హృతిక్, సుజానేల విడాకులకు కారణమెవరు?
హృతిక్, సుజానేల విడాకులకు కారణమెవరు?
Published Sun, Dec 15 2013 3:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, సుజానే విడిపోతున్నారన్న వార్త మీడియాలో చర్చనీయాంశమైంది. హృతిక్, సుజానే విడిపోవడం వెనుక అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. 17 ఏళ్ల స్నేహం, 13 సంవత్సరాల దాంపత్య జీవితానికి పుల్ స్టాప్ పడటం వెనుక అనేక కథనాలు మీడియాలో వెలువడుతున్నాయి. సుజానేకు అత్త, మామలతో విబేధాలు తీవ్రస్థాయికి చేరుకోవడం ఒకటైతే.. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ తో ఉన్న ఫ్రెండ్ షిప్ మరో కారణమని తెలుస్తోంది.
అత్తారింటి వారితో విబేధాలు తారాస్థాయికి చేరుకోవడంతో వేరు కాపురానికి హృతిక్ పై సుజానే చాలాకాలంగా ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ, తన తల్లిదండ్రులు, విడాకులు పొందిన తన సోదరిని వదిలి బయటకు రావడం ఇష్టం లేక.. సుజానే నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో వారి మధ్య మరింత అగాధం పెరిగిందని తెలుస్తోంది. హాలీవుడ్ నటి బార్బారా మోరీతో హృతిక్ సన్నిహిత సంబంధం కూడా వారు విడిపోవడానికి కారణమైందని మరో వాదన. అత్తారింటిలో ఉండటం ఇష్టం లేక గత మూడు నెలల నుంచి హృతిక్, సుజానేలు విడివిడిగా ఉంటున్నట్టు తెలిసింది.
ఇక ఎన్నో ఏళ్లుగా రోషన్, రాంపాల్ కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. అర్జున్, అతని సతీమణి మెహర్ లు సుజానేకు క్లోజ్ ఫ్రెండ్స్. సుజానే, హృతిక్ ల మధ్య విబేధాలు తలెత్తినా సుజానే తల్లితండ్రులు ఈ విషయంపై రాంపాల్ తో చర్చించడానికి ఇష్టపడలేదని మరో వాదన. హృతిక్, సుజానేలు విడిపోవడంపై స్పందించాలని మీడియా ఫోన్ లో కోరగా అందుకు అర్జున్ రాంపాల్ ఆగ్రహించినట్టు తెలిసింది. ఏది ఏమైనా.. కారణాలేమైనా..17 ఏళ్ల హృతిక్, సుజానేల ప్రేమకథ ట్రాజేడిగా ముగియనుంది.
Advertisement
Advertisement