సరోజ అనే కూతురు. ఆమె భర్త బెంగళూరులో ఉండగా.. సరోజ తండ్రి జనార్దన్ రావుతో కలిసి బీఎస్ మక్తాలో ఉంటోంది. సరోజ కొడుకు కిలారు కార్తి తేజ (29) అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి నగరానికి తిరిగి వచ్చాడు. తాత ఆస్తి కోసం నిత్యం గొడవ పడేవాడు. అందరినీ చూసినట్లు తనను చూడడంలేదని.. అందరిలా తనను పెంచలేదంటుండేవాడు. ఈ విషయంలో తాతతో విభేదించి కార్తితేజ ల్యాంకోహిల్స్‌లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. గురువారం రాత్రి బీఎస్ మక్తాకు వచ్చి ఆర్థిక లావాదేవీల గురించి తల్లి, తాతతో గొడవకు దిగాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్దన్ రావు కడుపులో పొడిచాడు. అడ్డుకున్న తల్లి సరోజను గాయపరిచాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అంతలోపే కార్తి తేజ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి అప్పటికే జనార్దన్ రావు మృతి చెందినట్లు నిర్ధారించారు. గాయాలపాలైన సరోజను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు కార్తి తేజ కోసం గాలిస్తున్నారు. -
కార్చిచ్చుపై ప్రెస్మీట్లో ముత్తాతనయ్యానని జో బైడెన్ ప్రకటన
లాస్ ఏంజెలెస్: అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు ఇబ్బందికర అనుభవం ఎదురైంది. లాస్ ఏంజెలెస్‌తో పాటు దక్షిణ కాలిఫోర్నియా మొత్తాన్ని భీకర కార్చిచ్చు చుట్టుముట్టి పెను నష్టం చేస్తున్న విషయం తెలిసిందే. దాని ధాటికి ఇప్పటికే లక్షన్నర మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ఇళ్లతో పాటు సర్వం బుగ్గి పాలై భారీగా ఆస్తి నష్టం జరిగింది. ముఖ్యంగా లాస్ ఏంజెలెస్‌లో హాలీవుడ్ తారలతో పాటు ప్రముఖులుండే అతి సంపన్న ఆవాసాలు పెద్ద సంఖ్యలో అగ్నికి ఆహుతిగా మారాయి. ఈ విపత్తుపై స్థానిక శాంటా మోనికాలో బైడెన్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఉన్నట్టుంది వ్యక్తిగత ప్రకటన చేశారు. తనకు ముని మనవడు పుట్టాడని చెప్పుకొచ్చారు. ‘ఈ ప్రతికూల వార్తల నడుమ ఒక శుభవార్త. ఈ రోజే నేను ముత్తాత అయ్యాను. చాలా కారణాలతో నాకీ రోజు గుర్తుండిపోతుంది‘ అని అన్నారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ‘పేరుకేమో అగ్ర రాజ్య అధ్యక్షుడు. కనీసం ఎక్కడేం మాట్లాడా లో తెలియదా?‘ అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాస్ ఏంజెలెస్ మంటల్లో బైడెన్ కుమారుని ఇల్లు కూడా బుగ్గిగా మారినట్టు వార్తలొచ్చాయి. ‘అది పూర్తిగా కాలిపోయిందని తొలుత చెప్పారు. బానే ఉందని ఇప్పుడంటున్నారు‘ అంటూ ఈ వార్త లపై బైడెన్ స్పందించారు.ప్రెస్ మీట్‌కు ముందే...మీడియా సమావేశానికి ముందే బైడెన్ స్థాని క ఆస్పత్రిలో ముని మనవడిని చూసి వచ్చారు. ఆ ఫొటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. పదవిలో ఉండగా ముత్తాత అయిన తొలి అమెరికా అధ్యక్షునిగా కూడా 82 ఏళ్ల బైడెన్ రికార్డు సృష్టించడం విశేషం. పెద్ద వయసులో అధ్యక్షుడు అయిన రికార్డు ఆయన పేరిటే ఉండటం తెలిసిందే. 77 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 78 ఏళ్ల ట్రంప్ ఇప్పుడా రికార్డును తిరగరా యనున్నారు. ఈ నెల 20న ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయనుండటం తెలిసిందే. -
తాత మందలించాడని.. మనమడు ఎంతకు బరి తెగించాడంటే..
కర్నూలు: ‘బాగుపడే లక్షణాలు లేవు.. సెల్‌ఫోన్ మీద ఉన్న ధ్యాస వృత్తి(పౌరోహిత్యం)పై ఉండటం లేదు. ఇలాగైతే ఎలా ’ అంటూ మందలించిన తాతను.. సొంత మనుమడే కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. స్థానిక మాధవీనగర్‌లో నివాసముంటున్న మేడవరం సుబ్రహ్మణ్య శర్మ (83) వ్యవసాయ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ 1996లో పదవీ విరమణ పొందాడు. సుబ్ర హ్మణ్య శర్మ భార్య శాంతమ్మ 13 ఏళ్ల క్రితం, పెద్ద కుమారుడు సతీష్ శకర్మ 14 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందడంతో కోడలు అరుణ(పెద్ద కొడుకు భార్య), మనుమడు దీపక్ శర్మ ఉంటున్నారు. దీపక్ శర్మ చదువు మధ్యలోనే ఆగిపోవడంతో కులవృత్తి పౌరోహిత్యం నేర్చుకోమని కేసీ కెనాల్ వద్ద ఉన్న వినాయక ఘాట్ దేవాలయంలో వదిలారు. అయితే పూజా కార్యక్రమాలకు డుమ్మా కొడుతుండటంతో తాత తరచూ మందలించేవాడు. రెండు రోజుల క్రితం మహానందిలో ఉన్న బంధువుల ఇంటికి స్కూటీపై వెళ్తుండగా బస్సులో వెళ్లమని చెప్పినా పెడచెవిన పెట్టాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా వృత్తిపని నేర్చుకునేందుకు వెళ్లకుండా సెల్ఫోన్లో మాట్లాడుతూ ఉండటంతో తాత మరో సారి మందలించాడు. దీంతో ఆలయానికి వెళ్లి కాసేపటికే తిరిగి ఇంటికి వచ్చాడు. ‘ఎందుకంతలోనే వచ్చావు.. వృత్తిపై ధ్యాస లేదా’ అంటూ ప్రశ్నించడంతో ఒక్కసారిగా ఆవేశానికి లోనై కూరగాయల కత్తి తీసుకొని మంచంపై పడుకోబెట్టి గొంతు కోసి హత్య చేశాడు. దుస్తులకు రక్తం అంటడంతో బాత్రూమ్లో స్నానం చేసి వేరే దుస్తులు వేసుకుని బాబాయి రమేష్‌శర్మకు ఫోన్ చేసి తాతను ఎవరో హత్య చేశారంటూ సమాచారమిచ్చాడు. వారు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో పడివున్న సుబ్రహ్మణ్య శర్మను చూసి ఆశ్చర్యపోయారు. విషయం తెలుసుకున్న మూడో పట్టణ సీఐ తబ్రేజ్, ఎస్ఐలు జయశేఖర్, శ్రీనివాసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. నేరం జరిగిన తీరును చూసి దీపక్ శర్మపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా తనకు తెలియదంటూ బుకాయించడంతో డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను సేకరించారు. స్టేషన్‌కు తీసుకువెళ్లి తమదైన శైలిలో విచారించగా నేరాన్ని అంగీకరించాడు. మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీ కేంద్రానికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: థాయ్ విద్యార్థినిపై అత్యాచార యత్నం.. హిందీ నేర్పిస్తానని ఇంటికి తీసుకెళ్లి.. -
‘లోన్ యాప్’ ఒత్తిడికి తాతా మనవళ్ల ఆత్మహత్య
నరసాపురం రూరల్(పశ్చిమ గోదావరి): రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మణేశ్వరం గ్రామం పరసావారి మెరకకు చెందిన తాతా మనవళ్లు ఆన్లైన్ లోన్ యాప్ ఒత్తిడి తట్టుకోలేక బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. రూరల్ ఎస్సై ప్రియకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భోగిరెడ్డి రాఘవరావు (73) వ్యవసాయం చేస్తూ, ఆయన మనవడు భోగిరెడ్డి గిరి ప్రసాద్ (26) ప్రైవేటు జాబ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆర్థిక అవసరాల నేపథ్యంలో ఆన్లైన్ లోన్ యాప్ నుంచి కొంత మొత్తం రుణం తీసుకుని కొంతకాలం సక్రమంగానే చెల్లించారు. చదవండి: కుమారుడిని ఇంట్లో వదిలేసి.. వివాహిత అదృశ్యం అనంతరం ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో రుణం చెల్లించడం ఆలస్యమైంది. ఆన్లైన్ లోన్ యాప్ నిర్వాహకులు వీరిని ఒత్తిడి చేసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడటంతో వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని రాఘవరావు కుమారుడు, గిరిప్రసాద్‌కు తండ్రి అయిన భోగిరెడ్డి నాగరాజు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామని ఎస్సై తెలిపారు. తాతా మనవళ్లు ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
చూడకూడనిది చూసిందని.. కన్నకూతురినే..
బోనకల్: ఓ మహిళ తన భర్త తండ్రితో శారీరక సంబంధం ఏర్పర్చుకున్న విషయాన్ని బయటపెడుతుందేమోనని కన్నకూతురినే కడతేర్చింది. తన కూతురు ఫిట్స్‌తో స్కూల్లో మృతిచెందినట్లు అందరినీ నమ్మించింది. చివరికి పోలీసుల విచారణలో నేరం అంగీకరిం చింది. ఖమ్మం జిల్లా బోనకల్లో జరిగిన ఈ ఘటన వివరాలను వైరా ఏసీపీ స్నేహామెహ్రా మంగళవారం ఇక్కడ వెల్లడించారు. బోన కల్కు చెందిన పా లెపు హరికృష్ణ– సునీత దంపతులకు ఇద్దరు కుమార్తెలున్నారు. హరికృష్ణ లారీ, ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన తరచూ పని నిమిత్తం దూర ప్రాంతాలకు వెళ్తుండేవాడు. ఈ క్రమం లో సునీతకు తన భర్త తండ్రి నర్సింహారావుతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఐదారేళ్లుగా ఇది కొనసాగుతున్నా ఇటీవల తల్లి– తాత ఒకే గదిలో ఉండగా సునీత పెద్ద కుమార్తె మహాదేవి(11) గమనించింది. ఈ విషయాన్ని తండ్రికి చెబుతానని మహాదేవి అనడంతో బెదిరిపోయిన సునీత, నర్సింహారావులు ఆ మెను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఫిట్స్‌తో మృతి చెందినట్లు చిత్రీకరణ ఈ నెల 8న మహాదేవి కాళ్లు, చేతులను చున్నీతో కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి వైరుతో మెడ బిగించి హతమార్చారు. తన కూతురు ఫిట్స్‌తో స్కూల్లో మృతి చెందినట్లు సునీత అందరినీ నమ్మించింది. అయితే, పాపమెడపై ఉన్న కమిలిన గాయాలను బంధువులు గమనించి పోలీసులకు చెప్పడంతో వారు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించారు. మహాదేవి హత్యకు గురైనట్లు నివేదిక రావడంతో పోలీసులు బాలిక తల్లి, తాతను అదుపులోకి తీసుకుని విచారించారు. మహాదేవిని తామే హత్య చేసినట్లు సునీత, నర్సింహారావు అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, కేసును త్వరగా ఛేదించిన మధిర సీఐ మురళి, ఎస్ఐ కవిత, సిబ్బంది నాగేశ్వరరావు, సత్యంబాబు, శాంత్‌కుమార్‌ను ఏసీపీ అభినందించి క్యాష్ రివార్డు అందజేశారు. -
విషాదం: మనవడిని కాపాడబోయి..
సాక్షి, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో మనవడు పడిపోగా కాపాడబోయి తాత కూడా మృతి చెందిన ఘటన మహా ముత్తరాం మండలం బోర్లగూడెం నర్సింగాపూర్ శివారులో జరిగింది. స్థానికుల కథనం.. ప్రకారం మృతులు భీముని భూమయ్య (58), భీముని రిషీ (10) నర్సింగాపూర్ కు వెళ్లి వస్తుండగా చెరువు వెనుక ఉన్న వారి పొలానికి వెళ్తూ నీటిలో నుంచి చెరువు దాటే ప్రయత్నం లో మనువడు ఒక్కసారిగా నీట మునిగిపోయాడు. దీంతో అతన్ని కాపాడే ప్రయత్నంలో భూమయ్య కూడా నీటమునిగి మృత్యువాత పడ్డాడు. చెరువు మరమ్మతులో భాగంగా గత నెలలో జేసీబీలతో మట్టిని తవ్వడం వల్ల లోతైన గుంటలు ఏర్పడంతో నే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. నిత్యం అదే చెరువులో చేపలు పడుతూ గత 25 సంవత్సరాలుగా చెరువు కట్టపైనే మంచెవేసుకుని ఉండే భూమయ్య కు ఆ చెరువులో ఎక్కడ లోతు ఉందో ఎక్కడ ఏముందో తెలిసిన అతను నీటిలో మునిగి మృతిచెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూమయ్య కొడుకు రవి గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. చదవండి: 16 ఏళ్ల నిర్లక్ష్యం.. పోయిన ప్రాణం -
దారుణం: ఆరేళ్ల బాలికపై తాత, మేనమామ అత్యాచారం
భోపాల్: భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు మన దేశంలో రక్షణ లేకుండా పోయింది. వివరాల ప్రకారం.. భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో నివసిస్తున్న మైనర్ బాలికపై తన మూడేళ్ల తమ్ముడి ఎదుటే అత్యాచారానికి గురిఅయింది. అయితే, అమ్మాయి ప్రవర్తనలో చాలా రోజుల నుంచి మార్పులను గమనించిన బాధితురాలి తల్లి ఏమి జరిగిందో గట్టిగ అడిగేసరికి జరిగినదంతా ఆమెకు చెప్పింది. షాకైన తల్లి తేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భోపాల్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎనిమిది రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రాణాలతో బయటపడిన ఆమె తన తల్లికి గత చాలా రోజులుగా అను భవిస్తున్న బాధ గురించి చెప్పింది. సమోసాలు ఇస్తానంటూ బాలిక మేనమామ బాలికను, ఆమె మూడేళ్ల తమ్ముడిని బంధువుల ఇంటికి తీసుకెళ్లాడని అక్కడ అప్పటికే ఆమె తాత ఉన్నాడని తెలిపింది. తర్వాత ఇద్దరూ కలిసి చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. మూడేళ్ల చిన్నారి(బాధితురాలి సోదరుడు) కళ్లముందే వారీ ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెప్పారు. ఆరేళ్ల బాలిక రక్తస్రావం కావడంతో వారు వెంటనే గ్రహించి బాధితురాలికి, తన తమ్ముడికి సమోసా, రూ.20 ఇచ్చి విడిచిపెట్టారు. అలాగే ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బెదిరించి పంపారు. బాధితురాలు తన తల్లిదండ్రులకు ఈ విషయం గురుంచి చెప్పడానికి చాలా భయపడి, నిశ్శబ్దంగా ఉండిపోయినట్లు కోలార్ పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరూ కూలీలు, మద్యానికి బానిసలు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేశామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు. చదవండి: బ్యాంకులో ఉరివేసుకున్న మహిళ మేనేజర్! -
తాత కోర్కెను తీర్చిన మనవళ్లు
సాక్షి ముంబై : పిల్లల కోరికలను తల్లిదండ్రులతోపాటు వారి నానమ్మలు, తాతయ్యలు తీర్చడం సాధారణంగా చూస్తుంటాం. కాని మహారాష్ట్రలో తాత కోరికను తీర్చి ఇద్దరు మనవళ్లు డాక్టర్ నందకుమార్ గోడ్గే, అడ్వకేట్ అవినాష్ గోడ్గేలు రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకెక్కాడు. ఇప్పటివరకు సినీ హీరోలు, సెలబ్రీటీలు, రాజకీయ నాయకులతోపాటు వివాహవేడుకలలో వధూవరులు హెలికాప్టర్లో రావడం చూసి ఉంటాం. కాని తమ నానమ్మ చహాబాయి గోడ్గే, తాత (అబ్బ) దేవరామ్ గోడ్గేల కోసం హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకుని పుణే నుంచి అహ్మద్‌నగర్ జిల్లాలోని తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. దేవరామ్ గోడ్గే 88వ జన్మదినోత్సవం సందర్భంగా ఈ వినూత్న బహుమతిని వారికి అందించారు. పుణే నుంచి అహ్మదనగర్ జిల్లా సంగమ్నేర్ తాలూకాలోని చించోలి గురవ్ గ్రామం వరకు హెలికాప్టర్లో తీసుకెళ్లారు.అయితే దీనికి ముందు ఆ గ్రామ సమీపంలోని ఓ మైదానాన్ని శుభ్రపరిచి హెచ్ ఆకారంలో రాశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామప్రజలు అందరు ఆసక్తిగా ఎదురుచూడసాగారు. అందరు చూస్తుండగానే మంగళవారం ఉదయం ఆకాశంలో హెలికాప్టర్ శబ్దం విని్పంచింది. అందరు ఒక్కసారిగా మైదానం వద్దకి పరుగులుతీశారు. ఇలా మునుపెన్నడు హెలికాప్టర్‌ను ఇంత దగ్గరగా చూడని అనేక మంది గ్రామప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడారు. ఇంటికి సమీపంలో దిగిన హెలిక్యాప్టర్ ల్యాండింగ్ అయిన ప్రాంతం నుంచి ఇంటి వరకు వారిని బ్యాండు మేళాలతో ఇంటికి తీసుకెళ్లారు. మరిచిపోలేని ఆనందాన్నిచ్చారు.. తన మనవళ్లు చివరి వయసులో జీవితంలో మరిచిపోలేని ఆనందాన్నిచ్చారంటూ దేవరామ్ గోడ్గే మీడియాకు తెలిపారు. ముఖ్యంగా డాక్టర్ నందకుమార్ పెళ్లి సమయంలో ఏనుగుపై ఊరేగింపు చేయాలని కోరడంతో ఆయన తాత ఎనుగును తీసుకొచ్చి ఊరేగించారు. దీంతో పలు మార్లు ఏదో సందర్భంగా అన్న తాను అన్న మాటలను గుర్తు ఉంచుకుని తనను నా భార్యను హెలిక్యాప్టర్‌లో తిప్పడమే గాక, తమ ఊరి వరకు తీసుకొని వచ్చారన్నారు. -
మా తాతగారు మాకెంతో స్ఫూర్తిదాయకం
శ్యామ్ కృష్ణ ప్రసాద్ మోటూరి తాత, మీ గ్రేట్ సెన్సాఫ్ హ్యూమర్, పాజిటివ్ యాటిట్యూడ్, నాకు సులువుగా చెస్ నేర్పించిన తీరు, నన్ను ఎల్లప్పుడూ నవ్వించే విధానం నాకు చాలా ఇష్టం అందుకే మీరంటే నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ యూ తాత. మీకు 67వ పుట్టినరోజు శుభాకాంక్షలు - శ్రేయస్ - మనుమడు. శ్యామ్ కృష్ణ ప్రసాద్ మోటూరి, మా తాతగారు, 1953 సెప్టెంబర్ 11న ఆంధ్రప్రదేశ్‌లోని సికినాలలో రాఘవమ్మ - రామచంద్రయ్యగారి దంపతులకు జన్మించారు. వృత్తిపరంగా ఇంగ్లీష్ టీచర్ అయిన తనకు ఆంగ్ల భాష పట్ల, వ్యాకరణం పట్ల మక్కువ ఎక్కువ. విద్యార్థులు ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఇబ్బంది పడకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా, సరళంగా వివరించేవారు. అందులో ఉన్న మెలుకువలను వారికి నేర్పించి ఇంగ్లీష్ భాష పట్ల వారిలో ఉన్న భయాలను తొలగించేవారు. కేవలం చదువు మాత్రమే చెప్పి చేతులు దులుపుకునే వ్యక్తిత్వం కాదు తనది. అందుకే పుస్తకంలో ఉన్న పాఠాలతో పాటు ఎన్నో జీవితపాఠాలను కూడా విద్యార్థులకు నేర్పించేవారు. జీవితంలో ఎలా ఎదగాలి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాటిని ఎదర్కొంటూ జీవితంలో పోరాడి ముందుకు ఎలా సాగాలి అనే విషయాలను కూడా చిన్ననాటి నుంచే తన విద్యార్థులకు చెప్పేవారు. తన బోధనలు కేవలం స్కూల్లో మార్కులు తెచ్చుకోవడానికే కాకుండా జీవితంలో ఎదురయ్యే పరీక్షలను జయించడంలో ఎంతో ఉపయోగపడతాయి. (Advertorial) తను ఎన్నో విషయాలలో మాకు స్ఫూర్తిదాయకం. నాటకాలపట్ల తనకున్న ఆసక్తితో మహాభారతంలో శక్తిమంతుడైన భీముని పాత్రలు వేసి తన నటనతో అందరి మన్ననలు పొంది వారిచే, కళామతల్లి బిడ్డగా పేరు పొందిన ఓ గొప్ప కళాకారుడు. అంతేకాక, జిల్లా, డివిజినల్ స్థాయిలో అనేక క్రీడా టోర్నమెంట్లు నిర్వహించి శారీరక ధృఢత్వంపై తన ఆసక్తిని కనబరిచారు. గొప్ప నైపుణ్యాలు కలిగిన వ్యక్తిగా జీవితంలో అనుక్షణం కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతూ ఉంటారు. ఇప్పటికి 5 (తెలుగు, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ) భాషలలో తను నిష్ణాతులు అయినప్పటికీ, ఈ సంవత్సరం చివరిలోగా మొత్తం 10 భాషల్లోకి ప్రవేశించాలన్న లక్ష్యంతో ఎందరినో ఆశ్చర్యపరిచి, మరెందరికో ఆదర్శంగా నిలిచారు. పెద్దల అక్షరాస్యత (వయోజన విద్య) కార్యక్రమంలో భాగమై, చిన్నతనంలో చదుకోవాలని ఉన్నా, పరిస్థితుల కారణంగా విద్యకు దూరమై అజ్ఞాన తిమిరంలో కొట్టుమిట్టాడుతున్న నిరక్షరాశ్యుల జీవితాలలో జ్ఞాన జ్యోతి నింపారు. జీవితంలో ఎదుగుదలకు అడ్డుతగులుతున్న విషయాలను అధిగమించడానికి విద్యావంతులుగా ఉండటం ఎంత అవసరమో వారికి వివరిస్తూ, విద్య పట్ల వారిలో ఆసక్తిని కలిగించి, వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దడం అను ఈ కార్యక్రమ లక్ష్యాన్ని సాధించటానికి ఎనలేని కృషి చేసారు. కేవలం తన దగ్గరకు విధ్యాభ్యాసముకు వచ్చిన వారికి మాత్రమే కాకుండా, ఎందరో పట్టణ-పల్లెల్లో ఉన్న నిరక్షరాశ్యులకు అక్షర జ్ఞానం చేస్తున్న గొప్ప వ్యక్తి. ఎందరో ఉన్నత శిఖరాలకు చేరడానికి నిచ్చెనలా నిలిచిన మహోన్నత వ్యక్తి మా తాతగారు. తాను చేసిన కృషిని గుర్తించి విద్యా శాఖతోపాటు అనేక స్థానిక పాలక మండలి నిపుణులు తనను ప్రశంసించారు. (Advertorial) వీటిని మించి ముఖ్యంగా తన దాతృత్వం, పాజిటివ్ యాటిట్యూడ్, పట్టుదల, కొత్త విషయాల పట్ల తనకుండే ఆసక్తి, గెలుపు-ఓటములలో సమంగా వ్యవహరించడం వంటి లక్షణాలు తనను గొప్ప వ్యక్తిగా, మా అందరికి ఆదర్శంగా నిలిచేలా చేసాయి. తానొక గుప్త రచయిత, నిస్వార్థపరులు, మంచి పేరున్న కబడ్డీ ఛాంపియన్, తన ఇద్దరి కుమారులకు ఆప్యాయతను పంచే ఒక గొప్ప తండ్రి, నాన్నమ్మకు అన్నింటిలో అండగా-కష్టకాలంలో కొండంత బలంగా నిలిచే తోడు, అన్ని తెలిసిన ఎంతో వినయంతో ఒదిగి ఉండే మంచి మనస్తత్వం తన సొంతం; తానే మా తాతగారు. (Advertorial) నేను ఎదిగే కొద్ది, తను ఏర్పరుచుకున్న వారసత్వం యొక్క అంతర్భాగం మా కుటుంబం అని తెలుసుకున్నాను. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా తను ప్రేమ, ఆప్యాయతలను పంచుతారు. ఏదేమైనా, చెప్పిన ఈ కారణాలు, చెప్పలేని అనేక కారణాల ద్వారా నేను చెప్పాలనుకున్నది ఒక్కటే… వి లవ్ యూ తాతగారు. చెరగని చిరునవ్వే తరగని ఆభరణంగా ధరించి, అందరి మంచిని ఆకాంక్షించే వ్యక్తిత్వంతో వారి అభివృద్ధికై శ్రమించే ఉపాధ్యాయుడు మా తాతగారు శ్యామ్ కృష్ణ ప్రసాద్ మోటూరి గారికి 67వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. (Advertorial) ఇట్లు, ఆశ్చర్య చకిత - మనుమరాలు, శ్రేయస్ - మనుమడు, యోచన్ కుమార్ - మనుమడు. -
దారుణం: మనవడిని రోకలిబండతో కొట్టి..
బేస్తవారిపేట (ప్రకాశం జిల్లా): వ్యసనాలకు బానిసైన మనవడిని తాత హత్య చేశాడు. ఈ సంఘటన బేస్తవారిపేట మండలంలోని ఖాజీపురంలో శనివారం అర్ధరాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే.. పూనూరు చిన్న వెంకటరెడ్డి, వరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రాఘవేంద్రరెడ్డి(20) గత మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రెవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. లాక్డౌన్ నేపథ్యంలో ఆరు నెలల క్రితం సొంత గ్రామానికి వచ్చాడు. అయితే తరుచూ మద్యం సేవిస్తూ, పేకాటాడుతూ నిత్యం డబ్బుల కోసం కుటుంబసభ్యులను వేధిస్తున్నాడు. (చదవండి: నన్ను కాపాడి నువ్వెళ్లిపోయావా..) ఈ క్రమంలో డబ్బులు ఇవ్వాలని కుటుంబసభ్యులపై ఒత్తిడి ఎక్కువ చేశాడు. నా ఆస్తి వాటా పంచి ఇస్తే కారు కొనుక్కోని బాడుగకు తిప్పుకుంటానని, ఇవ్వకపోతే చంపుతానని బెదిరింపులకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇంట్లో పడుకుని ఉన్న సమయంలో రాఘవేంద్రరెడ్డి జేజీనాయన పూనూరు పెద్ద ఓసూరారెడ్డి రోకలిబండతో కొట్టి హతమార్చాడు. హత్య చేసిన అనంతరం ఇంట్లో నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న గిద్దలూరు సీఐ యు సుధాకరరావు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: విషాదం: వివాహమైన 28 రోజులకే..) అవాక్కైన గ్రామస్తులు.. ప్రతి కుటుంబంలో పిల్లలతో గొడవలు ఉంటాయి. అంతమాత్రానికే మనువడిని హత్య చేయడంపై గ్రామస్తులు విస్మయం చెందుతున్నారు. హత్య చేయడానికి వేరే కారణాలు ఏమైనా ఉండవచ్చునని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. -
అయ్యో! తాతకోసం చిన్నోడి కష్టం
సాక్షి, లక్నో: ప్రభుత్వ ఆసుపత్రులలో లంచాల కోసం పీక్కుతినే సిబ్బందికి సంబంధించి చాలా కథనాలు గతంలో విన్నాం. తాజాగా మరో హృదయ విదారకమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్ట్రెచర్ కోసం లంచం అడిగిన రాబందులను సంతృప్తి పర్చలేక ఒక నిరుపేద కుటుంబంలోని ఆరేళ్ల బాలుడే స్వయంగా స్ట్రెచర్‌ను తోసుకుంటూ వెళ్లిన వైనం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఉత్తరప్రదేశ్, డియోరియా జిల్లా ఆస్పత్రిలో రెండు రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే డియోరియా జిల్లాలోని గౌర గ్రామానికి చెందిన చెడి యాదవ్ రెండు రోజుల క్రితం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. ఆయన కాలు ఫ్యాక్చర్ కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సర్జికల్ వార్డులో ఉన్న యాదవ్‌ను డ్రెస్సింగ్ కోసం వేరే వార్డుకు తరలించాల్సి వచ్చింది. అయితే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు అక్కడున్న వార్డ్ బాయ్ 30 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో యాదవ్‌కు సాయంగా వచ్చిన ఆయన కుమార్తె బిందు వద్ద డబ్బులు లేకపోవడంతో వాళ్లే స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు నిర్ణయించారు. అయితే తల్లి కష్టం చూసి ఆ పసివాడి మనసు చలించిందో ఏమోకానీ, అక్కడే ఉన్న బిందు ఆరేళ్ల కుమారుడు శివం కూడా తన వంతుగా ముందుకొచ్చాడు. బిందు ముందుండి స్ట్రెచర్ ను లాగితే.. శివం వెనుక తోస్తూ సాయం చేశాడు. ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తన తండ్రి డ్రెస్సింగ్ కోసం స్ట్రెచర్‌ను వార్డుకు తీసుకెళ్లేందుకు హాస్పిటల్ సిబ్బంది ప్రతిసారీ 30 రూపాయలు డిమాండ్ చేశారనీ, డబ్బు ఇవ్వకపోతే, స్ట్రెచర్‌ను నెట్టడానికి నిరాకరించారని బిందు వాపోయారు. మరోవైపు ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించారు. ఆసుపత్రిని సందర్శించిన జిల్లా కలెక్టర్ అమిత్ కిషోర్ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. యాదవ్ కుటుంబాన్నిపరామర్శించారు. ఆసుపత్రి అసిస్టెంట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సంయుక్త దర్యాప్తు ప్యానల్‌ను ఏర్పాటు చేసి, వెంటనే నివేదికను సమర్పించాలని ఆదేశించారు. డబ్బులు డిమాండ్ చేసిన వార్డు బాయ్‌ను విధుల నుంచి తొలగించామనీ, ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. -
తాతయ్య కన్నుమూత.. ఉపాసన ట్వీట్
సాక్షి, హైదరాబాద్: మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు బుధవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఉపాసన ట్విటర్ వేదికగా సంతాపం తెలిపారు. ‘మా తాత కె.ఉమాపతి రావు(జూన్ 15,1928- మే 27, 2020) గొప్ప విలువలు, నిస్వార్థం, మానవతామూర్తి గల వ్యక్తి. ఆయనకు హాస్య చతురత కూడా ఎక్కువే. ఉర్దూలో ఆయన రాసిన రచనల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టీటీడీ తొలి ఈవోగా పనిచేశారు. అనేక గొప్ప సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి తాత’ అంటూ ఉపాసన భావోద్వేగ ట్వీట్ చేశారు. కాగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దోమకొండకు చెందిన ఉమాపతిరావు ఐఏఎస్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. టీటీడీ తొలి ఈవోగా సేవలందించారు. our thatha, K.Umapathy Rao of Domakonda-IAS 15June 1928-27May 2020 was a man of great principles, selflessness, generosity & sense of humor. An Urdu Poet know for his Shayari & the first EO of TTD was a strong believer in the religion of kindness & generosity.#RestinPeace 🙏🏼 pic.twitter.com/hb4iLgDGwj — Upasana Konidela (@upasanakonidela) May 27, 2020 -
లాక్డౌన్: ‘ఇది మనసును చిత్రవధ చేస్తోంది’
మిచిగాన్: మనవరాలు పుట్టాడని తెలిసిన క్షణం నుంచీ ఆ పెద్దాయన మనసు మనసులో లేదు. ఎప్పుడెప్పుడు బుడ్డదాన్ని చేతుల్లోకి తీసుకుని ఆడించాలా అని తెగ ఉబలాటపడిపోతున్నాడు. కానీ కాలం బాగోలేదు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కరోనా మహమ్మారి పట్టి పీడించేందుకు సిద్ధంగా ఉంటుంది. దీన్ని దష్టిలో పెట్టుకున్న ఆ పెద్దాయన నడక ప్రారంభించాడు. మితిమీరిన వయసును మర్చిపోయి హుషారుగా కొడుకింటికి చేరుకున్నాడు. ఈ లోకంలోకి కొత్తగా అడుగుపెట్టిన మనవరాలిని కళ్లారా చూసుకున్నాడు. కానీ తనివితీరా ఎత్తుకోలేకపోయాడు. బయట నుంచే చూసి అటునుంచి అటే వెనుదిరిగాడు హదయాలను హత్తుకున్న ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. మిచిగాన్‌లోని జోషువా గిల్లెట్కు కూతురు ఇలియానా జన్మించింది. (కోవిడ్ -19 విధ్వంసం : పేదరికం గుప్పిట్లోకి 40 కోట్ల మంది) సరిగ్గా అదే సమయంలో కరోనా వ్యాప్తి నివారించేందుకు అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కానీ ఆ తాతయ్యకు ప్రాణం అంతా చిన్నారిమీదే. అందుకే తరచూ నాలుగు మైళ్లు(ఆరు కి.మీ) నడిచి కొడుకింటికి రావడం, మనవరాలిని బయట అద్దంలో నుంచే చూసి సంతోషించడం పరిపాటైంది. దీనికి సంబంధించిన ఫొటోను జోషువా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. "నా కన్నతండ్రి, తన మనవరాలిని కనీసం తాకడానికి కూడా వీలు లేదు. ఇది నా మనసును చిత్రవధ చేస్తోంది" అని భావోద్వేగానికి లోనయ్యాడు. అయితే ఎప్పటికప్పుడు శిశువు ఫొటోలను తన తండ్రికి పంపిస్తున్నానని చెప్పాడు. ఈ విపత్కర సమయంలో అందరూ తమతమ ఇళ్లలోనే ఉండాలని సూచించాడు. (భారత్‌కు పెరుగుతున్న డిమాండ్) -
తాతయ్య, నానమ్మలకు కారులో చోటు లేదా?
కారులో నాలుగు సీట్లుంటాయి.అమ్మా నాన్న ఇద్దరు పిల్లలకు సరిపోయేలా. సంసారం కారు కూడా అలాగే తయారైంది. ప్రయాణంలో పెద్దలు అడ్డమవుతున్నారు.బంధుత్వాలకి స్పీడ్‌బ్రేకర్లు పడుతున్నాయి.కలిసి చేసే ప్రయాణంలో ఇన్ని కుదుపులున్నప్పుడువిడి ప్రయాణం చేసి కలిసుండమంటున్నారు సైకియాట్రిస్టులు. కార్లను బేన్ చేయాలి అని ఒక నిమిషం అనిపించింది విశ్వానికి.ఆ గేటెడ్ కమ్యూనిటీలో తమ ఇంటి బయట పార్క్ చేసి ఉన్న తన కారును చూస్తే కోపం కూడా వచ్చింది అతనికి.గొడవ కారు వల్లనా? లేక నాలుగు సీట్లకు మించి ఎదగని మనుషుల వల్లనా?ఎం.టెక్ చేశాక పెళ్లి చేసుకున్నాడు విశ్వం. జంషెడ్‌పూర్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. భార్యను తీసుకుని అక్కడికి వెళ్లిపోయాడు. వెళ్లాక కారు కొన్నాడు. కారు నడపడం అతడికి సరదాగా ఉండేది. కొత్త భార్య పక్కన కూచుని ఉంటే నడపడం ఇంకా బాగుండేది.సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చే సమయానికి భార్య రెడీగా ఉండేది. కారు తీసుకొని షికారుకు వెళ్లేవారు. సడన్‌గా ఆమె సినిమా ప్రోగ్రామ్ అంటే కారులోనే రయ్యిమని వెళ్లిపోయేవారు. ఇద్దరు పిల్లలు పుట్టారు. వారి కోసం వెనుక రెండు సీట్లు సిద్ధంగా ఉన్నాయి. పిల్లలు వెనుక తల్లిదండ్రులు ముందు కూచుని డిక్కీలో రెండు మూడు రోజులకు సరిపడా బట్టలు పడేసుకొని ఒక్కోసారి హాలిడీ ట్రిప్‌కు వెళ్లిపోయేవారు. ఊరుగాని ఊరు... భాషకాని భాష.పెద్దగా ఫ్రెండ్స్ లేరు. కనుక బర్త్‌డే పార్టీ అయినా పండుగ వచ్చినా సెలవుదినమైనా నలుగురూ ఎంజాయ్ చేయడమే వారికి అలవాటైపోయింది.పదహారేళ్లు గడిచిపోయాయి.ఎంతకాలం ఇలా పరాయి ప్రాంతంలో? హైదరాబాద్ వెళ్లి అక్కడ ఉందాం అనుకున్నాడు విశ్వం. భార్య రాధ కూడా సరేనంది. పిల్లలిద్దరు ఒకరు ఎనిమిదిలోకి మరొకరు ఇంటర్లోకి వచ్చే సమయం కావడంతో ఇదే అదను అని కూడా అనుకున్నారు.‘విడిగా ఉండటం ఎందుకు? మా అమ్మా నాన్నతో ఉందాం. పెద్ద ఇల్లు కదా. ఏం ఇబ్బంది?’ అన్నాడు విశ్వం.‘అదే బెటర్. పెద్దవాళ్ల తోడు కూడా ఉన్నట్టుంటుంది’ అని రాధ.వాళ్లు హైదరాబాద్ వచ్చేశారు.మరో సంవత్సరానికి రాధ, విశ్వం మానసిక ప్రశాంతత కోల్పోయి, ఒకరిమీద ఒకరికి ప్రేమ చచ్చిపోయి, తీవ్ర అశాంతిలో ఉండగా సైకియాట్రిస్ట్ దగ్గరకు కౌన్సెలింగ్‌కు వచ్చారు. ‘ఏమిటి సమస్య?’ అని అడిగింది లేడీ సైకియాట్రిస్ట్.‘ఇద్దరం చాలా తగువులాడుకుంటున్నాం. జీవితం నరకంగా ఉంది’ అన్నాడు విశ్వం.‘ఆయన ముఖం చూస్తేనే కోపం వస్తోంది’ అంది రాధ.అన్నివిధాలా పరిణితి ఉన్న ఈ జంటకు ఏం సమస్య వచ్చిందా అని సైకియాట్రిస్ట్ ఆలోచించింది.అత్తామామలతో కలిసి ఉండటం మొదలెట్టాక రాధకు అనిపించిన మొదటి విషయం ఇకమీదట పిల్లల్ని ఇంట్లో వదిలి భర్తతో షికారుకు వెళ్లొచ్చు. డిన్నర్‌కు వెళ్లొచ్చు. సినిమాకు వెళ్లొచ్చు అని. పెళ్లయిన వెంటనే కాన్పు జరగడం పరాయి ప్రాంతంలో ఉండటం వల్ల మరోమనిషి తోడు లేకపోవడం వల్ల పిల్లల అన్నిపనులూ తనే చేయాల్సి రావడం ఎప్పుడూ పిల్లలు తోడుగా ఉండటం... వీటన్నింటి వల్ల భర్తతో గడిపే సమయం వచ్చింది అని రాధ అనుకుంది.రాధ అత్తమామలు ఏమో కొడుకు కోడలు రావడంతోనే అమ్మయ్యా ఇక అందరం కలిసి ఉండొచ్చు, కలిసి తిరగొచ్చు... ఇన్నాళ్లు కొడుకు కోడలు మనమలతో జీవితం చూడలేదు. ఇక ఒక్క క్షణం కూడా వీళ్లను వదిలేది లేదు అనుకున్నారు.రాధ, విశ్వంలు హైదరాబాద్ వచ్చినా వారి ధోరణి జంషడ్‌పూర్ ధోరణిగానే ఉంది. తమ పాటికి తాము ఫోన్ మాట్లాడుకుని, సడన్‌గా ఈవెనింగ్ ప్రోగ్రామ్ పెట్టుకోవడం, ఒక్కోసారి ఇద్దరే వెళ్లడం, ఒక్కోసారి నలుగురే వెళ్లడం కొనసాగించారు. నిజానికి ఉన్న కారులో నలుగురే వెళ్లగలరు. నాలుగు సీట్లే ఉంటాయి. తమ సంగతి ఏమిటి అని అత్తామామలకు రంధి మొదలయ్యింది.‘వాళ్లు అక్కడున్నా అంతే. ఇక్కడున్నా అంతేనా?’ అని అత్తగారు మామగారి దగ్గర బాధ పడింది.‘ఇంట్లో పెద్దవాళ్లకు ఒక మాటచెప్తే ఏం పోతుంది?’ అని మామగారు మనసులో అనుకున్నారు.కాని మనసులో ఉన్నవి మనసులోనే ఉండవు. చేష్టలలో బయటపడతాయి. అత్తామామల నిరసన మెల్లగా రాధను తాకడం మొదలైంది.‘ఇదేమిటండీ... మీ అమ్మానాన్నలు మనల్ని చూసి ఏడుస్తున్నారు. కాళ్లు చేతులు గట్టిగా ఉన్నవాళ్లేగా. తిరగాలంటే వాళ్లూ తిరగొచ్చు. ఒక్క కారులో అందరం ఎలా తిరుగుతాం. వాళ్లకూ ఒక కారు ఉందిగా. డ్రైవర్‌ను పెట్టుకొని తిరగమనండి’ అంది రాధ ఒకరోజు విశ్వంతో.‘వాళ్లకు మనం తప్పితే ఎవరున్నారు. మనం ఎలాగోలా వాళ్లను కూడా కలుపుకొని పోవాలి’ అన్నాడు విశ్వం.కాజువల్‌గా అన్న మాటే. గతంలో అలా అతని ప్రాధాన్యంలో మరో మనిషి లేడు. ఇప్పుడు అతని ప్రాధాన్యంలో తల్లిదండ్రులు ఉన్నారని రాధకు అర్థం కావడంతోటే విశ్వం ‘కూరగాయలు తేనా’ అన్నా ‘గొంతుకోయనా’ అన్నట్టు రాధకు వినిపించడం మొదలయ్యింది.ఇంట్లో నాలుగు స్తంభాలాటగా ఉంది.నాలుగు స్తంభాలున్నప్పుడే అది ఇల్లవుతుందిగానీ ఏ స్తంభం ఎంతదూరంలో ఉండాలన్నదే పేచీగా మారింది. నవ్వుకుంటూ స్నేహంగా ఉండే ఆ మనుషులు చిరాగ్గా మారిపోయారు. పిల్లలకు కూడా ఇదంతా విసుగ్గా అనిపిస్తోంది. దీనికంతటికి ఫుల్స్టాప్ పెట్టాలని కౌన్సెలింగ్‌కు వచ్చారు.‘చూడండి... ఇందులో నేను చేయగలిందేమీ లేదు. మీ అమ్మా నాన్నలూ మీరిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుంది’ అంది సైకియాట్రిస్ట్ విశ్వంతో.ఇది తెలిసిన విశ్వం తండ్రి ‘ఎందుకురా... సైకియాట్రిస్ట్ సమక్షంలోనే మాట్లాడుకుందాం’ అని ఆ వయసులో భార్యను వెంటబెట్టుకుని వచ్చాడు.ఆయనే సైకియాట్రిస్ట్‌తో అన్నాడు–‘చూడమ్మా... మేం ఒక విధంగా ఆలోచిస్తే వీరు ఒకవిధంగా రియాక్ట్ అయ్యారు. ప్రేమలూ బంధాలు ఆప్యాయతలు మరీ ఎక్కువైనా కష్టమే. అందరం తమదైన జీవితాన్ని జీవించే పద్ధతికి అలవాటయ్యామని నాకు అర్థమైంది. వీళ్ల గొడవ చూసి నేను కూడా ఆలోచించాను. ఆ గేటెడ్ కమ్యూనిటీలోనే మా వీధిలోనే వీళ్లు ఇంకొక ఇల్లు తీసుకుంటే సరిపోతుంది. మాతోనే ఉన్నట్టుంటుంది. విడిగానూ ఉన్నట్టుంటుంది. సాయంత్రాలు కలవొచ్చు. ఆదివారాలు కలవొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవొచ్చు. అంతేకాదు... ఒకరికొకరం కంటపడకుండా కొన్ని గంటలు ఉండొచ్చు. దూరం కూడా ప్రేమకు ఆధారం అనిపిస్తోంది. వీళ్లు మాతోనే ఉండాలని మాకు నియమం లేదు. కాని మా కళ్ల ముందు ఉండాలనైతే ఉంది’ అన్నాడాయన. ఆరు నెలలు గడిచాయి.రెండు కుటుంబాలు ఇప్పుడు ఆ చేదును మర్చిపోయాయి. అత్తగారు మామగారు ఇన్స్టెంట్ డ్రైవర్‌కు కాల్చేసి కావాల్సిన సమయాల్లో బయటకు వెళుతున్నారు. మనవల్ని కూడా తీసుకెళుతున్నారు. విశ్వం, రాధ ఒక్కోసారి పిల్లల్ని ఇంట్లో ఉంచి అత్తా మామలతో గుళ్లకు గోపురాలకు వెళ్లివస్తున్నారు. రెండు వంటగదులే అయినా వండినవి ఇరువురికీ అందుతున్నాయి.ఇది కూడా బాగున్నట్టే ఉంది.బంధాలు తెగిపోకుండా చేసుకునే ఏ అమరికైనా స్వాగతించాల్సిందే కదా .– కథనం: సాక్షి ఫ్యామిలీ ఇన్పుట్స్: డా. పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్ -
గుంటూరు జిల్లా మాచర్లలో దారుణం
-
అశ్విన్ ఇంట విషాదం
చెన్నై:టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఇంట విషాదం నెలకొంది. అశ్విన్ తాత ఎస్ నారాయణ స్వామి(92) శనివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో్ బాధపడుతున్ననారాయణ స్వామి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణ స్వామి సదరన్ రైల్వేలో మాజీ ఉద్యోగి. మరొకవైపు ఆయనకు క్రికెట్ అంటే విపరీతమైన ప్రేమ. అశ్విన్ క్రికెటర్ గా ఎదిగే క్రమంలో నారాయణ స్వామి కీలక పాత్ర పోషించారు. నారాయణ స్వామికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అశ్విన్.. తన తాతను కడసారి చూసేందుకు రాలేకపోయాడు. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో అశ్విన్ సభ్యుడు కావడంతో అతను తిరిగి భారత్ కు వచ్చే అవకాశం లేకుండా పోయింది. న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ కు ముందు అశ్విన్ కు తాత మృతిచెందిన వార్తను చేరవేశారు. దాంతో ఆ మ్యాచ్ లో బాధను దిగమింగుకుని అశ్విన్ పాల్గొన్నాడు. -
బ్రహ్మీకి ప్రమోషన్ వచ్చిందోచ్
హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు, హాస్యబ్రహ్మ బ్రహ్మానందానికి ప్రమోషన్ లభించింది. అనేక సినిమాల్లో తనదైన హావభావాలు, నటనతో హాస్యం పడించి, అటు ప్రేక్షకులను అభిమానాన్ని, ఇటు అనేక రివార్డులు, అవార్డులను సొంతం చేసుకున్న బ్రహ్మీ వ్యక్తిగత జీవితంలో మరో కీలకమైన మెట్టు ఎక్కారు. అదే.. తాతయ్య అయ్యారు. దీంతో బ్రహ్మానందం కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్- జ్యోత్స్న దంపతులకు మంగళవారం మగబిడ్డ జన్మించాడు. హనుమాన్ జయంతి కావడంతో పండగ రోజు ఇంట్లో సంతోషం వెల్లివిరిసిందని.. మనవడి రాకతో ఇల్లు కళకళలాడుతోందని బ్రహ్మానందం తన ఆనందాన్ని కుటుంబసభ్యులు, బంధువులతో పంచుకున్నారు. పండుగ రోజున, ఆనందం తమ సంతోషం రెండింతలు అయిందనీ, ప్రతి ఒక్కరితో ఈ సంతోష వార్తను పంచుకునేందుకు ఆనందంగా ఉందన్నారు. జ్యోత్స్న , బాబు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని బ్రహ్మానందం తెలిపారు. అలాగే గౌతమ్ తండ్రిగా మారడం ఆనందంగా ఉందన్నారు. అన్నట్టు మనవడికి అన్నీ తాత పోలికలేనట. కాగా పల్లకిలో పెళ్లి కూతురు సినిమాతో హీరోగా టాలీవుడ్లో తెరంగేట్రం చేసిన గౌతమ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి. ప్రస్తుతం మను అనే ఫిల్మ్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
తాతను నరికేసిన మనవడు..!
కోటా(రాజస్థాన్): ఓ చిన్నపాటి వివాదం కారణంగా ఓ వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, మనవడు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన గుమాన్‌పురా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కోటారి - గోవర్దన్‌పూర్ ప్రాంతానికి చెందిన దేవీలాల్ ప్రజాపత్(70), అతని కుమారులు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. పెద్ద కొడుకు తన పోర్షనులోకి నీటి పైపు వేయాల్సి వచ్చింది. తన పోర్షన్ నుంచి దానిని వేసేందుకు దేవీలాల్ అభ్యంతరం చెప్పాడు. దీనిపై సోమవారం సాయంత్రం పెద్ద కుమారుడితో గొడవ జరిగింది. ఆయనకి భార్య, కుమారుడు తోడయ్యారు. అంతా కలిసి వృద్ధుడిని ఇంటి బయటకు లాగేశారు. అనంతరం కుమారుడు, కోడలు ప్రజాపత్ చేతులను పట్టుకోగా మనవడు కత్తితో అతని మెడపై నరికాడు. ఘటన అనంతరం ముగ్గురూ అక్కడి నుంచి పరారయ్యారు. రక్తపు మడుగులో పడి ఉన్న ప్రజాపత్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ప్రజాపత్ మరో కుమారుడు చేసిన ఫిర్యాదు మేరకు నిందితుల కోసం గాలింపు చేపట్టామని గుమాన్‌పురా ఎస్సై హన్స్‌రాజ్ తెలిపారు. -
అత్యాచారం కేసులో అమ్మమ్మ అరెస్ట్
కొల్లం: కేరళలో మనవరాలిపై అత్యాచార ఘటనలో భర్తకు సహకరించిన దారుణమైన సంఘటన వెలుగు చూసింది. కొల్లాం జిల్లా కుంద్రాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలైన మనవరాళ్లపై తాత అత్యాచారానికి పాల్పడితే.. ఆయనకు అమ్మమ్మ సహకరించడం కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు శనివారం బాలికల అమ్మమ్మను (62) అరెస్ట్ చేశారు. మనవరాళ్లపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మనుమరాళ్లపై గత రెండేళ్లకాలంగా విజయన్ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో తాత లైంగిక వేధింపులకు తాళలేక 10 సం.రాల బాలిక ఇటీవల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలికలపై భర్త అఘాయిత్యం, లైంగిక వేధింపులు ఆమెకు తెలుసుఅనీ, ఈ మహిళ సాయం చేసినట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆమె భర్త విక్టర్ అలియాస్ విజయన్ ను రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు. మూత్రపిండాల వ్యాధి చికిత్స చేయించుకుంటున్న ఆమెను ఆసుపత్రి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన తరువాత ఆమెను జైలుకు తరలించానున్నామని దర్యాప్తు అధికారి, కొట్టారకార డిప్యూటి ఎస్పీ.దర్యాప్తు అధికారి కృష్ణకుమార్, చెప్పారు. 376 (అత్యాచారం చేసినందుకు శిక్ష) , 305 (పిల్లల ఆత్మహత్యకు ప్రేరేపణ) సహా, పోస్కో (లైంగిక నేరాలు నుండి పిల్లలు రక్షణ) సహా, పలు ఐపిసి సెక్షన్ల కింద కేసులు, కేసులు నమోదు చేశామన్నారు. -
బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి
చిరునవ్వుల స్నేహశీలి సర్వేపల్లి ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): పరిచయం అవసరం లేని వ్యక్తిత్వం.. అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చిన ప్రతిభ.. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గొప్ప తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆయన పనిచేశారు. సర్వేపల్లి మనుమడు గౌతమ్ రాధాకృష్ణన్ గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే విందాం. బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి తాత అధ్యాపకుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. మాలో 12 మంది వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేనొక్కడినే అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. ఆయన నుంచి నాకు వచ్చిన ఆస్తి అధ్యాపక వృత్తే. వ్యక్తిగత జీవితం వేరు మా తాతకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. మొత్తం 13 మంది మనుమలం. ఒకరు చనిపోగా ప్రస్తుతం 12 మంది ఉన్నాం. నేను చిన్న కుమార్తె కుమారుడిని. తాత వ్యక్తిగత జీవితానికి, వృత్తి పరమైన జీవితానికి వ్యత్యాసం ఉండేది. రెండింటికీ తగిన సమయం కేటాయించేవారు. ఆడంబరాలకు దూరం తాత ఎక్కువగా మాకు దగ్గరవడానికే ప్రయత్నించే వారు. ఎప్పుడూ మీరు అని సంభోదించడానికి ఇష్టపడే వారు కాదు. నువ్వు అని పిలవమనే వారు. సాధారణంగా ఉండాలని కోరుకునేవారు. ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రూపాయి వేతనం తీసుకునే వారు తాత రాష్ట్రపతిగా పనిచేసిన సమయంలో కేవలం ఒక రూపాయి వేతనంగా తీసుకునేవారు. రాష్ట్రపతి భవన్ లో ఒక పాత కారు ఉండేది. మా కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు వచ్చినా స్టేషన్ నుంచి ఆ పాత కారులోనే తీసుకువచ్చేవారు. కారు తరచూ మరమ్మత్తులకు గురవుతున్నప్పటికీ.. అధికారిక వాహనాలను కుటుంబ అవసరాలకు ఎప్పుడూ వాడలేదు. ప్రత్యేకంగా వంటగది, వ్యక్తిగత వంట మనిషి ఉండేవారు. తాత వాడిన పాత కారు డ్రైవర్‌కు సొంతంగా వేతనం ఇచ్చేవారు. తాతలో చిరునవ్వే చూశాను ఆయనలో ఎప్పుడూ కోపం చూడలేదు. హాస్యంతో అందరినీ ఆనంద పరిచేవారు. గంభీరమైన సందర్భాలను సైతం ఆయన ఎంతో నవ్వుతూ స్వీకరించేవారు. ఆయనను నేను చాలా దగ్గరగా చూశాను. కుటుంబసభ్యుల పైనే కాదు.. ఎవ్వరిపైనా కోపగించుకోవడం నా జీవితంలో చూడలేదు. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మూడు దశాబ్దాల పైగా పనిచేశాను. దశాబ్ద కాలం వరకు నేను సర్వేపల్లి మనవడిననే విషయం ఎవ్వరికి తెలియదు. అన్నం, చారు, అప్పడం నేను చూసిన రోజుల్లో తాత ఎప్పుడూ భోజన ప్రియుడిగా కనిపించలేదు. ఎక్కడికైనా పార్టీలకు వెళ్లాల్సి ఉన్నా ఇంటిలో వండిన అన్నం, చారు, అప్పడం వంటి వాటితో భోజనం ముగించేవారు. సభా మర్యాద కోసం అందిరితో కలసి భోజనం వద్ద కూర్చునేవారు. ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా.. ఆయన మాత్రం పరిమితంగానే తినేవారు. ఎక్కువగా గడిపా..తాతతో చిన్నతనంలో ఎక్కువ సమయం తాతతో గడిపే అవకాశం వచ్చింది. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి సుమారు 15 ఏళ్ల కాలం తాతను దగ్గరగా చూశాను. తాత వాస్తవిక దృక్పథం ఉన్న వ్యక్తి. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రసంగ పాఠాన్ని ఆయనే తయారు చేసుకునేవారు. ఒక రోజు గుండె సంబంధిత ప్రసంగం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నేను అనుకోకుండా తాత గదిలోనికి వెళ్లాను. వెంటనే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అంటూ ప్రశ్నించారు. గుండె ఎలా పని చేస్తుంది, గుండె సమస్యలు ఎలా వస్తాయి అనే విషయాలు తెలియజేశారు. ఆయన పరిశోధన ఆసక్తికి ఈ సంఘటన నిదర్శనం. -
హీరో నాని వాళ్ల తాత సినిమాలో చేయాలట
-
లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో కొత్త మలుపు
-
లక్ష్మీ ప్రసన్న హత్య కేసులో కొత్త మలుపు
మేడ్చల్: చిన్నారి లక్ష్మీ ప్రసన్న హత్యకేసులో విచారణను మేడ్చల్ పోలీసులు ముమ్మరం చేశారు. లక్ష్మీ ప్రసన్న తల్లితండ్రులకు మిగతా కుటుంబసభ్యులకు తరచూ గొడవలవుతూ ఉండేవని, భార్యభర్తల మధ్య కూడా అన్యోన్యత లేదని గ్రామస్ధులు చెబుతున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యుల కాల్ డేటా వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పథకం ప్రకారమే చిన్నారిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబసభ్యులే చిన్నారిని హతమార్చి ఉంటారని గ్రామస్ధులు చెబుతుండటంతో పోలీసుల అనుమానం బలపడింది. ఎల్లంపేటలో హత్య జరిగిన రోజు మధ్యాహ్న సమయంలో లక్ష్మీ ప్రసన్న తాత ఇంటికి వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో లక్ష్మీ ప్రసన్న తల్లి, తండ్రి, పిన్ని, తాతయ్యలను పోలీసులు ప్రశ్నించి.. తాతను అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని తెలిపారు. -
వాహనం ఢీకొని తాత, మనవరాలికి గాయాలు
హసన్‌పర్తి : తవేరా వా హనం ఢీకొని తాత, మ నవరాలికి గాయాలైన సంఘటన హన్మకొండ–కరీంనగర్ ప్రధాన ర హదారిలోని సీతంపేట క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం సాయంత్రం జరిగింది. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మం డలం శంభునిపల్లికి చెందిన ప్రణీతారెడ్డి ఎ ర్రగట్టు క్రాస్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. దసరా సెలవులు ప్రకటించడంతో ఆమె తాత పెండ్యాల శ్రీనివాస్‌రెడ్డి పాఠశాలకు వచ్చాడు. తిరి గి ద్విచక్రవాహనంపై ప్రణీతారెడ్డిని తీసుకుని శంభునిపల్లికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న తవేరా వాహనం వారి ని ఢీకొంది. ఈ ఘటనలో శ్రీనివాస్‌రెడ్డి కాలి కింది భాగం నుజ్జునుజ్జయింది. ప్రణీతారెడ్డి తలకు బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గంట తర్వాత చేరుకున్న 108 వాహనం.. ప్రమాదం జరిగిన వెంటనే 108 వాహనానికి సమాచారం ఇచ్చినప్పటికీ గంట తర్వాత సంఘటన స్థలానికి చేరుకుంది. దీంతో స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమైంది. ఓ దశలో క్షతగాత్రులను ప్రైవేట్ వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లడానికి స్థానికులు ఉపక్రమించారు. -
తాత, బామ్మకు పెళ్లి.. చేశారు మళ్లీ
గుండేపల్లి (నల్లజర్లరూరల్) : మనుమలు, మునిమనుమలతో సహా వారసులంతా ఒక్కచోట చేరి తాతా, బామ్మలకు పెళ్లి చేశారు. ఇన్నాళ్ల వారి దాంపత్య జీవితాన్ని తీయగా పండించుకున్న వారికి ఈ షష్టిపూర్తి పండగ పూట ఓ చిరుకానుక అయ్యింది. తమ వారసులు మళ్లీ పెళ్లినాటి జ్ఞాపకాలను గుర్తు చేయడంతో ఆ రెండు మనసులు మురిసిపోయాయి. బోసి నవ్వుతో తాత, బామ్మలు పులకించిపోయారు. నల్లజర్ల మండలం గుండేపల్లి గ్రామానికి చెందిన గుడ్ల పుల్లయ్యకు 102 సంవత్సరాలు. ఆయన భార్యకు 94 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఎవరికీ భారం కాకుండా ఇప్పటికీ ఆ జంట తమ పనులు తామే చేసుకుంటూ, తమ వంట తామే చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం ఆ దంపతులకు వారి కుమారులు, మనవళ్లు, మనవరాండ్రు మొత్తం 69 మంది షష్టిపూర్తి ఉత్సవం నిర్వహించి ఊరంతా భోజనాలు పెట్టారు. వారి సంతానం అంతా వ్యవసాయ కూలీలుగానే ఉంటున్నా వారి ప్రేమలను చూసి గ్రామస్తులు సరదాపడ్డారు. వారంతా ఇదే జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. -
నాలుగేళ్ల మనవరాలిపై తాత దాష్టీకం
చీపురుగూడెం (నల్లజర్ల రూరల్) :అభం, శుభం తెలియని ఆ పసిపాప పేరు కీర్తన. వయసు నాలుగేళ్లు. తండ్రి వదిలేశాడు. గంగన్నగూడెంకు చెందిన తల్లి అచ్చమ్మ గల్ఫ్ వెళ్లిపోయింది. కొంతకాలంగా ఆ పాప చీపురుగూడెంలో తన తాత (తల్లి తండ్రి) కొల్లూరి అబ్బుల వద్ద ఉంటోంది. పగలు అంగన్వాడీ కేంద్రంలో, రాత్రి తాత ఇంటి వద్ద ఉంటోంది. ఆ ఇంట్లో కీర్తన తాత, అమ్మమ్మ, పిన్ని ఉంటున్నారు. కొన్ని రోజుల నుంచి ఆ పిల్లను కుటుంబ సభ్యులంతా హింసకు గురిచేస్తున్నారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. ఈ అకృత్యాలను చూడలేక వారంతా చైల్డ్‌లైన్ సిబ్బందికి సమాచారం అందించారు. మంగళవారం చైల్డ్‌లైన్ నోడల్ కోఆర్డినేటర్ బి.నరేంద్ర, జిల్లా కోఆర్డినేటర్ జే.వి.ఆర్.ఆల్ఫ్రెడ్, సిబ్బంది ఎస్.రవిబాబు, ఎస్.సునీత చీపురుగూడెం వచ్చి విచారణ చేశారు. విషయం వాస్తవమని తేలింది. బాలిక కట్టా కీర్తన వెళుతున్న నంబర్ 55 అంగన్వాడీ కేంద్రంలో టీచర్ కృష్ణకుమారి, పరిసర ప్రాంత వాసుల నుంచి వివరాలు సేకరించారు. వచ్చీరాని మాటలతో ఆ బాలిక కూడా తాతే తనను కొట్టినట్టు చెబుతోంది. బాలిక ఒంటిపైన, చేతిపైన, వీపు మీద గాయాలున్నాయి. బాలిక తాత కొల్లూరి అబ్బులను పిలిచి విచారించారు. బాలికను కొట్టిన మాట వాస్తవమేనని ఒప్పుకున్నాడు. ముద్దొచ్చి బుగ్గపై కొరికానంటున్నాడు. ‘మా అమ్మ మణెమ్మ కోపమొచ్చి కొట్టిన మాట వాస్తవమేనని అందుకే ఆమె వద్ద నుంచి పిల్లను తీసుకోచ్చి తన వద్ద ఉంచానని చెప్పాడు. ఇదంతా ఎప్పుడో జరిగిందని ఇప్పుడు బాగానే చూసుకుంటున్నామని చెప్పాడు. ఈ విషయాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి డి.అప్పారావు రికార్డు చేశారు. బాలికను హింసించిన అబ్బులను అనంతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికను ఏలూరులో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సీహెచ్.పి.వి.ఎన్.లక్ష్మీ, వి.విజయనిర్మల వద్ద హాజరుపర్చారు. వారి సూచనల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం హోమ్‌కు తరలిస్తామని చైల్డ్‌లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆల్ఫ్రెడ్ తెలిపారు. -
చిరుత దాడిలో తాత, మనవడు మృతి
కోలారు: చిరుత దాడిలో తాత, మనవడు మరణించారు. స్థానికుల సమాచారం మేరకు... కోలారు తాలూకా ఎం.గొల్లహళ్లికి చెందిన వెంకటప్ప(60), మహేష్(16) మంగళవారం రాత్రి త్యావనహళ్లి వద్ద ఉన్న తమ తోట వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మరి కొద్ది సేపటిలో తోటను సమీపిస్తుండగా వారిపై చిరుత దాడి చేసింది. బుధవారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించిన గ్రామస్తుల సమాచారం మేరకు ఎం.గొల్లహళ్లి వాసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరు. శరీరంపై ఉన్న గాట్లను ఆధారంగా చేసుకుని చిరుత దాడిలో మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అజయ్ హిలోరి, అటవీశాఖాధికారి జగదీష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ... గ్రామస్తుల చెప్పిన దాన్ని బట్టి చిరుత దాడిలో మరణించినట్లు ఉన్నా.. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వా త వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. కాగా, చిరుత దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరి హారాన్ని ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే వర్తూరు ప్రకా ష్ డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి, మృతుల కుటుంబాలను పరా మర్శిం చారు. -
శోకసంద్రంలో గుత్తా జ్వాల
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. జ్వాల తాత, స్వాతంత్ర సమరయోధుడు గుత్తా సుబ్రమణ్యం మరణించారు. ఆయన వయసు 102 ఏళ్లు. డిసెంబర్ 30న ఆయన తుది శ్వాస విడిచారు. సుబ్రమణ్యం కోరిక మేరకు ఆయన కళ్లు, శరీరం సాధన మెడికల్ కాలేజీకి అందజేశారు. సుబ్రమణ్యం గాంధేయవాది. ఆయన ఆశయాల మేరకు జ్వాల తండ్రి వార్దా ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపారు. అక్కడే చైనా అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. జ్వాల తండ్రి తెలుగువారు కాగా, తల్లి చైనాకు చెందినవారు. జ్వాల తాత సంస్మరణ సభ శనివారం జరగనుంది. -
ఫేస్బుక్ నిండా తాత జ్ఞాపకాలే
సిటీబ్యూరో: ప్రమాదవశాత్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన నందమూరి హరికృష్ణ తనయుడు జానకీరామ్‌కు తాత స్వర్గీయ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం. అందుకు గుర్తుగా చిన్నతనంలో తాతతో కలిసి దిగిన ఫొటోలు, ఎన్టీఆర్‌కు సంబంధించిన కార్టూన్లు, ఫొటోలను ఫేస్ బుక్‌లో భద్రపరుచుకున్నారు. అంతే కాదు తన కుమారునికి సైతం నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్)అని పేరు పెట్టుకు న్నారు. 1977లో ఎన్టీఆర్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చాణక్యచంద్రగుప్త సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని జానకీరామ్‌ను ఎత్తుకుని దిగిన ఫొటోను ఫేస్బుక్లో భద్రంగా దాచుకున్నారు. చిన్నతనంలో ఏఎన్ఆర్, ఎన్టీఆర్‌లతో కలిసి ఫొటో దిగడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఫేస్బుక్లో రాసుకున్నారు. -
ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపూ ఒకటే టెన్షన్
