భారత్ లో సల్మానే కండలవీరుడు!
భారత్ లో సల్మానే కండలవీరుడు!
Published Thu, Apr 24 2014 4:49 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, అర్జున్ రాంపాల్ లపై కండలవీరుడు సల్మాన్ పైచేయి సాధించారు. ఆన్ లైన్ ఓ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో భారతదేశంలో ఫిజికల్ ఫిట్ నెస్, ఆరోగ్యవంతంగా ఉన్న నటుడుగా సల్మాన్ ఖాన్ కు అత్యధిక మంది ఓటు వేశారు.
దాదాపు 30 వేల మంది పైగా ఈ సర్వేలో పాల్గోన్నారు. ఈ సర్వేలో సల్మాన్ ఖాన్ 43.36 శాతం, హృతిక్ కు 42.81 శాతం ఓట్లు లభించాయి. ఆతర్వాత స్థానాల్లో విద్యుత్ జమ్వాల్, అర్జున్ రాంపాల్, షాహీద్ కపూర్ లు నిలిచారు.
Advertisement
Advertisement