ఏడాదిన్నర మనవరాలిని చితకబాదిన తాత | One and half year old baby beaten up, hospitalised | Sakshi
Sakshi News home page

ఏడాదిన్నర మనవరాలిని చితకబాదిన తాత

Published Fri, Oct 18 2013 3:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

One and half year old baby beaten up, hospitalised

కొచ్చి: పిల్లలు దైవంతో సమానం అనేది నానుడి. పసి ప్రాయంలో వారు చేసే ఏ అల్లరైనా అందంగానే ఉంటుంది. అలాగే ఒక్కొసారి పిల్లలు చేసే అల్లరి అద్దూ అదుపూ లేకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువైతే మురిపెంగా బుజ్జగిస్తాం. అలాకాకుండా పిల్లలను చితకబాది విచక్షణ కోల్పోతే చేసేదేముంది. ఇటువంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. తల్లి విదేశాల్లో,  తండ్రి కొచ్చిలోని కొట్టరకారాలో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో ఆ పాపను తాత దగ్గరు వదిలి పెట్టారు.

 

ఇలా కొన్ని రోజులు బాగానే గడిచాయి.  ఈ క్రమంలో పాప ఏదో సందర్భంలో మారాం చేయడంతో ఆ తాతకు కోపం చిర్రెత్తుకొచ్చింది..ఇంకేముంది..తన దగ్గర ఉన్న కొట్టడం అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. పాపను చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ పాపను స్థానికులు ఆస్పత్రికి తరలించారు.  ప్రస్తుతం ఆ పాప ఐసీయూలో చికిత్స పొందుతోంది. విచక్షణ కోల్పోయిన ఆ తాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement