సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతుంటారు. ముఖ్యంగా వాళ్ల సినిమా విశేషాల కంటే పర్సనల్ లైఫ్‌పై ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇక హీరో,హీరోయిన్ల ప్రేమ, పెళ్లిళ్లలకు సంబంధించిన వార్తలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ టాలీవుడ్ హీరోయిన్ పోలీస్ ఆఫీసర్ ప్రేమలో పడిపోయిందనే గాసిప్ జోరుగా వినిపిస్తుంది.
'మా అబ్బాయి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ చిత్రా శుక్లా. ఆ తర్వాత రాజ్ తరుణ్‌తో ‘రంగుల రాట్నం’, అల్లరి నరేష్ తో ‘సిల్లీ ఫెలోస్’, ‘తెల్లవారితే గురువారం’వంటి పలు సినిమాల్లో నటించిన మెప్పించింది. లేటెస్ట్‌గా గీతసాక్షిగా అనే సినిమాలోనూ నటించింది. తాజాగా ఆమె ప్రేమ వ్యవహారం నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. వైభవ్ ఉపాధ్యాయ్ అనే పోలీస్ ఆఫీసర్‌తో చిత్రా కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతుందట. చదవండి: మెగా హీరోకు పార్టీ ఇచ్చిన మంచు మనోజ్
తాజాగా ఆమె బర్త్‌డే సందర్భంగా వైభవ్ షేర్ చేసిన పోస్ట్ ఈ రూమర్స్‌కి మరింత బలం చేకూరుస్తుంది. హ్యాపీ బర్త్‌డే స్వీట్‌హార్ట్ అంటూ వైభవ్ పోస్ట్‌చేయడం, దానికి చిత్రా థ్యాంక్యూ నా వైభవ్ అంటూ కామెంట్ చేయడంతో ఈ అమ్మడి లవ్ మ్యాటర్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment