Arjun Rampal Welcomes Second Child With Girl Friend Gabriella - Sakshi
Sakshi News home page

Arjun Rampal-Gabriella: బిడ్డకు జన్మనిచ్చిన 'ఊపిరి' నటి.. 50 ఏళ్ల వయసులో తండ్రైన నటుడు!

Published Fri, Jul 21 2023 3:51 PM | Last Updated on Fri, Jul 21 2023 4:54 PM

Arjun Rampal Welcomes Second Child With Girl Friend Gabriella - Sakshi

నటి గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్‌ రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. దక్షిణాఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో రిలేషన్‌లో ఉంది. కాగా.. ఇప్పటికే 2019లో ఈ జంటకు అరిక్ రాంపాల్‌ అనే కుమారుడు జన్మించారు. దీంతో దాదాపు 50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రయ్యారు బాలీవుడ్ నటుడు రాంపాల్. ఈ విషయాన్ని ఆయన తన ఇన్‌స్టా ద్వారా పంచుకున్నారు. కాగా.. 2018లో ఫ్రెండ్స్‌ ద్వారా పరిచయమైన వీరిద్దరు రిలేషన్‌లో ఉన్నారు. 

(ఇది చదవండి: బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి బేబీ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!)

అర్జున్ రాంపాల్ తన ఇన్‌స్టాలో రాస్తూ..  'ఈ రోజు నేను, నా కుటుంబం ఓ అందమైన బిడ్డకు స్వాగతం పలికాం. ప్రస్తుతం తల్లీ, కొడుకులిద్దరూ క్షేమంగానే ఉన్నారు. అద్భుతంగా సేవలందించిన వైద్యులు, నర్సులకు నా ధన్యవాదాలు. మీ అందరి ప్రేమకు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు.  ఇది చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు అభినందనలు తెలిపారు. కాగా.. అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లా.. నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన ఊపిరి చిత్రంలో కీలకపాత్రలో నటించింది. 2018 నుంచి ఈ జంట రిలేషన్‌లో ఉన్నారు. 

కాగా.. అర్జున్‌కు మొదటి భార్య మెహర్ జెసియాకు మహికా రాంపాల్, మైరా రాంపాల్ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ జంట 2019లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అర్జున్ చివరిగా కంగనా రనౌత్ యాక్షన్ చిత్రం 'ధాకడ్'లో కనిపించాడు. ఇది బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. తదుపరి బాబీ డియోల్‌తో 'పెంట్‌హౌస్'లో కనిపించనున్నాడు. దీంతో అర్జున్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ 'క్రాక్'లో నటించనున్నారు.

(ఇది చదవండి: ఒకటే ముక్క..పుష్ప-2 పవర్‌ఫుల్‌ డైలాగ్‌ లీక్‌..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement