
అత్యాచారం కేసులో అమ్మమ్మ అరెస్ట్
కేరళలో మనవరాలిపై అత్యాచార ఘటనలో భర్తకు సహకరించిన దారుణమైన సంఘటన వెలుగు చూసింది.
కొల్లం: కేరళలో మనవరాలిపై అత్యాచార ఘటనలో భర్తకు సహకరించిన దారుణమైన సంఘటన వెలుగు చూసింది. కొల్లాం జిల్లా కుంద్రాలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలైన మనవరాళ్లపై తాత అత్యాచారానికి పాల్పడితే.. ఆయనకు అమ్మమ్మ సహకరించడం కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు శనివారం బాలికల అమ్మమ్మను (62) అరెస్ట్ చేశారు. మనవరాళ్లపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం మనుమరాళ్లపై గత రెండేళ్లకాలంగా విజయన్ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ క్రమంలో తాత లైంగిక వేధింపులకు తాళలేక 10 సం.రాల బాలిక ఇటీవల ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఈ దారుణం వెలుగు చూసింది. బాలికలపై భర్త అఘాయిత్యం, లైంగిక వేధింపులు ఆమెకు తెలుసుఅనీ, ఈ మహిళ సాయం చేసినట్టుగా పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఆమె భర్త విక్టర్ అలియాస్ విజయన్ ను రెండు రోజుల క్రితం అరెస్టు చేశారు.
మూత్రపిండాల వ్యాధి చికిత్స చేయించుకుంటున్న ఆమెను ఆసుపత్రి నుంచి జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయిన తరువాత ఆమెను జైలుకు తరలించానున్నామని దర్యాప్తు అధికారి, కొట్టారకార డిప్యూటి ఎస్‌పీ.దర్యాప్తు అధికారి కృష్ణకుమార్, చెప్పారు. 376 (అత్యాచారం చేసినందుకు శిక్ష) , 305 (పిల్లల ఆత్మహత్యకు ప్రేరేపణ) సహా, పోస్కో (లైంగిక నేరాలు నుండి పిల్లలు రక్షణ) సహా, పలు ఐపిసి సెక్షన్ల కింద కేసులు, కేసులు నమోదు చేశామన్నారు.