Amy Jackson Shares Adorable Pics With New Boyfriend Ed Westwick - Sakshi
Sakshi News home page

Amy Jackson: పెళ్లికి ముందే తల్లయిన హీరోయిన్‌.. కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో రొమాంటిక్‌ పిక్స్‌ షేర్‌ చేస్తూ..

Published Thu, Feb 16 2023 7:42 PM | Last Updated on Thu, Feb 16 2023 8:41 PM

Amy Jackson Shares Adorable Pics With New Boyfriend Ed Westwick - Sakshi

ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్రిటిష్‌ బ్యూటీ​ అమీ జాక్సన్. నటిగా కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే వ్యాపారవేత్త జార్జ్‌ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలిన అమీ జాక్సన్‌ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఏ సమాచారం లేదు. అయితే అమీ జాక్సన్‌ బ్రిటీష్‌ నటుడు ఎడ్‌‌వెస్ట్విక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్​ కాలేదు ఆమె.

చదవండి: పొలిటికల్‌ లీడర్‌ను పెళ్లాడిన హీరోయిన్‌

తాజాగా ఆ పుకార్లనే నిజం చేస్తూ కొత్త ప్రియుడిని పరిచయం చేసింది. ఎడ్‌వెస్ట్విక్‌తో ప్రేమలో ఉన్నట్టు వాలంటైన్స్‌ డే సందర్బంగా అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా ఎడ్‌వెస్ట్వీక్‌తో దిగిన పలు రొమాంటిక్‌ పిక్స్‌ను షేర్‌ చేస్తూ.. ‘హ్యాపీ వాలంటైన్స్ డే బేబీ, నీ అంతులేని ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ రెడ్‌ హార్ట్‌ ఎమోజీని జత చేసింది. దీంతో ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు క్యూట్‌ కపుల్‌ అంటూ హార్ట్‌ ఎమోజీలతో స్పందిస్తూంటే మరికొందరు ఆమె తీరుపై విమర్శిస్తున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం, బిడ్డకు జన్మనివ్వడం.. ఇప్పుడు మరో నటుడితో ప్రేమయాణం ఏంటని తప్పుబడుతున్నారు.

చదవండి: బండ్ల గణేష్‌ షాకింగ్‌ ట్వీట్‌.. ఆ స్టార్‌ డైరెక్టర్‌ను ఉద్దేశించేనా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement