
అశ్విన్ ఇంట విషాదం
చెన్నై:టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఇంట విషాదం నెలకొంది. అశ్విన్ తాత ఎస్ నారాయణ స్వామి(92) శనివారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో్ బాధపడుతున్ననారాయణ స్వామి తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. నారాయణ స్వామి సదరన్ రైల్వేలో మాజీ ఉద్యోగి. మరొకవైపు ఆయనకు క్రికెట్ అంటే విపరీతమైన ప్రేమ. అశ్విన్ క్రికెటర్ గా ఎదిగే క్రమంలో నారాయణ స్వామి కీలక పాత్ర పోషించారు. నారాయణ స్వామికి ఒక కొడుకు, ఒక కూతురు.
ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అశ్విన్.. తన తాతను కడసారి చూసేందుకు రాలేకపోయాడు. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టులో అశ్విన్ సభ్యుడు కావడంతో అతను తిరిగి భారత్ కు వచ్చే అవకాశం లేకుండా పోయింది. న్యూజిలాండ్ తో వార్మప్ మ్యాచ్ కు ముందు అశ్విన్ కు తాత మృతిచెందిన వార్తను చేరవేశారు. దాంతో ఆ మ్యాచ్ లో బాధను దిగమింగుకుని అశ్విన్ పాల్గొన్నాడు.