ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌ పార్టీ.. అమ్మా, నీకింకా పెళ్లికాలేదా? | Amy Jackson With Son at Engagement Dinner with Ed Westwick | Sakshi
Sakshi News home page

మొన్నే ప్రియుడితో ఎంగేజ్‌మెంట్‌.. కుమారుడితో కలిసి పార్టీ ఇచ్చిన హీరోయిన్‌

Mar 23 2024 2:31 PM | Updated on Mar 23 2024 2:57 PM

Amy Jackson With Son at Engagement Dinner with Ed Westwick - Sakshi

రెండు నెలల క్రితం నా చేతికి ఉన్న ఉంగరం చూసి అమ్మా.. నీకింకా పెళ్లి కాలేదా? అని అడిగాడు. ఎడీని ఎందుకింకా పెళ్లి చేసుకోలేదని అడిగితే తను వివాహం గురించి ఎ

అమీ జాక్సన్‌.. తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలే! ఎవడు సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఐ మూవీతో మెప్పించింది. అభినేత్రి సినిమాలో చల్‌ మార్‌ అనే స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. తమిళ, హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఈ సుందరాంగి బిజినెస్‌మెన్‌ ఆండ్రియాస్‌ పనయిటో కుమారుడు జార్జ్‌తో లవ్‌లో పడింది.

ప్రియుడి ప్రపోజల్‌
2015 డిసెంబర్‌లో వీరు నిశ్చితార్థం చేసుకున్నారు. కానీ పెళ్లి మాత్రం చేసుకోలేదు. 2019లో వీరికి ఓ కుమారుడు జన్మించాడు. తర్వాత పలు కారణాల వల్ల బ్రేకప్‌ చెప్పుకున్నారు. 2022లో బ్రిటీష్‌ యాక్టర్‌ ఎడ్‌ వెస్ట్‌విక్‌తో మరోసారి ప్రేమలో పడింది అమీ జాక్సన్‌. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఈ లవ్‌ బర్డ్స్‌ ఈ ఏడాది జనవరి 29న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. మంచుకొండల్లో ప్రియుడు ఉంగరం తొడిగి ప్రపోజ్‌ చేయడంతో సంతోషంతో ఓకే చెప్పింది హీరోయిన్‌.

అదే అతడిలో నచ్చింది
తాజాగా కుటుంబసభ్యులు, బంధుమిత్రులందరికీ ఎంగేజ్‌మెంట్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. అమీ మాట్లాడుతూ.. 'నా కుమారుడు ఆండ్రియాకు ఎడ్‌ చాలాకాలం నుంచే తెలుసు. ఈ సెలబ్రేషన్స్‌ చూసి తను చాలా ఎగ్జయిట్‌ అవుతున్నాడు. ఎడ్‌.. నా కొడుకుతో ఎంతో బాగా కలిసిపోతాడు. తనకు, నాకు చాలా సపోర్ట్‌గా ఉంటాడు. ఈ అంశాలే అతడిలో నాకు బాగా నచ్చాయి.

తనే ముందుకొచ్చి మాట్లాడతానన్నాడు
నా కుమారుడు రెండు నెలల క్రితం నా చేతికి ఉన్న ఉంగరం చూసి అమ్మా.. నీకింకా పెళ్లి కాలేదా? అని అడిగాడు. ఎడీని ఎందుకింకా పెళ్లి చేసుకోలేదని అడిగితే తను వివాహం గురించి ఎప్పుడూ మాట్లాడలేదన్నాను. అది విన్న ఆండ్రియా.. అయితే నేను వెళ్లి చెప్తానుండు అన్నాడు. అంత ఎంకరేంజ్‌మెంట్‌ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. మా బంధానికి అతడు ఎప్పుడో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు' అని చెప్పుకొచ్చింది.

చదవండి: 'ఏజెంట్‌' బాటలో భారీ డిజాస్టర్‌ సినిమా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement