Gabriella Demetriades
-
అబ్బాయిలు ఇడియట్స్.. అప్పటిదాకా ఆగి పెళ్లి చేసుకోండి: నటుడు
చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం వల్లే విడాకులు తీసుకోవాల్సి వచ్చిందంటున్నాడు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. నేను విచ్ఛిన్నమైన కుటుంబం నుంచి వచ్చాను. అక్కడ బంధాలు తెగిపోవడమే చూశాను. కానీ ఎందుకలా జరుగుతున్నాయనేది అర్థం చేసుకోలేకపోయాను. నాదాకా వస్తే కానీ అన్నీ అవగతం కాలేదు. అయినా విడాకులు తీసుకోవడానికి పూర్తి బాధ్యత నాదే! నాది చిన్న వయసునాకు 24 ఏళ్లు ఉన్నప్పుడే పెళ్లి చేశారు. పెళ్లి చేసుకోవడానికి అది చాలా చిన్న వయసు. ఇంకా నేర్చుకోవాల్సిన విషయాలెన్నో ఉంటాయి. పూర్తిగా మెచ్యూరిటీ వచ్చాకే వైవాహిక బంధంలో అడుగుపెట్టాలి. అమ్మాయిల కన్నా అబ్బాయిలు చాలా నెమ్మదిగా పరిణతి చెందుతారు. మేము ఇడియట్స్ అని ఇక్కడే తెలిసిపోతోంది. మూడుముళ్ల బంధం విజయవంతం కావాలంటే ఆ సమయం వచ్చేదాకా ఆగిన తర్వాతే పెళ్లి చేసుకోవాలి.పెళ్లి- విడాకులుపెళ్లనేది కేవలం ఒక పేపర్ ముక్కలాంటిదే. నా దృష్టిలో నా ప్రియురాలు గాబ్రియెల్లాకు, నాకు పెళ్లయిపోయినట్లే. తనతో నా మాజీ భార్య ఎంతో క్లోజ్‌గా ఉంటుంది. పిల్లలందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు అని చెప్పుకొచ్చాడు. ఈయన 1998లో నిర్మాత మెహర్ జెసియాను పెళ్లి చేసుకున్నాడు. వీరికి మహిక, మైరా అనే ఇద్దరు కూతుర్లు జన్మించారు. దంపతుల మధ్య విభేదాలు రావడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నారు.సినిమాలు..అదే సంవత్సరం నటి గాబ్రియెల్లా డెమట్రియాడెస్తో రిలేషన్లో ఉన్నట్లు ప్రకటించడంతో పాటు వీరికి ఒక బాబు పుట్టాడు. 2023లో మరోసారి బాబు జన్మించాడు. బాలీవుడ్లో అనేక చిత్రాల్లో నటించిన ఇతడు భగవంత్ కేసరి మూవీతో గతేడాది తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ద బ్యాటిల్ ఆఫ్ కొరెగావ్, నాస్తిక్, 3 మంకీస్, దురంధర్ మూవీస్ చేస్తున్నాడు.చదవండి: రూ.3 లక్షలిస్తేనే ప్రమోషన్స్.. హీరోయిన్‌పై నిర్మాత ఫైర్! -
పెళ్లి కాకుండానే రెండోసారి బిడ్డకు జన్మనిచ్చిన నటి!
నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో రిలేషన్లో ఉంది. కాగా.. ఇప్పటికే 2019లో ఈ జంటకు అరిక్ రాంపాల్ అనే కుమారుడు జన్మించారు. దీంతో దాదాపు 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు బాలీవుడ్ నటుడు రాంపాల్. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. కాగా.. 2018లో ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన వీరిద్దరు రిలేషన్లో ఉన్నారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) అర్జున్ రాంపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను, నా కుటుంబం ఓ అందమైన బిడ్డకు స్వాగతం పలికాం. ప్రస్తుతం తల్లీ, కొడుకులిద్దరూ క్షేమంగానే ఉన్నారు. అద్భుతంగా సేవలందించిన వైద్యులు, నర్సులకు నా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా.. నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన ఊపిరి చిత్రంలో కీలకపాత్రలో నటించింది. 2018 నుంచి ఈ జంట రిలేషన్లో ఉన్నారు. కాగా.. అర్జున్‌కు మొదటి భార్య మెహర్ జెసియాకు మహికా రాంపాల్, మైరా రాంపాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ జంట 2019లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అర్జున్ చివరిగా కంగనా రనౌత్ యాక్షన్ చిత్రం 'ధాకడ్'లో కనిపించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తదుపరి బాబీ డియోల్‌తో 'పెంట్‌హౌస్'లో కనిపించనున్నాడు. దీంతో అర్జున్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ 'క్రాక్'లో నటించనున్నారు. (ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్ఫుల్ డైలాగ్ లీక్..!) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) View this post on Instagram A post shared by Arjun Rampal (@rampal72) -
పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలు...క్రేజీ కపుల్
-
నాలుగేళ్లుగా హీరోతో సహజీవనం.. నటికి రెండోసారి ప్రెగ్నెన్సీ!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బీ టౌన్లో పరిచయం అక్కర్లేని పేరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్ అనే రొమాంటిక్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. రాంపాల్ బాలీవుడ్లో దాదాపుగా 40కి పైగా చిత్రాల్లో నటించారు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నటుడు అర్జున్ రాంపాల్ మరో నటితో సహజీవన చేస్తున్నారు. తాజాగా రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ రెండోసారి గర్భం ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇవాళ యోగా డే సందర్భంగా గాబ్రియెల్లా బేబీబంప్‌తో యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) కాగా.. అర్జున్, గాబ్రియెల్లా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ జంట 2018లో తమ స్నేహితుల ద్వారా కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఈ జంటకు 2019లో తమ మొదట కుమారుడు అరిక్ రాంపాల్ జన్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి గర్భం ధరించినట్లు గాబ్రియెల్లా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. కాగా.. అర్జున్ రాంపాల్‌కు ఇది వరకే పెళ్లి కాగా.. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అసలు ఎవరు ఈ గాబ్రియెల్లా? అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన 'ఊపిరి' సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ కూడా ఓ పాత్రలో నటించింది. సౌత్ ఆఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. (ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) -
ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రేయసి, మోడల్ గార్బెల్లా డెమట్రేడ్స్ త్వరలో తల్లి కాబోతోంది. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని గార్బెల్లా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈమేరకు బేబీ బంప్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇది నిజమేనంటారా? లేదా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ అంటారా? అని తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన సెలబ్రిటీలు కాజల్, అమీ జాక్సన్.. సహా పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేయగా వారందరికీ గార్బెల్లా ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చింది. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు, అదే ఏడాది.. కాగా అర్జున్ రాంపాల్ గతంలో మెహర్ జెసియాను పెళ్లాడాడు. 1998లో వైవాహిక బంధాన్ని ప్రారంభించిన వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2019లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది అర్జున్ తన ప్రేయసి గార్బెల్లాను సోషల్ మీడియా వేదికగా పరిచయం చేశాడు, అది కూడా తను గర్భం దాల్చిందన్న వార్తతో! 2019 జూలైలో గార్బెల్లా పండంటి బాబుకు జన్మనిచ్చింది. అతడికి అరిక్ రాంపాల్గా నామకరణం చేశారు. గార్బెల్లా నేపథ్యం ఇదీ.. కాగా గార్బెల్లా.. సౌత్ ఆఫ్రికన్ మోడల్ మాత్రమే కాదు ఒక డిజైనర్ కూడా! డీమ్ లవ్ పేరిట వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ఒక బ్రాండ్ ఉంది. అర్జున్ రాంపాల్ విషయానికి వస్తే నెయిల్ పాలిష్, రావన్, ఓం శాంతి ఓం, రాక్ ఆన్, హీరోయిన్, రాజ్‌నీతి, ఇంకార్ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ధాకడ్ సినిమాలో, ద ఫైనల్ కాల్ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. View this post on Instagram A post shared by Gabriella Demetriades (@gabriellademetriades) చదవండి: నాటు నాటు నా టాప్ 100 సాంగ్స్ లిస్టులోనే లేదు: కీరవాణి -
Fashion: సెలెబ్రిటీస్ బ్రాండ్.. మౌనీ రాయ్ కట్టుకున్న ఈ చీర ధరెంతో తెలుసా?
మొహంలో అమాయకత్వం.. పోషించే పాత్రలో ఆటిట్యూడ్.. ఈ రెండిటినీ ఐడెంటిటీగామలచుకున్న హిందీ నాయిక .. మౌనీ రాయ్. దేశమంతా పరిచయం ఉన్న నటి. ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె గుర్తించే బ్రాండ్స్ ఇవే.. ది హౌస్ ఆఫ్ రోజ్ నగల వ్యాపారానికి ఓ గ్రామర్ సెట్ చేసిన బ్రాండ్ ఇది. దీన్ని బీరెన్ వైద్య అనే జ్యూయెలరీ డిజైనర్ సోదరి పూరిమా సేథ్ స్థాపించారు. 1981లో.. ముంబై, ఓపెరా హౌస్‌లోని చిన్న గదిలో మొదలైన ఆ ప్రస్థానం తక్కువ కాలంలోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. వైవిధ్యమైన డిజైన్, నాణ్యతే దీని బ్రాండ్ వాల్యూ. ఢిల్లీలోనూ దీనికో స్టోర్ ఉంది. లండన్, హాంకాంగ్, ఖతార్, బహెరైన్, దుబాయ్, అబీధాబూల్లో క్రమం తప్పకుండా జ్యూయెలరీ ఎగ్జిబిషన్స్‌ను నిర్వహిస్తూ ఉంటుంది. దీని చరిత్ర ఎంత ఘనమో నగల ధరా అంతే ఘనం. జ్యూయెలరీ బ్రాండ్: ది హౌస్ ఆఫ్ రోజ్ డెమె బై గాబ్రియేలా ఏ అవుట్ ఫిట్‌లో ఉన్నా స్టయిల్ ఐకాన్‌గా.. వందమందిలో ప్రత్యేకంగా వెలిగిపోతున్నారంటే కచ్చితంగా ఆ ఘనత ‘డెమె బై గాబ్రియేలా’దే అయుంటుంది. ఈ కితాబే ఆ బ్రాండ్ వాల్యూ. దీని హక్కుదారు, అధికారి ప్రముఖ మోడల్, నటి గాబ్రియేలా డెమెట్రియాడ్స్. దక్షిణ ఆఫ్రికా దేశస్థురాలు. మోడలింగ్ అవకాశాలను వెదుక్కుంటూ ముంబై వచ్చింది. 2009లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగమైంది. పేరెన్నికైన ఎన్నో బ్రాండ్లకు మోడలింగ్ చేసింది. ఫ్యాషన్ పట్ల మక్కువే కాదు.. స్టయిల్ పట్ల సెన్స్ కూడా ఎక్కువే. ఆ లక్షణాలే ఆమెను డిజైనింగ్ వైపు పురిగొల్పాయి. అలా 2012లో తన పేరు మీదే ‘డెమె బై గాబ్రియేలా’ బ్రాండ్‌ను ప్రారంభించింది. నిజానికి ఇది సెలెబ్రిటీస్ బ్రాండ్. దీపికా పడుకోణ్, కరీనా కపూర్, అదితీ రావు హైదరీ, మలైకా అరోరా, లీసా హేడన్ వీళ్లంతా డెమె బై గాబ్రియేలా అభిమానులే. ఆధునిక అవుట్‌ఫిట్, సంప్రదాయ కట్టు.. ఏదైనా ..నాజూకు అందం, నిండైన హుందాతనం.. శరీరాకృతి ఎలా ఉన్నా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేది ఈ బ్రాండే. క్యాజువల్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అన్ని సందర్భాలకు సరిపోయే దుస్తులూ దొరుకుతాయిక్కడ. డిజైన్‌ను బట్టే ధర. ఆన్లైన్లో మాత్రమే లభ్యం. రోజ్ గోల్డ్ ప్రీ డ్రేప్డ్ శారీ బ్రాండ్: డెమె బై గాబ్రియేలా ధర:రూ. 22,540 స్టయిల్.. ఫ్యాషన్ అనేవి వ్యక్తిగతమైనవి. వాటి వ్యక్తిత్వానికి కొనసాగింపుగా భావిస్తాను– మౌనీ రాయ్ -దీపిక కొండి -
ప్రియురాలితో డేటింగ్, కొడుకు పుట్టినా పెళ్లి మాత్రం వద్దంటున్న నటుడు
బాలీవుడ్ విలక్షణ నటుడు అర్జున్ రాంపాల్ భార్య మెహర్ జెసియాకు విడాకులిచ్చిన తర్వాత నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్కు దగ్గరయ్యాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా, ఆపై ప్రేమగా మారింది. వీరి ప్రేమకు గుర్తుగా కొడుకు కూడా పుట్టాడు. అతడికి అరిక్ అని నామకరణం చేసి పెంచుతున్నారు. అయితే జంటగా జీవిస్తున్నప్పటికీ తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం మాత్రం లేదంటున్నాడు అర్జున్. తమ బంధాన్ని నిరూపించుకోవడానికి కాగితం ముక్కలు అవసరం లేదని చెప్తున్నాడు. మా బంధాన్ని ధృవీకరించే వివాహం తన ప్రియురాలికి ఏమాత్రం ఇష్టం లేదని తెలిపాడు. అయినా మనసులు కలిసాయంటే దానర్థం మేము పెళ్లి చేసుకున్నట్లేనని తేల్చి చెప్పాడు. భార్యాభర్తల కన్నా తామేమీ తక్కువ కాదని పేర్కొన్నాడు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా అర్జున్, గాబ్రియెల్ల ఒకరికొకరు పరిచయమయ్యారు. వీరి మధ్య ప్రేమ చిగురించడంతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో 2019లో గాబ్రియెల్లా గర్భం దాల్చిన సమయంలో వారి ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. View this post on Instagram A post shared by Arjun (@rampal72) -
ఎన్సీబీ కార్యాలయానికి అర్జున్ గర్ల్‌ఫ్రెండ్
ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్ కేసులో ఇవాళ అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని ఎన్సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అదే విధంగా అర్జున్ రాంపాల్‌ను కూడా ఎన్సీబీ విచారించనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఎన్సీబీ అధికారులు ఆర్జున్ రాంపాల్ ఇంటిలో సోదాలు నిర్వహంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన డ్రైవర్‌ను కూడా విచారించారు. గత నెల బాలీవుడ్ డ్రగ్ పెడ్లర్‌తో సంబంధాలు ఉన్నాయని గాబ్రియెల్లా సోదరుడు అగిసిలాస్‌ను ఎన్సీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. దక్షిణాఫ్రికా జాతీయుడైన ఆమె సోదరుడు అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతడిని కస్టడీకి పంపారు. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు) చదవండి: అర్జున్ రాంపాల్‌కు ఎన్సీబీ నోటీసులు ఈ క్రమంలో గాబ్రియెల్లాకు కూడా బాలీవుడ్ డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఎన్సీబీ ఇవాళ ఆమెను విచారణ పలిపించింది. ఆమె తెలుగులో నాగార్జున, హీరో కార్తి నటించిన మల్లిస్టారర్ చిత్రం ‘ఊపిరి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇందులో ఆమె నాగార్జునకు ప్రియురాలిగా నటించారు. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్సీబీ సమన్లు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలైన రియాకు డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని సుశాంత్, మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్ తదితరులను అరెస్ట్ చేశారు. 28 రోజుల రిమాండ్ తర్వాత రియాకు బెయిల్ మంజూరు కావడంతో ఆమె బయటకు రాగా... ఆమె సోదరుడితో పాటు ఇతరులు జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్) -
మూడోసారి తండ్రి అయిన హీరో!
బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మూడోసారి తండ్రి అయ్యాడు. అతడి గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్ గురువారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ జేపీ దత్తా కూతురు నిధి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో అర్జున్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ‘రాక్ ఆన్’ ఫేమ్ అర్జున్ రాంపాల్ 20 ఏళ్ల క్రితం మోడల్ మెహర్ జేసియాను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు మహిక(17), మైరా(13) ఉన్నారు. కాగా సుదీర్ఘ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన అర్జున్ భార్యను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్న కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అని ఈ దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే వీరికి ఇంకా విడాకులు మంజూరు కాలేదు. అయినప్పటికీ అర్జున్ దక్షిణాఫ్రికా మోడల్ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది. ఇక ఐపీఎల్ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్‌కు పరిచయమైన గాబ్రియెల్లా పలు బాలీవుడ్ సినిమాల్లో నటించింది. అదే విధంగా నాగార్జున ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. Congratulations @rampalarjun on the arrival of your bundle of joy! God bless! ❤️ pic.twitter.com/vWsPGMfLGY — Nidhi Dutta (@RealNidhiDutta) July 18, 2019 -
అప్పుడే ఆయనతో నటించడం లక్కీనే..
చెన్నై: తాను సినీ పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే ప్రముఖ టాలీవుడ్ నటుడు నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమే అని అంటోంది ప్రముఖ దక్షిణాఫ్రికా మోడల్, నటి గాబ్రియెల్లా దిమిత్రిడేస్. గతంలో సోనాలి కేబుల్ అనే హిందీ చిత్రంలో నటించిన ఆమె ఇప్పుడు తాజాగా నాగార్జున సరసన హీరయిన్గా నటిస్తోంది. తెలుగు-తమిళ భాషల్లో పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు కార్తీ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మరో హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించి గాబ్రియెల్ తన అనుభవాలు తెలియజేస్తూ 'ఇది నాజీవితానికి ఒక కల. కెరీర్ ప్రారంభంలోనే నాగార్జునలాంటి హీరోతో పనిచేసే అవకాశం రావడం నాకు నేను చాలా అదృష్టం అని అనుకుంటున్నాను. ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాను. ఇంతకుమించి సినిమా వివరాలు తెలియజేయలేను' అని తెలిపింది.