ముంబై: దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగు చూసిన డ్రగ్ కేసులో ఇవాళ అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు విచారించనున్నారు. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అదే విధంగా అర్జున్ రాంపాల్‌ను కూడా ఎన్‌సీబీ విచారించనుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సోమవారం ఎన్‌సీబీ అధికారులు ఆర్జున్ రాంపాల్ ఇంటిలో సోదాలు నిర్వహంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఆయన డ్రైవర్‌ను కూడా విచారించారు. గత నెల బాలీవుడ్ డ్రగ్ పెడ్లర్‌తో సంబంధాలు ఉన్నాయని గాబ్రియెల్లా సోదరుడు అగిసిలాస్‌ను ఎన్‌సీబీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం విధితమే. దక్షిణాఫ్రికా జాతీయుడైన ఆమె సోదరుడు అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్‌సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతడిని కస్టడీకి పంపారు. (చదవండి: అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్‌సీబీ దాడులు)
చదవండి: అర్జున్ రాంపాల్‌కు ఎన్‌సీబీ నోటీసులు
ఈ క్రమంలో గాబ్రియెల్లాకు కూడా బాలీవుడ్ డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై ఎన్‌సీబీ ఇవాళ ఆమెను విచారణ పలిపించింది. ఆమె తెలుగులో నాగార్జున, హీరో కార్తి నటించిన మల్లిస్టారర్ చిత్రం ‘ఊపిరి’లో అతిథి పాత్రలో కనిపించారు. ఇందులో ఆమె నాగార్జునకు ప్రియురాలిగా నటించారు. ఇప్పటికే ఈ కేసులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకొనె, శ్రద్దా కపూర్, సారా అలీ ఖాన్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఎన్‌సీబీ సమన్లు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ మృతి కేసులో ప్రధాన నిందితురాలైన రియాకు డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రియాతో పాటు ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తిని సుశాంత్, మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్ సావంత్ తదితరులను అరెస్ట్ చేశారు. 28 రోజుల రిమాండ్ తర్వాత రియాకు బెయిల్ మంజూరు కావడంతో ఆమె బయటకు రాగా... ఆమె సోదరుడితో పాటు ఇతరులు జైలులోనే ఉన్నారు. (చదవండి: సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment