Arjun Rampal
-
నటుడి ట్విటర్ ఖాతా హ్యాక్.. ఫ్యాన్స్‌కు హెచ్చరిక!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ సోషల్ మీడియా ఖాతా ఎక్స్(ట్విటర్ అకౌంట్) హ్యాకింగ్ గురైంది. ఈ విషయాన్ని నటుడు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. తన ఖాతా నుంచి ఏదైనా పోస్టులు వస్తే స్పందించవద్దని తెలిపారు. తన అభిమానులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.కాగా.. అర్జున్ రాంపాల్ చివరిసారిగా 'క్రాక్' చిత్రంలో నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్, రణవీర్ సింగ్‌లతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ఫోటోలను పంచుకున్నారు. ఆదిత్య ధర్ హెల్మ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైందని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బీ62 బ్యానర్లపై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ ధర్, ఆదిత్య ధర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
అబ్బాయిలు ఇడియట్స్.. అప్పటిదాకా ఆగి పెళ్లి చేసుకోండి: నటుడు
చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందంటున్నాడు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. నేను విచ్ఛిన్నమైన కుటుంబం నుంచి వచ్చాను. అక్కడ బంధాలు తెగిపోవడమే చూశాను. కానీ ఎందుకలా జరుగుతున్నాయనేది అర్థం చేసుకోలేకపోయాను. నాదాకా వస్తే కానీ అన్నీ అవగతం కాలేదు. అయినా విడాకులు తీసుకోవడానికి పూర్తి బాధ్యత నాదే! నాది చిన్న వయసునాకు 24 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసుకోవడానికి అది చాలా చిన్న వయసు. ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉంటాయి. పూర్తిగా మెచ్యూరిటీ వచ్చాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలి. అమ్మాయిల కన్నా అబ్బాయిలు చాలా నెమ్మదిగా పరిణతి చెందుతారు. మేము ఇడియట్స్ అని ఇక్కడే తెలిసిపోతోంది. మూడుముళ్ల బంధం విజయవంతం కావాలంటే ఆ సమయం వచ్చేదాకా ఆగిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి.పెళ్లి- విడాకులుపెళ్లనేది కేవలం ఒక పేపర్ ముక్కలాంటిదే. నా దృష్టిలో నా ప్రియురాలు గాబ్రియెల్లాకు, నాకు పెళ్లయిపోయినట్లే. తనతో నా మాజీ భార్య ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. పిల్లలందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ఈయన 1998లో నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి మహిక, మైరా అనే ఇద్దరు కూతుర్లు జన్మించారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నారు.సినిమాలు..అదే సంవత్సరం నటి గాబ్రియెల్లా డెమట్రియాడెస్తో రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించడంతో పాటు వీరికి ఒక బాబు పుట్టాడు. 2023లో మరోసారి బాబు జన్మించాడు. బాలీవుడ్లో అనేక చిత్రాల్లో నటించిన ఇతడు భగవంత్ కేసరి మూవీతో గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ద బ్యాటిల్ ఆఫ్ కొరెగావ్, నాస్తిక్, 3 మంకీస్, దురంధర్ మూవీస్ చేస్తున్నాడు.చదవండి: రూ.3 లక్షలిస్తేనే ప్రమోషన్స్.. హీరోయిన్‌పై నిర్మాత ఫైర్! -
పోలీసుల అదుపులో స్టార్ హీరో.. ఫోటో వైరల్
స్క్రీన్‌పై అద్భుతమైన విన్యాసాలు చేయడంలో పేరుగాంచిన నటుడు విద్యుత్ జమ్వాల్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరు అగ్రశ్రేణి మార్షల్ ఆర్టిస్టులలో ఒకరిగా ఆయన పేరుపొందారు. లూపర్ క్యూరేట్ చేసిన ప్రతిష్టాత్మక జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడుగా జమ్వాల్ రికార్డ్ క్రియేట్ చేశాడు. తాజాగా రిస్కీ స్టంట్స్ చేసినందుకు గాను విద్యుత్ జమ్వాల్‌ను ముంబైలో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) బాంద్రా కార్యాలయంలో ఆయన కూర్చోని ఉన్న ఫోటో ఒకటి షోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కానీ ఆయన ఆరెస్ట్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఫోటో షూటింగ్లో భాగమేనని కొందరు అంటున్నారు. కానీ ఆయన అరెస్ట్ అయ్యాడంటూ వస్తున్న వార్తలపై పోలీసులతో పాటు విద్యుత్ జమ్వాల్ కూడా ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. ఈ విషయంపై అధికారికంగా సమాచారం ఇవ్వాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. విద్యుత్ జమ్వాల్ తన తదుపరి చిత్రం 'క్రాక్-జీతేగా తో జీగ' (CRAKK-JEETEGAA... TOH JIYEGAA ) విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. సినిమా ప్రమోషన్ ఇప్పటికే జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 9న విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, నోరా ఫతేహి, అమీ జాక్సన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఆదిత్య దత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా కోసం ఆయన రియల్‌గానే కొన్ని స్టంట్స్ చేసిన విషయం తెలిసిందే. వాటిలో కొన్ని ట్రైలర్లో చూపించారు. -
పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!
నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో రిలేషన్లో ఉంది. కాగా.. ఇప్పటికే 2019లో ఈ జంటకు అరిక్ రాంపాల్ అనే కుమారుడు జన్మించారు. దీంతో దాదాపు 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు బాలీవుడ్ నటుడు రాంపాల్. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. కాగా.. 2018లో ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) అర్జున్ రాంపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను, నా కుటుంబం ఓ అందమైన బిడ్డకు స్వాగతం పలికాం. ప్రస్తుతం తల్లీ, కొడుకులిద్దరూ క్షేమంగానే ఉన్నారు. అద్భుతంగా సేవలందించిన వైద్యులు, నర్సులకు నా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా.. నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన ఊపిరి చిత్రంలో కీలకపాత్రలో నటించింది. 2018 నుంచి ఈ జంట రిలేషన్లో ఉన్నారు. కాగా.. అర్జున్‌కు మొదటి భార్య మెహర్ జెసియాకు మహికా రాంపాల్, మైరా రాంపాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ జంట 2019లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అర్జున్ చివరిగా కంగనా రనౌత్ యాక్షన్ చిత్రం 'ధాకడ్'లో కనిపించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తదుపరి బాబీ డియోల్‌తో 'పెంట్‌హౌస్'లో కనిపించనున్నాడు. దీంతో అర్జున్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ 'క్రాక్'లో నటించనున్నారు. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు...క్రేజీ కపుల్
-
నాలుగేళ్లుగా హీరోతో సహజీవనం.. నటికి రెండోసారి ప్రెగ్నెన్సీ!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ అనే రొమాంటిక్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. రాంపాల్ బాలీవుడ్లో దాదాపుగా 40కి పైగా చిత్రాల్లో నటించారు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నటుడు అర్జున్ రాంపాల్ మరో నటితో సహజీవన చేస్తున్నారు. తాజాగా రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ రెండోసారి గర్భం ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇవాళ యోగా డే సందర్భంగా గాబ్రియెల్లా బేబీబంప్‌తో యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) కాగా.. అర్జున్, గాబ్రియెల్లా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ జంట 2018లో తమ స్నేహితుల ద్వారా కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఈ జంటకు 2019లో తమ మొదట కుమారుడు అరిక్ రాంపాల్ జన్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి గర్భం ధరించినట్లు గాబ్రియెల్లా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. కాగా.. అర్జున్ రాంపాల్‌కు ఇది వరకే పెళ్లి కాగా.. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలు ఎవరు ఈ గాబ్రియెల్లా? అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన 'ఊపిరి' సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ కూడా ఓ పాత్రలో నటించింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. (ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) -
నాలుగున్నరేళ్లుగా నటుడితో సహజీవనం.. మీరిక పెళ్లి చేసుకోరా?
ప్రేమకు పెళ్లితో పనేంటి? అవును, మీరు విన్నది నిజమే.. ప్రేమకు పెళ్లితో పనేంటి? అంటున్నారు బాలీవుడ్ లవ్ బర్డ్స్ అర్జున్ రాంపాల్- గాబ్రెల్లా డెమట్రేడ్స్. ప్రేమించుకున్నాం, మాకు నచ్చినట్లుగా కలిసి జీవిస్తున్నాం.. ఇంకేంకావాలి? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ముందుకు సాగుతున్నారు. నాలుగున్నరేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంటకు ఓ బాబు సంతానం కాగా ప్రస్తుతం గాబ్రెల్లా రెండోసారి గర్భం దాల్చింది. అయితే పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవిస్తున్న ఈ జంటపై కొందరు నెటిజన్లు అదేపనిగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో తనను టార్గెట్ చేసిన ఓ నెటిజన్‌కు చురకలేసింది నటి. తాజాగా గాబ్రెల్లా వీకెండ్ అంటూ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె బేబీ బంప్ పిక్ కూడా ఉంది. ఇది చూసిన ఓ నెటిజన్.. 'మీరు ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? మీరు మీ దేశంలో లేరు ఇండియాలో ఉన్నారు. మీరిద్దరూ కలిసి యూత్‌ను చెడగొడుతున్నారు' అని కామెంట్ చేశాడు. దీనికి గాబ్రెల్లా స్పందిస్తూ.. 'అవును నిజమే, నీలాంటి మూర్ఖులకు బదులుగా అందమైన చిన్నారిని ఈ లోకంలోకి తీసుకువస్తుండటమే మేము చేసిన తప్పు' అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది. కాగా అర్జున్ రాంపాల్ గతంలో మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. 1998లో భార్యాభర్తలుగా కొత్త జీవితాన్ని ఆరంభించిన వీరిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత వీరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2019లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది గాబ్రెల్లాను తన ప్రేయసి అంటూ అభిమానులకు పరిచయం చేశాడు, అది కూడా తను గర్భం దాల్చిందన్న వార్తతో! View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) చదవండి: పెళ్లి పీటలెక్కిన బాలీవుడ్ నటి, ఫోటోలు వైరల్ -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు..క్రేజీ కపుల్
-
ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రేయసి, మోడల్ గార్బెల్లా డెమట్రేడ్స్ త్వరలో తల్లి కాబోతోంది. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని గార్బెల్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈమేరకు బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇది నిజమేనంటారా? లేదా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంటారా? అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన సెలబ్రిటీలు కాజల్, అమీ జాక్సన్.. సహా పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేయగా వారందరికీ గార్బెల్లా ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు, అదే ఏడాది.. కాగా అర్జున్ రాంపాల్ గతంలో మెహర్ జెసియాను పెళ్లాడాడు. 1998లో వైవాహిక బంధాన్ని ప్రారంభించిన వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2019లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది అర్జున్ తన ప్రేయసి గార్బెల్లాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు, అది కూడా తను గర్భం దాల్చిందన్న వార్తతో! 2019 జూలైలో గార్బెల్లా పండంటి బాబుకు జన్మనిచ్చింది. అతడికి అరిక్ రాంపాల్గా నామకరణం చేశారు. గార్బెల్లా నేపథ్యం ఇదీ.. కాగా గార్బెల్లా.. సౌత్ ఆఫ్రికన్ మోడల్ మాత్రమే కాదు ఒక డిజైనర్ కూడా! డీమ్ లవ్ పేరిట వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ఒక బ్రాండ్ ఉంది. అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే నెయిల్ పాలిష్, రావన్, ఓం శాంతి ఓం, రాక్ ఆన్, హీరోయిన్, రాజ్‌నీతి, ఇంకార్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ధాకడ్ సినిమాలో, ద ఫైనల్ కాల్ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) చదవండి: నాటు నాటు నా టాప్ 100 సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి -
భర్త నుంచి విడిపోయాక ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నా: నటి
భర్త అర్బాజ్‌ఖాన్‌తో 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికిన బాలీవుడ్ సీనియర్ నటి మలైకా అరోరా ఇప్పుడు మరింత ఆనందంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. పెళ్లి బంధం నుంచి విడిపోయాక తమ ఇద్దరికీ జీవితం పట్ల అవగాహన పెరిగిందని, మెరుగ్గా ఆలోచిస్తున్నామని పేర్కొంది. కాగా, 1998 డిసెంబర్లో పెళ్లి చేసుకున్న మలైక, అర్బాజ్‌ఖాన్ 2017లో పెళ్లి బంధానికి స్వస్తి పలికారు. ఆ తర్వాత ఆమె నటుడు అర్జున్ కపూర్‌తో, అతను జార్జియా యాండ్రియానితో రిలేషన్షిప్లో ఉన్నారు. 19 ఏళ్ల కుమారుడు అర్హాన్ ఖాన్‌కు తల్లిదండ్రులుగా బాధ్యతలు నెరవేరుస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. మాజీ భర్తతో మీరు టచ్‌లో ఉన్నారా? అని ప్రశ్నించగా మలైకా మాట్లాడుతూ.. నచ్చినట్టు బతకడమే జీవితమని ఆమె వ్యాఖ్యానించింది. జీవితంలో సంతోషం వెతుక్కోవాలని.. తన మాజీ భర్త, తాను అదే పని చేశామని చెప్పింది. అర్బాజ్‌ఖాన్ మంచి వ్యక్తి అని, అతను బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటానని తెలిపింది. ఇద్దరు వ్యక్తులు చాలా అంశాల్లో మంచివారై ఉండినప్పటికీ.. కలిసి బతికే విషయాల్లో ఆ రకంగా ఉండకపోవచ్చని.. తమ దాంపత్య జీవితంలో అదే జరిగిందని వెల్లడించింది. కుమారుడితో తనకు మంచి అనుబంధం ఉందని పేర్కొంది. తన నిర్ణయాలను అతను గౌరవిస్తాడని, తాను సంతోషంగా ఉంటే అర్హాన్ ఆనందిస్తాడని చెప్పింది. ‘విడాకుల విషయమై ముందుగా నేనే నిర్ణయం తీసుకున్నా. నాకు ఏది సరైంది అనిపించిందో అదే చేశా. మనసుకి నచ్చిన నిర్ణయాలు తీసుకోవాడానికి భయపడొద్దు. ఇబ్బందులు సహజం.. వాటిని దాటుకుని ముందుకెళ్లాలి. అందరినీ సంతోషపెట్టాలనుకోవడం కుదరదు’ అని మలైకా పేర్కొంది. ఇండియన్ బెస్ట్ డాన్సర్ షోకు ఆమె గతంలో జడ్జిగా వ్యవహరించింది. ఇక అర్బాజ్ సోని లివ్ షో ప్రసారం చేయనున్న పొలిటికల్ డ్రామా తానావ్లో నటిస్తున్నాడు. -
ప్రియురాలితో డేటింగ్, కొడుకు పుట్టినా పెళ్లి మాత్రం వద్దంటున్న నటుడు
బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ భార్య మెహర్ జెసియాకు విడాకులిచ్చిన తర్వాత నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్కు దగ్గరయ్యాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. వీరి ప్రేమకు గుర్తుగా కొడుకు కూడా పుట్టాడు. అతడికి అరిక్ అని నామకరణం చేసి పెంచుతున్నారు. అయితే జంటగా జీవిస్తున్నప్పటికీ తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం లేదంటున్నాడు అర్జున్. తమ బంధాన్ని నిరూపించుకోవడానికి కాగితం ముక్కలు అవసరం లేదని చెప్తున్నాడు. మా బంధాన్ని ధృవీకరించే వివాహం తన ప్రియురాలికి ఏమాత్రం ఇష్టం లేదని తెలిపాడు. అయినా మనసులు కలిసాయంటే దానర్థం మేము పెళ్లి చేసుకున్నట్లేనని తేల్చి చెప్పాడు. భార్యాభర్తల కన్నా తామేమీ తక్కువ కాదని పేర్కొన్నాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అర్జున్, గాబ్రియెల్ల ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2019లో గాబ్రియెల్లా గర్భం దాల్చిన సమయంలో వారి ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Arjun (@rampal72) -
డ్రగ్స్ కేసుతో నాకు సంబంధం లేదు: బాలీవుడ్ నటుడు
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ సోదరుడిని ఇటీవల నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అరెస్ట్ చేసింది. ఈ విషయం తెలిసి షాక్ అయ్యానని, ఈ కేసులోకి తన పేరు లాగొద్దని కోరాడు. ఈ విషయమై మీడియాకి ఓ ప్రకటనని విడుదల చేసిన అర్జున్..‘అగిసిలాస్ డెమెట్రియాడ్స్ (గాబ్రియెల్లా సోదరుడు) అరెస్టు విషయం తెలిసి షాక్ అయ్యాను. అతన కేవలం నా భాగస్వామి సోదరుడు మాత్రమే. అంతేకానీ అతనితో మరే విధమైన రిలేషన్షిప్ లేదు. ఈ కేసులోని నన్నులాగొద్దు’ అని తెలిపాడు. నటుడు, నటుడి కుటుంబం చట్టానికి లోబడి ఉండే పౌరులని, ఈ కేసులోకి తన పేరు తీసుకురావడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఇటీవల అగిసిలాస్ ఇంటిపై దాడి చేసి కొంత మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్సీబీ అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. డ్రైవ్ సమయంలో చరాస్, ఎల్ఎస్డి, ఎండిఎమ్ఎ/ఎక్స్టసీ వంటివి లభించడంతో అతడితో పాటు మరో నలుగురు డ్రగ్ డీలర్లపై మూడు ఎన్డీపీఎస్ కేసులను నమోదు చేసింది. చదవండి: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మలుపులు -
అర్జున్ ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే..
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్‌కు ఇటీవల ఎన్సీబీ మరోసారి సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. తదుపురి విచారణకు అర్జున్ హజరవ్వాల్సిందిగా ఎన్సీబీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అర్జున్ సోమవారం మధ్యాహ్నం ఎన్సీబీ ఎదుట హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అర్జున్ ఎన్సీబీకి ఇచ్చిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ నకిలీదని తేలితే అతడు అరెస్టు అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో వెలుగుచూసిన బాలీవుడ్ డ్రగ్ కేసును ముంబై పోలీసులు ఎన్సీబీకి అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో విచారణ చేపట్టి ఎన్సీబీ దర్యాప్తులో డ్రగ్ ప్లెడర్లతో అర్జున్‌కు సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గత నవంబర్ 9వ తేదిన అతడి ఇంటిలో దాడులు నిర్వహించిన ఎన్సీబీ కొన్ని అనుమానిత మందులతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకుని సమన్లు అందజేశారు. (చదవండి: అర్జున్ రాంపాల్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు) అయితే నవంబర్ నెలలో జరిగిన మొదటి విచారణలో అర్జున్ తన ఇంట్లో దొరికిన మందులు డాక్టర్ల సలహా మేరకు తీసుకుంటున్నట్లు చెప్పి దానికి సంబంధించిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను అధికారులకు ఇచ్చాడు. అయితే ఆ ప్రిస్క్రిప్షన్పై అనుమానం రావడంతో ఈ నెల 15న అర్జున్‌కు మరోసారి ఎన్సీబీ సమన్లు ఇచ్చి 16న విచారణకు హజరు కావాల్సిందిగా ఆదేశించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల తాను 21న విచారణకు హజరవుతానంటూ ఎన్సీబీని 16న గడువు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అర్జున్ ఈ రోజు మధ్యాహ్నం ఎన్సీబీ కార్యాలయానికి విచారణకు హజరయ్యాడు. అయితే ఈ విచారణలో అది నకిలీ ప్రిస్క్రిప్షన్ అని తేలితే అర్జున్ తప్పనిసరిగా అరెస్టును ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఎందుకంటే అర్జున్ ఇంట్లో దొరికిన అనుమానిత మందులను ఎన్సీబీ చట్టం ప్రకారం షెడ్యూల్లో చేర్చినవిగా ఎన్సీబీ గుర్తించింది. (చదవండి: మరోసారి ఎన్సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు) -
మరోసారి ఎన్సీబీ సమన్లు.. గడువు కోరిన నటుడు
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్ వ్యవహరంలో సంబంధాలు ఉన్నట్లు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మరోసారి అర్జున్‌కు మంగళవారం సమన్లు అందజేసి తదుపరి విచారణకు ఇవాళ(డిసెంబర్ 16) ఎన్సీబీ కార్యాలయంలో హజరుకావల్సిందిగా ఆదేశించింది. అయితే ఈ రోజు విచారణకు అర్జున్ హాజరకాలేదు. డిసెంబర్ 21వ తేదీ వరకు ఆయనకు గడువుకాలని ఎన్సీబీని కోరాడు. కాగా ఇప్పటికే ఈ కేసులో అర్జున్‌కు గత నవంబర్ 9న ఎన్సీబీ సమన్లు అందజేసి ఆయన ఇంటిపై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొద్ది గంటలపాటు ఆయన ఇంటిలో తనిఖీ చేసిన ఎన్సీబీ అధికారులు కొన్నీ డాక్యుమెంట్స్‌తో పాటు పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను స్వాధీనం చేసుకుని 13న విచారించింది. ఆ తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ గ్యాబ్రియోల్ డెమెట్రియేడ్స్‌కు కూడా సమన్లు అందజేసి విచారించారు. (చదవండి: అర్జున్ రాంపాల్‌కు మరోసారి సమన్లు) అయితే ఈ ఏడాది జూన్ 14న హీరో సుశాంత్ సింగ్ ముంబైలోని తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ డ్రగ్ వ్యవహరం వెలుగు చూసింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలైన రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి సుశాంత్‌కు డ్రగ్స్ ఇచ్చినట్లు ఆరోపణలు రుజువు కావడంతో వారిని పోలీసులు ఆరెస్టు చేశారు. విచారణలో రియా హీరోయిన్ దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌ల పేర్లను వెల్లడించడంతో ఎన్సీబీ వారికి కూడా సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ కేసులో అరెస్టెయిన రియా, ఆమె సోదరుడు షోవిక్‌లకు ఇటీవల బెయిల్ లభించగా సుశాంత్ ఇంటీ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్‌తో మరో ఇద్దరూ జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: రూ. 2.5 కోట్ల డ్రగ్స్ స్వాధీనం) -
అర్జున్ రాంపాల్‌కు మరోసారి సమన్లు
ముంబై: బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌కు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) మరోసారి సమన్లు ఇచ్చింది. సుశాంత్ మృతి కేసుతో వెలుగు చూసిన బాలీవుడ్ డ్రగ్ కేసుపై ఎన్సీబీ దర్యాప్తు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ డ్రగ్ ప్లెడర్లతో ఆర్జున్‌కు సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో గత నవంబర్‌లో ఎన్సీబీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 6 గంటల పాటు అర్జున్ విచారించి అధికారులు తాజాగా తదుపరి విచారణకు ఆదేశిస్తూ మరోసారి మంగళవారం సమన్లు అందజేసింది. రేపు(డిసెంబర్ 16) ఎన్సీబీకి కార్యాలయానికి విచారణకు హాజరకావాల్సిందిగా ఎన్సీబీ పేర్కొంది. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు) అంతేగాక గతనెలలోనే ఎన్సీబీ అధికారులు అర్జున్ ఇంటిలో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలపాటు అర్జున్ ఇంట్లో తనిఖీలు చేసిన అధికారులు పలు డాక్యుమెంట్లతో పాటు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నవంబర్ 9న అర్జున్‌కు నోటీసులు అందజేస్తూ.. 11వ తేదీన విచారణకు హజరుకావాల్సిందిగా ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అలాగే ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌కు కూడా అదే సమయంలో ఎన్సీబీ సమన్లు ఇచ్చి విచారించింది. (చదవండి: అర్జున్ను ఆరు గంటలు విచారించిన ఎన్సీబీ) -
