Arjun Rampal’s Girlfriend Gabriella Second Time Pregnancy Without Marriage - Sakshi
Sakshi News home page

Gabriella: 'ఊపిరి' నటికి  రెండోసారి ప్రెగ్నెన్సీ.. పెళ్లి కాకుండానే!

Jun 21 2023 7:12 PM | Updated on Jun 22 2023 10:57 AM

Arjun Rampal girlfriend Gabriella Pregnancy Second Time Without Marriage - Sakshi

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారు. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్‌ అనే రొమాంటిక్ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చారు. రాంపాల్ బాలీవుడ్‌లో దాదాపుగా 40కి పైగా చిత్రాల్లో నటించారు. ఇప్పటికే పెళ్లి చేసుకున్న నటుడు అర్జున్ రాంపాల్  మరో నటితో సహజీవన చేస్తున్నారు. తాజాగా రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్‌  గాబ్రియెల్లా డెమెట్రియాడెస్ రెండోసారి గర్భం ధరించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇవాళ యోగా డే సందర్భంగా గాబ్రియెల్లా బేబీబంప్‌తో యోగాసనాలు వేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 

(ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!)

కాగా.. అర్జున్, గాబ్రియెల్లా కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ జంట 2018లో తమ స్నేహితుల ద్వారా కలుసుకున్న తర్వాత డేటింగ్ ప్రారంభించారు. ఈ జంటకు 2019లో తమ మొదట కుమారుడు అరిక్ రాంపాల్‌ జన్మించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో మరోసారి గర్భం ధరించినట్లు గాబ్రియెల్లా వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసింది. అయితే ఇప్పటివరకు ఈ జంట అధికారికంగా పెళ్లి చేసుకోలేదు. కాగా.. అర్జున్ రాంపాల్‌కు ఇది వరకే పెళ్లి కాగా.. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అసలు ఎవరు ఈ గాబ్రియెల్లా?

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా నటించిన  'ఊపిరి' సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో గాబ్రియెల్లా డెమెట్రియాడ్స్ కూడా ఓ పాత్రలో నటించింది. సౌత్‌ ఆఫ్రికాకు చెందిన గాబ్రియెల్లా మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. 

(ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కానీ మా అమ్మే: అను ఇమ్మానియేల్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement