'ఐ', 'రోబో 2.0' సినిమాల్లో అందచందాలతో కట్టిపడేసింది అమీ జాక్సన్. ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకుండా పోయిన అమీ జాక్సన్ గతంలో వ్యాపాత్వేత్త జార్జ్ పనాయిటోను ప్రేమించింది. వీరిద్దరికీ 2019 మేలో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే కరోనా కారణంగా పెళ్లి వాయిదా పడుతూ రాగా అదే ఏడాది సెప్టెంబర్‌లో మగబిడ్డకు జన్మనిచ్చింది అమీ జాక్సన్.
ఇక ఏడడుగులు నడవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో సడన్‌గా ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలన్నింటినీ సోషల్ మీడియాలో తొలగించి బ్రేకప్ విషయాన్ని చెప్పకనే చెప్పిందీ భామ. తాజాగా ఈ హీరోయిన్ మరో నటుడితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బ్రిటీష్ యాక్టర్, గాసిప్ గర్ల్ హంక్ ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సౌదీ అరేబియాలోని రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో వీరిద్దరూ తొలిసారిగా ఒకరినొకరు కలుసుకున్నారట! అప్పుడు వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందని, ఈ క్రమంలో రెండు నెలల నుంచి వీళ్లు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్నారని కథనాలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా ఈ ప్రేమజంట వాలంటైన్స్ డేను ప్యారిస్‌లో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారని టాక్!
Comments
Please login to add a commentAdd a comment