రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్‌ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి.. | Young Man Cheating Girl Name Of Marriage In Konaseema District | Sakshi
Sakshi News home page

రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్‌ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..

Nov 20 2022 4:51 PM | Updated on Nov 20 2022 4:53 PM

Young Man Cheating Girl Name Of Marriage In Konaseema District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వారి బాగోతం ఆ బాలిక పెద్దలకు తెలియడంతో ఆ యువకుడు ముఖం చాటేశాడు.

కొత్తపేట(కోనసీమ జిల్లా): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్సై డి.శశాంక శనివారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా నమ్మించాడు.

ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒకసారి శారీరకంగా కలిశాడు. మళ్లీ 12న బాలిక స్కూల్‌లో ఉండగా వెళ్లి తన ఫ్రెండ్‌ బర్త్‌డేకు పలివెల వెళ్లివద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక రూములో రోల్డ్‌గోల్డ్‌ ఉంగరం తీసి, బాలిక వేలుకు తొడిగి, పెళ్లయిపోయిందని నమ్మించి, మరోసారి శారీరకంగా కలిశాడు. వారి బాగోతం ఆ బాలిక పెద్దలకు తెలియడంతో ఆ యువకుడు ముఖం చాటేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై తెలిపారు.
చదవండి: ప్రియుడితో కుమార్తె పరార్‌.. తల్లిదండ్రుల ఆత్మహత్య   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement