ఇన్‌స్పెక్టర్‌ రాసలీలలు.. లవ్‌ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..  | Police Cheated Young Woman At Vishakhapatnam | Sakshi
Sakshi News home page

ఇన్‌స్పెక్టర్‌ రాసలీలలు.. లవ్‌ యూ అంటూ ఆమెకు దగ్గరై.. ఆ తర్వాత..

Jun 5 2022 7:31 AM | Updated on Jun 5 2022 7:31 AM

Police Cheated Young Woman At Vishakhapatnam - Sakshi

మహిళలను రక్షించాల్సిన పోలీసు అధికారే ఆమెను నమ్మించి మోసం చేశాడు.

రామభద్రపురం : ప్రజలను రక్షించాల్సిన రక్షకభటుడే ఓ యువతిని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను గర్భవతిని చేసి మోహం చాటేశాడు. తనను మోసం చేసిన ప్రియుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితురాలు శనివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

వివరాల ప్రకారం.. మండలంలోని మిర్తివలస గ్రామానికి చెందిన సువ్వాడ ఉషారాణి అదే గ్రామానికి చెందిన పొట్నూరు గోపాలకృష్ణ 2019 నుంచి ప్రేమించుకుంటున్నారు. గోపాలకృష్ణ  హైదరాబాద్‌ సెంట్రల్‌ పోలీస్‌ లైన్స్‌లో రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్నాడు. అయితే 2020లో ఇద్దరి మధ్య బేదాభిప్రాయాలు రావడంతో గ్రామపెద్దల వద్దకు పంచాయితీ చేరింది. 

దీంతో గోపాలకృష్ణ నుంచి కొంత మొత్తాన్ని ఉషారాణికి ఇప్పించి రాజీ కుదిర్చారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ మళ్లీ ఒక్కటయ్యారు. గోపాలకృష్ణ డిప్యుటేషన్‌పై విశాఖపట్నంలో విధులు నిర్వహిస్తూ, అప్పుడప్పుడూ గ్రామానికి వచ్చి ఉషారాణితో గడుపుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోవాలని గోపాలకృష్ణపై ఒత్తిడి తీసుకువచ్చింది. 

అయితే, గోపాలకృష్ణ పెళ్లికి నిరాకరించడంతో తనకు న్యాయం చేయాలని బాధితురాలు విజయనగరం హ్యూమన్‌ రైట్స్‌ సంఘ సభ్యులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు గ్రామ పెద్దలతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సీఐ ఎం. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: యువతితో ఐదేళ్లుగా ప్రేమ.. నమ్మించి మోసం.. పెళ్లి చేసుకోవాలని నిలదీయడంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement