చిరుత దాడిలో తాత, మనవడు మృతి | Leopard attack, grandfather, grandson killed | Sakshi
Sakshi News home page

చిరుత దాడిలో తాత, మనవడు మృతి

Published Thu, Jan 8 2015 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM

చిరుత దాడిలో  తాత, మనవడు మృతి

చిరుత దాడిలో తాత, మనవడు మృతి

కోలారు:  చిరుత దాడిలో తాత, మనవడు మరణించారు. స్థానికుల సమాచారం మేరకు... కోలారు తాలూకా ఎం.గొల్లహళ్లికి చెందిన వెంకటప్ప(60), మహేష్(16) మంగళవారం రాత్రి త్యావనహళ్లి వద్ద ఉన్న తమ తోట వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మరి కొద్ది సేపటిలో తోటను సమీపిస్తుండగా వారిపై చిరుత దాడి చేసింది. బుధవారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించిన గ్రామస్తుల సమాచారం మేరకు ఎం.గొల్లహళ్లి వాసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరు. శరీరంపై ఉన్న గాట్లను ఆధారంగా చేసుకుని చిరుత దాడిలో మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు.

విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అజయ్ హిలోరి, అటవీశాఖాధికారి జగదీష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ... గ్రామస్తుల చెప్పిన దాన్ని బట్టి చిరుత దాడిలో మరణించినట్లు ఉన్నా.. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వా త వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. కాగా, చిరుత దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరి హారాన్ని ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే వర్తూరు ప్రకా ష్ డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి, మృతుల కుటుంబాలను పరా మర్శిం చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement