
Is Amy Jackson Confirms Her Relationship With Ed Westwick: ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే బ్యూటీఫుల్ హీరోయిన్ అమీ జాక్సన్. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు.
అయితే అమీ జాక్సన్ బ్రిటీష్ నటుడు ఎడ్‌వెస్ట్విక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్ కాలేదు అమీ. ఇదివరకు లండన్లో అతనితో చెట్టాపట్టాలేసుకోని తిరిగిన ఫొటోలు వారు ప్రేమలో ఉన్నారని చెప్పకనే చెప్పినట్లైంది. తాజాగా ఎడ్‌వెస్ట్విక్‌తో సాన్నిహిత్యంగా ఉన్న ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ప్రస్తుతం నెట్టింట వైరల్ అయిన ఈ ఫొటోలు చూస్తుంటే వారు ప్రేమలో ఉందన్న వార్తలు దాదాపు కన్ఫమ్ అయినట్లు తెలుస్తోంది.
చదవండి: ఆ పాత్ర నాకు నచ్చలేదు.. కానీ ఒప్పుకున్నా: సత్యరాజ్
Comments
Please login to add a commentAdd a comment