సాక్షి, చెన్నై: ఓ ఇంట్లోకి చొరబడి ముగ్గురు వ్యక్తులపై చిరుత దాడి చేసింది. తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తం సమీపంలోని కలైపాలయం ఎర్థంగాళ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. వేలాయుధం, అతని భార్య ప్రేమ, మరో వ్యక్తి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో చిరుత అర్థరాత్రి వారింట్లో ప్రవేశించింది. కోడిని వేటాడుతూ అటువైపుగా వచ్చి ఇంట్లో ఇరుక్కుపోయింది.
ఇంతలో మనుషుల అలికిడి వినబడటంతో వారిపై దాడి చేసింది. కాగా క్షతగాత్రులు ప్రస్తుతం గుడియాత్తం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఇంట్లో బంధించిన చిరుతపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. స్థానిక పోలీసులు వీరికి సహకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment