ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్‌ | Arjun Rampal Girlfriend Gabriella Demetriades Announces Second Pregnancy | Sakshi

భార్యకు విడాకులు, ప్రేయసితో నటుడి సహజీవనం.. రెండోసారి తల్లి కాబోతున్న మోడల్‌

Published Sat, Apr 29 2023 2:58 PM | Last Updated on Wed, May 3 2023 11:03 AM

Arjun Rampal Girlfriend Gabriella Demetriades Announces Second Pregnancy - Sakshi

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ప్రేయసి, మోడల్‌ గార్బెల్లా డెమట్రేడ్స్‌ త్వరలో తల్లి కాబోతోంది. కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్ని గార్బెల్లా సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. ఈమేరకు బేబీ బంప్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. ఇది నిజమేనంటారా? లేదా ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అంటారా? అని తన పోస్ట్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. ఇక ఈ ఫోటోలు చూసిన సెలబ్రిటీలు కాజల్‌, అమీ జాక్సన్‌.. సహా పలువురు సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు చేయగా వారందరికీ గార్బెల్లా ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చింది.

ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు, అదే ఏడాది..
కాగా అర్జున్‌ రాంపాల్‌ గతంలో మెహర్‌ జెసియాను పెళ్లాడాడు. 1998లో వైవాహిక బంధాన్ని ప్రారంభించిన వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. తర్వాత మనస్పర్థలు తలెత్తడంతో 2018లో విడిపోతున్నట్లు ప్రకటించారు. 2019లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది అర్జున్‌ తన ప్రేయసి గార్బెల్లాను సోషల్‌ మీడియా వేదికగా పరిచయం చేశాడు, అది కూడా తను గర్భం దాల్చిందన్న వార్తతో! 2019 జూలైలో గార్బెల్లా పండంటి బాబుకు జన్మనిచ్చింది. అతడికి అరిక్‌ రాంపాల్‌గా నామకరణం చేశారు.

గార్బెల్లా నేపథ్యం ఇదీ..
కాగా గార్బెల్లా.. సౌత్‌ ఆఫ్రికన్‌ మోడల్‌ మాత్రమే కాదు ఒక డిజైనర్‌ కూడా! డీమ్‌ లవ్‌ పేరిట వస్త్ర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేకమైన ఒక బ్రాండ్‌ ఉంది. అర్జున్‌ రాంపాల్‌ విషయానికి వస్తే నెయిల్‌ పాలిష్‌, రావన్‌, ఓం శాంతి ఓం, రాక్‌ ఆన్‌, హీరోయిన్‌, రాజ్‌నీతి, ఇంకార్‌ వంటి పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ధాకడ్‌ సినిమాలో, ద ఫైనల్‌ కాల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ నటించాడు. 

చదవండి: నాటు నాటు నా టాప్‌ 100 సాంగ్స్‌ లిస్టులోనే లేదు: కీరవాణి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement