cheating girlfriend
-
రూమ్‌కు తీసుకెళ్లి రోల్డ్‌గోల్డ్ ఉంగరం తొడిగి.. పెళ్లయిపోయిందని నమ్మించి..
కొత్తపేట(కోనసీమ జిల్లా): ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్టు అదనపు ఎస్సై డి.శశాంక శనివారం తెలిపారు. ఆమె కథనం ప్రకారం.. మండలంలోని వానపల్లి శివారు రామ్మోహనరావుపేటకు చెందిన 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని కొంతకాలంగా నమ్మించాడు. ఈ నెల 10న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఒకసారి శారీరకంగా కలిశాడు. మళ్లీ 12న బాలిక స్కూల్లో ఉండగా వెళ్లి తన ఫ్రెండ్ బర్త్‌డేకు పలివెల వెళ్లివద్దామని చెప్పి తీసుకువెళ్లాడు. అక్కడ ఒక రూములో రోల్డ్‌గోల్డ్ ఉంగరం తీసి, బాలిక వేలుకు తొడిగి, పెళ్లయిపోయిందని నమ్మించి, మరోసారి శారీరకంగా కలిశాడు. వారి బాగోతం ఆ బాలిక పెద్దలకు తెలియడంతో ఆ యువకుడు ముఖం చాటేశాడు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై తెలిపారు. చదవండి: ప్రియుడితో కుమార్తె పరార్.. తల్లిదండ్రుల ఆత్మహత్య -
ఇన్స్పెక్టర్ రాసలీలలు.. లవ్ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..
రామభద్రపురం : ప్రజలను రక్షించాల్సిన రక్షకభటుడే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి మోహం చాటేశాడు. తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వివరాల ప్రకారం.. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ పోలీస్ లైన్స్‌లో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. అయితే, గోపాలకృష్ణ పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్ రైట్స్ సంఘ సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో.. -
ఐదేళ్లు ప్రేమాయణం, పెళ్లి చేసుకుంటానని.. వేరే యువతితో
విశాఖపట్నం: ఐదేళ్లుగా ప్రేమాయణం సాగించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. శారీరకంగా దగ్గరై, ఇప్పుడు వేరే యువతిని వివాహం చేసుకోడానికి సిద్ధమయ్యాడు. ఆ యువకుడిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాధితురాలు మంగళవారం ఫిర్యాదు చేసింది. దీనికి సంబంధించి బాధిత యువతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదతీనార్లలకు చెందిన కారే ఆశ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆమె 8వ తరగతి చదువుతున్న సమయంలోనే ఇదే గ్రామానికి చెందిన మైలపల్లి రాము అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. ఇద్దరం భార్యాభర్తలమే నువ్వేమి అనుమానం పడక్కర్లేదంటూ కర్నాటక, హంపి,హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తీసుకెళ్లాడు. శారీరకంగా అనుభవించాడు. తీరా పెళ్లి చేసుకోమని అడిగితే కట్నం ఇవ్వలేరన్న కారణంతో తిరస్కరించి ఈనెల 2వ తేదీన వేరే యువతిని వివాహం చేసుకునేందుకు మూహూర్తం పెట్టుకున్నాడు. విషయం తెలిసి నిలదీస్తే, నువ్వంటే ఇష్టమేనని కానీ మా తల్లిదండ్రులను ఎదిరించి వివాహం చేసుకోలేనని ముఖం చాటేస్తున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి కుటుంబ పెద్దలు రాము తల్లిదండ్రులతో చర్చలు జరిపారు. ఇద్దరికీ వివాహం చేయాలని కోరారు.అయితే రాము కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో బాధితురాలు తన కుటుంబ సభ్యుల సాయంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను మోసం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించి, న్యాయం చేయాలని కోరింది. ఇద్దరూ కలిసి వివిధ ప్రాంతాల్లో తీసుకున్న ఫొటోలు, వాట్సాప్ చాటింగ్‌ను ఆమె పోలీసులకు చూపించింది. దీనిపై ఎస్ఐ వెంకన్నను వివరణకోరగా మెలపల్లి రాముపై బాధితురాలు ఫిర్యాదు చేసిందన్నారు. కేసు నమోదు చేశామని తెలిపారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ఆందోళన
నెన్నెల(బెల్లంపల్లి): ప్రేమ పేరిట మాయమాటలు చెప్పి.. తీరా పెళ్లికి నిరాకరించిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగే దాకా అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకూర్చుంది. ఈ సంఘటన మండలంలోని గన్పూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మైలారం గ్రామానికి చెందిన గిరిజన యువతి సండ్ర సంధ్యారాణి, గన్పూర్ గ్రామానికి చెందిన సత్యంశెట్టి సత్యనారాయణ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి లోబర్చుకొని మోసం చేసినట్లు యువతి తెలిపింది. పెళ్లి మాట ఎత్తినప్పుడల్లా అప్పుడూ.. ఇప్పుడూ అంటూ దాటేసుకుంటు వచ్చినట్లు పేర్కొంది. తీరా సోమవారం వేరే అమ్మాయితో నిశ్చితార్థం కాగా.. తనకు న్యాయం చేయాలంటూ సత్యనారాయణ ఇంటి ఎదుట సంధ్యారాణి ఆందోళనకు దిగింది. న్యాయం జరగకుంటే ఆత్మహత్యే శరణ్యమంటోంది. కాగా, ప్రియుడి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లగా.. సత్యనారాయణ సైతం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సంధ్యారాణి వాపోయింది. -
నా శీలాన్ని దోచేసి... వదిలేసింది
న్యాయం చేయండి పోలీసులను ఆశ్రయించిన యువకుడు సహజీవనం చేసి, ఇప్పుడు కాదంటోందంటూఆరోపణ బెంగళూరు : నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నాతో శారీరక సంబంధం కొనసాగించి గర్భం దాల్చింది. ఇప్పుడు నన్ను కాదంటోంది. శీలం కోల్పోయిన నేను వేరొకరిని ఎలా వివాహం చేసుకోవాలి. న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాడో బాధితుడు. వివరాల్లోకి వెళ్లితే... తుమకూరు జిల్లా బెళ్లావి తాలూకాకు చెందిన శివకుమార్ రెండేళ్లుగా అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. రెండు నెలలుగా సదరు యువతి అతడికి దూరంగా ఉంటోంది. దీంతో రెండు రోజుల ముందు శివకుమార్ స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. మొదట్లో వద్దంటున్నా యువతి నాపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రేమించేలా చేసింది. అటుపై నేను తప్పని చెబుతున్నా బలవంతంగా నాతో శారీరక సంబంధం కొనసాగించింది. అంతేకాకుండా గర్భవతి కూడా అయింది. అటుపై ఆమె తల్లిదండ్రులు నన్ను బెదిరించి రూ. 30 వేలు తీసుకుని ఆమెకు గర్భప్రావం చేయించారు. అటుపై కూడా నాతో సంబంధం కొనసాగించింది. ఆమె బాగోగులు కోసం నేను రూ. 5 లక్షల వరకూ ఖర్చు చేశాను. కొంత కాలంగా నా నుంచి దూరంగా ఉంటోంది. ఆమె తల్లిందండ్రులు యువతిని హాసన్‌లో ఉంచారని తెలుసుకుని అక్కడకు వెళ్లి గాలించిన ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు పోయినందుకు నాకు బాధ లేదు. ఇప్పుడు నా శీలం పోయింది. మరొకరిని ఎలా పెళ్లి చేసుకోవాలి. ఈ విషయమై యువతిపై రేప్ కేసు పెట్టండంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు మాత్రం ఈ తరహా కేసులు నమోదు చేయలేమని చేతులెత్తేశారు. దీంతో బాధితుడు సోమవారం మీడియాను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో మోస పోయిన ఘటనలో మహిళలు తాము అత్యాచారానికి గురైనట్లు ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసుకునే పోలీసులు... పురుషుల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. ఇప్పుడు నా శీలాన్ని ఆమె దోచుకుంది. నాకు న్యాయం చేయండి. ఆ యువతిపై అత్యాచారం కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. లేదా ఆమెతో నాకు వివాహం జరిపించండి అని మీడియా సాక్షిగా విజ్ఞప్తి చేశాడు.