
సాక్షి, చెన్నై: ఈరోడ్ సమీపంలో మద్యానికి డబ్బు ఇవ్వలేదని మంగళవారం అవ్వను మనుమడు హతమార్చాడు. ఈరోడ్ జిల్లా, అవల్‌పూందురై భారతివీధికి చెందిన ముత్తుస్వామి, జల్విన్‌మేరి కుమార్తె భారతివెన్నిలా, కుమారుడు పూవిళిసెల్వన్ (33). భారతివెన్నిలాకు వివాహమై విడిగా ఉంటున్నారు.
పూవిళిసెల్వన్ భార్య షర్మిలా (35). ఒక కుమార్తె ఉన్నారు. పూవిళిసెల్వన్‌కు రెండేళ్లుగా మానసిక స్థితి సరిలేదు.ఇలావుండగా షర్మిల, భర్త, కుమార్తెతో కోవైలోని పుట్టింటికి వెళ్లింది.ఆ తర్వాత మంగళవారం అవల్‌పూందురైకు వచ్చిన పూవిళిసెల్వన్ మద్యానికి డబ్బులివ్వాలంటూ తల్లి జల్విన్‌మేరీతో గొడవ పడ్డాడు. ఆమె డబ్బులు ఇవ్వకపోవడంతో ఇంట్లో నిద్రిస్తున్న 95 ఏళ్ల అవ్వను కత్తితో పొడిచి హతమార్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అరచ్చలూరు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment