మూడోసారి తండ్రి అయిన హీరో! | Arjun Rampal Girlfriend Gabriella Demetriades Gave Birth To Baby Boy | Sakshi

మగ బిడ్డకు జన్మనిచ్చిన ‘ఊపిరి’ నటి!

Published Thu, Jul 18 2019 7:04 PM | Last Updated on Thu, Jul 18 2019 7:13 PM

Arjun Rampal Girlfriend Gabriella Demetriades Gave Birth To Baby Boy - Sakshi

బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ మూడోసారి తండ్రి అయ్యాడు. అతడి గర్ల్‌ఫ్రెండ్‌ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌ గురువారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బాలీవుడ్‌ ఫిల్మ్‌మేకర్‌ జేపీ దత్తా కూతురు నిధి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో అర్జున్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ‘రాక్‌ ఆన్‌’ ఫేమ్‌ అర్జున్‌ రాంపాల్‌ 20 ఏళ్ల క్రితం మోడల్‌ మెహర్‌ జేసియాను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు మహిక(17), మైరా(13) ఉన్నారు.

కాగా సుదీర్ఘ వైవాహిక బంధానికి స్వస్తి చెప్పిన అర్జున్‌ భార్యను విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేర్వేరు దారుల్లో ప్రయాణించాలనుకుంటున్న కారణంగా విడాకులు తీసుకుంటున్నాం అని ఈ దంపతులు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అయితే వీరికి ఇంకా విడాకులు మంజూరు కాలేదు. అయినప్పటికీ అర్జున్‌ దక్షిణాఫ్రికా మోడల్‌ గాబ్రియెల్లా డెమెత్రియెడ్స్‌తో సహజీవనం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె మగ శిశువుకు జన్మనిచ్చింది.  ఇక ఐపీఎల్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా 2009లో ఓ పార్టీలో అర్జున్‌కు పరిచయమైన గాబ్రియెల్లా పలు బాలీవుడ్‌ సినిమాల్లో నటించింది. అదే విధంగా నాగార్జున ‘ఊపిరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement