పోలీసుల అదుపులో స్టార్‌ హీరో.. ఫోటో వైరల్‌ | Actor Vidyut Jammwal In Railway Police Custody In Mumbai For Reportedly For Doing Risky Stunts - Sakshi
Sakshi News home page

Vidyut Jammwal: పోలీసుల అదుపులో స్టార్‌ హీరో.. ఫోటో వైరల్‌

Published Sun, Feb 11 2024 11:06 AM | Last Updated on Sun, Feb 11 2024 1:25 PM

Actor Vidyut Jammwal In Railway Police Station - Sakshi

స్క్రీన్‌పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో పేరుగాంచిన  నటుడు విద్యుత్ జమ్వాల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు అగ్రశ్రేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయన పేరుపొందారు. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడుగా జమ్వాల్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేశాడు. 

తాజాగా రిస్కీ స్టంట్స్ చేసినందుకు గాను విద్యుత్ జమ్వాల్‌ను ముంబైలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త ఒకటి నెట్టింట వైరల్‌ అవుతుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఆయన కూర్చోని ఉన్న ఫోటో ఒకటి షోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. కానీ ఆయన ఆరెస్ట్‌ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈ ఫోటో షూటింగ్‌లో భాగమేనని కొందరు అంటున్నారు. కానీ ఆయన అరెస్ట్‌ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై పోలీసులతో పాటు  విద్యుత్ జమ్వాల్‌ కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

విద్యుత్ జమ్వాల్ తన తదుపరి చిత్రం 'క్రాక్-జీతేగా తో జీగ' (CRAKK-JEETEGAA... TOH JIYEGAA ) విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమా ప్రమోషన్ ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 9న విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం ఆయన రియల్‌గానే కొన్ని స్టంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ట్రైలర్‌లో చూపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement