
కర్ణాటక: యువకునిపైన చిరుతపులి దాడి చేసి గాయపరిచిన సంఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు తాలూకాలోని రామేనహళ్ళి బెట్ట తప్పలి వద్ద చోటు చేసుకుంది. రామేనహళ్ళికి చెందిన అనిల్ అనే యువకుడు స్నేహితులతో కలిసి ఊరి బయట మండపం వద్ద కూర్చుని ఉండగా, కొండపై నుంచి వచ్చిన చిరుత అతని మీదకు దూకింది. ఈ దాడిలో అతనికి భుజం, కడుపులో గాయాలయ్యాయి. మిగతావారు గట్టిగా కేకలు వేయడంతో చిరుత పరారైంది. వెంటనే గ్రామస్తులు అతన్ని హుణసూరులో ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరి్పంచారు.
హంతక చిరుత బందీ
బాలికను బలి తీసుకున్న చిరుతపులి ఎట్టకేలకు బోనులోకి చిక్కింది. చామరాజనగర జిల్లా కొళ్ళెగాల తాలూకా మదువనహళ్లి సమీపంలోని సిద్దేశ్వర బెట్ట వద్ద చిరుత దొరికింది. కగ్గలిగుందిలో గత నెల 26న ఆరేళ్ల బాలికను చిరుత లాక్కుపోవడానికి యతి్నంచింది, ఈ ఘటనలో బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. అలాగే కంచహళ్ళి గ్రామంలో రైతు పైన దాడి చేసింది. గత 19 రోజులుగా ఈ చిరుత కోసం చుట్టుపక్కల గ్రామాల్లో గాలింపు జరిపి బోనులు పెట్టడంతో దొరికింది. అటవీ సిబ్బంది దానిని తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment