Amy Jackson Is Dating Gossip Girl Star Ed Westwick Is Confirmed ? - Sakshi
Sakshi News home page

Amy Jackson: ప్రియుడితో అమీ జాక్సన్‌ చట్టాపట్టాల్‌.. ఫోటోలు వైరల్‌

Published Sun, May 8 2022 12:42 PM | Last Updated on Sun, May 8 2022 1:33 PM

Amy Jackson Is Dating Gossip Girl Star Ed Westwick Is Confirmed - Sakshi

వరుడు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ అమీ జాక్సన్‌.. 'ఐ', 'రోబో 2.0' సినిమాలతో మరింత పాపులర్‌ అయింది. కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్‌ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్‌ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్‌ చెప్పేసుకున్నారు.

అయితే ఇటీవలె మరోసారి ప్రేమలో పడిన అమీ జాక్సన్‌ కొన్నాళ్లుగా బ్రిటీష్‌ నటుడు ఎడ్‌‌వెస్ట్విక్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ లండన్‌లో చట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. ఎడ్ వెస్ట్‌విక్‌తో కలిసి అమీ జాక్సన్‌ చేతిలో చేయి వేసుకొని లండన్‌ వీధుల్లో తిరుగుతూ కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వీరిద్దరి లవ్‌ ఎఫైర్‌ మరోసారి చర్చనీయాంశమైంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement