leopard attack
-
తిరుపతి జూపార్క్ రోడ్డులో చిరుత కలకలం
-
చిరుతపులి దాడి.. మరో చిన్నారి మృతి
లక్నో: చిరుతపులి దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పశుగ్రాసం తీసుకొచ్చేందుకు తల్లితో కలిసి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాలికపై.. చిరుత ఒక్కసారిగా దాడి చేసి.. ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో శుక్రవారం జరిగింది. నహ్తౌర్ ప్రాంతంలోని మల్కాపూర్ గ్రామానికి తాన్య(8) అనే చిన్నారి పశుగ్రాసం సేకరించేందుకు తల్లితో కలిసి ఉదయం 8 గంటల సమయంలో సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లింది.అయితే అదే సమయంలో చిరుత ఒక్కసారిగా బాలికపై దాడి చేసి.. తాన్యను రోడ్డుపై నుంచి ఈడ్చుకెళ్లింది. వెంటనే చిన్నారి తల్లి, ఇతర గ్రామస్థులు కర్రలతో చిరుతను వెంబడించారు. దీంతో భయపడిన చిరుత.. చిన్నారిని వదిలి వెళ్లిపోయింది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం పంపినట్లు నహ్తౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ధీరజ్ సింగ్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చిరుతపులిని గుర్తించడానికి కెమెరా ట్రాప్లను, థర్మల్ డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు ఫారెస్ట్ డివిజన్ అధికారి పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ఇటీవల చిరుత దాడిలో యూపీలోని లఖింపూర్ ఖేరీలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. -
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన మాజీ స్టార్ క్రికెటర్
జింబాబ్వే మాజీ స్టార్ క్రికెటర్ గై విట్టల్ చిరుత పులి దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. విట్టల్ తల, చేతి భాగంపై చిరుత తీవ్రమైన గాయాలు చేసింది. విట్టల్‌ను హుటాహుటిన సమీపంలోని అసుపత్రికి ఎయిర్ లిఫ్ట్ చేశారు. అతనికి మరిన్ని శస్త్ర చికిత్సలు చేయాల్సి ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం విట్టల్ పరిస్థితి నిలకడగా ఉందని అతని భార్య హన్నా ఫేస్బుక్ ద్వారా తెలిపింది. 51 ఏళ్ల గై విట్టల్ కుటుంబంతో కలిసి హ్యూమని అనే అటవీ ప్రాంతంలో సఫారీ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. గత మంగళవారం విట్టల్ తన పెంపుడు శునకం చికారాతో కలిసి అటవీ ప్రాంతంలోకి వెళ్లాడు. ఆ సమయంలో చిరుత అమాంతం విట్టల్‌పై దాడికి దిగింది. ఇది గమనించిన చికారా చిరుతతో కలబడింది. చికారా ప్రతిఘటించడంతో చిరుత మెత్తబడి పారిపోయింది.చికారా లేకుంటే విట్టల్ ప్రాణాలతో బయటపడేవాడు కాదని అతని భార్య హన్నా తెలిపింది. సఫారీలో విట్టల్‌కు ఇలాంటి అనుభవాలు కొత్తేమీ కాదు. పదేళ్ల క్రితం ఓ భారీ మొసలి తన గేమ్ రిజర్వ్‌లోని బెడ్రూమ్లోకి ప్రవేశించి, రాత్రి అక్కడే గడిపింది. ఈ విషయం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉండింది. గై జేమ్స్ విట్టల్ 1993-2003 మధ్యలో జింబాబ్వే తరఫున 46 టెస్ట్‌లు, 147 వన్డేలు ఆడాడు.టెస్ట్‌ల్లో ఓ డబుల్ సెంచరీ, 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీల సాయంతో 2207 పరుగులు చేసిన విట్టల్.. 51 వికెట్లు కూడా పడగొట్టాడు. వన్డేల్లో 11 హాఫ్ సెంచరీల సాయంతో 2705 పరుగులు చేసిన విట్టల్.. 88 వికెట్లు పడగొట్టాడు.రైట్ ఆర్మ్ మీడియం పేస్ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన విట్టల్.. 21వ శతాబ్దం ఆరంభంలో ఫ్లవర్, స్ట్రాంగ్ బ్రదర్స్, హీత్ స్ట్రీక్‌లతో కలిసి జింబాబ్వే క్రికెట్లో ఓ వెలుగు వెలిగాడు. గై విట్టల్ కజిన్ ఆండీ విట్టల్ కూడా అదే సమయంలో జింబాబ్వేకు ప్రాతినిథ్యం వహించాడు. -
ఢిల్లిలో చిరుత కలకలం.. ఐదుగురు ఆస్పత్రికి!
ఢిల్లిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ వాసులను వణికిస్తున్న చిరుత పట్టపగలే మరోసారి దర్శన మిచ్చింది. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం ఉత్తర ఢిల్లిలో రూప్ నగర్లో చిరుతపులి ఓ ఇంట్లోకి చొరబడింది. ఈ క్రమంలో ముగ్గురిపై దాడిచేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెటింట చక్కర్లు కోడుతుంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం అగ్నిమాపక బృందం సాయంతో ఎట్టకేలకు దానిని బంధించారు. దీంతో అక్కడి జనం, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ చిరుతను అదుపులోకి తెచ్చేందుకు అగ్నిమాపక బృందం నానా కష్టాలు పడినట్టు సమాచారం. చిరుతని గదిలో బంధించామని, గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని ఢిల్లీ అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. STORY | Leopard barges into house in Delhi's Roop Nagar, 5 injured READ: https://t.co/EbH7OulTMV VIDEO: (Source: Third Party) pic.twitter.com/7bJRdu08YH — Press Trust of India (@PTI_News) April 1, 2024 -
ఇంట్లోకి చొరబడిన చిరుత.. దాడిలో ఆరుగురికి గాయాలు
తమిళనాడులోని నీలగిరి జిల్లా కూనూరు అటవీ ప్రాంతంలో చిరుత దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో విధుల్లో ఉన్న జర్నలిస్ట్ ఒకరు ఉన్నారు. ఆహారం కోసం అడవి నుంచి బయటకు వచ్చిన చిరుత కూనూరు సమీపంలోని గ్రామంలో ఓ వీధి కుక్కను వెంబడిస్తూ ఓ ఇంట్లోకి ప్రవేశించింది. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుతను బంధించేందుకు చర్యలు చేపట్టారు. చిరుత చొరబడిన ఇంట్లో ఓ వ్యక్తి ఉండటంతో అతన్ని రక్షించేందుకు ప్రయత్నించిన ఆరుగురిపై చిరుత దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన వీరిలో విధుల్లో ఉన్న ఓ జర్నలిస్ట్ కూడా ఉన్నారు. వీరందరినీ కూనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిరుత ఇంకా ఇంట్లోనే ఉందని, దాన్ని బంధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. -
పుణెలో దారుణం.. ఇంటివద్ద ఆడుకుంటున్న బాలుడిని లాక్కెళ్లిన చిరుత
ముంబై: మహారాష్ట్రలో పుణెలో దారుణం చోటుచేసుకుంది. చిరుతపులి దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘోరం జున్నార్ తాలుకాలోని ఆలే గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. వ్యవసాయ పనులు చేసుకునే అమోల్ కుమారుడు నాలుగేళ్ల శివాన్ష్ బుజ్పాల్ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా ఒక్కసారిగా అక్కడికి వచ్చిన చిరుత.. చిన్నారిని నోట కరుచుకొని పక్కనే ఉన్న చెరుకు తోటలోకి లాకెళ్లింది. పక్కనే ఉన్న పొలంలో పనులు చేస్తున్న బాలుడి తాత..పిల్లాడి కేకలు విని అక్కడికి పరుగుతెత్తుకొచ్చాడు. బాలుడిని రక్షించేందుకు పొరుగున ఉన్న కొందరు సైతం కర్రలతో చెరుకు పొలాల్లోకి వెళ్లారు. అయితే అప్పటికేచిరుత బాలుడిని చాలా దూరం ఈడ్చుకెళ్లి.. కింద పడేయడంతో తల, మెడ, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా చిరుత పులులను పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు ఆ ప్రాంతంలో నిరసనకు దిగారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో పెట్రోలింగ్‌ను ముమ్మరం చేశామని, ట్రాప్ కేజ్‌లను ఏర్పాటు చేసే పనిలో ఉన్నామని అటవీ అధికారి తెలిపారు. ఇదిలా ఉండగా జున్నార్ అటవీ డివిజన్లో చిరుత దాడి చేయడం ఈ ఏడాది మూడోసారి. అంతేగాక పుణె జిల్లాలో జనవరి, ఏప్రిల్ మధ్య వేర్వేరు ప్రదేశాలలో ఇలాంటి సంఘటనలు నాలుగు చోటుచేసుకున్నాయి. -
అలిపిరి నడక మార్గంలో పటిష్ట బందోబస్తు: టీటీడీ ఈవో ధర్మారెడ్డి
తిరుమల: తిరుమలలో అలిపిరి నడక మార్గంలో చిరుత దాడిలో మృతిచెందిన బాలిక ఘటనపై టీటీడీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి శనివారం అత్యవసర సమావేవేశాన్ని ఏర్పాటు చేశారు. అటవీశాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమయ్యారు. తిరుమల నడకమార్గంలో భక్తుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు చిరుత దాడి విషయం తెలిసి హైదరాబాద్ నుంచి హుటాహుటిన తిరుమలకు బయలుదేరారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చిన్నారిపై దాడి బాధాకరం: ఈవో తిరుమల నడకదారిలో చిన్నారిపై దాడి బాధాకరమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి అన్నారు. అలిపిరిలో చిరుతను బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలిపిరి నడకమార్గం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేతపై ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. నడక దారిలో ప్రతి 40 అడగులకు సెక్యూరిటీ ఉండే చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలకు చిన్న పిల్లలతో వచ్చే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు నడక దారిలో ఫారెస్ట్, పోలీస్, టీటీడీ కలిసి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని ధర్మారెడ్డి అన్నారు. అలిపిరి నడక మార్గంలో 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చిరుత దాటి ఘటనపై సీసీఎఫ్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించాని తెలిపారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటలకు బైక్స్ నిలిపి వేయాలని సూచనలు వచ్చాయని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటాని పేర్కొన్నారు. చదవండి: ఇదేం చిత్రం చంద్రబాబూ.. ఇదే కదా నీ కొంపముంచేది? దాడి చేసింది చిరుతనా లేదా ఎలుగబంటినా? బాలికపై చిరుత దాడికి పాల్పడిన ఘటనా స్థలాన్ని సీసీఎఫ్ నాగేశ్వర రావు, డీఎఫ్ఓ సతీష్ కుమార్ పరిశీలించారు. దాడి చేసింది చిరుతా లేక ఎలు బంటా అన్నది పోస్టుమార్టం రిపోర్టు వస్తే నిర్ధారణ అవుతుందని తెలిపారు. దాడి చేసిన జంతువును బంధించేందుకు బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఎలుగుబంటి అయితే మత్తు ద్వారా బంధిస్తామని, చిరుత అయితే బోన్ ద్వారా బంధిస్తామని చెప్పారు. జంతువుల కదలికలను గుర్తించేందుకు ట్రాప్ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాలు వినియోగిస్తామని తెలిపారు. 7వ మైలు రాయి నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హై అలర్ట్ జోన్‌గా ప్రకటిస్తున్నామని అన్నారు. కాగా తిరుమలలోని అలిపిరి కాలి బాటలో ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం చెందిన దినేష్ కుమార్, శశికళ కుమార్తె లక్షిత శుక్రవారం సాయంత్రం అలిపిరి కాలిబాటలో కనిపించకుండా పోయింది. చిరుత దాడిని గుర్తించని తల్లిదండ్రులు.. నడకదారిలో చిన్నారి కోసం వెతగ్గా దొరకలేదు. నిన్న రాత్రి పోలీసులకు లక్షిత తప్పిపోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా.. రాత్రి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చే పట్టారు. శనివారం ఉదయం నడక దారిలో లక్షిత మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించి..ఈ ఘటనపైకేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తవ్వగా.. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. -
తిరుమలలో ఆరేళ్ల బాలికను చంపేసిన చిరుత
-
యువకునిపై చిరుతపులి దాడి
కర్ణాటక: యువకునిపైన చిరుతపులి దాడి చేసి గాయపరిచిన సంఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని రామేనహళ్ళి బెట్ట తప్పలి వద్ద చోటు చేసుకుంది. రామేనహళ్ళికి చెందిన అనిల్ అనే యువకుడు స్నేహితులతో కలిసి ఊరి బయట మండపం వద్ద కూర్చుని ఉండగా, కొండపై నుంచి వచ్చిన చిరుత అతని మీదకు దూకింది. ఈ దాడిలో అతనికి భుజం, కడుపులో గాయాలయ్యాయి. మిగతావారు గట్టిగా కేకలు వేయడంతో చిరుత పరారైంది. వెంటనే గ్రామస్తులు అతన్ని హుణసూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు. హంతక చిరుత బందీ బాలికను బలి తీసుకున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులోకి చిక్కింది. చామరాజనగర జిల్లా కొళ్ళెగాల తాలూకా మదువనహళ్లి సమీపంలోని సిద్దేశ్వర బెట్ట వద్ద చిరుత దొరికింది. కగ్గలిగుందిలో గత నెల 26న ఆరేళ్ల బాలికను చిరుత లాక్కుపోవడానికి యతి్నంచింది, ఈ ఘటనలో బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. అలాగే కంచహళ్ళి గ్రామంలో రైతు పైన దాడి చేసింది. గత 19 రోజులుగా ఈ చిరుత కోసం చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు జరిపి బోనులు పెట్టడంతో దొరికింది. అటవీ సిబ్బంది దానిని తీసుకెళ్లారు. -
చిరుత దాడి.. చిన్నారి కౌశిక్‌ను పరామర్శించిన వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, తిరుమల: తిరుమలలో అయిదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన ఘటనపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. చిరుత దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కౌశిక్‌ను శుక్రవారం ఉదయం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం బాలుడు క్షేమంగా ఉన్నాడని తెలిపారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నట్లు పేర్కొన్నారు. ఎంత ఖర్చైనా బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. మరో రెండు రోజుల్లో క్షేమంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్ అయ్యే అవకాశం ఉందన్నారు. బాలుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పామని అన్నారు. అదే విధంగా తిరుమలలో మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మెట్ల మార్గంలో జంతవులు తిరిగే చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నడక మార్గంలో భద్రతను మరింతగా పెంచుతామని తెలిపారు. కాగా తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసిన విషయం తెలిసిందే. ఆదోనికి చెందిన భక్తులు అలిపిన నడకమార్గంలో వెళ్తండగా బుధవారం బాలుడిని చిరుత లాక్కెళ్లింది. భక్తులు కేకలు వేయడంతో అటవీ ప్రాంతంలో కొద్ది దూరంలో వదిలేసి వెళ్లింది. చిరుత దాడిలో బాలుడి చెవి వెనక, మెడకు, తలకు గాయాలయ్యాయి. పద్మావతి చిల్ట్రన్ ఆసుపత్రిలో బాలుడు కౌశిక్‌కు చికిత్స అందిస్తున్నారు. చదవండి: ‘శ్రీవాణి’పై ఆరోపణలు నమ్మవద్దు -
Video: చిరుతపులి బీభత్సం.. కోర్టు ఆవరణంలోకి ప్రవేశించి, ఆరుగురిపై దాడి
లక్నో: కోర్టు కాంప్లెక్స్‌లోకి చొరబడిన ఓ చిరుతపులి స్థానికంగా బీభత్సం సృష్టించింది. కోర్టు అంతా సంచరిస్తూ పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్ కోర్టులోని మొదటి అంతస్తులోకి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ చిరుతపలి ప్రవేశించింది. కోర్టు ప్రాంగణంలో చిరుతపులి కనిపించడంతో భయంతో అక్కడున్న వారంతా అటు ఇటు పరుగులు తీశారు. చిరుత నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొంతమంది లాయర్లు లాయర్లు తమ గదుల్లోకి వెళ్లి లాక్ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణంలో గందరగోళం నెలకొంది. చుట్టూ జనాలను చూసి బెంబేలెత్తిన చిరుతపులి మరింత రెచ్చిపోయింది. కర్రల సాయంతో తరిమికొట్టేందుకు వెళ్లిన లాయర్‌పై చిరుతపులిని దాడి చేసింది. అంతేగాక కోర్టు ఆవరణలో చెప్పులు కుట్టే వ్యక్తి, పోలీస్ అధికారితో సహా పలువురిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచింది. pic.twitter.com/OuxoVC3Bv4 — Utkarsh Singh (@utkarshs88) February 8, 2023 చిరుతపులి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాలుగు గంటలు శ్రమించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతపులిని నెట్లో బంధించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వద్ద చిరుతపులి సంచారం.. న్యాయవాదులను గాయపరిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. #WATCH | Several people injured as leopard enters Ghaziabad district court premises in Uttar Pradesh pic.twitter.com/ZYD0oPTtOl — ANI (@ANI) February 8, 2023 -
చిరుత దాడి.. ఇంటికి వస్తున్న చిన్నారిని ఎత్తుకెళ్లి చంపేసిన వైనం
సాక్షి, బెంగళూరు: గత కొద్ది రోజులుగా మైసూరు జిల్లాలో చిరుత దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. శుక్రవారం రాత్రి చిరుత దాడిలో ఓ వృద్ధురాలు బలైన ఘటన టి.నరిసిపుర తాలుకాలో మరిచిపోక ముందే మరోఘటన అదే తాలూకాలో చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలుడు చిరుత దాడిలో బలయ్యాడు. ఇంటికి వస్తుండగా ఈడ్చుకెళ్లిన చిరుత.. హోరళహళ్లి గ్రామానికి చెందిన దశకంఠ కుమారుడు జయంత్ (11) శనివారం సాయంత్రం అత్త ఇంటికి వెళ్లి బిస్కెట్ తీసుకుని ఇంటికి తిరిగి వస్తుండగా పొదల మాటున నక్కిన చిరుత ఒక్కసారిగా దాడి చేసి జయంత్‌ను అడవిలోకి ఈడ్చుకుని వెళ్లింది. బాలుడిని చంపి కొంత తినేసింది. గ్రామస్తులు వెంటనే స్పందించి రాత్రి దాకా గాలించారు. ఎక్కడ కనిపించలేదు. ఆదివారం తెల్లవారుజామున కిలోమీటరు దూరంలో బాలుడి మృతదేహం కనిపించింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరుతలకు బలి కావాల్సిందేనా అంటూ మండిపడ్డారు. టి నరసిపుర తాలూకాలో ఇప్పటి వరకు చిరుతల దాడిలో నలుగురు మృతి చెందారని, చిరుతను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. గ్రామంలో విషాదం నెలకొంది. చదవండి: కన్నతల్లితో మరో వ్యక్తి సహజీవనం.. సన్నిహితంగా నటించి -
ఫొటోషూట్‌కు వెళ్లిన మోడల్‌పై చిరుతల దాడి
జర్మనీకి చెందిన ప్రముఖ మోడల్‌పై రెండు చిరుత పులులు దాడి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తూర్పు జర్మనీలోని ఆటవీ ప్రాంతం సమీపంలో ఫొటోషూట్ నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సదరు మోడల్ పేరు జెస్సికా లీడోల్ఫ్(36). ప్రముఖ అంతర్జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. తూర్పు జర్మనీ సాక్సోనీ-అన్హాల్ట్ రాష్ట్రంలో నెబ్రా అనే ప్రైవేటు స్థలంలో ఓ వ్యక్తి జంతువుల ప్రదర్శన కోసం రిటైర్మెంట్ హోంను నడిపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చిరుతలు ఉండే బోనుకు సమీపంలో జెస్సికా ఫొటోషూట్ తీసుకుంటుండగా రెండు చిరుతలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆమెను హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందించినట్లు స్థానిక పోలీసులు మీడియాతో పేర్కొన్నారు. చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. నోటీసులు రాలేదంటున్న నటులు! ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సర్జరీ చేశారని పోలీసులు చెప్పినట్లు సదరు మీడియా వెల్లడించింది. అయితే తన తల, చెవులు, చెంపలపై చిరుతలు పదే పదే దాడి చేశాయని జెస్సికా స్థానిక మీడియాతో పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా సదరు రిటైర్ట్ హోం యజమాని బిర్గిట్ స్టేచ్‌ను పోలీసులు కోరగా ఆయన మాట్లాడేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో యజమానిపై కేసు నమోదు చేసి, ఈ హోంను అధికారికంగా నిర్వహిస్తున్నారా లేదా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. చదవండి: బిగ్‌బాస్ : అఫిషియల్ డేట్ వచ్చేసింది.. లిస్ట్ ఇదే! -
సింగిరికోనలో చిరుత దాడి
నారాయణవనం (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా నారాయణవనం మండలంలోని సింగిరికోన ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఆదివారం ఉదయం చిరుతపులి దాడిలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. వడమాలపేట మండలం లక్ష్మీపురానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు (58), మంజులాదేవి (48) ద్విచక్ర వాహనంపై సింగిరికోనకు లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. నారాయణవనం నుంచి సుమారు 6.5 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని ఆలయానికి అర కిలోమీటరు దూరంలో వెదురు పొదల వద్ద వీరిపై చిరుతపులి దాడి చేసింది. ద్విచక్ర వాహనంపై దూకిన చిరుత మంజులాదేవి తలపై పంజాతో గాయపరచింది. కుదుపుతో కింద పడిన సుబ్రహ్మణ్యంకు గాయాలయ్యాయి. అదే సమయంలో ఆలయ దర్శనానికి వస్తున్న భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుత సమీపంలోని పొదల్లోకి పారిపోయింది. తీవ్రంగా గాయపడిన మంజులాదేవి, సుబ్రహ్మణ్యంలను పుత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మంజులాదేవికి సుమారు 25 కుట్లు పడ్డాయి. ఈ ఘటన జరిగిన గంట వ్యవధిలో ఆలయ దర్శనానికి వెళ్తున్న నగరికి చెందిన దంపతులపై మరోసారి చిరుత దాడికి యత్నించింది. వీరు తప్పించుకుని ఆలయానికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, అటవీశాఖ సిబ్బంది సింగిరికోనలోని భక్తులను ఖాళీ చేయించారు. ప్రస్తుతం సింగిరికోనకు రాకపోకలను నిషేధించామని, తదుపరి అనుమతులు వచ్చేవరకు ఎవరూ రావొద్దని ఎస్ఐ ప్రియాంక మీడియా ద్వారా భక్తులకు సూచించారు. అటవీ సమీప గ్రామాల్లో వలంటీర్ల ద్వారా అప్రమత్తం చేస్తామని తెలిపారు. -
అయ్యో పాపం.. అదా రాణి!
శ్రీనగర్: మీర్ యాసిర్ అదా.. ముద్దులొలికే ఐదేళ్ల పాప. ఇరుగు పొరుగు అందరూ ఆమెను అదా రాణి అని పిలుస్తారు. అలా పిలిపించుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఈ నెల 3న అదా సోదరుడు అలీ ఏడో జన్మదినం. ఈ వేడుకను ఇంట్లోనే ఘనంగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సాయంత్రం కేక్ కట్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. చిన్నారి అదా రాణి తనకెంతో ప్రీతిపాత్రమైన బార్బీ డ్రెస్ ధరించింది. తనను తాను బుల్లి యువరాణిగా ఊహించుకుంటూ తలపై కిరీటం కూడా పెట్టుకుంది. బుడిబుడి నడకలు నడుస్తూ చిరునవ్వులు చిందిస్తూ అందంగా మెరిసిపోతున్న పాపను చూసి విధికి కూడా కన్నుకుట్టిందో ఏమో! ఇంతలో చిరుతపులి రూపంలో మృత్యువు హఠాత్తుగా వారి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించింది. పాపను నోట కరుచుకొని సమీపంలోని చిట్టడవిలోకి పరుగులు తీసింది. చిన్నారి అమ్మానాన్న, ఇతర కుటుంబ సభ్యులంతా ఈ ఊహించని పరిణామంతో ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. వెంటనే తేరుకొని అడవిలో పాప కోసం గాలించారు. స్థానికులు, అటవీ అధికారులు కూడా ఈ గాలింపులో పాల్గొన్నారు. అడవిలో ఒకచోట కొన్ని మాంసం ముద్దలు, రక్తం మరకలు, పాప అడుకొనే ఒక బొమ్మ మాత్రమే కనిపించాయి. తమ గారాల పట్టి చిరుత పంజాకు బలైపోవడంతో కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ శివారులో ఈ విషాదం చోటుచేసుకుంది. జనాభా విపరీతంగా పెరుగుతుండడం, అడవుల విస్తీర్ణం భారీగా తగ్గుతుండడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని నిపుణులు పేర్కొంటున్నారు. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివారులో ఓంపురా ప్రాంతంలోని ‘మిర్ హౌస్’లో చోటుచేసుకున్న విషాదాంతం ప్రతి ఒక్కరినీ కలచి వేస్తోంది. ఈ ఘటన సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది. చిన్నారి అదా రాణి మరణం పట్ల జనం సంతాపం వ్యక్తం చేస్తూ సందేశాలు పోస్టు చేస్తున్నారు. ఇంటి సమీపంలో ఉండేవారంతా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. బాలిక జ్ఞాపకాలను గుర్తుచేసుకొని కంటతడి పెడుతున్నారు. అప్పటివరకు తన అమ్మమ్మ ఇంట్లో ఉన్న చిన్నారి తన అన్న అలీ పుట్టినరోజు వేడుక కోసం తమ ఇల్లు మీర్ హౌస్‌కు వచ్చిందని, పై అంతస్తులో ముస్తాబైన తర్వాత కిందకు వచ్చి లాన్లో ఆడుకుంటుండగా చిరుత ఎత్తుకుపోయిందని ఆమె మామ ఐజాజ్ అహ్మద్ చెప్పారు. ఈ నెల 5న చిన్నారి అంత్యక్రియలు పూర్తి చేశారు. ముద్దుల పాపకు కన్నీటి వీడ్కోలు పలికారు. ‘‘స్వర్గం ఇప్పుడు మరింత అందమైన ప్రాంతంగా మారి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడక్కడ అదా రాణి ఉంది కదా’’ అని నెటిజన్ ఒకరు ట్విట్టర్లో పోస్టు చేశారు. పాప తండ్రి ముదాసిర్ థాయ్‌ల్యాండ్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. కరోనా వ్యాప్తి వల్ల గత ఏడాది ఇండియాకు తిరిగి వచ్చాడు. అదా రాణి శ్రీనగర్‌లోని డీపీఎస్ స్కూల్లో చదువుతోంది. చిరుత పులి దాడిలో ఆమె మరణం పట్ల సహచర విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారి మరణాన్ని జమ్మూకశ్మీర్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ పలువురు ఫారెస్టు అధికారులను సస్పెండ్ చేసింది. -
చెన్నై: ముగ్గురు వ్యక్తులపై చిరుత దాడి
-
కోడిని వేటాడుతూ ఇంట్లోకి.. ముగ్గురిపై చిరుత దాడి
సాక్షి, చెన్నై: ఓ ఇంట్లోకి చొరబడి ముగ్గురు వ్యక్తులపై చిరుత దాడి చేసింది. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని కలైపాలయం ఎర్థంగాళ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. వేలాయుధం, అతని భార్య ప్రేమ, మరో వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిరుత అర్థరాత్రి వారింట్లో ప్రవేశించింది. కోడిని వేటాడుతూ అటువైపుగా వచ్చి ఇంట్లో ఇరుక్కుపోయింది. ఇంతలో మనుషుల అలికిడి వినబడటంతో వారిపై దాడి చేసింది. కాగా క్షతగాత్రులు ప్రస్తుతం గుడియాత్తం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇంట్లో బంధించిన చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు వీరికి సహకరిస్తున్నారు. చదవండి: పెళ్లైన ఆర్నెళ్లకే గొడవలు; విరక్తి చెంది భర్తపై.. -
‘అదే పులి సహజ బుద్ది.. తప్పు లేదు’
-
భయానకం.. కాపాడాలని చూస్తే దాడి చేసింది!
భయానక ఘటన. ఓ చిరుత పులిని రక్షించాలని చూసిన జనంపై అది దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుశాంత్ నందా అనే అటవీ అధికారి గురువారం ట్విటర్లో ఈ వీడియోను షేర్ చేశాడు. గుంతలో పడిపోయిన చిరుత పులిని అటవీ అధికారులు, స్థానికులు కలిసి రెస్క్యు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అది గుంట నుంచి పైకి వచ్చింది. పైకి వచ్చిన పులి చూట్టు ఉన్న జనసముహాన్ని చూసి బెంబేలెత్తి ఒక్కసారిగా వారిపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఓ వ్యక్తిపైకి దూకి దాడి చేయడంతో అతడు కింద పడిపోయాడు. దీంతో ఆ వ్యక్తిని వదిలి మరో వ్యక్తిపై దాడి చేస్తూ.. అలా అక్కడి వారందరిని భయాందోళనకు గురి చేసింది. ఈ వీడియోకు ఇప్పటీ వరకూ దాదాపు 3 వేల వ్యూస్ రాగా, వందల్లో కామెంట్లు వచ్చాయి. (కరోనా సునామీ: ఒక్క రోజే 33 కేసులు) ఇక ఈ వీడియోకు సుశాంత్.. ‘భయానక రెస్క్యు.. ఓ చిరుత పులిని కాపాడాలని చూసిన జనంపై అది దాడి చేసి.. మరోమారు పులుల సహాజత్వాన్ని వారికి గుర్తుచేసింది. ఇందులో దాని తప్పు లేదు’ అంటూ ట్వీట్ చేశాడు. ‘ఇది వారి ముర్ఖత్వానికి నిదర్శనం. ఎందుకంటే ప్రకృతిలో చిరుత పులి ఎంత క్రూరమైనవో తెలిసి కూడా దానిని రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అది తన స్వభావాన్ని చూపించింది’ అని ‘ఆ పులికి ఎమైంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ( కరోనా: కలకలం రేపిన వియత్నాం బృందం ) -
ఘోరం: చిన్నారిని బలి తీసుకున్న చిరుత
సాక్షి, తుమకూరు : నరమాంసాన్ని రుచిమరిగిన ఓ చిరుత పులి ఓ చిన్నారిని బలితీసుకుంది. తుమకూరు తాలుకాలోని హెబ్బూరు సమీపంలో ఉన్న బైచేనహళ్లి తోటలో శనివారం సాయంత్రం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. శ్రీనివాస్, శిల్పా దంపతుల కుమార్తె చందన (2) ఇంటి ముందు ఆడుకుంటుండగా తోటలోకి ప్రవేశించిన పులి చిన్నారిని ఒక్కసారిగా నోట కరుచుకుని అడవిలోకి పారిపోయింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు బాలికను కాపాడటానికి పులితో పాటు పరుగులు తీసినా ఫలితం లేకపోయింది. అక్కడికి కొంత దూరంలో చిన్నారి మృతదేహం కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. (విషాదం: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..) చదవండి : పసి ప్రాణాన్ని బలిగొన్న ‘బాతు’! -
చిరుతపులి ముఖంపై పంచ్‌లు కురిపించింది!
కోల్‌కతా : చిరుతపులితో తలపడి తన ప్రాణాలను రక్షించుకోవటమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలిచిందో మహిళ. ఈ సంఘటన నార్త్ బెంగాల్‌లోని అలిపురుద్వార్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం ఉదయం అనితా నగషియా అనే మహిళ అలిపురుద్వార్.. కల్చిని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజభట్ టీ తోటలో పనిచేసుకుంటోంది. అదే సమయంలో అనిత వెనకాల నక్కి ఉన్న ఓ చిరుత పులి ఆమెపైకి దూకింది. ఈ హఠాత్పరిణామానికి మొదట భయపడ్డా.. ఆ వెంటనే ధైర్యంగా చిరుతపై తిరగబడింది. ఒట్టి చేతుల్తో దాని ముఖంపై పిడిగుద్దులు గుద్దటం ప్రారంభించింది. దాదాపు ఐదు నిమిషాల పాటు చిరుతకు, మహిళ మధ్య పోరాటం జరిగింది. మొదట్లో చిరుత ఆమె దాడికి స్పందించకపోయినా, చివరకు దెబ్బలు తాళలేక తోక ముడిచింది. అక్కడినుంచి పరుగులు పెట్టింది. అనంతరం తీవ్ర గాయాలపాలైన అనితను తోటి పనివాళ్లు దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. కాగా, టీ తోటలలో చిరుతపులుల దాడులు మామూలైపోయాయి. నిత్యం ఎక్కడో ఓ చోట ఎవరో ఒకరు చిరుతల బారిన పడుతూనే ఉన్నారు. గత డిసెంబర్‌లోనూ టీ తోటలో పనిచేసుకుంటున్న ఓ 17ఏళ్ల యువతిపై చిరుతపులి దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన సంగతి తెలిసిందే. -
ముళ్లపంది దెబ్బకు.. విలవిల్లాడిన చిరుత!
చిరుత పులిని చూస్తే ఏ జంతువైనా, మనిషి అయినా భయపడి పారిపోతారు. ఇక అది దాడికి దిగితే ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీయాల్సిందే. అయితే ఓ రహదారిపై ముళ్ల పంది మాత్రం తన ముళ్లతో చిరుతను బెంబేలెత్తించింది. పందిపై దాడికి దిగిన ఈ చిరుత చివరకు తగ్గి వెనుదిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. అడవి మార్గం గుండా వెళుతున్న ముళ్ల పందిని చూసి చిరుత దానిపై దాడి చేసిన వీడియోను.. పర్విన్ కశ్వాన్ అనే ఓ ఆటవీ అధికారి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ‘చిరుతకు ముళ్లపందికి మధ్య పోరాటం.. చివరకు చిరుత గుణపాఠాన్ని నేర్చుకుంది’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటి వరకు వేలల్లో వ్యూస్, వందల్లో కామెంట్లు వచ్చాయి. వీడియో ప్రకారం... తనపై దాడి చేస్తున్న చిరుతను చూసి ముళ్లపంది భయపడలేదు. ఎందుకంటే దానితో పెట్టుకుంటే ఎమౌతుందో చిరుతకే తెలిస్తుందనుకుందో ఏమో మరి.. అది వెంటపడుతున్నా పరిగెత్తలేదు. ఇక దానిని చంపి తీనాలని చూసిన చిరుత పులికి చివరకు తగిన శాస్తి జరిగింది. పందిని కొరకడానికి ప్రయత్నించిన చిరుత నోటికి దాని ముళ్లు గుచ్చుకోవడంతో నొప్పితో విలవిలలాడింది. చివరకు తిన్నగా తన దారిన తాను వెళ్లిపోయింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు... ‘అయ్యో! చిరుతకు ముల్లు గట్టిగా గుచ్చుకుని ఉంటుంది , ‘బాబోయ్.. రోమాలు నిక్కపోడిచే పోరాటం’ అని.. మరికొందరు చిరుతకు తగిన శాస్తి జరిగిందని అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. -
చిరుత దాడిలో మూడు దూడలు మృతి
ఆమనగల్లు: చిరుత మళ్లీ పంజా విసిరింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి గ్రామ సమీపంలో ఉన్న మూడు దూడలపై ఆదివారం రాత్రి చిరుత దాడి చేసింది. ఈ దాడిలో దూడ అక్కడికక్కడే మృతిచెందగా మరో రెండు దూడలు సాయంత్రం మృతిచెందాయి. మంగళపల్లి గ్రామ సమీపంలో బాపురెడ్డి, శ్రీను తమ వ్యవసాయ పొలాల వద్ద పశువులను ఉంచారు. తెల్లవారుజామున రైతులు వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిచూడగా దూడ చనిపోగా మిగతా రెండు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. సమీపంలో ఉన్న పాదముద్రలను చూసి చిరుత దాడి చేసినట్లుగా రైతులు గుర్తించారు. రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని మంగళపల్లి సర్పంచ్ నర్సింహారెడ్డి పరిశీలించారు. చిరుత దాడిలో ఇప్పటికే ఆరు ఆవు దూడలు మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చిరుతను త్వరగా బంధించాలని రైతులు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు. -
చిరుత దాడి నుంచి తమ్ముడిని రక్షించిన బాలిక
పారి: నాలుగేళ్ల తన తమ్ముడిని ఓ చిరుతపులి బారినుంచి కాపాడిందో 11ఏళ్ల అక్క. ఉత్తరాఖండ్‌లోని దేవ్కుందైతల్లి గ్రామంలో జరిగిందీ ఘటన. ఈ నెల నాలుగోతేదీన నాలుగేళ్ళ తమ్ముడితో కలసి రాఖీ (11) ఆడుకుంటోంది. ఇంతలో ఒక్కసారిగా ఒక చిరుత తన తమ్ముడిపై దాడి చేసింది. అయితే రాఖీ ఏమాత్రం ఆ చిరుతకు భయపడకుండా ఎదురొడ్డి ధైర్యంగా నిలబడింది. చిరుత లాక్కెళ్లకుండా రాఖీ తన తమ్ముడిని మీదపడి అడ్డుగా నిలబడింది. ఈ క్రమంలో రాఖీ మెడపై తీవ్రగాయాలయ్యాయి. ఇంతలో గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో చిరుత పక్కనే ఉన్న అడవిలోకి ఉడాయించింది. ప్రస్తుతం బాలిక ఢిల్లీలోని రామ్మనోహర్ లోహియా ఆస్పత్రిలోకి చికిత్సపొందుతోంది. వైద్య ఖర్చులకు రాష్ట్రమంత్రి బాలికకు రూ.1లక్ష ఆర్థికసాయం చేశారు. -
చిరుత దాడి : తమ్ముడిని కాపాడింది కానీ..
డెహ్రాడూన్ : చిరుత బారి నుంచి తమ్ముడి ప్రాణాలను కాపాడటం కోసం ఓ అక్క తన ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. తెలివితో ధైర్యంగా తన తమ్ముడిని రక్షించింది.. కానీ చిరుత దాడిలో తను తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన అక్టోబర్ 4వ తేదీన ఉత్తరాఖండ్ పౌరి జిల్లాలోని దేవకుండి తల్లి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో 11 ఏళ్ల రాఖీ, నాలుగేళ్ల తన తమ్ముడితో కలిసి ఆడుకుంటుండగా.. వారిపై చిరుత దాడి చేసింది. అయితే చిరుత దాడి చేస్తుంటే రాఖీ అక్కడి నుంచి పారిపోకుండా అక్కడే ఉండిపోయింది. తన చిన్నారి తమ్ముడిపై పడుకుని చిరుత అతనిపై దాడి చేయకుండా చేసింది. అలా తన తమ్ముడిని కాపాడింది. కానీ రాఖీ మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. చిరుత పిల్లలపై దాడి చేస్తుందని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకోని శబ్ధాలు చేయడంతో.. చిరుత అడవిలోకి పారిపోయింది. వెంటనే గ్రామస్తులు రాఖీని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర గాయాల దృష్ట్యా రాఖీకి మెరుగైన వైద్యం అందించాల్సి ఉందని అక్కడి వైద్యులు తెలుపడంతో.. బాలిక బంధువులు ఆమెను ఢిల్లీలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అక్కడ సిబ్బంది రాఖీని ఆస్పత్రిలో చేర్చుకోలేదు. దీంతో అతి కష్టం మీద రాఖీ బంధువులు ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సత్పాల్ మహారాజ్‌ను కలిసి పరిస్థితిని వివరించారు. మంత్రి చొరవతో రాఖీని 7వ తేదీన ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం రాఖీ ప్రాణాపాయం నుంచి బయటపడినట్టు ఆమె బంధువులు తెలిపారు. దీనిపై సత్పాల్ ఓఎస్స్డీ అభిషేక్ శర్మ మాట్లాడుతూ.. బాలిక వైద్యం కోసం మంత్రి ఆ కుటుంబానికి లక్ష రూపాయలు అందజేశారని.. ఇతర అవసరమై ఖర్చులు కూడా భరిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. అలాగే ఢిల్లీలో ఉన్న బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్.. తమ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు. బాలిక చూపిన ధైర్యాన్ని అభినందించారు. -
జిత్తులమారి చిరుత!
సాక్షి, యాచారం: చిరుత రూటు మార్చింది. యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని అటవీప్రాంతంలో తలదాచుకుంటూ సమీప పొలాల్లో కట్టేసిన మూగజీవాలపై ఏడాదిగా దాడులు చేస్తోంది. చిరుత వరుసగా పంజా విసురుతుండడంతో ఎలాగైనా దానిని బంధించాలని అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం కనిపించలేదు. ఏకంగా జూపార్కు నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన షూటర్స్‌ను రప్పించి మత్తు మందుతో చిరుతపై షూట్ చేయించి పట్టుకుందామన్నా ప్రయోజనం దక్కలేదు. యాచారం, కడ్తాల, మాడ్గుల, ఆమనగల్లు మండలాల సరిహద్దులో దాదాపు 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం విస్తరించి ఉండడంతో తప్పించుకోవడం దానికి సులువుగా మారింది. ఆరు నెలలుగా ఫారెస్టు అధికారులు దానిని పట్టుకోవడానికి తీవ్రంగా యత్నిస్తున్న విషయం తెలిసిందే. రెండు మండలాల్లో 25 చోట్ల గొర్రెలు, మేకలు, దూడలపై దాడులు చేసి చంపేసింది. కాగా, సీసీ కెమెరాల్లో దాని కదలికలు నిక్షిప్తమయ్యాయి. బోన్లకు మాత్రం చిక్కలేదు. అటవీప్రాంతంలో ఒకే చిరుత ఉందా... లేదా రెండు, మూడు ఉన్నాయా అనే విషయం తెలుసుకోవడం కోసం అటవీ ప్రాంతంలో పలు చోట్ల సీసీ కెమెరాలు బిగించినట్లు ఫారెస్టు అధికారి సత్యనారాయణ తెలిపారు. వర్షాలు కురుస్తుండడంతో అటవీప్రాంతం పచ్చగా మారిందన్నారు. చిరుత కోసం ఏర్పాటు చేసిన బోను తనిఖీలతోనే రూటు మార్చిందా..? పల్లెచెల్క తండాలో రైతులకు అవగాహన కల్పిస్తున్న ఫారెస్టు అధికారులు ఏడాది కాలంగా యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో దాడులు చేసిన చిరుత రైతులకు, అటవీశాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీంతో చేసేదేమీ లేక అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల్లో రైతులను చైతన్యం చేసి అటవీ ప్రాంతం సమీపంలోని పొలాల్లో గొర్రెలు, మేకలు, పశువులను కట్టేయకుండా అవగాహన కల్పించారు. అడవిలో తిరుగుతున్న చిరుత మూగజీవాలపై దాడులు చేయకుండా అరికట్టేందుకు యాచారం మండల పరిధిలోని తాడిపర్తి, కుర్మిద్ద అట ప్రాంతంతోపాటు కడ్తాల మండల పరిధిలోని చరికొండ, పల్లెచల్కతండా అటవీ ప్రాంతంలో 34 జింకలను ఇటీవల ఫారెస్టు అధికారులు వదిలేశారు. జింకలను వదిలినప్పటి నుంచి అది యాచారం, కడ్తాల మండలాల్లో దాడులు జరగలేదు. తాజాగా యాచారం, కడ్తాల మండలాల పరిధిలోని అటవీప్రాంతం వదిలేసి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమన్‌గల్లు మండల పరిధిలోని మంగల్‌పల్లి, చంద్రయ్యపల్లి తండా సమీపంలోని పొలాల్లో కట్టేసి ఉన్న పశువులపై దాడులు చేయడం ఆరంభించింది. ఆమనగల్లు మండలం మంగళపల్లి సమీపంలో సోమవారం రాత్రి పొలాల వద్ద ఉన్న దూడను చంపి దాదాపు కిలోమీటరు దూరం వరకు చిరుత లాక్కెళ్లింది. మూడు రోజుల క్రితం ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని చంద్రాయణపల్లి తండాలో రైతు బిచ్చానాయక్‌కు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. చిరుత అటవీ ప్రాంతంలో వదిలిన జింకలను కనిపెట్దిందా.. లేదా ఆహారం కోసమే ఆమనగల్లు మండల పరిధిలోని పొలాల్లోని పశువులపై దాడి చేస్తోందా..? లేదా వచ్చిన దారిగుండా నల్లమల్ల అటవీ ప్రాంతంలోకి రూటు మార్చిందా అనే విషయం తెలియడం లేదు. వరుస దాడులతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రత్యేక టీంలను పంపాం ఆమన్‌గల్లు మండలంలోని పలు గ్రామాల సమీపంలో చిరుత సంచరిస్తూ పశువులపై దాడులు చేస్తోంది. దీంతో కందుకూరు డివిజన్ నుంచి రెండు ప్రత్యేక టీం బృందాలను ఆమనగల్లుకు పంపాం. దాడులు చేసిన చోటుకు చిరుత మళ్లీ వస్తుందనే ఉద్దేశంతో సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశాం. పులి నిత్యం ఆహారం కోసం 25 కిలోమీటర్ల మేర సంచరిస్తోంది. ఈక్రమంలో అది నల్లమల్ల అడవులకు వెళ్లే అవకాశం లేకపోలేదు. రైతులు అప్రమత్తంగా ఉండాలి. – సత్యనారాయణ, అటవీశాఖ రేంజ్ అధికారి మరోసారి చిరుత పంజా చిరుత దాడిలో మృతిచెందిన దూడను పరిశీలిస్తున్న సర్పంచ్ నర్సింహారెడ్డి సాక్షి, ఆమనగల్లు: ఆమనగల్లు మండలంలో మరోసారి చిరుత పంజా విసిరింది. మంగళపల్లి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి వ్యవసాయ పొలాల వద్ద ఉన్న మూగజీవాలపై చిరుత దాడి చేసింది. ఒక దూడను చంపి దాదాపు కిలోమీటర్ దూరం లాక్కెళ్లి వదిలేసింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని మంగళపల్లి గ్రామ సమీపంలో తిప్పిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, పర్వతాలు తదితర రైతులు తమ పాడి పశువులను వ్యవసాయ పొలం వద్ద షెడ్డుల్లో కట్టేశారు. సోమవారం రాత్రి శ్రీనివాస్‌రెడ్డి, పర్వతాలుకు చెందిన ఆవులపై చిరుత దాడి చేసి స్వల్పంగా గాయపరిచింది. అనంతరం తిప్పిరెడ్డి వెంకట్‌రెడ్డికి చెందిన రెండు బర్రె దూడలపై దాడిచేసింది. ఇందులో దూడ గొంతును చిరుత తీవ్రంగా గాయపర్చింది. మరో దూడను దాదాపు కిలోమీటరు దూరం లాక్కెళ్లి హతమార్చింది. ఉదయాన్నే పొలాల వద్దకు వెళ్లిన రైతులు పశువులపై చిరుత దాడి చేయడాన్ని గుర్తించారు. వెంటనే సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించారు. అధికారుల సందర్శన.. మంగళపల్లి గ్రామ సమీపంలో చిరుత మూగజీవాలపై దాడి చేసిన సంఘటనా స్థలాన్ని ఆమనగల్లు ఎఫ్ఆర్ఓ కమాలుద్దీన్, సర్పంచ్ తిప్పిరెడ్డి నర్సింహారెడ్డి, స్థానిక నాయకులు సందర్శించారు. చిరుత దాడిలో మృతిచెందిన దూడ, తీవ్రంగా గాయపడిన బర్రె దూడలను వారు పరిశీలించారు. చిరుతను బంధించడానికి బోను ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ రేంజ్ అధికారి కమాలుద్దీన్ తెలిపారు. మూడు రోజుల క్రితం చంద్రాయణపల్లితండా సమీపంలో బోను, నాలుగు అధునాతన కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. మంగళపల్లి గ్రామసమీపంలో మంగళవారం రాత్రికి చిరుతను బంధించడానికి బోను ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. రైతులు భయాందోళనలు చెందవద్దని చిరుతను బంధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. చంద్రాయణపల్లి సమీపంలో చెట్టుకు ఏర్పాటు చేసిన కెమెరా -
బెంబేలెత్తిస్తున్న చిరుత
తూర్పుగోదావరి , ఆత్రేయపురం (కొత్తపేట): ఆత్రేయపురం, రావులపాలెం మండలాల వాసులను చిరుతపులి సంచారం వార్త బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఆత్రేయపురం మండలం అంకంపాలెం ఇటుక బట్టీల వద్ద దాని అడుగుల ముద్రలు పడినట్టు బట్టీల యజమానులు తెలిపారు. చిరుత సంచరిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరిస్తూ టాంటాంలు వేయిస్తున్నారు. ఆ నేపథ్యంలో 7వరోజు ఆదివారం పోలీసు, అటవీశాఖ అధికారులు చిరుత కోసం గాలింపు చర్యలను కొనసాగించారు. అంకంపాలెం, ర్యాలి గ్రామాల సమీప ప్రాంతాల్లో చిరుత పులి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా చేపట్టారు. వారు డ్రోన్ కెమెరాలతో లంక ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. మొదటి రోజు ఈ నెల 4వ తేదీన అంకంపాలెంలో కనిపించిన చిరుత ఆతర్వాత ఎవరికీ కనిపించలేదు. దాని పాద ముద్రల ఆధారంగా ఈప్రాంతంలో అధికారులు ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నారు.చిరుత భయంతో కూలీలు పనులకు రాకపోవడంతో వ్యవసాయ పనులకు అంతరాయం ఏర్పడింది. చిరుత దొరికే వరకు ప్రజల్లో భయాందోళనలు తప్పవు. అవి బావురుపిల్లి అడుగుజాడలు రావులపాలెం/ఆలమూరు (కొత్తపేట): ఈ నెల నాలుగున అంకంపాలెంలో ప్రత్యక్షమైన చిరుతపులి శుక్రవారం రావులపాలెం మండలంలోని ఊబలంక లంక భూముల్లో కనిపించినట్టు రైతు మేడపాటి సాంబశివారెడ్డి రావులపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చేనుకు నీరు పెడుతుండగా చిరుతపులిని చూశానని అతను పేర్కొన్నాడు. దాంతో పోలీసులు అటవీశాఖ అధికారులకు ఆ సమాచారం అందించగా వారు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ఉన్న పాదముద్రలు చిరుతపులివి కావని, అవి బావురుపిల్లి అడుగులేనని తేల్చి చెప్పారు. రావులపాలెం, ఆత్రేయపురం మండలాల్లోని లంక భూముల్లోకి పనులు చేసుకునేందుకు అప్పుడే వెళ్లవద్దని అధికారులు సూచిస్తుండడంతో రైతులకు ఏమి చేయాలో తోచడం లేదు. ఇదిలా ఉండగా చిరుతపులి తమ గ్రామంలోకి రావచ్చని ఆలమూరు మండలం బడుగువానిలంక గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఊబలంక– బడుగువాని లంక గ్రామాల మధ్య గోదావరి పాయ ఉంది. అందులో నీరు లేకపోవడంతో ఏక్షణంలోనైనా చిరుతపులి తమ పంట పొలాలు, తోటల్లోకి ప్రవేశించే అవకాశం లేకపోలేదని అధికారులు చెబుతున్నారు. ఆలమూరు ఎస్సై టి.క్రాంతికుమార్ లంక గ్రామాల రైతులను అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే లంక గ్రామాల పరిధిలో దండోరా వేయించారు. -
చండీగఢ్‌లో చిరుత దాడి.. పరుగులు తీసిన జనం
-
చిరుత ఆకస్మిక దాడి.. పరుగులు తీసిన జనం
చండీగఢ్ : పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో చిరుత బీభత్సం సృష్టించింది. జనావాసాలపై విరుచుకుపడి ప్రజలను గాయపరిచింది. చివరకు అటవీ అధికారులు ట్రాంక్విలైజర్ గన్ను ఉపయోగించి చిరుతను అదుపు చేయడంతో జనాలు ఊపిరి పీల్చుకున్నారు. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. కాగా హిమాచల్ ప్రదేశ్ నుంచి పారిపోయిన ఈ చిరుత అటవీ మార్గం గుండా జలంధర్ చేరుకుని ఉంటుందని పంజాబ్ అటవీ శాఖ అధికారులు అభిప్రాయపడ్డారు. వల వేసి పట్టుకుందామని ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదని.. అందుకే మత్తులో దించి దానిని బంధించినట్లు తెలిపారు. అనంతరం చాట్‌బిర్ జూకు తరలించినట్లు పేర్కొన్నారు. -
తల్లి చూస్తుండగానే బాలుడిని ఈడ్చుకెళ్లిన..
సాక్షి, న్యూఢిల్లీ : ముక్కపచ్చలారని మూడేళ్ల బాలుడిపై చిరుతపులి పంజా విసిరింది. అతి దారుణంగా హతమార్చింది. తల్లితో పాటు వంటగదిలో ఉన్న వసీం అక్రమ్ (3)ను ఇంట్లోకి ప్రవేశించిన చిరుత ఆమె కళ్లెదుటే పిల్లాడ్ని నోట కరుచుకుపోయింది. ఇంటి సమీపంలోని దట్టమైన అడవిలోకి తీసుకెళ్లి విగతజీవుడిని చేసింది. అటవీశాఖ సిబ్బంది చిరుతను వలపన్ని పట్టుకుందామని చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. బాలుడు అదృశ్యమైన 15 గంటల తర్వాత అతని శవం మాత్రం కనుగొన్నారు. తల, మొండెం వేరుచేసి ఉన్న చిన్నారి శవం చూసి ఆ గ్రామమంతా కన్నీరుమున్నీరైంది. ఈ ఘటన రియాజీలోని మహోర్ ప్రాంతంలో మంగళవారం చోటుచేసుకుంది. అలసత్వం ప్రదర్శించిన అటవీ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. బాలుడిని చంపిన చిరుత ఆచూకీ ఈ ఉదయం లభించిందనీ, కానీ దాన్ని పట్టుకోలేకపోయామని జమ్మూ ప్రాంతీయ వన్యప్రాణి అధికారి తాహిర్ అహ్మద్ షాల్ తెలిపారు. క్రూర జంతువుల దాడుల నుంచి రక్షించుకునేందుకు ప్రజల్ని అప్రమత్తం చేశామని అన్నారు. అయితే, వాటి (వన్య ప్రాణులు) ఆవాసమైన అడవిలోకి ప్రవేశించడమే ఈ అనర్థానికి మూలమని వ్యాఖ్యానించారు. కాగా, గడచిన రెండు నెలల్లో ఇది మూడో ఘటన. డిసెంబర్ 7న ఎనిమిదేళ్ల బాలుడిని ఓ చిరుత పొట్టనబెట్టుకుంది. గతవారం యోగా చేసుకుంటున్న ఓ బౌద్ధ గురువుపై చిరుత దాడి చేసి హతమార్చింది. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా అడవులను నరికివేయడంతోనే ఈ దుస్థితి దాపురించిందనీ, అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు ప్రజల ప్రాణాలను తీసేవి కావని పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చిక్కని చిరుత
సాక్షి, మెదక్‌జోన్: రెండు సంవత్సరాలుగా చిరుతపులి ఇప్పటి వరకు 67 జీవాలను హతమార్చింది. దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అటవీ అధికారులను ముప్పుతిప్పలు పెడుతోంది. గడిచిన ఏడాదిన్నర కాలంగా 67 జీవాలను హతమార్చగా అందులో మేకలు, లేగదూడలు, దూడ్డెలున్నాయి. పంట పొలాల వద్ద పశువుల పాకలో కట్టేసిన జీవాలే లక్ష్యంగా చంపుకుతింటుంది. ముఖ్యంగా మెదక్, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, హవేళిఘణాపూర్ మండలాల్లో ఈ పులి వేట సాగుతోంది. ఇందులో ఒక్కో బాధితుడికి రూ. 1,500 నుంచి రూ. 2,000 వేల వరకు పరిహారం చెల్లించగా ఆవుదూడలు, దూడ్డెలకు రూ. 3వేల నుంచి 10వేల వరకు పరిహారాన్ని అటవీ అధికారులు చెల్లించారు. ప్రతి యేటా అటవీ అభివృద్ధికి వచ్చే బడ్జెట్లో సగం చిరుతపులి చంపుకుతినే జీవాల బాధితులకు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. మృతి చందిన వాటిలో ఇప్పటి వరకు 62 జీవాలకు పరిహారం చెల్లించగా, మరో ఐదింటికి చెల్లించాల్సి ఉంది. చిరుతను బంధించేందుకు గతేడాదిగా ఫారెస్ట్ అధికారులు చేయని ప్రయత్నం లేదు. పులులను బంధించే నిష్ణాతులైన శిక్షణ పొందిన వారిని హైదరాబాద్ నుంచి రప్పించి రామాయంపేట అడవుల్లో అనేక చోట్ల బోన్లను సైతం ఏర్పాటు చేశారు. దానికి మేకలు, దూడలను ఎరవేసినప్పటికీ ఆ పులి అటవీ అధికారుల కళ్లుగప్పి తిరుగి బోనుకు చిక్కని పరిస్థితి. రెండు నెలలుగా స్తబ్దుగా ఉన్న చిరుత ఇటీవల మళ్లీ రెచ్చిపోయి వేట మొదలుపెట్టింది. ఇటీవల చిన్నశంకరంపేట మండలంలోని కొండాపూర్‌లో పశువుల మందపై దాడి చేసి దూడెను ఎత్తుకెళ్లింది. ఇలా నిత్యం 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని అడవుల్లో ఈ చిరుత సంచరిస్తుందని తెలుస్తోంది. గుర్తించిన అధికారులు దాన్ని బంధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒంటరి జీవాలే టార్గెట్.. బోరుబావులు, పంటపొలాల వద్ద ఒంటరిగా కట్టేసే లేగదూడలు, మేకలు ఆవుదూడలను చంపుకుతింటుంది. ఎక్కువ శాతం ఊరికి చివరలోని పంటపొలాల్లో కట్టేసినవాటినే టార్గెట్ చేస్తోంది. కానీ ఇప్పటి వరకు గ్రామాల్లో చొరబడి జీవాలను చంపిన దాఖాలాలు లేవు. కాగా రైతులు నిత్యం పంటపొలాల వద్దే ఎక్కువ సమయం గడుపుతున్నందున వారు పాడిపశువులను అక్కడే కట్టేస్తారు. ఈ క్రమంలో పులి వాటిని వెంటాడి చంపుతుండడంతో ఒంటరిగా పంటపొలాల వద్దకు వెళ్లాలంటేనే బాధిత మండలాల రైతులు జంకుతున్నారు. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం.. చిరుతపులి ఎక్కువగా ఊరు బయట కట్టేసిన జీవాలపై మాత్రమే దాడి చేసి చంపుకుతింటుంది. కాగా పశువులు, మేకలను ఊరి చివర కాకుండా గ్రామాల్లోనే కట్టేయాలి. ఇప్పటి వరకు చిరుత 67 జీవాలను చంపింది. 62 జీవాలకు రూ. 4.5లక్షల పరిహారం చెల్లించాం. చిరుతను పట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాం. –పద్మజారాణి, అటవీ శాఖ జిల్లా అధికారి -
పశువులంటే ప్రాణం... పొద్దుగాలే లేచి
సాక్షి, డెహ్రాడూన్ : అది అల్మోరా జిల్లా ప్రభుత్వాసుపత్రి.. ప్రతీ నాలుగైదు రోజులకోకసారి తీవ్ర గాయాలతో మహిళలు ఆస్పత్రిలో చేరుతున్నారు. వారంతా చిరుతల దాడుల్లోనే గాయపడి అక్కడ చేరటం విశేషం. వీరంతా తమ పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లిన సమయంలోనే ఇలాంటి దాడులు చోటుచేసుకోవటం విశేషం. పది రోజుల క్రితం ఆల్మోరా జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిల్ఖా గ్రామానికి చెందిన పూజా దేవి పశువుల కోసం గడ్డి తెచ్చేందుకు సమీపంలోని అడవికి వెళ్లింది. అక్కడ ఓ చిరుతపులి ఆమెపై దాడి చేయగా.. అక్కడే ఉన్న ఉమా దేవి ఆమెను రక్షించే క్రమంలో గాయపడింది. వారి కేకలు విన్న చుట్టు పక్కల స్థానికులు పరిగెత్తుకుంటూ వెళ్లి చిరుతను తరిమారు. ఇద్దరూ తీవ్రంగా గాయపడినప్పటికీ.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఇది తమకు చాలా ఏళ్లుగా అలవాటైపోయిందని ఉమా దేవి చెబుతున్నారు. మాకు పశువులంటే ప్రాణం. అవే మాకు జీవనాధారం. గడ్డి లేకపోతే అవి ఎలా బతుకుతాయి. అందుకే అడవికి వెళ్లక తప్పటం లేదు అని ఆమె చెప్పారు. కొండ ప్రాంతంలో జీవనాధరం లేకపోతే చాలా కష్టం. గిరిజనులు.. పైగా నిరక్షరాస్యులు. వేరే పని లేకపోవటంతో అక్కడ చాలా మట్టుకు పశు సంరక్షణ మీదే ఆధారపడి జీవిస్తున్నారు. వారి కుటుంబాలకు తిండి పెట్టే మూగ జీవాల కోసం ప్రాణాలను పణంగా పెడుతున్నారు అని జోయ్ హల్కే అనే మహిళా షూటర్ చెబుతున్నారు. సమస్య దశాబ్దం పైదే ... ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా 600 మంద చిరుతల బారిన పడి చనిపోగా, 3100 మంది గాయపడ్డారు. అంటే సగటున ఏడాదికి 35 మంది చిరుత పంజాకు బలవుతున్నారన్న మాట. వీరిలో 30 శాతం మంది పురుషులు, 20 శాతం మంది పిల్లలు, ఇక మిగిలిన 50 శాతం మహిళలే కావటం గమనార్హం. ఆల్మోరా, పౌరీ జిల్లాల్లో ఈ దాడులు ఏటా ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇప్పటిదాకా 150 చిరుతలను మ్యాన్ ఈటర్లుగా గుర్తించి వాటిలో 40ని మట్టుపెట్టగలిగారు. మరో 40 చిరుతలను బంధించగలిగారు. గ్రామస్థులను అడవుల్లోకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నయ మార్గాలు లేకపోవటంతో వాళ్లు వాళ్ల జీవితాలను పణంగా పెడుతున్నారని దిగ్విజయ్ సింగ్ ఖటి అనే అటవీ అధికారి చెబుతున్నారు. -
కవరేజికి వెళ్తే.. చిరుత దాడి చేసింది!
తలుచుకుంటేనే గుండె ఝల్లుమనే ఘటన ఇది. పది అడుగుల దూరంలో చిరుతపులి ఉండగా.. దాన్ని ఫొటో తీద్దామని వెళ్లారు వాళ్లు. అంత ధైర్యం ఎందుకంటే, అప్పటికే అటవీ శాఖాధికారులు దానికి మత్తు ఇంజెక్షన్లు ఇచ్చేశారు. దాంతో అది మత్తుగా పడి ఉందని అనుకున్నారు. కానీ అంతలోనే అది కాస్తా లేచి.. ఫొటోలు తీయడానికి వచ్చిన రిపోర్టర్ల మీద దాడిచేసింది. ఇద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఒళ్లు జలదరించే ఈ ఘటన పశ్చిమబెంగాల్లోని అలీపుర్దార్ జిల్లా ఫలకతాలో జరిగింది. ఎయ్ సమయ్ అనే పత్రికకు చెందిన జయా చక్రవర్తి అనే రిపోర్టర్ ఈ ఘటనలో గాయపడింది. ఆమెకు యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అదే గ్రామంలో అంతకుముందు రైతు జంటపై ఈ చిరుత దాడిచేసింది. దాన్ని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దాడి తర్వాత కూడా అధికారులు, గ్రామస్తులు కలిసి చిరుతను పట్టుకున్నారు. కానీ జయా చక్రవర్తి మాత్రం ఈ దాడితో ఒక్కసారిగా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒక్క క్షణం పాటు తన ప్రాణాలు పోయాయనే అనుకున్నట్లు చెప్పారు. అది తన ఎడమ చేతిని తినేయడానికి ప్రయత్నించిందని వివరించారు. అక్కడున్న గ్రామస్తులలో ఒకరు కర్రతో చిరుత తలమీద కొట్టడంతో అది జయను వదిలేసింది. నిజానికి చిరుతపులి ఒక వెదురు తోటలోకి ప్రవేశించినప్పుడు గ్రామస్తులు దాన్ని గుర్తించి అటవీ శాఖాధికారులకు చెప్పారు. దాంతో వాళ్లు దాన్ని మత్తు ఇంజెక్షన్లతో షూట్ చేశారు. దాంతో అంతా అది పడుకుందనే అనుకున్నారు. కానీ, అంతలోనే అది ఒక్కసారిగా లేచి జయా చక్రవర్తితో పాటు ఆమె సహోద్యోగి సుధీర్ బర్మన్పై కూడా దాడిచేసింది. అతడికి వీపుమీద, మెడ మీద 8 కుట్లు పడ్డాయి. -
ఈ అబ్బాయి.. చిరుతయ్యాడు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాలో ఓ బాలుడు మృత్యువు అంచులదాకా వెళ్లి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ బాలుడ్ని ఇప్పుడు అందరూ చిరుత అని పిలుస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. కేప్ టౌన్లో జస్టిన్ అనే వ్యక్తి తన ఇద్దరు కొడుకులతో కలసి పార్క్‌కు వెళ్లాడు. పార్క్‌లో కొడుకులిద్దరూ ఆడుకుంటుండగా, జస్టిన్ ఎదుటే చిరుత వారిపై దాడి చేసింది. కెల్లన్ డెన్నీ అనే ఆరేళ్ల బాలుడిని చిరుత నోటితో కరుచుకుని లాక్కెళ్లింది. జస్టిన్ తన కొడుకును రక్షించుకునేందుకు వెంటనే చిరుతను వెంబడించాడు. చిరుత 100 అడుగుల దూరం లాక్కెళ్లిన తర్వాత డెన్నీని వదిలేసిపారిపోయింది. చిరుత కొరకడంతో డెన్నీ మెడ, చేతులు, భుజాలపై గాయాలయ్యాయి. జస్టిన్ తన కొడుకును దగ్గరలోని ఓ కుటీరంలోకి తీసుకెళ్లి గాయాలకు చికిత్స చేశాడు. ఆ తర్వాత ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించడంతో కోలుకున్నాడు. ఈ ఘటన తమ కుటుంబానికి ఎంతో బాధకలిగించిందని జస్టిన్ వాపోయాడు. చిరుత దాడిలో తీవ్రంగా గాయపడినా ప్రాణాలతో బయటపడిన డెన్నీని ఇప్పుడు అందరూ 'చిరుత బాలుడు' అని పిలుస్తున్నారు. గత 40 ఏళ్లుగా ఇలాంటి దాడి జరగలేదని పార్క్ మేనేజర్ చెప్పాడు. -
పాలవాయిలో చిరుత కలకలం
కల్యాణదుర్గం : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం పాయివాయిలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. గురువారం ఉదయం ఓ చిరుత, ఆవుల మందపై దాడిచేసింది. ఈ ఘటనలో రెండు ఆవు దూడలు మృతి చెందాయి. చిరుత సంచారం సమాచారం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చర్య తీసుకోవాలని అధికారులకు ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. -
చిరుత దాడిలో వ్యక్తికి గాయాలు
సైదాపేట: చిరుతపులి దాడిచేసి ఓ వ్యక్తిని గాయపరిచింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా సైదాపేట మండలంలోని మొలకలపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మద్దిపాటి శివయ్య(33) ఉదయం బావి వద్దకు వెళ్తున్న సమయంలో పొదల్లో చిరుత అలికిడి అయింది. వెంటనే అప్రమత్తమైన శివయ్య వెనక్కితిరిగి అరుస్తూ పరిగెత్తాడు. ఇంతలోనే చిరుతపులి ఆయనపై దాడి చేసింది. ఆయన అరుపులు విన్న కొందరు స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో బెదిరిన చిరుత పొదల్లోకి జారుకుంది. గాయాలపాలైన శివయ్యను గూడూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు మృతి
రొద్దం(అనంతపురం): రెండు చిరుతల దాడిలో 71 గొర్రె పిల్లలు హతమయ్యాయి. అనంతపురం జిల్లా రొద్దం మండల పరిధిలోని ఆర్ లోచెర్ల, కంచిసముద్రం గ్రామాల మధ్య ఓకుంట వద్ద గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. గొర్రెల కాపర్లు తెలిపిన వివరాలు.. పెనుకొండ మండలం చిన్నపరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు మేపు కోసం 18 రోజుల క్రితం గొర్రెల మందను తోలుకెళ్లారు. ఆర్ లోచెర్ల గ్రామానికి చెందిన బోయ హనుమంతు అనే రైతు పొలంలో వందలాది గొర్రెల మందను నిలిపారు. సరిగా నడవలేని 100 పిల్లలను రొప్పం ఏర్పాటు చేసి ఒక చోట ఉంచారు. వాటి వద్ద కాపలా ఉన్న నాగన్న భోజనం చేయడానికి గ్రామంలోకి వెళ్లగా, మాటు వేసిన రెండు చిరుతలు ఒక్కసారిగా దాడి చేసి 71 గొర్రె పిల్లలను చంపేసి రక్తం తాగారుు. 20 పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. భోజనం చేసి వచ్చిన నాగన్నపైకి చిరుతలు దాడికి యత్నించడంతో అతను గట్టిగా కేకలు వేస్తూ పరుగు తీసి ప్రాణాలు కాపాడుకున్నాడు. రూ 3 లక్షలు నష్టం వాటిల్లినట్లు వారు వాపోయారు. -
అమ్మో పులి!
అడవిని వదిలి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులు వారం రోజులుగా అటవీ సమీప నివాస ప్రాంతాల్లో సంచారం బర్డ్, రుయా సమీపంలో ఓ దూడ, కుక్కపై చిరుత దాడి ప్రేక్షక పాత్రలో అటవీ శాఖ అధికారులు తిరుపతి కార్పొరే షన్/మంగళం: అభయారణ్యంలో సంచరించాల్సిన క్రూర మృగాలు యథేచ్ఛగా జనావాసాల్లోకి వస్తున్నాయి. ఎర్రచందనం అన్వేషణ, వన్య మృగాల వేట, నీరు లభించకపోవడంతో ఇవి జనావాసాల వైపు వస్తున్నా యి. రెండు రోజులుగా తిరుపతి రుయా, బర్డ్, స్విమ్స్ ఆసుపత్రులతో పాటు సమీపంలోని భారతీయ విద్యాభవన్, ఎస్వీబీసీ శ్రీవారి నమూనా ఆలయం, వేదిక్, ఎస్వీయూ, ఎన్సీసీ నగర్, రీజనల్ సైన్స్ సెం టర్లో పులు సంచరిస్తున్నాయి. అటవీ అధికారులకు సవాల్ విసురుతూ, సమీప జనావాసాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రుయా, బర్డ్ ఆసుపత్రి సమీపంలోని ఓ ప్రహరీ గోడపైకి చిరుతపులి ఓ కుక్కను, మరో లేగ దూడను తీసుకొచ్చి తిన్న సంఘటన గురువారం సంచలనం రేపింది. రుయాలోని ఐడీహెచ్ వార్డు విసిరేసినట్టు దూరంగా ఉండటం, చుట్టూ దట్టమైన చెట్లు, పొదలు ఉండడంతో వన్య మృగాలకు నిలయంగా మారుతోంది. 15 రోజుల క్రితం వేదిక్ వ ర్సిటీ, ఎన్సీసీ నగర్ వద్ద చిరుత జింకపై దాడి చేయడం, శ్రీవారిమెట్టు, మామండూరు సమీప గ్రామాల్లో సంచరించడం వంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎప్పుడు పులి వచ్చి దాడి చేస్తుందోనని జనం భయపడుతున్నారు. రాత్రి స్మగ్లర్లు.. పగలు పోలీసులు.. అశేష వన్యమృగాలకు నిలయమైన శేషాచల అడవిలోకి ఎర్రచందనం కోసం స్మగ్లర్లు అడుగులు వేస్తున్నారు. రాత్రిపూట వృక్షాలను యథేచ్ఛగా నరికేస్తున్నారు. ఆ చప్పుడు కారణంగా వన్యమృగాల ప్రశాంతతకు భంగం కలుగుతోంది. రాత్రిల్లో ఆహార అన్వేషణలో భాగంగా సమీపంలోని జనావాసాల్లోకి వస్తున్నాయి. రాత్రిళ్లు స్మగ్లర్ల బెడదైతే పగలు పోలీసుల అలజడి వన్యమృగాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పగటిపూట స్మగ్లర్ల కోసం కూంబింగ్ చేస్తున్న పోలీసులు మారణాయుధాలతో అడవిని జల్లెడ పడుతున్నారు. ఈ ప్రభావం వన్యమృగాలపై పడుతోంది. ఆహారం కోసం కాకుండా తమ ఉనికి కోసం అడవిని ఖాళీ చేస్తున్నాయి. జనావాసాల్లోకి వస్తున్నాయి. వేట కూడా కారణమే... శేషాచల అడవుల్లోని వన్యప్రాణులు ఆహార అన్వేషణలో భాగంగా నీటి కోసం భాకరాపేట, ఎర్రావారి పాళెం, కళ్యా ణి డ్యాంల వద్దకు వస్తున్నాయి. నాటుతుపాకులు, విల్లంబులు, బరిసెలతో వేటగాళ్లు దాడి చేస్తుండడంతో వన్యమృగాలు అలజడికి గురవుతున్నాయి. వేటగాళ్ల దాడులకు భయపడి అటవీ సమీప గ్రామాల వైపు వెళ్తున్నాయి. అదే క్రమంలో కుక్కలు, ఆవులు, దూడలపై దాడి చేస్తున్నాయి. నీటి కోసం అన్వేషణ.. వర్షాభావం కారణంగా శేషాచల అడవుల్లో చెరువులు, కుంటలు ఇంకిపోతున్నాయి. దీంతో దాహం తీర్చుకునేందుకు అడవి జంతువులు సుదీర్ఘంగా పయనిస్తున్నాయి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీ ప్రాంతంలో కృత్రిమంగా నీటి కొలనులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అక్కడక్కడా కొలనులు ఉన్నా వాటిలో నీటిని నింపడం లేదు. దీంతో నీటిని అన్వేషిస్తూ జనావాసాల్లోకి వస్తున్నాయి. -
చిరుత దాడిలో తాత, మనవడు మృతి
కోలారు: చిరుత దాడిలో తాత, మనవడు మరణించారు. స్థానికుల సమాచారం మేరకు... కోలారు తాలూకా ఎం.గొల్లహళ్లికి చెందిన వెంకటప్ప(60), మహేష్(16) మంగళవారం రాత్రి త్యావనహళ్లి వద్ద ఉన్న తమ తోట వద్దకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. మరి కొద్ది సేపటిలో తోటను సమీపిస్తుండగా వారిపై చిరుత దాడి చేసింది. బుధవారం తెల్లవారుజామున మృతదేహాలను గుర్తించిన గ్రామస్తుల సమాచారం మేరకు ఎం.గొల్లహళ్లి వాసులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాలు పడి ఉన్న తీరు. శరీరంపై ఉన్న గాట్లను ఆధారంగా చేసుకుని చిరుత దాడిలో మరణించినట్లు నిర్ధారణకు వచ్చారు. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ అజయ్ హిలోరి, అటవీశాఖాధికారి జగదీష్ అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై ఎస్పీ మాట్లాడుతూ... గ్రామస్తుల చెప్పిన దాన్ని బట్టి చిరుత దాడిలో మరణించినట్లు ఉన్నా.. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వా త వాస్తవాలు వెలుగు చూస్తాయని అన్నారు. కాగా, చిరుత దాడిలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరి హారాన్ని ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే వర్తూరు ప్రకా ష్ డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించి, మృతుల కుటుంబాలను పరా మర్శిం చారు. -
వామ్మో.. చిరుత
* సీసీ కెమెరాల్లో కదలికలు * గొర్రెలు మేపడంపై నిషేధాజ్ఞలు * చిరుత దాడిలో రేంజర్ మృతి చెన్నై, సాక్షి ప్రతినిధి: చిచ్చరపిడుగుల్లాంటి రెండు చిరుతలు చెంగల్పట్టు జనావాసాల్లోకి ప్రవేశించాయి. వీటి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయంతో వణికిపోతున్నా రు. చెంగల్పట్టు పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని రెండు నెలలుగా స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇవన్నీ పుకార్లేనని అటవీశాఖ కొట్టి పారేసింది. ఓ పశువుల కొట్టంలో కట్టివేసిన దూడను మే 19వ తేదీ రాత్రిచంపి తినేసింది. బాధిత రైతు ఫిర్యాదు మేర కు దూడ మాంసాన్ని అటవీశాఖాధికారులు పరిశోధన చేసి నిర్ధారణకొచ్చారు. కలెక్టర్ సౌందరపాండియన్ నేతృత్వంలో చెంగల్పట్టు పరిసరాలైన తిరుమణి, తిరుక్కుళుకున్రం, తాళంపాడు, తిరువడిశూలం, పనంగాటిపాక్కం, వండలూరుల్లో బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను ఆకర్షించేందుకు బోన్లలో కుక్కలు, గొర్రెలను ఉంచారు. ఇందు కు జంతు సంక్షేమ సంఘం ప్రతినిధులు నిరసన తెలపడంతో వాటిని వదిలివేసి వలలు ఏర్పాటు చేశారు. గొర్రెల కాపర్లకు, అడవుల్లోకి వెళ్లే ప్రేమజంటలకు చిరుత కనపడుతుందేగానీ సీసీ కెమెరాల్లో చిక్కలేదు. ఆ తరువాత అంజార్ ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది. అటవీశాఖకు మళ్లీ అనుమానం వచ్చింది. మరో పది చోట్ల సీసీ కెమెరాలను ఉంచారు. ఎట్టకేలకు గురువారం రాత్రి సీసీ కెమెరాల్లో చిరుత సంచారం కనపడింది. ఐదేళ్ల వయస్సు కలిగిన చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి పాదం గుర్తుల ఆధారంగా వివరాలను సేకరించాల్సిందిగా అటవీశాఖను ఆదేశించినట్లు శుక్రవారం తనను కలిసిన మీడియాకు సౌందరపాండియన్ చెప్పారు. గొర్రెలు మేపరాదని, అటవీ సరిహద్దుల్లో ఒంటరిగా సంచరించరాదని నిషేధాజ్ఞలు జారీచేసినట్లు తెలిపారు. ఊటీ, వాల్పారై, కోవై తదితర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉందని ఓ అటవీశాఖాధికారి చెప్పారు. అడవిలో బోన్లు, గొలుసులు పెట్టినట్లు చెప్పారు. బోనులో కుక్క చిక్కుకుంటే 3 కి.మీ, చిరుత, గొర్రె తదితర జంతువులు చిక్కుకుంటే 2 కి.మీ వరకు వినిపించేలా సైరన్ అమర్చినట్టు తెలిపారు. జనావాసంలో సంచరిస్తున్న చిరుతలను వారంలోగా పట్టుకుంటామని వెల్లడిం చారు. సీసీ కెమెరాల్లో కనపడుతున్న చిరుత గర్భంతో ఉందని, ఇదే ప్రాంతంలో మరో మగ చిరుత కూడా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. చిరుత దాడిలో రేంజర్ మృతి: ఈరోడ్డు జిల్లా సత్యమంగళం అటవీ చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న కృష్ణన్ (53) అనే రేంజర్‌ను గురువారం రాత్రి ఓ చిరుత పొట్టనపెట్టుకుంది. చెక్‌పోస్టులో కృష్ణన్‌తో పాటు ముత్తుస్వామి (40) అనే మరో రేంజర్ కూడా ఉన్నారు. గురువారం రాత్రి చెక్‌పోస్టుకు సమీపంలోని బంకులో టీ తాగేందుకు ముత్తుస్వామి వెళ్లాడు. ఇంతలో ఓ చిరుత వచ్చి కృష్ణన్‌పై దాడిచేసింది. భయాందోళనకు గురైన ముత్తుస్వామి ఫ్లయింగ్ స్క్వాడ్, అగ్నిమాపక దళాలకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకుని బాణసంచాకాలుస్తూ, కాగడాలతో చిరుతను తరిమివేశారు. అయితే అప్పటికే కృష్ణన్ చనిపోయినట్లు గుర్తించారు. ఇదే చెక్‌పోస్టు వద్ద ఇటీవల ఓ లారీ డ్రైవర్‌ను సైతం చిరుత బలితీసుకుంది. -
పోలీసులకు చుక్కలు చూపించిన చిరుత
కాంకేర్ : చత్తీస్‌గఢ్‌లో చిరుత కలకలం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి తప్పించుకుని జనావాసాల్లోకి వచ్చిన చిరుత కాంకేర్ జిల్లా అమపరా గ్రామంలో హల్చల్ చేసింది. దాంతో చిరుతను చూసిన గ్రామస్తులు భయాందోళనలతో పరుగులు తీశారు. చిరుత దాడిలో 14 మందికి గాయాలయ్యాయి. పట్టుకునేందుకు ప్రయత్నించిన సీజీ పోలీసుల్ని సైతం చిరుత ముప్పుతిప్పలు పెట్టింది. ఎట్టకేలకు పోలీసులు చిరుతను తుపాకీతో కాల్చి చంపడంతో కాంకేర్ గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు ఏడు గంటల పాటు చిరుత చుక్కలు చూపించింది. చిరుత నిన్న సాయంత్రం నుంచే గ్రామంలో సంచరించటంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. దాంతో చిరుత సంచారంపై వారు పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ముందుగా చిరుత ఓ విలేకరి నివాసంలోకి దూకింది. అక్కడ నుంచి దాన్ని తరిమేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ సమయంలో వారిపై దాడి చేసింది. -
చిరత దాడిలో 14 మందికి గాయాలు