అర్జున్ను ఆరు గంటలు విచారించిన ఎన్సీబీ
ముంబై: బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహరంలో నటుడు అర్జున్ రాంపాల్‌కు సంబంధం ఉందనే ఆరోపణలతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) ఆయనకు సమన్లు జారీ చేసి విచారణకు పిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నిన్న(శుక్రవారం) ముంబైలోని ఎన్సీబీ కార్యాలయంలో విచారణకు హజరయ్యారు. గత సోమవారం అర్జున్ నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొన్ని ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పాటు పలు అనుమానిత పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై ఆయనను నిన్న దాదాపు ఆరు గంటలపాటు ఎన్సీబీ విచారించింది. అనంతరం అర్జున్ మీడియాతో మాట్లాడుతూ... తాను పూర్తిగా ఎన్సీబీకి సహకరిస్తున్నానని చెప్పారు. అయితే డ్రగ్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ఇంట్లో దొరికిన ప్రిస్క్రిప్షన్ ద్వారా కొన్న మందులని స్పష్టం చేశారు. ఆ ప్రిస్క్రిప్షన్‌ను అధికారులను అందించానని కూడా అర్జున్ పేర్కొన్నారు. డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అధికారులు నిబద్ధతతో ఉన్నారని, వారి పని వారు చేసుకుంటున్నారని అధికారులను ప్రశంసించారు. ముఖ్యంగా అధికారుల్లో ఒకరైన సమీర్ వాఖేండే బాగా పని చేస్తున్నారన్నారు. అయితే ఆయన గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియేలా సోదరుడు అజియాలోస్ దిమిత్రియేడ్స్ను డ్రగ్స్ పెడ్లర్‌తో సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గాబ్రియేలాకు కూడా సమన్లు జారీ చేసిన ఎన్సిబీ విచారించింది. కాగా ఈ డ్రగ్స్ కేసులో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. వారిని విచారణకు పలిచిన ఎన్సీబీ ఆ తర్వాత వారికి డ్రగ్స్ ఎటువంటి సంబంధాలు లేవని క్లీన్చిట్ ఇచ్చింది. -
ఎన్సీబీ కార్యాలయానికి అర్జున్ గర్ల్‌ఫ్రెండ్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్ కేసులో ఇవాళ అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అదే విధంగా అర్జున్ రాంపాల్‌ను కూడా ఎన్సీబీ విచారించనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఎన్సీబీ అధికారులు ఆర్జున్ రాంపాల్ ఇంటిలో సోదాలు నిర్వహంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన డ్రైవర్‌ను కూడా విచారించారు. గత నెల బాలీవుడ్ డ్రగ్ పెడ్లర్‌తో సంబంధాలు ఉన్నాయని గాబ్రియెల్లా సోదరుడు అగిసిలాస్‌ను ఎన్సీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. దక్షిణాఫ్రికా జాతీయుడైన ఆమె సోదరుడు అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతడిని కస్టడీకి పంపారు. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు) చదవండి: అర్జున్ రాంపాల్‌కు ఎన్సీబీ నోటీసులు ఈ క్రమంలో గాబ్రియెల్లాకు కూడా బాలీవుడ్ డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఎన్సీబీ ఇవాళ ఆమెను విచారణ పలిపించింది. ఆమె తెలుగులో నాగార్జున, హీరో కార్తి నటించిన మల్లిస్టారర్ చిత్రం ‘ఊపిరి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇందులో ఆమె నాగార్జునకు ప్రియురాలిగా నటించారు. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలైన రియాకు డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని సుశాంత్, మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్ తదితరులను అరెస్ట్ చేశారు. 28 రోజుల రిమాండ్ తర్వాత రియాకు బెయిల్ మంజూరు కావడంతో ఆమె బయటకు రాగా... ఆమె సోదరుడితో పాటు ఇతరులు జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు
ముంబై: మాదక ద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) సోదాలు నిర్వహించింది. నవంబర్ 11న విచారణకు హాజరుకావ్సాలిందిగా ఎన్సీబీ రాంపాల్‌కి సమన్లు జారీచేసింది. సబర్బన్ బాంద్రాలోని ఆయన ఇంటి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఎన్సీబీ ఆయన డ్రైవర్‌ను విచారించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వాడకంపై ఎన్సీబీ విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. జూహూ ప్రాంతంలోని బాలీవుడ్ నిర్మాత ఫిరోజ్ నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, మాదకద్రవ్యాలు కలిగి ఉన్నారంటూ ఆయన భార్యని ఆదివారం అరెస్టు చేశారు. ఈ కేసులో ఎన్సీబీ ఎదుట హాజరైన నదియాద్వాలా తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదివరకే అరెస్టు అయిన వహీద్ అబ్దుల్ ఖాదిర్ షేక్ అలియాస్ సుల్తాన్ ఇచ్చిన సమాచారంతో ఎన్సీబీ అధికారులు నదియాద్వాలా ఇంటిపై దాడిచేసి, పది గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాదకద్రవ్యాల కేసులో ఎన్సీబీ, తాజాగా మరో ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. ఇప్పటివరకు 727.1 గ్రాము గంజా, 74.1 గ్రాముల ఇతర మాదకద్రవ్యాలను, రూ.3.58 లక్షల నగదును వారి వద్దనుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్సీబీ అధికారులు తెలిపారు. -
అర్జున్ రాంపాల్‌కు ఎన్సీబీ నోటీసులు
ముంబై : బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎస్సీబీ) అధికారులు నోటీసులు అందజేశారు. బాలీవుడ్‌కి డ్రగ్స్‌కి లింక్ ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయనకు ఈ నోటీసులు అందజేశారు. ఈ నెల 11న విచారణకు హాజరుకావాలని రాంపాల్‌కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. అంతకు ముందు ఎన్సీబీ అధికారులు అర్జున్ రాంపాల్ నివాసంపై దాడులు నిర్వహించారు. కొన్ని గంటల పాటు ఈ సోదాలు కొనసాగాయి. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు సంబంధించిన కొంత కీలక సమాచారాన్ని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాలను ముగిసిన కొద్దిసేపటికే ఆయనకు సమన్లను జారీ చేశారు. కాగా, ఆదివారం ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నడియాడ్ వాలా భార్యను అరెస్టు చేసి.. ఆ ఇంటినుంచి 10 గ్రాముల మార్జువానాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. తమముందు ఈ నెల 8 న హాజరు కావాల్సిందిగా కోరుతూ ఫిరోజ్ కు సమన్లు జారీ చేసినప్పటికీ ఆయన స్పందించలేదని ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ కి చెందిన మరికొందరి ఇళ్లలో తాము సోదాలు చేయనున్నామని ఎన్సీబీ అధికారులు తెలిపారు. -
సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆ దిశగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్సీబీ అతనిని రిమాండ్‌లోకి తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతనిని కస్టడీకి పంపారు. ఇప్పటికే సుశాంత్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్‌సావంత్ తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రియా ఈ కేసులు 28రోజుల జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలయ్యింది. వీరినే కాకుండా ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్ లాంటి వారిని కూడా ఎన్సీబీ విచారించింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్సీబీ కేసు నమోదు చేసింది. చదవండి: ప్రముఖ టీవీ ఛానెల్‌పై రూ.200 కోట్ల దావా -
వాళ్లకు విడాకులు మంజూరయ్యాయి!
ముంబై : బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, మాజీ సూపర్ మోడల్ మెహర్ జెసియా అధికారికంగా విడిపోయారు. బాంద్రా ఫ్యామిలీ కోర్టు ఈ జంటకు విడాకులు మంజూరు చేసింది. ‘రాక్ ఆన్’ ఫేమ్ అర్జున్ రాంపాల్ 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి భార్య మెహర్ జెసియాను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఆమె కూడా ఇందుకు సమ్మతం తెలపడంతో... ‘ ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో అందమైన ఙ్ఞాపకాలు ఉన్నాయి. ప్రస్తుతం మేం వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్నాం. కొత్త జీవితం ఆరంభించాలనుకుంటున్నాం అంటూ 2018లో సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించడంతో జడ్జి శైలజా సావంత్ ప్రత్యేక వివాహ చట్టం కింద వీరికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ముంబై మిర్రర్ కథనం ప్రచురించింది. కాగా అర్జున్ రాంపాల్ 1998లో మెహర్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు కుమార్తెలు మహిక(17), మైరా(13) ఉన్నారు. ఇక భార్యతో విడిపోనున్నట్లు ప్రకటించిన.. అనంతరం రాంపాల్ దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ ఏడాది జూలైలో ఆమె మగ బిడ్డకు జన్మనిచ్చింది. అతడికి అరిక్ అని నామకరణం చేశారు. కాగా ఐపీఎల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్‌కు పరిచయమైన గాబ్రియెల్లా పలు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది. అంతేకాకుండా నాగార్జున- కార్తి కాంబినేషన్లో తెరెకెక్కిన ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన సంగతి తెలిసిందే. -
నెటిజన్‌కు కౌంటర్ ఇచ్చిన హీరో
ముంబై పారిశ్రామిక నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. ముంబైలో ఇలాంటి వర్షాలు కురవడం ఇది మూడోసారి. ఈసారి వరదల్లో సాధారణ ప్రజలతో పాటు ప్రముఖ బాలీవుడ్ తారలు సైతం చిక్కుకోవడం గమనార్హం. వరదల్లో తమ పరిస్థితులను సైతం సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ వరదల్లో చిక్కుకున్న ఓ లగ్జరీ కారును ఉద్దేశిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ.. ఓ కామెంట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే అర్జున్ రాంపాల్ బుధవారం వరదల్లో కూరుకుపోయిన ముంబై వీధుల్లో కారులో వెళుతూ..‘ఖరీదైన లగ్జరీ కార్లు నీటిలో నడవడం చాలా కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఇండియా కార్లు మాత్రమే ముందుకు సాగగలవు. జాగ్రత్తగా నడపండి’ అంటూ పోస్ట్ చేశాడు. రెడ్ కలర్ మెర్సిడెస్ కారును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. దీనిపై స్పందించిన కొంతమంది నెటిజన్లు సోషల్‌మీడియాలో అర్జున్ను ట్రోల్ చేస్తూ విమర్శలకు దిగారు. దీనిపై స్పందించిన ఓ నెటిజన్ ‘ఏం మాట్లాడుతున్నారండి, అయితే మీరు మీ రేంజ్ రోవర్ కార్ వాడటం మానేసి మారుతి ఆల్టోని కొనండి’ అని ట్రోల్ చేశాడు. ఆ కామెంట్‌కు బదులుగా.. ‘ఈ వీడియో నా ఆల్టో నుంచే తీశాను’ అని సమాధానమిచ్చాడు. హాస్యాస్పదంగా పెట్టిన ఈ కామెంట్‌ను చూసిన తన అభిమానులంతా సరిగ్గా సమాధానం చెప్పావ్ అంటూ అర్జున్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. View this post on Instagram Only Indian cars survive in this weather. Be safe. Drive Indian. A post shared by Arjun (@rampal72) on Sep 4, 2019 at 6:52am PDT -
మూడోసారి తండ్రి అయిన హీరో!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మూడోసారి తండ్రి అయ్యాడు. అతడి గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్ గురువారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ జేపీ దత్తా కూతురు నిధి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో అర్జున్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ‘రాక్ ఆన్’ ఫేమ్ అర్జున్ రాంపాల్ 20 ఏళ్ల క్రితం మోడల్ మెహర్ జేసియాను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు మహిక(17), మైరా(13) ఉన్నారు. కాగా సుదీర్ఘ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన అర్జున్ భార్యను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్న కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అని ఈ దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే వీరికి ఇంకా విడాకులు మంజూరు కాలేదు. అయినప్పటికీ అర్జున్ దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇక ఐపీఎల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్‌కు పరిచయమైన గాబ్రియెల్లా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అదే విధంగా నాగార్జున ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. Congratulations @rampalarjun on the arrival of your bundle of joy! God bless! ❤️ pic.twitter.com/vWsPGMfLGY — Nidhi Dutta (@RealNidhiDutta) July 18, 2019 -
‘అందమైన భార్యను వదిలి.. ఇదేం పని?’
తన భర్త గర్ల్‌ఫ్రెండ్ తల్లికానున్న విషయాన్ని బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ భార్య మెహర్ జెసియా తేలికగా తీసుకున్నారని ఆమె సన్నిహితులు తెలిపారు. ఒక తల్లిగా తన పిల్లలకు మంచి భవిష్యత్తు ఏర్పరచడం పట్ల మాత్రమే ఆమెకు శ్రద్ధ ఉందని పేర్కొన్నారు. ‘రాక్ ఆన్’ ఫేమ్ అర్జున్ రాంపాల్ 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్పి భార్యను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్న కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అని ఈ దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే వీరికి ఇంకా విడాకులు మంజూరు కాలేదు. ప్రస్తుతం తన గర్ల్‌ఫ్రెండ్, దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో అర్జున్ సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో.. ‘ నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం. నాకు బేబిని ఇస్తున్నందుకు థ్యాంక్యూ బేబీ’ అంటూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా తాను మరోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని అర్జున్ అభిమానులతో పంచుకున్నాడు. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అర్జున్‌కు శుభాకాంక్షలు చెబుతుండగా.. మరికొంత మంది మాత్రం..‘ అందమైన భార్యను, ఇద్దరు కూతుళ్లను వదిలిపెట్టి ఇదేం పని. ఇలా చేయడం సరైందేనా’ అంటూ ప్రశ్నిస్తున్నారు. భార్య మెహర్‌తో అర్జున్ రాంపాల్ ఈ విషయంపై స్పందించిన అతడి భార్య మెహర్ స్నేహితులు మాట్లాడుతూ.. ‘ ఇంతవరకు వాళ్లిద్దరికి విడాకులు మంజూరు కాలేదు. కానీ అర్జున్ జీవితంలో ముందుకు సాగిపోయాడన్న నిజాన్ని మెహర్ అంగీకరించింది. ఆర్థిక పరమైన చిక్కుముడులు తొలగిన తర్వాత వారికి విడాకులు మంజూరయ్యే అవకాశం ఉంది. మెహర్ ప్రపంచంలోని గొప్ప తల్లులో ఒకరు. తన ఇద్దరు కూతుళ్లకు అత్యుత్తమ భవిష్యత్తు అందించేందుకు నిరంతరం శ్రమిస్తూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా 20 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న అర్జున్- మెహర్ దంపతులకు మహిక(17), మైరా(13) అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇక ఐపీఎల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్-గాబ్రియెల్లాలకు పరిచయమైంది. ఈ క్రమంలో ఆమెతో సహజీవనం మొదలుపెట్టిన అర్జున్ భార్యతో బంధానికి స్వస్తి పలికాడు. View this post on Instagram Blessed to have you and start all over again....thank you baby for this baby 👶🏽 A post shared by Arjun (@rampal72) on Apr 23, 2019 at 9:38am PDT -
బాలీవుడ్‌కు అమలాపాల్
తమిళసినిమా: సంచలనం అన్న పదానికి మారు పేరు అమలాపాల్ అని అనవచ్చు. ఎప్పుడూ ఒకేలా ఉండటం నావల్ల కాదు అని ముఖం మీద కొట్టినట్లు చెప్పగలిన నటి అమలాపాల్. దర్శకుడు విజయ్ను ప్రేమించి పెళ్లి చేసుకుని రెండేళ్లకే ఆ బంధానికి చెల్లు చీటి చెప్పేసిన సంచలన నటి అమలాపాల్. వైవాహిక జీవితంలో ఇంత జరిగినా ఆ ప్రభావం తన కేరీర్‌పై ఏమాత్రం పడకుండా జాగ్రత్త పడిన నటి ఈ కేరళ కుట్టి. పెళ్లి, సంసారం, విడాకులు అన్నీ దాటి హీరోయిన్గా రాణిస్తున్న అరుదైన నటి అమలాపాల్. ఆమె ప్రస్తుతం తమిళంలో రాక్షసన్, మలయాళంలో పృధ్వీరాజ్‌కు జంటగా ఒక చిత్రం చేస్తోంది. విషయమేమిటంటే తాజాగా ఆ అమ్మడికి బాలీవుడ్ అవకా«శం వరించిందన్నది సమాచారం. అవును దక్షిణాదిని చుట్టేసిన ఈ బామ ఇక బాలీవుడ్లో కలకలం సృష్టించడానికి రెడీ అవుతోంది. హిందీలో నరేశ్ మల్హోత్ర దర్శకత్వం వహించనున్న చిత్రంలో అర్జున్ రామ్‌పాల్‌కు జంటగా నటించడానికి అమలాపాల్ సిద్ధం అవుతోంది. ఈ చిత్ర కథ నచ్చడంతో నటించడానికి అంగీకరించినట్లు అమలాపాల్ పేర్కొంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్ర షూటింగ్ అక్టోబరు నెలలో హిమాలయాల్లో ప్రారంభం కానుందట. ఈ చిత్రం తరువాత మరిన్ని బాలీవుడ్ అవకాశాలు వస్తాయనే ఆశాభావాన్ని అమలాపాల్ వ్యక్తం చేస్తోంది. -
ప్రేమ ఎప్పటికీ ఉంటుంది
..అంటున్నారు బాలీవుడ్ కపుల్ అర్జున్ రామ్‌పాల్, మెహర్. 20 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకుల ద్వారా ఫుల్స్టాప్ పెట్టదలిచారీ జంట. పరస్పర అంగీకారం మీద వీళ్లిద్దరు విడిపోయారు. ఈ జంటకు మహికా, మైరా అనే ఇద్దరు కుమార్తెలున్నారు. విడాకుల గురించి ఈ కపుల్ మాట్లాడుతూ – ‘‘ప్రేమా, సంతోషం.. ఇలా అందమైన జ్ఞాపకాలతో నిండిన ఈ 20 ఏళ్ల పయాణం తర్వాత అన్ని జర్నీలు ఒకటే పాత్లో సాగవు అని తెలుసుకున్నాం. ఇది విడిపోయే సమయమని మేం అర్థం చేసుకున్నాం. విడిపోయినా ఒకరికొకరం ఎప్పుడూ తోడుగానే ఉంటాం. ముఖ్యంగా మా పిల్లల కోసం. రిలేషన్షిప్ ఎండ్ అవ్వొచ్చు కాని ప్రేమ ఎప్పటికీ ఉంటుంది’’ అని పేర్కొన్నారు. -
అవును.. 20 ఏళ్ల తర్వాత విడిపోతున్నాం
సాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో బ్రేకప్ ఖాయమైపోయింది. నటుడు అర్జున్ రామ్‌పాల్(45) తన భార్య మెహర్ జెసియా(47) నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. మూడేళ్లుగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావటం, జంటగా కనిపించి ఆ వార్తలను పటాపంచల్ చేస్తూ వచ్చారు . అయితే ఈసారి మాత్రం దానిని నిజం చేస్తూ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘20 ఏళ్ల అందమైన ప్రయాణం తర్వాత పరస్పర అంగీకారంతో మేం విడిపోవాలనుకుంటున్నాం. వీటి వెనుక కారణాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. వేర్వేరు దారుల్లో వెళ్దామనుకుంటున్నాం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నప్పటికీ మాకు కావాల్సిన వాళ్ల కోసం మా మధ్య బంధం కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తన కంటే వయసులో పెద్ద అయిన మోడల్ మెహర్ జెసియాను 1998లో అర్జున్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు మహీకా(16), మైరా(13). మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అర్జున్ రామ్‌పాల్.. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్(2001) చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టిన అర్జున్ రామ్‌పాల్.. దీవానపన్, ఆంఖే, దిల్ హై తుమ్హారా, దిల్ కా రిష్తా తదితర చిత్రాల్లో నటించారు. డాన్, ఓం శాంతి ఓం, రాక్ ఆన్, హౌజ్‌ఫుల్, రాజ్‌నీతి, రా వన్, హీరోయిన్ చిత్రాల్లో అర్జున్ నటనకు మంచి పేరు దక్కింది. ఆ మధ్య డాడీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అర్జున్ రామ్‌పాల్, పల్తాన్తో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు. -
నిర్భయ కేసులో బుక్కైన హీరో బావ
సాక్షి, ముంబై : ఎయిర్‌హోస్టెస్‌కు మత్తుమందు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో అతను బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ బావ అని తేలటంతో వ్యవహారం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై మిర్రర్ కథనం ప్రకారం.. ఇన్వెస్టర్ అయిన అమిత్ గిల్‌కు నటుడు అర్జున్ రామ్‌పాల్ సోదరి కోమల్‌తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌లో పని చేసే ఎయిర్‌హోస్టెస్ ఒకరు గిల్‌ను నమ్మి రూ.18 లక్షలు పెట్టుబడి పెట్టింది. అయితే తర్వాత గిల్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో ఆమె నిలదీయగా.. గిల్ ఆమెకు ఓ చెక్ ఇచ్చాడు. అది కాస్త బౌన్స్ కావటంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తానని అతన్ని బెదిరించింది. దీంతో రూ. 12 లక్షలు చెల్లించాడు. ఇక మిగిలిన సొమ్ము కోసం ఆమెను పదే పదే తన ఆఫీస్ చుట్టూ తిప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఓరోజు ఆఫీస్‌కు వచ్చిన ఆమెకు మత్తు మందు కలిపిన కూల్ డ్రింకు ఇచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆపై ఆమెను నగ్నంగా ఫోటోలు తీసి వేధించటం ప్రారంభించాడు. రెండేళ్లపాటు అతని వేధింపులను భరించిన ఆమె చివరకు సాంటాక్రూజ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో అతని వేధింపులు నిజమని తేలటంతో చివరకు అతన్ని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనపై స్పందించేందుకు రామ్‌పాల్ నిరాకరించారు. అమిత్ గిల్‌పై నిర్భయ కేసు దాఖలు చేసినట్లు ముంబై కమీషనర్ వెల్లడించారు. -
ఇన్ని మెసేజ్‌లా.. నేనెవరిపై దాడి చేయలేదు: నటుడు
ముంబై: ‘పొద్దున్న లేచి చూడగానే.. నేను అభిమానిపై దాడి చేసినట్టు వరదలా మెసేజ్‌లు వచ్చిపడ్డాయి. ఎవరు వీళ్లు? ఎందుకిలా వార్తలు సృష్టిస్తారు. నేనెవరిపై దాడి చేయలేదు. ఫేక్ న్యూస్’ ఇది బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ చేసిన ట్వీట్. తాను ఓ అభిమానిపై దాడి చేసినట్టు పోలీసు కేసు నమోదు కావడంతో ఆయన ఈ మేరకు వివరణ ఇచ్చారు. అర్జున్ రాంపాల్ తనపై దాడి చేసినట్టు షాబిత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబైలోని షాంగ్రీ-లా హోటల్ నైట్‌క్లబ్‌లో అర్జున్ రాంపాల్ డీజేగా ఉండగా ఆదివారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నైట్‌క్లబ్‌లో రాంపాల్ ఎంత వద్దని వారిస్తున్నా ఫొటోగ్రాఫర్ ఫొటోలు తీసేందుకు ప్రయత్నించడంతో.. చిర్రెత్తుకొచ్చిన రాంపాల్ అతని కెమెరాను లాక్కొని జనాల్లోకి విసిరాడు. అది జనాలు క్యాచ్ చేస్తారని రాంపాల్ అనుకున్నప్పటికీ.. అది కాస్తా వెళ్లి షాబిత్ అనే వ్యక్తికి తాకింది. దీంతో తనకు గాయమైందని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రస్తుతం నైట్ క్లబ్ సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు. -
వివాదంలో ప్రముఖ నటుడు.. కేసు నమోదు
ముంబై: బాలీవుడ్ ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఆ హీరోపై దాడి కేసు నమోదైంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. మోడల్ గా కెరీర్ ఆరంభించి ఆపై కొన్ని సినిమాల్లో హీరోగా నటించిన రాంపాల్ 2000 దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగాడు. నిర్మాతగానూ రాంపాల్ కొన్ని సినిమాలను రూపొందించాడు. ప్రస్తుతం టెలివిజన్ షోలతో బిజీగా ఉన్న అర్జున్ రాంపాల్ ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఓ ఫొటోగ్రాఫర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ వివాదం ముదిరి పోలీస్ స్టేషన్ కు చేరింది. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన ఈవెంట్లో ఓ ఫొటోగ్రాఫర్ రాంపాల్ వద్దకు వచ్చాడు. నటుడు వద్దని ఎంత వారిస్తున్నా ఫొటోగ్రాఫర్ కెమెరాకు పని చెబుతూ.. ఫొటోలు తీశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన రాంపాల్ మొదట ఫొటోగ్రాఫర్ చేతిలో కెమెరాను తీసుకుని విసిరికొట్టడంతో అది పాడయింది. దీంతో వెంటనే రాంపాల్ ను ప్రశ్నించగా.. తనపై దాడికి పాల్పడి గాయపరిచాడని బాధిత ఫొటోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించాడు. తనకు న్యాయం చేయాలని కోరుతూ నటుడు రాంపాల్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
ఆ పార్టీ ప్రచార బరిలో సినీ దిగ్గజాలు!
రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి సినీ గ్లామర్ తోడయ్యే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ సినీస్టార్లను ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మంగళవారం బాలీవుడ్ ప్రముఖులు అర్జున్ రాంపాల్, జాకీష్రఫ్ న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద కనిపించారు. ఈ ఇద్దరు నటులు కూడా పార్టీ కార్యాలయం బీజేపీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ మీడియాతో మాట్లాడుతూ తాను రాజకీయ నాయకుడిని కాదని, బీజేపీలో చేరే ఉద్దేశం తనకు లేదని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశం కోసం మంచి పనులు చేస్తున్నదని, వాటికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పథకాలైన స్వచ్ఛభారత్, పెద్దనోట్ల రద్దుకు తాను గట్టిగా మద్దతునిస్తున్నట్టు తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు తాను సిద్ధమేనంటూ సంకేతాలు ఇచ్చారు. -
నవంబర్ 26న పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు
ఈరోజు మీతోపాటు పుట్టినరోజు జరుపుకొంటున్న ప్రముఖులు అర్జున్ రాంపాల్ (యాక్టర్) ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 9. ఇది కుజునికి సంబంధించినది. 9 అంకె పరిపూర్ణతకు, సంతృప్తికి, కార్యసిద్ధికి సంకేతం కాబట్టి కొత్త ఆశలు, ఆశయాలతో జీవితం ప్రారంభించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీరు కోరినవి లభిస్తాయి. అయితే కుజుని ప్రభావం వల్ల దూకుడుగా వ్యవహరించడం, నిర్మొహమాటంగా మాట్లాడటం మూలాన ఇతరులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతర కులస్థులతో ప్రేమ వ్యవహారాల వల్ల కొంత చికాకు కలుగుతుంది. అయితే దీనిని సామరస్యంగానే పరిష్కరించుకోవాలి. పదునైన ఆయుధాల వాడకంలోనూ, వాహనాలు నడిపేటప్పుడూ, నిప్పుతోనూ అప్రమత్తంగా ఉండకపోతే ముప్పు తప్పదు. పుట్టిన తేదీ 26. ఇది శనికి సంబంధించినది కావడం వల్ల ఈరోజు పుట్టిన వారికి ఆయా వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధికరంగా సాగుతాయి. అయితే దేనిమీదా అతిగా ఆశలు పెట్టుకోవడం అంత మంచిది కాదు. అవివాహితులకు వివాహయోగం, నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి ఉన్నాయి. ఇనుము, ఐరన్ అండ్ స్టీల్, ఆయిల్ వ్యాపారులకు అభివృద్ధికరంగా ఉంటుంది. లక్కీ నంబర్స్: 1,2,3,6,8,9; లక్కీ డేస్: ఆది, సోమ, మంగళ, శుక్ర, శనివారాలు; లక్కీ కలర్స్: వైట్, సిల్వర్, రెడ్, ఆరంజ్, బ్లూ, బ్లాక్, పర్పుల్. సూచనలు: సుబ్రహ్మణ్యేశ్వరునికి అభిషేకం, సుదర్శన హోమం చేయించడం, ఇంటిలో ఖురాన్ పఠన చేయించడం లేదా ప్రేయర్ పెట్టించడం, రక్తదానం చేయడం, తల్లిని, తోబుట్టువులను ఆదరించడం, అనాథలకు మందులు పంపిణీ చేయడం, కాకులకు, కోతులకు ఆహారం పెట్టడం, వృద్ధులను ఆదరించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ -
'ఆ హీరోతో రెండో పెళ్లి వార్తలు అబద్ధం'
ముంబై: మరోసారి పెళ్లి చేసుకునే ఆలోచన లేదని బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నె ఖాన్ చెప్పారు. హృతిక్ స్నేహితుడు, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇటీవల వచ్చిన వార్తలను ఖండించారు. ఇలాంటి వదంతులు మనోవేదన కలిగిస్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హృతిక్, సుసాన్నె నాలుగేళ్లు డేటింగ్ చేశాక 2000లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే 2013లో హృతిక్, సుసాన్నె జంట విడిపోయారు. హృతిక్, సుసాన్నెలు విడిపోవడానికి అర్జున్ రాంపాలే కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. సుసాన్నె, అర్జున్ ఇటీవల ఓ కాఫీ షాప్‌లో కనబడ్డారు. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు ఊహాగానాలు వచ్చాయి. అయితే హృతిక్‌తో తాను విడిపోవడానికి ఎవరూ కారణం కాదని, పెళ్లికి సంబంధించిన వార్తలు నిరాధారమని సుసాన్నె స్పష్టం చేశారు. -
సెట్స్ మీదకు 'ఆంకేన్ 2'
వెల్ కం బ్యాక్ సినిమా సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న దర్శకుడు అనీష్ బజ్మీ మరో ఆసక్తికరమైన సినిమా ఎనౌన్స్ చేశాడు. పదేళ్ల క్రితం రిలీజ్ అయిన ఓ థ్రిల్లర్ క్రైమా డ్రామాకు సీక్వల్ రూపొందిచే పనిలోఉన్నాడు దర్శకుడు. అప్పట్లో బాలీవుడ్ టాప్ స్టార్స్ నటించిన ఈ సినిమాను మరోసారి అదే స్ధాయిలో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నాడు అనీష్ బజ్మీ. 'ఆంకేన్'.. 2002 లో రిలీజ్ అయిన ఈ థ్రిల్లర్ మూవీ అప్పట్లో సెన్సేషన్ సృష్టించింది. ముగ్గురు గుడ్డి వాళ్లు ఒక బ్యాంక్ దొంగతనం చేయటం అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ లు మాత్రమే వస్తున్న ఆ సమయంలో ఆడియన్స్ కు ఆంకేన్ ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. ముఖ్యంగా అంధులుగా అక్షయ్ కుమార్, అర్జున్ రామ్ పాల్, పరేష్ రావల్ ల నటన సూపర్బ్. ఇక వాళ్లను ట్రైన్ చేసి దొంగతనం చేయించే గైడ్ పాత్రం అమితాబ్ తన మార్క్ చూపించాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న స్టార్ ఇమేజ్ కారణంగా అక్షయ్, అర్జున్ రామ్‌పాల్ లు ఈ సినిమాలో నటించే అవకాశం కనిపించటం లేదు.. దీంతో యువ కథానాయకలను ఎంపిక చేయాలని భావిస్తున్నారట.. అమితాబ్ పాత్రను మాత్రం మరోసారి బిగ్ బి తోనే చేయించాలని ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు అనీష్ బజ్మీ. -
ఆ నట దంపతులు విడిపోతున్నారట!
ముంబయి: ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఆయన భార్య, మాజీ మిస్ ఇండియా మెహర్ జెస్సియా త్వరలో విడిపోనున్నారని బాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి. వారి మధ్య బేధాబిప్రాయాలు తారా స్థాయిలో వచ్చాయని వారి వ్యక్తిగత జీవితాన్ని గురించి అంతా బాహటంగానే చెప్పుకుంటున్నారు. వారిద్దరు ఇప్పటికే వారిద్దరు విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. అయితే, వీరిద్దరు విడిపోవడానికి కారణం మాత్రం సుసాన్ ఖాన్ అని చెప్పుకుంటున్నారు. ఆమె వల్లే ఆ దంపతుల మధ్య వివాదం తలెత్తిందట. ఇక అర్జున్ రాంపాల్ గత కొంతకాలంగా విడిగానే ఉంటున్నారని చెప్తున్నారు. ఇదిలా ఉండగా, ఈసారి తాను స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను న్యూయార్క్‌లో జరుపుకుంటున్నట్లు రాంపాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. -
బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌కు నోటీసులు
ముంబయి : బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌కు ముంబయి పోలీసులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గావ్లీతో సంబంధాలపై పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. గత నెలలో అనుమతి లేకుండా అరుణ్ గావ్లీని కలిసినందుకు పోలీసులు అర్జున్ రాంపాల్‌కు నోటీసులు ఇచ్చారు. కాగా కార్పొరేటర్ కమ్లాకర్ జమ్సందేకర్ హత్య కేసులో అరుణ్ గావ్లీ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా అర్జున్ రాంపాల్ 'డాడీ' చిత్రంలో డాన్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం గావ్లీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాలోని సన్నివేశాలను మరింత రక్తి కట్టించేందుకు అర్జున్ రాంపాల్... అరుణ్ గావ్లీ దగ్గర కొన్ని టిప్స్ తీసుకున్నట్లు సమాచారం. డిసెంబర్ 29న జేజే ఆస్పత్రిలో అవుట్ పేషెంట్‌గా ఉన్న అర్జున్ గావ్లీతో సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోకుండా సుమారు గంటపాటు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ముంబయి పోలీసులు తమ నోటీసులో పేర్కొన్నారు. -
భారత్ లో సల్మానే కండలవీరుడు!
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, అర్జున్ రాంపాల్ లపై కండలవీరుడు సల్మాన్ పైచేయి సాధించారు. ఆన్ లైన్ ఓ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో ఫిజికల్ ఫిట్ నెస్, ఆరోగ్యవంతంగా ఉన్న నటుడుగా సల్మాన్ ఖాన్ కు అత్యధిక మంది ఓటు వేశారు. దాదాపు 30 వేల మంది పైగా ఈ సర్వేలో పాల్గోన్నారు. ఈ సర్వేలో సల్మాన్ ఖాన్ 43.36 శాతం, హృతిక్ కు 42.81 శాతం ఓట్లు లభించాయి. ఆతర్వాత స్థానాల్లో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, షాహీద్ కపూర్ లు నిలిచారు. -
హృతిక్, సుజానేల విడాకులకు కారణమెవరు?
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానే విడిపోతున్నారన్న వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. హృతిక్, సుజానే విడిపోవడం వెనుక అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. 17 ఏళ్ల స్నేహం, 13 సంవత్సరాల దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పడటం వెనుక అనేక కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. సుజానేకు అత్త, మామలతో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకోవడం ఒకటైతే.. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ మరో కారణమని తెలుస్తోంది. అత్తారింటి వారితో విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో వేరు కాపురానికి హృతిక్ పై సుజానే చాలాకాలంగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, తన తల్లిదండ్రులు, విడాకులు పొందిన తన సోదరిని వదిలి బయటకు రావడం ఇష్టం లేక.. సుజానే నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో వారి మధ్య మరింత అగాధం పెరిగిందని తెలుస్తోంది. హాలీవుడ్ నటి బార్బారా మోరీతో హృతిక్ సన్నిహిత సంబంధం కూడా వారు విడిపోవడానికి కారణమైందని మరో వాదన. అత్తారింటిలో ఉండటం ఇష్టం లేక గత మూడు నెలల నుంచి హృతిక్, సుజానేలు విడివిడిగా ఉంటున్నట్టు తెలిసింది. ఇక ఎన్నో ఏళ్లుగా రోషన్, రాంపాల్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అర్జున్, అతని సతీమణి మెహర్ లు సుజానేకు క్లోజ్ ఫ్రెండ్స్. సుజానే, హృతిక్ ల మధ్య విబేధాలు తలెత్తినా సుజానే తల్లితండ్రులు ఈ విషయంపై రాంపాల్ తో చర్చించడానికి ఇష్టపడలేదని మరో వాదన. హృతిక్, సుజానేలు విడిపోవడంపై స్పందించాలని మీడియా ఫోన్ లో కోరగా అందుకు అర్జున్ రాంపాల్ ఆగ్రహించినట్టు తెలిసింది. ఏది ఏమైనా.. కారణాలేమైనా..17 ఏళ్ల హృతిక్, సుజానేల ప్రేమకథ ట్రాజేడిగా ముగియనుంది.