![Akhil Akkineni First Reaction On Naga Chaitanya And Sobhita Dhulipala Relationship - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/16/movi%20enews.jpg.webp?itok=-nglOOIt)
సమంతతో విడిపోయిన తర్వాత అక్కినేని నాగచైతన్య శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్‌పై ఇంతవరకు అటు చై, శోభిత దూళిపాళ స్పందించకపోయినా వారి ప్రేమ వ్యవహారం మాత్రం ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతూనే ఉంది. రీసెంట్‌గా లండన్‌లోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరు కలిసున్న ఓ ఫోటో లీక్ అయ్యి ఎంతగా వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీంతో చై-శోభితల రిలేషన్‌షిప్ నిజమేనంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.
తాజాగా ఈ వ్యవహారంపై అఖిల్ అక్కినేని స్పందించారు. ఏజెంట్ మూవీ ప్రెస్‌మీట్‌లో భాగంగా పాల్గొన్న అఖిల్‌కు.. ''మీ అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఎవరో అమ్మాయితో ఫొటోలో కనిపించి(శోభిత దూళిపాళను ఉద్దేశిస్తూ) నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాడు.
మరి మీ పరిస్థితి ఏంటి''?అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దానికి అఖిల్ బదులిస్తూ..'నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, బాడీని మెయిన్‌టైన్ చేయడమే సరిపోయింది. నా దృష్టి మొత్తం సినిమాలపైనే' అంటూ బదులిచ్చాడు. ప్రస్తుతం అఖిల్ చేసిన ఆ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Comments
Please login to add a commentAdd a comment