ములపర్రు (ఆచంట) : ‘నవంబరు 16ను ఎప్పటికీ మరిచిపోలేం.. మా చిన్నోడు (కిడాంబి శ్రీకాంత్) ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన రోజు అది.. ఆ రోజు రాత్రి ఫైనల్ మ్యాచ్ చూస్తున్నంత సేపు ఒకటే టెన్షన్.. ప్రత్యర్థి సామాన్యుడు కాదు మరి.. చైనా దిగ్గజం లీన్డాన్.. అప్పటికే రెండు సార్లు మా చిన్నోడు అతని చేతిలో ఓడిపోయాడు.. మూడోసారి తలపడుతున్నాడు.. పోరు హోరాహోరీగా సాగుతోంది.. మా చిన్నోడి ఆట చూసి గెలుస్తాడనుకున్నాం.. దేవుడిపైనే భారం వేశాం.. చివరకు ఎవరూ ఊహించని విధంగా శ్రీకాంత్ చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు’ అని కిడాంబి శ్రీకాంత్ తాతయ్య, అమ్మమ్మలు కొంమాండూరి స్వామినాథ న్, శేషవల్లి ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ తల్లి రాధా ముకుంద నాగమణి స్వగ్రామం పెనుగొండ మండలం ములపర్రు గ్రామం. బ్యాడ్మింటన్‌లో చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ గురించి తెలుసుకునేందుకు ఆనందడోలికల్లో మునిగితేలుతున్న తాతయ్య, అమ్మమ్మలతో ఇంటర్వ్యూ. మీ మనవడు శ్రీకాంత్ విజయంపై మీ స్పందన చాలా సంతోషంగా ఉంది. ఆటల ద్వారా మా మనవడు పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగుతుండటం చాలా హ్యాపీ. కష్టానికి తగిన ఫలితమిది. మీరెప్పుడైనా మీ మనవడు ఈ స్థాయికి వెళతాడని ఊహించారా వాడు చిన్నప్పటి నుంచే బ్యాడ్మింటన్‌లో ప్రతిభ చూపేవాడు. ఎప్పటికైనా మంచిపేరు తెచ్చుకుంటాడనే నమ్మకం మాకుంది. మీ పెద్దమనవడు కూడా ఇదే రంగంలో ఉన్నారంట కదా అవును పెద్ద మనుమడు నందగోపాల్, చిన్న మనుమడు శ్రీకాంత్. ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్లే. శ్రీకాంత్ బ్యాడ్మింటన్‌లో రాణించడానికి ప్రోత్సాహకులు ఎవరు మా అల్లుడు (శ్రీకాంత్ తండ్రి)కి కూడా ఆటలంటే ఇష్టం. దేవుని దయవ ల్ల వారి ఆర్థిక పరిస్థితి బాగుండటంతో పిల్లలను ప్రోత్సహించారు. శ్రీకాంత్ ఈ స్థాయికి వెళ్లాడంటే ఆయనే కారణం. శ్రీకాంత్ ఎక్కడ శిక్షణ తీసుకున్నాడు విశాఖ, ఖమ్మంలో కొద్దికాలం శిక్షణ పొందాడు. తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ అకాడమీలో ప్రత్యేక ట్రైనింగ్ తీసుకున్నాడు. భవిష్యత్‌లో శ్రీకాంత్ ఏం సాధించాలని మీరు కోరుకుంటున్నారు పుల్లెల గోపీచంద్ అంత ఎత్తుకు ఎదగాలని, ఒలింపిక్స్‌లో ఆడాలని కోరుకుంటున్నాం. అకాడమీ ఏర్పాటుచేసి తనలాంటి క్రీడాకారుల్ని తయారు చేయాలని ఆశిస్తున్నాం. శ్రీకాంత్‌కు మీరిచ్చే సలహా ఏమైనా ఉందా విజయాన్ని ఎప్పుడూ తలకెక్కించుకోకూడదు. భవిష్యత్‌లో మరింత కష్టపడి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం. మీ చిన్నోడికి మీరిచ్చే కానుక ఏమైనా ఉందా చిన్నోడికే కాదు పెద్దోడికి కూడా ఇచ్చేందుకు రెండు ఇంక్ పెన్నులు కొని సిద్ధంగా ఉంచాం. -
తాతను కాల్చేసిన 11 ఏళ్ల బాలుడు
చికాగో: అమెరికాలో విచ్చలవిడి తుపాకీ సంస్కృతికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఇంట్లో గొడవల కారణంగా ఓ 11 ఏళ్ల బాలుడు తన తండ్రి, తాతను తుపాకీతో కాల్చాడు. తాత అక్కడికక్కడే మరణించగా, తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఉత్తర కరోలినాలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. లాయిడ్ వుడ్లీఫ్ (84) తన కొడుకు లాయిడ్ పీటన్ వుడ్లీఫ్ (49) ఇంట్లో ఉంటున్నాడు. ఇంట్లో ఘర్షణ జరగడంతో కాల్పులు జరిగినట్టు అధికారులు చెప్పారు. ఫోన్ కాల్ రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. పీటన్ తీవ్రంగా గాయపడగా, లాయిడ్ అప్పటికే మరణించాడు. 11 ఏళ్ల పిల్లాడే తుపాకీతో కాల్చినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదు. -
తాత చెప్పినట్టే దేశ దిమ్మరినయ్యూ
కేంద్ర మంత్రి ఎం.వెంకయ్య నాయుడు విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : ‘ఓరే బాబూ నీ అరి కాలిపై చక్రం ఉందిరా. దేశ దిమ్మరివవుతావు. అని చాలా చిన్న వయస్సులోనే మా తాత చెప్పారు. అలాగే ఆ నాడు ఆయన చెప్పిన ప్రకారమే దేశదిమ్మరినయ్యూ. దేశమంతా తిరిగి ప్రజలకు సేవ చేయడానికే దేశ దిమ్మరినయ్యా’ అని అన్నారు కేంద్ర పట్టణాభివృద్థి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు. చంద్రబాబు ప్రమాణాస్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు నగరంలోని గేట్‌వే హోటల్లో దిగిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు ఆదివారం ఉదయం ఆరున్నర గంటలకు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో కొద్దిసేపు వాకింగ్ చే శారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నడక శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. చేసే పని మంచిదైతే మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. తాను రోజూ ఇంటిలో అందుబాటులో ఉన్న డ్రైవర్‌తో, కుక్‌తో ఎవరితోనైనా కలిసి షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతుంటానన్నారు. తనకిష్టమైన షటిల్ బ్యాడ్మింటన్ ఆడిన తరువాత హుషారుగా, ప్రశాంతంగా ఉంటుందన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ వాకింగ్, సైక్లింగ్ చేసే సంస్కృతి పెరగాలన్నారు. ఇందుకోసమే పట్టణాభివృద్ధిలో భాగంగా దేశంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న స్మార్ట్ సిటీలు, మెట్రో సిటీల్లో రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. సీమాంధ్ర నగరాల్లో వేసే రోడ్లపై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఐజీఎంసీ స్టేడియంలో అనుకోని అతిథిగా కాషాయ రంగు టీ షర్ట్, లోయర్‌తో సాదాసీదాగా వచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు స్టేడియంలో వార్మ్ప్ చేస్తున్న టెన్నిస్ ఆడే చిన్నారులు ‘గుడ్ మార్నింగ్ సార్’ అంటూ స్వాగతం పలికారు. ఇందుకు వెంకయ్యనాయడు తనైదైనశైలిలో ‘మనం భారతీయులం. గుడ్ మార్నింగ్ కాదు నమస్తే అనాలి. మమ్మీ, డాడీ కాదు అమ్మా, నాన్న అని పిలవాలి’ అని సూచించారు. టెన్నిస్ చిన్నారులతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ చేస్తున్న మహిళా క్రికెటర్లకు కుశల ప్రశ్నలువేశారు. స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా వెంకయ్యనాయుడుతో కరచలనం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు ఒక సారి స్టేడియంలో వాకింగ్ చేసేం దుకు వచ్చానని, మళ్లీ ఇప్పుడు వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి స్టేడియంలో సింథటిక్ రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు విషయాన్ని ‘న్యూస్‌లైన్’ వెంకయ్య నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయాల్సి ఉందని, ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కేంద్రం వద్ద ఉన్నాయని వివరించగా వెంకయ్యనాయుడు వెంటనే తన పీఏను పిలిచి ఢిల్లీ వెళ్లగానే సంబంధిత మంత్రితో మాట్లాడేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాకింగ్ అనంతరం స్టేడియం నుంచి బందరు రోడ్డుపై నడుచుకుంటూనే తాను బస చేసిన హోటల్ గేట్‌వేకు చేరుకున్నారు. -
రామ్‌చరణ్‌కు తాతగా...
మహేశ్ ‘ఆగడు’ నుంచి బయటకొచ్చిన ప్రకాశ్‌రాజ్... రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోకి ఫ్రెష్‌గా ఎంటరయ్యారు. మూడు తరాల కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారు. ఈ పాత్రకు ముందు తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని తీసుకున్నారు. రాజ్‌కిరణ్‌తో పలు కీలక సన్నివేశాలను కూడా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. అయితే ఏమైందో ఏమో... ఇప్పుడు రాజ్‌కిరణ్ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. అలాగే, పైకి ప్రకటించని కొన్ని కారణాల వల్ల చిత్రీకరణకు విరామం ప్రకటించిన ఈ టీమ్ త్వరలోనే మళ్ళీ సెట్స్‌కి వెళ్లనుంది. మరి, ఇందులో చరణ్ తండ్రి పాత్ర పోషించే నటుడెవరో తెలియాల్సి ఉంది. -
ఏడాదిన్నర మనవరాలిని చితకబాదిన తాత
కొచ్చి: పిల్లలు దైవంతో సమానం అనేది నానుడి. పసి ప్రాయంలో వారు చేసే ఏ అల్లరైనా అందంగానే ఉంటుంది. అలాగే ఒక్కొసారి పిల్లలు చేసే అల్లరి అద్దూ అదుపూ లేకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువైతే మురిపెంగా బుజ్జగిస్తాం. అలాకాకుండా పిల్లలను చితకబాది విచక్షణ కోల్పోతే చేసేదేముంది. ఇటువంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. తల్లి విదేశాల్లో, తండ్రి కొచ్చిలోని కొట్టరకారాలో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో ఆ పాపను తాత దగ్గరు వదిలి పెట్టారు. ఇలా కొన్ని రోజులు బాగానే గడిచాయి. ఈ క్రమంలో పాప ఏదో సందర్భంలో మారాం చేయడంతో ఆ తాతకు కోపం చిర్రెత్తుకొచ్చింది..ఇంకేముంది..తన దగ్గర ఉన్న కొట్టడం అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. పాపను చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ పాపను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప ఐసీయూలో చికిత్స పొందుతోంది. విచక్షణ కోల్పోయిన ఆ తాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.