చెన్నై: తెన్‌కాశిలో అదృశ్యమైన అవ్వ, మనుమరాలు హత్యకు గురయ్యారు. వీరి మృతదేహాలు శుక్రవారం గోనెసంచిలో లభ్యమయ్యాయి. మదురై కోర్టు ఉత్తర్వులతో ఈ సంఘటనలో మిస్టరీ వీడింది. తెన్‌కాశి కీళపులియూరుకు చెందిన ఉచ్చిమాగాళి భార్య గోమతి (55). ఈమె కుమార్తె సీతాలక్ష్మి (25). అల్లుడు మురుగన్ (31) సైన్యంలో పనిచేస్తున్నాడు. వీరి కుమారుడు మనీష్ (6), కుమార్తె ఉత్తర అలియాస్ సాక్షి (1) మనుమరాలు ఉత్తరను గోమతి అమ్మాళ్ పెంచుకుంటూ వచ్చింది. గత జనవరి 12 నుంచి గోమతి అమ్మాళ్, ఉత్తర కనిపించలేదు.
కశ్మీర్‌లో పనిచేస్తున్న అల్లుడు మురుగన్ ఇంటికి చేరుకుని కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు అవ్వ, మనుమరాలి ఆచూకీ కనుగొనాలని పోలీసులను ఆదేశించింది. పోలీసులు గోమతి అమ్మాళ్ చివరిసారిగా వీరపాండియమ్మాళ్‌తో మాట్లాడిన విషయం తెలిసింది. పోలీసుల విచారణలో గోమతి అమ్మాళ్ వీరపాండియమ్మాళ్‌కు వడ్డీకి నగదు అందజేసింది. ఈ నగదు తిరిగివ్వమని కోరడంతో ఇద్దరి మధ్య తగాదా ఏర్పడింది. దీంతో వీరపాండియమ్మాళ్, గోమితి అమ్మాళ్, మనుమ రాలిని హతమార్చి మృతదేహాలను గోనెసంచిలో కట్టి తోటలో విసిరేసినట్లు తెలిసింది. పోలీసులు శుక్రవారం ఆమెను అరెస్టు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: కడుపుమీద కారు ఎక్కించి హత్య
చదవండి: ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో స్కూల్ టీచర్‌పై
Comments
Please login to add a commentAdd a comment