బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ భార్య మెహర్ జెసియాకు విడాకులిచ్చిన తర్వాత నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌కు దగ్గరయ్యాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. వీరి ప్రేమకు గుర్తుగా కొడుకు కూడా పుట్టాడు. అతడికి అరిక్ అని నామకరణం చేసి పెంచుతున్నారు. అయితే జంటగా జీవిస్తున్నప్పటికీ తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం లేదంటున్నాడు అర్జున్.
తమ బంధాన్ని నిరూపించుకోవడానికి కాగితం ముక్కలు అవసరం లేదని చెప్తున్నాడు. మా బంధాన్ని ధృవీకరించే వివాహం తన ప్రియురాలికి ఏమాత్రం ఇష్టం లేదని తెలిపాడు. అయినా మనసులు కలిసాయంటే దానర్థం మేము పెళ్లి చేసుకున్నట్లేనని తేల్చి చెప్పాడు. భార్యాభర్తల కన్నా తామేమీ తక్కువ కాదని పేర్కొన్నాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అర్జున్, గాబ్రియెల్ల ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2019లో గాబ్రియెల్లా గర్భం దాల్చిన సమయంలో వారి ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment