One and half year old baby
-
మంచినీరు అనుకుని పురుగుమందు తాగిన చిన్నారి
రెంటచింతల (గుంటూరు) : మంచినీరు అనుకుని ఓ చిన్నారి పురుగు మందు తాగి మృత్యువాతపడింది. గుంటూరు జిల్లా రెంటచింతల మండలం పసర్లపాడులో సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కర్మన్నాయక్, రోజా బాయి దంపతులది వ్యవసాయ కుటుంబం. సోమవారం సాయంత్రం పొలానికి వెళ్తూ తమ చిన్నారి సంధ్య(ఏడాదిన్నర)ను వెంట తీసుకెళ్లారు. పొలం గట్టున చిన్నారిని నిద్రపుచ్చిన ఆ దంపతులు పురుగు మందు పిచికారీ చేయటంలో నిమగ్నమయ్యారు. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చిన చిన్నారి... దాహం వేయటంలో పక్కనే ఉన్న పురుగు మందును మంచినీళ్లుగా భావించి తాగింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగానే సంధ్య చనిపోయింది. చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
ఏడాదిన్నర మనవరాలిని చితకబాదిన తాత
కొచ్చి: పిల్లలు దైవంతో సమానం అనేది నానుడి. పసి ప్రాయంలో వారు చేసే ఏ అల్లరైనా అందంగానే ఉంటుంది. అలాగే ఒక్కొసారి పిల్లలు చేసే అల్లరి అద్దూ అదుపూ లేకుండా ఉంటుంది. ఇంకా ఎక్కువైతే మురిపెంగా బుజ్జగిస్తాం. అలాకాకుండా పిల్లలను చితకబాది విచక్షణ కోల్పోతే చేసేదేముంది. ఇటువంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. తల్లి విదేశాల్లో, తండ్రి కొచ్చిలోని కొట్టరకారాలో ఉద్యోగాలు చేయాల్సి రావడంతో ఆ పాపను తాత దగ్గరు వదిలి పెట్టారు. ఇలా కొన్ని రోజులు బాగానే గడిచాయి. ఈ క్రమంలో పాప ఏదో సందర్భంలో మారాం చేయడంతో ఆ తాతకు కోపం చిర్రెత్తుకొచ్చింది..ఇంకేముంది..తన దగ్గర ఉన్న కొట్టడం అనే ఆయుధాన్ని ప్రయోగించాడు. పాపను చితకబాదాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆ పాపను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప ఐసీయూలో చికిత్స పొందుతోంది. విచక్షణ కోల్పోయిన ఆ తాతను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.